Author: Editor's Desk, Tattva News

ప్రతి ఏడాది బ్రిటన్‌లో పని చేయడానికి భారత్‌ నుండి యువ నిపుణుల కోసం 3,000 వీసాలకు అనుమతి ఇచ్చినట్లు బ్రిటీష్‌ ప్రధాని రిషి సునాక్‌ ప్రకటించారు. బాలిలో జరుగుతున్న జి20 సమావేశంలో భారత్‌ ప్రధాని మోడీతో బ్రిటన్‌ ప్రధాని రిషిసునాక్‌ సమావేశమయ్యారు. వారిద్దరు కలుసుకున్న కాసేపటికే బ్రిటన్‌ ప్రభుత్వం ఈ కీలక ప్రకటన చేయడం గమనార్హం. భారత సంతతికి చెందిన మొదటి వ్యక్తి రిషి సునాక్‌ గత సెప్టెంబర్ లో బ్రిటీష్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇదే వారి మొదటి సమావేశం కావడం గమనార్హం. గతేడాది అంగీకరించిన యుకె -ఇండియా మైగ్రేషన్‌ అండ్‌ మొబిలిటీ భాగస్వామ్యంలో భాగంగా, ఈ పథకం నుండి ఇటువంటి లబ్థి పొందిన మొదటి దేశం భారత్‌ అని బ్రిటన్‌ ప్రభుత్వం ప్రకటించింది. యుకె – ఇండియా యంగ్‌ ప్రొఫెనల్స్‌ పథకం కింద 18-30 ఏళ్ల డిగ్రీ పూర్తి చేసిన భారత పౌరులు బ్రిటన్‌కి వచ్చి రెండేళ్లపాటు…

Read More

2024యూఎస్ ఫెడరల్ ఎలక్షన్ కమిషన్‌ కు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన మద్దతుదారులు పేపర్లు సమర్పించారు.వచ్చే అధ్యక్ష ఎన్నికల బరిలోకి ట్రంప్ దిగబోతున్నట్టు ప్రకటించారు. ఫలితంగా వచ్చే ఎన్నికల అభ్యర్థిత్వం కోసం పత్రాలు సమర్పించిన మొదటి పోటీదారు అయ్యారు.  ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ..   అమెరికా కేమ్ బ్యాక్ మొదలైందని పేర్కొన్నారు. ట్రంప్ గతంలో ఈ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. అధ్యక్ష ఎన్నికల కోసం తన అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తున్నట్టు చెప్పారు.  2016 అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించిన ట్రంప్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. యూఎస్‌కు మరోమారు అధ్యక్షుడు కావాలని తలపోసినా గత ఎన్నికల్లో అది సాధ్యం కాలేదు. దీంతో వచ్చే ఎన్నికలపై దృష్టి సారించారు. ఆయనకు ఇప్పటికీ ప్రజల్లో మంచి పాప్యులారిటీ ఉంది.  వైట్‌హౌస్‌కు మళ్లీ రావాలన్న తన ఆకాంక్షను ట్రంప్ పలుమార్లు బహిరంగంగానే బయటపెట్టారు. దేశ చరిత్రలో ఈ రోజు అత్యంత ముఖ్యమైన రోజుల్లో…

Read More

ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం చైనా కొనసాగుతూ ఉన్నప్పటికీ వచ్చే ఏడాది నాటికి భారత్ ఆ స్థానంలోకి రానున్నది. చైనా అనుసరిస్తున్న‘వన్ చైల్డ్ పాలసీ’ కారణంగా వరుసగా ఐదో ఏడాది కూడా జననాల రేటు పడిపోవడంతో ఆ దేశం రెండో స్థానానికి పడిపోనున్నది. అప్పుడు చైనా స్థానంలో భారత్ మొదటి స్థాయికి చేరుకోనున్నది. ఈ విషయాన్ని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్(యూఎన్ఎఫ్‌పీఏ) వెల్లడించింది. భారత్ లో జనాభా పెరుగుదల అటు ఎక్కువగా ఉండకుండా.. ఇటు పడిపోకుండా స్థిరంగా ఉంటున్నట్లు తెలిపింది. మరోవైపు ప్రపంచ జనాభా 800కోట్లకు చేరిందని మంగళవారం యూఎన్ఎఫ్‌పీఏ ప్రకటించింది. 7 700 కోట్ల నుంచి 800 కోట్లకు చేరడంలో భారత్ ఎక్కువగా దోహదపడిన్నట్లు తెలిపింది.  తర్వాతి స్థానంలో చైనా ఉందని పేర్కొన్నది. యూఎన్ జనాభా అంచనాల రిపోర్టు ప్రకారం.. 2022లో భారత్  జనాభా 141.2 కోట్లు కాగా, చైనా జనాభా 142.6 కోట్లు. 2050 నాటికి భారత్  లో జనాభా 166.8…

