Author: Editor's Desk, Tattva News

కరోనాకు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో ఆ మహమ్మారి మళ్లీ జడలు విప్పుతోంది. శుక్రవారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా 11,773 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాజధాని బీజింగ్‌లో అదే రోజు 118 కేసులు వెలుగు చూశాయి. దీంతో అక్కడ ఉన్న 2 కోట్ల మంది ప్రజలకు అధికారులు రోజువారీ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన 10 వేల మందికి పైగా బాధితుల్లో ఆ వ్యాధి లక్షణాలు లేనప్పటికీ ఒక్క రోజే ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదవడం అక్కడి ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా ఆంక్షలను సడలించాలని చైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న 24 గంటలు గడవక ముందే పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూడడంతో కొవిడ్ కొత్త దశ కట్టడికి ఆ దేశ అధికార యంత్రాంగం తిరిగి ఆంక్షలను అమలులోకి తెచ్చింది. కోటీ 30 లక్షల జనాభా కలిగిన గ్వాంగ్‌ఝు నగరంలో 3,775 కేసులు వెలుగు చూడడంతో…

Read More

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విశాఖపట్నంలో జరిగి రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కక్షసాధింపు రాజకీయాల నుండి ఫిర్యాదు చేసిన సమయంలోనే రాష్ట్రంలో పోలీసులు పలుచోట్ల జనసేన శ్రేణులను వేధించడం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదురవుతున్నాయి. స్వయంగా పవన్ కళ్యాణ్ పైననే తాడేపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జనసేన సభ కు ఇప్పటం గ్రామస్థులు స్థలాలు ఇచ్చారనే కోపంతో వారి ఇళ్లను రోడ్ విస్తరణ పేరుతో కూల్చారని జనసేన ఆరోపించింది. ఇల్లు కోల్పోయిన వారిని పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ ఇప్పటంకు వెళ్లిన సందర్భంగా పోలీసులతో ఘర్షణ చోటుచేసుకొంది. తనను పోలీసులు ఆపే ప్రయత్నం చేయడంతో పార్టీ కార్యాలయం నుంచి కాలి నడకన ఇప్పటం వెళ్లే ప్రయత్నం చేశారు. ఆపై కారుపైకి ఎక్కి ప్రయాణించారు. కారు వేగంగా దూసుకుపోతున్నా కూడా ఆయన కాళ్లు బారజాపుకుని అలానే కూర్చిండి పోయారు. ఇలా టాప్ పైకి ఎక్కి ప్రమాదకరంగా ప్రయాణించడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, హైవేపై పలు…

Read More

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు ముంబై ఎయిర్ పోర్ట్ లో చేదు అనుభవం ఎదురైంది. దుబాయ్‌లో ఇటీవల ముగిసిన ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌కి హాజరైన షారూక్ ఖాన్ ఈరోజు ముంబయికి చేరుకున్నారు. కార్యక్రమాన్ని ముగించుకుని షారూఖ్ ఖాన్ అనంతరం ప్రైవేటు జెట్‌లో ఇండియాకు తిరిగి వచ్చాడు. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు టెర్మినల్ 3దగ్గర ల్యాండ్ అయ్యాడు. టెర్మినల్ నుంచి బయటికి వచ్చేటప్పుడు తనిఖీలు చేపట్టగా బ్యాగేజీలో ఆరు ఖరీదైన వాచ్‌లు బయటపడ్డాయి. ఈ వాచ్‌ల ఖరీదు రూ.18లక్షలు ఉంటుందని సమాచారం. అతని లగేజీని చెక్ చేసిన కస్టమ్స్ అధికారులు ఆ వాచీలపై ఆరా తీశారు.  ఈ క్రమంలో చాలా సేపు షారూక్ ఖాన్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయాడు. చివరికి ఆ రూ.18 లక్షల విలువైన వాచీలకి గానూ రూ.6.83 లక్షలు కస్టమ్స్ డ్యూటీ కట్టిన తర్వాత షారూక్‌ని విమానాశ్రయం వెలుపలికి అధికారులు అనుమతించారు.  ఇలా షారుఖ్ ఖరీదైన వాచ్ లతో…

