ప్రఖ్యాత ఆధ్యాత్మిక వేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్‌ను అమెరికాలోని ప్రతిష్టాత్మక జాతీయ మానవహక్కుల మ్యూజియం “ఎమిసరీ ఆఫ్ పీస్” (శాంతి దూత) అవార్డుతో సత్కరిచింది. ఐ స్టాండ్ ఫర్ పీస్ కార్యక్రమంలో భాగంగా రవిశంకర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా జాతీయ మానవ హక్కుల మ్యూజియం శాంతి దూత అవార్డును ప్రదానం చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన అమెరికా జాతీయ మానవ హక్కుల మ్యూజియం డైరెక్టర్ శైలా కర్కెరా రవిశంకర్ సేవలను కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా 150 కి పైగా దేశాలలో సుదర్శన క్రియ, యోగా, ధ్యానం, ప్రాణాయామం ద్వారా కోట్లాది మందికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందిస్తున్నారంటూ ప్రశంసించారు. వివిధ జాతులు, వర్గాలు, దేశాల మధ్య సంఘర్షణల నివారణకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న రవిశంకర్ లాంటి మహోన్నత వ్యక్తికి ఈ ప్రత్యేకమైన అవార్డును అందించడం తమకెంతో గౌరవప్రదమని శైలా కర్కెరా పేర్కొన్నారు. అవార్డు అందుకున్న అనంతరం…
Author: Editor's Desk, Tattva News
కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ కవిత పేరును చేర్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో భాగంగా కవితకు సీబీఐ నోటసులు జారీ చేసింది. ఢిల్లీ లేదా హైదరాబాద్‌ల ఎక్కడైనా కవిత విచారణకు హాజరుకావొచ్చని సీబీఐ పేర్కొంది. ఈ నెల 6న హైదరాబాద్‌లో కవిత విచారణకు హాజరుకానున్నట్టు తెలుస్తోంది. 160 సీఆర్పీసీ కింద సీబీఐ కవితకు నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌లో కవిత పేరును ఈడీ పొందుపర్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసులో కవిత పాత్ర ఏంటనే అంశంపై విచారణ చేసేందుకు సీబీఐ ఆమెకు నోటీసులు జారీ చేసింది. మోడీ రోజుల క్రితం సిబిఐ కోర్టులో దాఖలు చేసిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ పలు అంశాలను పొందుపర్చింది.…
దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో ఒకటైన ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో మరో వివాదం రాజుకుంది. స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ భవనంలోని గోడలపై బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుని రాసిన విద్వేషపూరిత రాతలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ రాతలను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సహా పలు విద్యార్థి సంఘాలు, అధ్యాపక సంఘాలు ఖండిస్తూ ప్రకటనలు విడుదల చేశాయి. విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్న ఈ రాతలపై సమగ్ర విచారణకు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ శాంతిశ్రీ డి. పండిట్ ఆదేశించారు. వివిధ సిద్ధాంతాలు, భావజాలాల సంఘర్షణ జరిగే చోట రాజకీయ రాద్ధాంతం మళ్లీ మొదలైంది. ఈ రాతలు రాసింది తాము కాదు, ఎదుటి పక్షం అంటూ విద్యార్థి సంఘాలు పరస్పరం నిందించుకుంటున్నారు. గోడలపై ప్రత్యక్షమైన రాతల్లో “బ్రాహ్మణులారా.. ఈ క్యాంపస్‌ను విడిచిపొండి”, ‘‘రక్తపాతం జరగబోతోంది’’, ‘‘బ్రాహ్మణులారా, భారత్‌ను విడిచిపొండి’’, ‘‘బ్రాహ్మణులారా, వైశ్యులారా, మేం మీ కోసం వస్తున్నాం. ప్రతీకారం తీర్చుకుంటాం’’ అంటూ…