Read More

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య ఘర్షణలను పరిష్కరించుకోవడానికి సంప్రదింపుల ప్రక్రియే మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జి-20 సదస్సులో ఇంధన భద్రత, ఆహారం అంశంపై మంగళవారం ఆయన ప్రసంగిస్తూ ఈ ఘర్షణలను ఆపేందుకు ప్రపంచ నేతలు కృత నిశ్చయంతో సమిష్టి కృషి చేయాల్సిఉందని చెప్పారు. గత శతాబ్దంలో రెండో ప్రపంచ యుద్ధం పెను విధ్వంసం సృష్టించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అటువంటి పరిస్థితి ఇప్పుడు రాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌ పరిణామాలు, వీటితో ముడిపడి ఉన్న సమస్యలన్నీ కలిపి ప్రస్తుతం ప్రపంచ సంక్షోభాన్ని సృష్టించాయని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలో సంబంధాలు తెగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో ప్రతి ఒక్క దేశంలోని సామాన్య పౌరుడు బాధపడుతున్నాడని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల సంక్షోభం కూడా పెద్ద ఎత్తున నెలకొందని పేర్కొన్నారు. ఇటువంటి సమయంలో దేశాధినేతలందరూ ఏకమై సమస్యను పరిష్కరించాల్సిఉందని సూచించారు. ఈ తరహా సమస్యలను పరిష్కరించడంలో…

Read More

తాను ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తోసిపుచ్చారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. పైగా, ప్రస్తుత ఎమ్యెల్యేలు అందరికీ వచ్చే ఎన్నికలలో తిరిగి సీట్లు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. తెలంగాణ భ‌వ‌న్‌లో కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న‌ జరిగిన టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో అసెంబ్లీ ఎన్నిక‌లకు స‌న్న‌ద్ధ‌త‌తో పాటు ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే అంశంపై చ‌ర్చించారు. పార్టీ శ్రేణులంతా ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాల‌ని పిలుపునిచ్చారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేల‌ను మార్చే ప్ర‌స‌క్తే లేద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. మ‌ళ్లీ పాత వారికే టికెట్లు ఇస్తామ‌ని పేర్కొన్నారు. ఎన్నిక‌ల‌కు ప‌ది నెల‌ల స‌మ‌యమే ఉంది. పార్టీ శ్రేణులంతా ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాలి. ప్ర‌తి ఎమ్మెల్యే నిత్యం ప్ర‌జ‌ల‌తో మాట్లాడాలి అని సూచించారు. ఏవైనా స‌మ‌స్య‌లుంటే ప్ర‌భుత్వం దృష్టికి తేవాల‌ని కేసీఆర్ సూచించారు. స‌ర్వేల‌న్ని టీఆర్ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. వంద శాతం మ‌ళ్లీ టీఆర్ఎస్‌దే అధికార‌మ‌ని తేల్చిచెప్పారు.…

Read More

గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తెల్లా హేని క్రిస్టినా, ఆమె భర్త కత్తెర సురేష్ కుమార్ షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తులు కాదని, వారు క్రైస్తవులే అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రకటించింది.  గుంటూరు జిల్లా కొల్లిపర గ్రామానికి చెందిన మండ్రు సరళ కుమారి దాఖలు చేసిన పిటిషన్ మేరకు హైకోర్టు ఈ ప్రకటన చేసింది.  భార్యాభర్తలు ఇరువురు షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తులే అంటూ జిల్లా గుంటూరు జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు తోసిపుచ్చింది. క్రైస్తవ ఆచార వ్యవహారాలు పాటిస్తూ, హార్వెస్ట్ ఇండియా అనే ఒక క్రిస్టియన్ సంస్థను నడుపుతున్న సురేష్ కుమార్, హెనీ క్రిస్టినా దంపతులు ఇకపై షెడ్యూల్ కుల హోదాకు అర్హులు కాదని స్పష్టం చేసింది.గతంలో జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు రద్దు పరుస్తూ, మూడు నెలల్లోపు సవరించిన ఉత్తర్వులు ఇవ్వవలసిందిగా గుంటూరు జిల్లా కలెక్టరుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తులు మతం…