Read More

భువ‌నేశ్వ‌ర్‌ లో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఈ-కుంభ్‌ పోర్ట‌ల్‌ను ప్రారంభించారు. ప్రాంతీయ భాష‌ల‌కు ప్రాధాన్య‌త ఇస్తూ సుమారు 12 భాష‌ల‌కు చెందిన పుస్త‌కాల‌ను ఆ సైట‌లో పొందుప‌రిచారు. ఈ-కుంభ్ అన‌గా నాలెడ్జ్ అన్‌లీష్డ్ ఇన్ మ‌ల్టిపుల్ భార‌తీయ లాంగ్వేజెస్‌. ఈ వెబ్ పోర్ట‌ల్‌లో ఇంజినీరింగ్ పుస్త‌కాలు విద్యార్థుల‌కు అందుబాటులో ఉంటాయి. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫ‌ర్ టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్ ఇంజనీరింగ్ పుస్త‌కాల‌ను ఒడియా భాష‌లో రాష్ట్ర‌ప‌తి ముర్ము రిలీజ్ చేశారు. క‌మిష‌న్ ఫ‌ర్ సైంటిఫిక్ అండ్ టెక్నిక‌ల్ ట‌ర్మినాల‌జీ(సీఎస్టీటీ) ఒడియా భాష‌లో డెవ‌ల‌ప్ చేసిన సుమారు 50వేల టెక్నిక‌ల్ ట‌ర్మ్స్‌ను కూడా ఆ భాష సైట్‌లో పొందుప‌రిచారు. ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉన్న ఇంజినీరింగ్ పుస్త‌కాల‌ను 12 భార‌తీయ భాష‌ల్లోకి త‌ర్జుమా చేసిన‌ట్లు మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్ తెలిపారు. హిందీ, మ‌రాఠీ, బెంగాలీ, త‌మిళ్‌, తెలుగు, గుజ‌రాత్‌, క‌న్న‌డ‌, పంజాబీ, ఒడియా, అస్సామీ భాష‌ల్లో ఇంజినీరింగ్ పుస్త‌కాలు ట్రాన్స్‌లేట్ అయిన‌ట్లు ఆయ‌న చెప్పారు. …

Read More

అవినీతి, కుటుంబ పాలన ఎంతో కాలం సాగదని స్పష్టం చేస్తూ తెలంగాణాలో కేసీఆర్ పాలనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా హెచ్చరిక చేశారు. హైదరాబాద్‌లోని బేగంపేట్ ఎయిర్‌పోర్టులో బీజేపీకి కార్యకర్తలనుద్దేశించి మోదీ ప్రసంగిస్తూ పెదాలను దోచుకొనేవారిని వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. తెలంగాణలో అవినీతి రహిత పాలన అందించేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నదని ప్రకటించారు.   పేదల ఎదుగుదలకు అవినీతే అడ్డు అని పేకరోన్తు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ బీజేపీ మరింత బలపడుతుందని భరోసా వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని దుష్టశక్తులు ఏకమయ్యాయన్నారు. అవినీతిపరులంతా ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.  కొందరు తనను తిట్టడం కోసం డిక్షనరీలను వెతుకుంటున్నారని అంటూ తనను, బీజేపీని తిట్టినా భరిస్తాను కానీ.. తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే మాత్రం సహించనని చెప్పారు. 22 ఏళ్లుగా ఎందరితోనో ఎన్నో తిట్లు తిన్నాను.. రోజు కిలోల కొద్దీ తిట్లు తింటాను.. అందుకే అలసిపోనని పెక్రోన్నారు.  మోదీని తిట్టేవాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. చక్కగా తిట్లు వింటూ.. చాయ్…

Read More

రెండు రోజుల విశాఖపట్నం పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీతో శుక్రవారం రాత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు వేర్వేరుగా సమావేశమయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై సమాలోచనలు జరిపారు. రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేయడం గురించి కోర్ కమిటీ సభ్యులకు ప్రధాని కీలకమైన సూచనలు చేశారు. పవన్‌ కళ్యాణ్‌తో పాటు జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ కూడా ప్రధానితో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు పవన్ ప్రధానికి వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అన్ని తనకు తెలుసని ప్రధాని ఈ చెప్పారు. ‘రెండు రోజుల కిందట నాకు పీఎంవో నుంచి పిలుపు వచ్చింది. అనేక సార్లు ఢిల్లీ వెళ్లినా ప్రధానిని కలవలేదు. 2014లో ప్రమాణ స్వీకారానికి ముందు ఆయన్ని కలిశాను. ఆ తర్వాత ప్రధానిని ఎప్పుడూ కలవలేదు. 8 ఏళ్ల తర్వాత ఇప్పుడే…