ఆంధ్రప్రదేశ్ లో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. విజయవాడలోని అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్, గుంటూరులోని ఎన్నారై ఆసుపత్రిలో ఈడీ అధికారులు శుక్రవారం సోదాలు చేపట్టారు. ఆయా ఆసుపత్రుల్లో రికార్డులను అధికారులు పరిశిలించారు. అలాగే ఎన్నారై ఆసుపత్రి సొసైటీ సభ్యుల ఇళ్లలోనూ ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఇటీవల తెలంగాణలో మంత్రి మల్లారెడ్డి మెడికల్ కాలీజీలు, ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఆ సోదాలు కూడా మెడికల్ కాలేజీలో సీట్ల విషయంలో పెద్ద ఎత్తున డొనేషన్లు తీసుకున్నారనే ఆరోపణలతో సోదాలు చేశారు. ఇప్పుడు ఏపీలో కూడా అదే జరగడం కలకలం రేపుతోంది. అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిలో ఈడీ అధికారులు సోదాలలో భాగంగా అధికారులు అక్కడి ఆసుపత్రి సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకొని, పలువురిని ప్రశ్నించారు. విదేశీ నిధులు అక్రమంగా దారి మళ్లించారనే ఆరోపణలతోనే ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అమెరికాలో…
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద సమాచారం ఇచ్చారని ఓ మహిళా అధికారిపై కేసీఆర్ ప్రభుత్వం వేటు వేయడం పట్ల బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలంటే కేసీఆర్ సర్కారుకి ఎంత గౌరవమో తాజాగా మీడియాలో వచ్చిన కథనం చూస్తే బాగా అర్ధమవుతుందని ఆమె ధ్వజమెత్తారు. ఇన్‌చార్జి మేనేజరుగా ఉన్న ఓ మహిళ ఉన్నతాధికారి అనుమతితో నిజామాబాద్ జిల్లా మామిడి క్వారీకి చెందిన సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐ కింద దరఖాస్తుదారుడికి ఇచ్చారు. దాని ఆధారంగా దరఖాస్తుదారుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పరిణామాలతో ఆగ్రహించిన శాఖాధిపతి మహిళా ఉద్యోగిని ఇన్‌చార్జి మేనేజరు బాధ్యతల నుంచి తొలగించారని విజయశాంతి వివరించారు. ఆర్టీఐ కింద ఒక గనికి సంబంధించిన సమాచారాన్ని పై అధికారి అనుమతితోనే ఇచ్చినప్పటికీ ఆమెను ఏడేళ్లుగా వేధిస్తుండటమే గాక, రెండున్నరేళ్లుగా జీతం కూడా చెల్లించడం లేదని ఆమె విమర్శించారు. ఈ బాధలు భరించలేక చివరికి వీఆరెస్ అడిగినా…
ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ కేసులో నిందితులకు ముందస్తు బెయిల్ ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న సమయంలో క్రయోజనిక్ ఇంజన్లను అభివృద్ధి చేస్తున్న ప్రఖ్యాత శాస్త్రవేత్త నంబి నారాయణ్ విదేశాలకు దేశ రహస్యాలు అమ్మేశారంటూ పోలీసులు ఆయనపై కేసు పెట్టారు. ఈ తప్పుడు కేసు కారణంగా ఆయన కెరీర్ నాశనం కావడంతో పాటు భారత దేశం రెండు దశాబ్దాల పాటు క్రయోజనిక్ ఇంజన్లను తయారు చేసే వీల్లేకుండా పోయింది. ఆ తర్వాత ఇది తప్పుడు కేసని తేలడంతో ఆయనకు క్లీన్ చిట్ లభించింది. అయితే ఈ కేసులో కుట్రకు పాల్పడ్డ నలుగురు పోలీసు అధికారులపై సీబీఐ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తోంది. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ కేసులో అప్పట్లో కుట్రకు పాల్పడ్డ గుజరాత్ మాజీ డీజీపీ ఆర్బీ శ్రీకుమార్, రిటైర్డ్ ఇంటెలిజెన్స్ అధికారి జయప్రకాష్, మరో ఇద్దరు పోలీసు అధికారులు విజయన్, దుర్గాదత్ భారత్ కు క్రయోజనిక్ పరిజ్ఞానం…
సీఎం కేసీఆర్ తెలంగాణను ఆఫ్ఘనిస్థాన్ మాదిరిగా మార్చేశారన్నారని, తాలిబన్ల మాదిరిగా పాలన సాగిస్తున్నారని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్లంతా తాలిబన్లే అని ఎద్దేవా చేశారు. ధ్వంసమైన వాహనంలో ప్రగతి భవన్ కు వెళ్తుండగా పోలీసులు తనను అరెస్ట్ చేసిన వైనం, తాను కూర్చున్న కారును టోయింగ్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన తీరుపై షర్మిల.. గురువారం రాజ్ భవన్ లో గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్ కు ఫిర్యాదు చేశారు. కేవలం ట్రాఫిక్ జామ్ కు కారణం అయిన కేసులో తనను అరెస్టు చేశారని, మహిళను అని కూడా చూడకుండా తాను కూర్చున్న కారును టోయింగ్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో తన పాదయాత్రను టిఆర్ఎస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తున్నాయని, ఈ క్రమంలోనే నర్సంపేటలో తనపై దాడి చేసి, తన వాహనాన్ని ధ్వంసం చేశారని ఆమె చెప్పారు. కేవలం ట్రాఫిక్ జామ్ కు…
