బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ను 40 రోజులుగా పీడీ చట్టం కింద జైలుపాలు చేసిన తెలంగాణ ప్రభుత్వంకు రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. సుదీర్ఘ విచారణ అనంతరం కేసీఆర్ ప్రభుత్వం ప్రయోగించిన పీడీ యాక్ట్ ను హైకోర్టు ఎత్తివేసింది. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టైన రాజాసింగ్కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో పాటు, ఆయనపై ప్రయోగించిన పీడీయాక్టు కేసు ఎత్తివేయడంతో….చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. ఈక్రమంలో న్యాయస్థానం కొన్ని షరతులు విధించింది. మూడు నెలల పాటు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టకూడదని రాజాసింగ్ ను ఆదేశించింది. జైలు నుంచి విడుదలయ్యే సందర్భంలో ఎలాంటి ర్యాలీలు చేయకూడదని నిర్దేశించింది. మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ అభ్యంతరకర పోస్ట్ లు, కామెంట్స్ చేయకూడదని తెలిపింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే అభియోగాలతో సెప్టెంబర్ 2 న రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ పరిణామం జరిగిన మూడు రోజులకే (సెప్టెంబర్ 5న) ఆయనపై పోలీసులు…
Author: Editor's Desk, Tattva News
మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అధ్యక్షతన సిట్‌ను ఏర్పాటు చేశారు. నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కమలేశ్వర్ సింగేనవర్, శంషాబాద్ డీసీపీ ఆర్ జగదీశ్వర్ రెడ్డి, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ డివిజన్ ఏసీపీ గంగాధర్, మొయినాబాద్ ఎస్‌హెచ్‌వో లక్ష్మీరెడ్డి సభ్యులుగా కొనసాగనున్నారు. దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తూ హోం శాఖ కార్యదర్శి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసు విచారణపై ఇచ్చిన స్టే ఉత్తరువులను తొలగించిన హైకోర్టు కేసును పోలీసులు దర్యాప్తు చేయవచ్చని తెలుపుతూ దర్యాప్తును నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను మంగళవారం కోర్టు రద్దు చేసింది. ఎంతో కాలంపాటు దర్యాప్తును వాయిదా వేయడం సబబు కాదని న్యాయమూర్తి జస్టిస్ బీ విజయసేన్‌రెడ్డి ధర్మాసనం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ…
భారతీయ సంతతికి చెందిన అమెరికా మహిళ అరుణా మిల్లర్ అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ అయ్యారు. దేశంలో ఇప్పుడు జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో నలుగురు ఇండో అమెరికన్లు అమెరికా ప్రతినిధుల సభకు డెమోక్రాటిక్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ అయిన అరుణా మిల్లర్ అమెరికాలో ఆమె కొత్త చరిత్ర సృష్టించారు. తెలంగాణలోని హైదరాబాద్ అరుణా మిల్లర్ జన్మస్థలం. ఇంతకు ముందు అరుణ రెండు సార్లు అమెరికాలో ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. 2010 నుంచి అమెరికా చట్టసభల దిగువ సభకు ప్రాతినిధ్యం వహించారు. అమెరికాలో ప్రతిపక్ష, ట్రంప్ నాయకత్వపు రిపబ్లికన్ పార్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో మేరీలాండ్ కీలకమైనది. ఇక్కడి ఎన్నికలలో అరుణ మంగళవారం జరిగిన ఎన్నికలలో దాదాపు 60 శాతం ఓట్లు పొందారు. మిల్లర్ దేశంలో తొలి ఇండో అమెరికన్ లెఫ్టినెంట్ గవర్నర్. అంతేకాకుండా తొలి ఆసియా అమెరికన్ కూడా కావడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. …
పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13,000 కోట్ల మేర మోసగించి బ్రిటన్ పారిపోయిన గుజరాత్ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించడంలో ముందడుగు పడింది. తనను భారత్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ, మానసిక ఆరోగ్య కారణాలను పేర్కొంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను లండన్ హైకోర్టు బుధవారం తిరస్కరించింది. నీరవ్ అప్పీల్‌ను విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ జెరెమీ స్టువర్ట్-స్మిత్, జస్టిస్ రాబర్ట్ జేతో కూడిన ధర్మాసనం, పరారీలో ఉన్న ఆయనను భారత్‌కు అప్పగించేందుకు అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది. ‘నీరవ్ మోడీ మానసిక పరిస్థితి, ఆయన ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం, ఆయనను అప్పగించడం అన్యాయమని లేదా అణచివేతకు గురిచేస్తుందని మేం భావించడం లేదు. నీరవ్ చేసిన వాదనలపై మేం సంతృప్తి చెందలేదు’ అని కోర్టు పేర్కొంది. అక్టోబర్ 12న రిజర్వ్ చేసిన తీర్పును బుధవారం వెల్లడించింది. మరోవైపు లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్న 51 ఏళ్ల నీరవ్ మోదీ, లండన్ హైకోర్టు తీర్పుపై 14…
సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. సీజేఐగా రెండేళ్ల పాటు ఆయన విధులు నిర్వర్తించనున్నారు. 2024, నవంబర్ 10వ తేదీ వరకు ఆయన సీజేఐగా ఉంటారు. రాష్ట్రపతి భవన్‌లో ఇవాళ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. జస్టిస్ చంద్రచూడ్ 1959, నవంబర్ 11న జన్మించారు. 1979లో ఆయన ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1982లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్‌బి పూర్తి చేశారు. 1983లో హార్వర్డ్ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎమ్ చేశారు. 1986లో హార్వర్డ్ నుంచే జురిడికల్ సైన్సెస్‌లో(ఎస్జేడీ) డాక్టర్ పట్టా పొందారు. 44 ఏళ్ల క్రితం సీజేఐ డీవై చంద్రచూడ్ తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్ కూడా భారత ప్రధాన న్యాయమూర్తి చేశారు. జస్టిస్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 12న రామగుండంలో జరుపనున్న అధికార పర్యటనకు సహితం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్) ప్లాంట్‌ను జాతికి అంకితం చేయడానికి వస్తున్న ప్రధానికి కనీసం స్వాగతం పలికెదుకు కూడా కేసీఆర్ వెనుకడుగు వేయవచ్చని తెలుస్తున్నది. ఇది పూర్తిస్థాయిలో అధికారిక కార్యక్రమమే. ప్రధాన మంత్రి ఒక రాష్ట్రంలో పర్యటిస్తున్నప్పుడు పార్టీలకతీతంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కావడం ఆనవాయితీ. అయితే, గతంలో ప్రధాని చేపట్టిన మూడు పర్యటనలకు గైర్హాజరైనట్లుగానే ఇప్పుడు కూడా కేసీఆర్ వెళ్లడం లేదని టీఆర్‌ఎస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, గతంలో ప్రధాని పాల్గొన్న మూడూ కూడా ప్రైవేటు కార్యక్రమాలు కావడంతో కేసీఆర్ పాల్గొనలేదని అనుకోవచ్చు. ముచ్చింతల్ సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మోదీ వచ్చారు. కానీ, స్వాగతం పలకడానికి కానీ కార్యక్రమానికి కానీ కేసీఆర్ హాజరు కాలేదు. అప్పటి నుంచే మోదీ, కేసీఆర్ మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలపై ఈ నెల 23న కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించనున్నది. ఈనెల 23వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశమై విభజన సమస్యలను పరిష్కరిస్తామని, తప్పకుండా సంసిద్ధంగా ఉండాలని కోరుతూ ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ లేఖలు రాసింది. కేంద్రం ఆధ్వర్యంలో ఉన్న ఈసమీక్ష వెబ్ పోర్టల్‌లో అప్‌డేట్ చేసిన అంశాల ఆధారంగా ఈ సమావేశాన్ని హోంశాఖ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ పోర్టల్‌లో తెలంగాణ ఎలాంటి అంశాలను అప్‌డేట్ చేయక పోవడంతో తెలంగాణ అధికారులు విభజన భేటీకి హాజరయ్యేది సందేహంగా మారింది. పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాలతో సెప్టెంబరు చివర్లో కేంద్ర హోం శాఖ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న అజయ్‌కుమార్ భల్లా అధ్యక్షతన ఈ సమావేశం జరుగనున్నది. ఏపీకి ప్రత్యేకంగా విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్, అమరావతి రాజధాని నిర్మాణానికి అదనంగా…