Read More

నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు హోంమంత్రి మహమూద్ అలీని సాక్షులుగా చేర్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్  డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నియమించిన సిట్ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు.  ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే హైకోర్టు ఆధ్వర్యంలో సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బ్రుందాన్ని (సిట్)ను నియమించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇదే విషయంపై తాము హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. అసలు ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎందుకు బయటకు రావడం లేదు? మీడియా ముందుకు వచ్చి వాస్తవాలు ఎందుకు వెల్లడించడం లేదు? ప్రగతి భవన్ లోనే ఎందుకు ఉంచినట్లు వివరణ ఇవ్వాలని కోరారు.  గతంలో కేసీఆర్ నయీం కేసు, ఇంటర్మీడియట్ పేపర్ లీక్, మియూపూర్ భూములు, డ్రగ్స్ కేసు వంటి అంశాలన్నింటిపైనా సిట్ వేశారు. కానీ ఆ విచారణలు ఏమయ్యాయి? కేవలం సిట్ నివేదికను అడ్డుపెట్టుకుని బ్లాక్…

Read More

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దక్షిణాదిన తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు, భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలు కు బెంగళూరు లోని కెఎస్ఆర్ రైల్ వే స్టేశన్ లో పచ్చజెండా ను చూపించి, ఆ రైళ్ళ ను ప్రారంభించారు. ప్రధాన మంత్రి క్రాంతివీర సంగొళ్లి రాయణ్ణ (కెఎస్ఆర్) రైల్ వే స్టేశన్ లో 7వ నంబరు ప్లాట్ ఫార్మ్ కు చేరుకొని, చెన్నై-మైసూరు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు కు ప్రారంభ సూచకం గా ఆకుపచ్చటి సిగ్నల్ ను చూపెట్టారు. ఇది దేశం లో అయిదో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు కానుంది. అంతేకాకుండా, ఇది దక్షిణ భారతదేశంలో తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు కూడా కానుంది. ఇది పారిశ్రామిక కేంద్రం అయినటువంటి చెన్నైకి, టెక్- స్టార్ట్-అప్ కేంద్రం అయినటువంటి బెంగళూరుకు, ఇంకా ప్రముఖ పర్యటక నగరం అయినటువంటి మైసూరుకు మధ్య సంధానాన్ని పెంపొందింప చేయనుంది. ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో ‘‘చెన్నై-మైసూరు…

Read More

ఆర్థిక నేరగాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ.200కోట్ల మనీలాండరింగ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటడి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌కు ఢిల్లీ కోర్టు స్వల్ప ఊరట కల్పించింది. ఇటీవల మంజూరు చేసిన తాత్కాలిక బెయిల్‌ను ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. ఇంతకు ముందు ఇచ్చిన తాత్కాలిక బెయిల్‌ సమయం ఈ నెల 10వ తేదీతో ముగిసింది. ఈ క్రమంలో గురువారం బెయిల్‌పై విచారణ జరగ్గా  నటి, ఈడీ వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. ఫెర్నాండెజ్‌కు బెయిల్‌ పొడిగిస్తే దేశం విడిచి వెళ్లిపోతుందని ఈడీ విచారణ సందర్భంగా వాదించింది.  ఈ సందర్భంగా మిగతా నిందితులు జైలులో ఉండగా జాక్వెలిన్‌ను ఎందుకు అరెస్టు చేయలేదని ధర్మాసనం ప్రశ్నించింది. ‘పిక్ అండ్ చాయిస్ విధానాన్ని ఎందుకు అవలంబిస్తారు’ కోర్టు ఈడీని ప్రశ్నించింది. అయితే, నటి దేశం విడిచి వెళ్లకుండా లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ జారీ చేసినట్లు ఏజెన్సీ కోర్టుకు తెలిపింది. ఇప్పటికే విచారణ…

Read More

పెద్ద నోట్ల వల్ల నష్టమే ఎక్కువగా ఉండటంతో పెద్ద నోట్ల రద్దు తర్వాత అమలులోకి తీసుకొచ్చిన రూ. 2,000 నోటును ఇకపై ప్రింట్‌ చేయట్లేదని రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించింది. గడిచిన మూడేళ్లలో రూ. 2,000 నోటు ఒక్కటి కూడా ప్రింట్‌ చేయలేదని, సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నలకు ఆర్బీఐ ఇచ్చిన వివరాలలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కొత్తగా రూ. 2,000 నోట్లు ప్రింట్‌ చేయలేదని తెలిపింది. కొంతకాలంగా రెండువేల నోటు చలామణిలో కనిపించడం లేదు. ఏటీఎంలలో కూడా రూ.500 వందలు, రూ.200, రూ.100 నోట్లు మాత్రమే వస్తున్నాయి. మార్కెట్లో రూ. 2,000 నోటు కనిపించడమే అరుదైపోయిందని పలువురు దుకాణదారులు అంటున్నారు. పాత నోట్ల రద్దు తర్వాత 2016-17, 2018-19 సంవత్సరాలలో రూ.2 వేల నోట్లను ముద్రించినట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుతం ఈ నోట్లలో ఎక్కువ భాగం బ్యాంకుల వద్దే ఉన్నాయని,…

Read More