Read More

ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలన్న బీజేపీ దాఖలు చేసిన పిటీషన్ ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఈ కేసును సీబీఐకి అప్పగించడానికి నిరాకరించింది. ఈ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగించాలని కొన్ని కండీషన్స్ పెట్టింది కోర్టు. ఈ కేసును సిట్ చీఫ్ సీవీ ఆనంద్ నేతృత్వంలో దర్యాప్తు చేయాలి. అలాగే దర్యాప్తుకు సంబంధించి ఎలాంటి విషయాలను అటు మీడియా, ఇటు రాజకీయ నాయకులకు వెల్లడించవద్దని హైకోర్టు తెలిపింది. ఒకవేళ వివరాలు లీకైతే సిట్ కు నేతృత్వం వహిస్తున్న వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పింది. దర్యాప్తుకు సంబంధించి పురోగతి నివేదికను ఈనెల 29న హైకోర్టు ముందు ఉంచాలని కోర్ట్ స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సిట్ ఏర్పాటు చేయగా దానిపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. …

Read More

వచ్చే నెల గుజరాత్‌లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి మెజారిటీ సాధిస్తే ఆ రాష్ట్రానికి భూపేంద్ర పటేల్ ముఖ్యమంత్రి కాగలరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. గుజరాత్‌లో ఏడోసారి కూడా అధికారాన్ని దక్కించుకునేందుకు బిజెపి కన్నేసింది. తొలిసారి ఎమ్యెల్యే అయినా భూపేంద్ర పటేల్ 2021 సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి విజయ్ రూపానీ స్థానంలో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఘట్లోడియా నియోజకవర్గం తొలి ఎంఎల్‌ఏ. ఆ సీటుకు ఆయన్నే మరోసారి నామినేట్ చేయడం జరిగింది. కాగా, గుజరాత్‌లో ఎన్నికల రికార్డులను బద్దలు కొట్టి అఖండ మెజారిటీతో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్ అభివృద్ధికి బీజేపీ అన్ని విధాలుగా కృషి చేసిందని చెబుతూ. ఈ విషయంలో తమ పార్టీ రాష్ట్ర ప్రజల అంచనాలను అందుకుందని తెలిపారు. తాము కొన్ని సంవత్సరాలుగా బలమైన ప్రభుత్వంతో సురక్షితమైన, బాగా అభివృద్ధి చెందిన, విద్యావంతులైన గుజరాత్‌ను తయారు చేయాలనుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో అనేక…

Read More

సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు. ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబీకులు ఆయనను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. కార్డియాల్ అరెస్ట్ ప్రభావం కిడ్నీలు, ఊపిరితిత్తులుపై కూడా పడటంతో కృష్ణ ఆరోగ్యం విషమించిందని నిన్న వైద్యులు వెల్లడించారు. వెంటిలేటర్ పై చికిత్స అందించినప్పటికీ కృష్ణ ప్రాణాలను కాపడలేక పోయారు వైద్యులు. ఆరోగ్యం విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆయన తదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానులు, తెలుగు సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. 1942 మే 31 న ఘట్టమనేని కృష్ణ గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జన్మించారు. కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1964కు ముందు చిన్న చిన్న పాత్రలు చేసిన ఆయనకు 1964-65లో హీరోగా నటించే అవకాశం వచ్చింది. హీరోగా నటించిన మొదటి సినిమా తేనెమనసులు. 340 పైగా సినిమాల్లో కృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. కృష్ణ భార్య, మహేష్ బాబు తల్లి…

Read More

చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌లు ముఖాముఖీ సమావేశమయ్యారు. బాలిలో జరుగుతున్న జి-20 దేశాల సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఇరువురు నేతలు సోమవారం నేరుగా కలుసుకున్నారు. హోటల్‌ ములియాలో బాల్‌రూమ్‌ ఈ అరుదైన భేటీకి వేదికయింది. అక్కడ ఏర్పాటు చేసిన చైనా, అమెరికా పతాకాల ఎదుట ఇరువురు నేతలు కరచాలనం చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్‌ ఎన్నికయిన తరువాత ఇరువురు నేరుగా కలవడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు వీడియో, ఫోన్‌ కాల్స్‌ ద్వారా వీరిద్దరి మధ్య సంభాషణలు సాగాయి. కరచాలనం అనంతరం ఇరు దేశాధినేతలు ప్రత్యేకంగా సమావేశమైనారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. దేశాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించుకునే దిశగా కృషి జరగాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఆకాంక్షించారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొన్న తర్వాత ఎన్నో ఒడిదుడుకులు, అవరోధాలు ఎదురయ్యాయని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. వీటి నుండి గుణపాఠాల నేర్చుకుని భవిష్యత్‌వైపు దృష్టి సారించాలని…

Read More