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్ ఎత్తేసేందుకు బీజేపీ జాతీయ క్రమశిక్షణ సంఘం సానుకూలత వ్యక్తం చేసినట్లు పార్టీ రాష్ట్ర వర్గాలు చెబుతున్నాయి. రెండు, మూడు రోజుల్లో ఆయనపై సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ హైకమాండ్ తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు భావిస్తున్నారు. రెండు రోజుల కిందటే రాజాసింగ్ భార్య ఉషాబాయీ బీజేపీ స్టేట్ ఆఫీసుకు వచ్చి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ని కలిసి దీనిపై చర్చించి వెళ్లారు. సస్పెన్షన్ పై బీజేపీ షోకాజ్ నోటీసు ఇవ్వగా, దీనికి రాజాసింగ్ ఇది వరకే వివరణ ఇస్తూ లేఖ రాశారు. దీనిపై క్రమశిక్షణ సంఘం సంతృప్తిని వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కమెడియన్ మునావర్ ఫారుఖీపై తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటూనే మహ్మద్ ప్రవక్తపై వివాదస్పద వ్యాఖ్యలు ఏమీ చేయలేదని, పైగా హిందూ ధర్మ రక్షణ కోసం తాను పోరాడుతున్నందుకు ఎంఐఎం, టీఆర్ఎస్ కుట్ర పన్ని తనపై తప్పుడు కేసులు బనాయించాయని రాజాసింగ్…
అత్యంత కీలకమైన జీ20 దేశాల కూటమికి డిసెంబరు 1 నుంచి భారత్ అధ్యక్షత వహించనుంది. ఈనేపథ్యంలో సరికొత్త థీమ్ తో కూడిన ‘జీ20’ లోగో, వెబ్ సైట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. లోగోలో ఉన్న కమలం పువ్వులో 7 రెమ్మలు ఉన్నాయని.. అవి ప్రపంచంలోని 7 ఖండాలకు ప్రతీకలని వివరించారు. ‘వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్’ నినాదంతో జీ20 కూటమిలో ముందుకుపోతామని ఆయన తెలిపారు. ఇంతకుముందు ‘వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్’ నినాదంతో పునరుత్పాదక ఇంధన వనరుల విప్లవాన్ని సాధించే దిశగా కసరత్తును ప్రారంభించామని ప్రధాని మోడీ ఈసందర్భంగా గుర్తు చేశారు. ‘వన్ ఎర్త్, వన్ హెల్త్’ నినాదంతో ప్రజారోగ్య పరిరక్షణను ఉద్యమ స్థాయిలో చేపట్టామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జీ20 కూటమిని ప్రగతిశీలకంగా ముందుకు తీసుకెళ్లేందుకు ‘వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్’ నినాదాన్ని చేపట్టామని ప్రధాని వివరించారు. జీ20 కూటమికి…
ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) నుంచి ముడుపులు స్వీకరించారన్న కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి భారీ ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి ఆమెపై మోపిన అభియోగాలను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. శ్రీలక్ష్మిని నిర్దోషిగా పరిగణిస్తూ, ఈ కేసులో ఆమెకు క్లీన్ చిట్ ఇస్తూ మంగళవారం హైకోర్టు తీర్పు చెప్పింది. దానితో ఆమెను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తదుపరి ప్రభుత్వ కార్యదర్శిగా నియమించేందుకు మార్గం సుగమమైన్నట్లు అయింది. ఓఎంసీ ముడుపుల వ్యవహారంలో సీబీఐ కేసు నమోదు చేయడంతో శ్రీలక్ష్మి ఏడాదిపాటు జైలులో గడపాల్సి వచ్చింది. శ్రీలక్ష్మి 2004-09 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా విధులు నిర్వహించారు. ఆ సమయంలో మైనింగ్ లీజులు పొందేందుకు శ్రీలక్ష్మి సహకరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందుకు గాను ఆమె భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్నారని ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు శ్రీలక్ష్మిని అరెస్టు చేసి జైలుకు పంపారు. తాజాగా ఈ కేసును హైకోర్టు…