చైనా కదలికలపై అమెరికా సహా నాటో సభ్య దేశాలు ఆందోళన చెందుతున్నాయని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ చెప్పారు. ఇదే సమయంలో బీజింగ్ ఎదుర్కొంటున్న సైనిక సవాళ్లను కూడా నాటో పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. నాటో సమావేశం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో బ్లింకెన్ మాట్లాడుతూ సైనిక శక్తిని పెంపొందించుకుంటూ ఒకవైపు, రష్యాకు దగ్గరగా వస్తూ మరోవైపు చైనా శరవేగంగా విస్తరించడంపై అమెరికా నిశితంగా పరిశీలిస్తుందని స్పష్టం చేశారు. చైనా అనుసరిస్తున్న విధానాలు కలవరపెడుతున్నాయని చెబుతూ అసత్యాలను ప్రచారం చేస్తున్నారని, అంతే కాకుండా సైనిక శక్తిని పెంచుకుంటున్న వేగంపై కూడా నిఘా ఉంచామని చెప్పారు. రష్యాతో కుమ్మక్కైన విషయం ఏనాడో గుర్తించామని, అయినప్పటికీ చైనాతో మాట్లాడుతామని పేర్కొన్నారు. రష్యా, చైనాలకు చెందిన యుద్ధ విమానాలు జపాన్ సముద్ర సరిహద్దు వద్ద ఇటీవల సైనిక విన్యాసాలు నిర్వహించారు. అలాగే, రెండు చైనీస్, 6 రష్యా యుద్ధ విమానాలు దక్షిణ కొరియా సమీపంలో ప్రయాణించాయి. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి…
ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరుపొందిన జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ గురువారం చేపట్టింది. ఇటీవల ఇండోనేషియాలో జరిగిన జీ-20 సమావేశాల్లో ఈ బాధ్యతలను భారత్ కు బదిలీ చేశారు. డిసెంబర్ 1 నుంచి జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వర్తిస్తుందని ప్రకటించారు. భారత్ జీ20 అజెండా ప్రతిష్టాత్మకంగా, కార్యాచరణ ఆధారితంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత్ జీ20 అధ్యక్ష స్థానాన్ని వైద్యం, సామరస్యం, ఆశల ప్రెసిడెన్సీగా మార్చేందుకు కలిసి పనిచేద్దామని పేర్కొన్నారు. మానవ- కేంద్రీకృత ప్రపంచీకరణకు కొత్త నమూనా రూపొందించడానికి కృషి చేయనున్నట్లు చెప్పారు. స్థిరమైన జీవనశైలి, ప్రపంచ ఆహార, ఎరువులు, మందులు, ఇతర వస్తువుల సరఫరా వ్యవస్థను రాజకీయాలతో సంబంధం లేకుండా చేయడం కోసం భారత్ ఎదురుచూస్తోందని వివరించారు. భారత్ జీ20 అధ్యక్ష పగ్గాలు చేపట్టినందున… ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు అనే థీమ్ ప్రేరణతో ఏకత్వాన్ని ప్రోత్సహించేందుకు పనిచేయనున్నట్లు ప్రధాని స్పష్టిం చేశారు. జీ20…
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కి భార్య సునందా పుష్కర్ మృతి కేసులో ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2014 జనవరి 17న ఢిల్లీలోని ఒక లగ్జరీ హోటల్లో సునంద అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హత్య అనే కోణంలో తొలుత దర్యాప్తు జరిగింది. ఆ తర్వాత ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకునేలా శశి థరూర్ ప్రేరేపించారనే అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయనను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు 2021 ఆగస్టులో ఆయనపై నమోదైన అభియోగాలను కొట్టివేసి, ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే, పటియాలా హౌస్ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టులో పోలీసులు సవాల్ చేశారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు థరూర్ కు నోటీసులు జారీ చేసింది.…