మునుగోడు ఉప ఎన్నిక నూతన ఆర్వోగా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ కు కేంద్ర ఎన్నికల కమిషన్ బాధ్యతలు అప్పగించింది. జగన్నాథ రావు స్థానంలో రోహిత్ సింగ్ కు బాధ్యతలు అప్పగించింది. ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు కేటాయించే విషయంలో జగన్నాథ రావును బాధ్యతల నుంచి తొలగించింది. ఉప ఎన్నికలో రోడ్డు రోలర్ గుర్తు మార్పుపై ఆర్వో జగన్నాథరావును విధుల నుంచి తప్పించింది. మునుగోడు ఉప ఎన్నికలో యుగతులసీ నుంచి పోటీ చేస్తున్న శివకుమార్ కు తిరిగి రోడ్డు రోలర్ గుర్తు కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సీఈసీ ఆదేశించింది. గతంలో శివకుమార్ కు రోడ్డు రోలర్ గుర్తు కేటాయించి.. ఆ తర్వాత రద్దు చేయడాన్ని సీఈసీ తీవ్రంగా పరిగణించింది. సీఈసీ ఆదేశాలతో శివకుమార్ కు మళ్లీ రోడ్డు రోలర్ గుర్తు కేటాయిస్తూ గెజిట్ విడుదల చేయాలని ఆదేశించింది. గుర్తులు ఎందుకు మార్చారో రిటర్నింగ్ అధికారిని వివరణ ఇవ్వాలని ఈసీని ఆదేశించింది. యుగతులసీ పార్టీ గుర్తింపు…
Author: Editor's Desk, Tattva News
ఈ నెలాఖరు వరకు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని, సభలు, సమావేశాలు, ప్రదర్శనలు, ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు అడ్డుచెప్పడంతో ఆదివారం విశాఖపట్నంలో జరుపదలచిన `జనవాణి’ కార్యక్రమాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రద్దు చేసుకున్నారు. పవన్ కల్యాణ్ విశాఖపట్నం పర్యటన రెండో రోజూ తీవ్ర ఉద్రిక్తంగా మారింది. మంత్రులపై దాడి చేశారనే అభియోగంపై జనసేన నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం, ఆ తరువాత పవన్ విశాఖలో ఎటువంటి కార్యక్రమాలనూ కొద్ది రోజుల వరకూ నిర్వహించకూడదని నోటీసులు ఇవ్వడం, తక్షణం విశాఖ నగరం విడిచి వెళ్లిపోవాలని పోలీసులు ఆజ్ఞలు జారీ చేయడం, తన కార్యకర్తలను విడిచిపెట్టే వరకూ కదిలేది లేదని పవన్ భీష్మించుకు కూర్చోవడం… వంటి ఘటనలతో విశాఖ నగరం వేడెక్కింది. తనకు పోలీసులు నోటీసులివ్వడంపై పవన్ మండిపడ్డారు. నేర చరిత్ర కలిగిన వారు అధికారంలో ఉంటే ఇలాగే ఉంటుందని ధ్వజమెత్తారు. ప్రాంతాలు, కులాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.…
కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా మధ్య ప్రదేశ్ లోని భోపాల్ లో ఈ రోజు దేశంలోనే మొట్ట మొదటి హిందీ ఎంబిబిఎస్ కోర్సును ప్రారంభించారు. అజాదికా అమృత్ మహోత్సవ్ సంవత్సరంలో వైద్య రంగానికి ఈ రోజు చాలా ముఖ్యమైనదని, రాబోయే కాలంలో దీనిని సువర్ణాక్షరాలతో రాస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. మెడికల్ బయోకెమిస్ట్రీ, అనాటమీ, మెడికల్ ఫిజియోలజీ సబ్జెక్ట్ పాఠ్యపుస్తకాలను ఆయన ఆవిష్కరిస్తూ కొత్త జాతీయ విద్యా విధానం ద్వారా.. మాతృభాషకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. దేశంలో తొలిసారి హిందీ లో వైద్యవిద్యను ప్రారంభించడం ద్వారా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం మోడీ కలను నెరవేర్చిందని పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచే మధ్యప్రదేశ్ లో హిందీలో మెడిసిన్ విద్య అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. మోదీ నాయకత్వంలో ఈ రోజు కొత్త న్యూ విద్యా విధానం మన భాషలకు ప్రాముఖ్యతను ఇవ్వడం మొదలు పెట్టిందని చెబుతూ జేఈఈ, నీట్, యూజీసీ పరీక్షలను దేశంలోని 12 భాషల్లో నిర్వహించడం ప్రారంభించామని…
2014కు ముందు ఉన్న ‘ఫోన్ బ్యాంకింగ్’ స్థానంలో ‘డిజిటల్ బ్యాంకింగ్’ కోసం బిజెపి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలే భారతదేశ స్థిరమైన ఆర్థిక వృద్ధికి కారణమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గత యుపిఎ హయాం గురించి ప్రస్తావిస్తూ, ‘ఫోన్ బ్యాంకింగ్’ కింద, ఎవరికి రుణాలు ఇవ్వాలి, ఏ నిబంధనలు, షరతులకు సంబంధించి ఫోన్‌లో బ్యాంకులకు సూచనలు ఇచ్చేవారని గుర్తు చేశారు. 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను (డిబియు) దేశానికి అంకితం చేసిన అనంతరం ఆదివారం ఆయన మాట్లాడుతూ దేశ ఆర్థిక ప్రగతి ప్రత్యక్షంగా బ్యాంకింగ్ వ్యవస్థ బలంతో ముడిపడి ఉంటుందని తెలిపారు. బ్యాంకింగ్ రంగం సుపరిపాలన, మెరుగైన సేవల పంపిణీకి మాధ్యమంగా మారింది, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డిబిటి) లీకేజీలను అరికట్టడానికి, పారదర్శకతను తీసుకురావడానికి సహాయపడిందని ప్రధాన మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటివరకు డిబిటి ద్వారా రూ. 25 లక్షల కోట్లను బదిలీ చేసిందని, పిఎం-కిసాన్ పథకం కింద మరో విడతను సోమవారం…
22 ఏళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు సోమవారం జరుగుతున్నాయి. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) అధ్యక్షుడిని నిర్ణయించేందుకు ఆ పార్టీ ప్రతినిధులు దేశవ్యాప్తంగా సోమవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతున్నది. ఈ పదవికి పోటీ చేస్తును మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ పలు రాష్ట్రాల్లో పర్యటించి, నేతలను కలుసుకొని మద్దతు కోరారు. ప్రచార ప్రక్రియ ఆదివారం నాటికే ముగిసింది. దేశవ్యాప్తంగా దాదాపు 9,300 మంది పైగా కాంగ్రెస్ నిర్వాహకులు ఓటర్లుగా ఉన్నారు. 36 పోలింగ్ స్టేషన్లలో 67 బూత్‌లు ఏర్పాటు చేశారు. ప్రతి 200 మంది ఓటర్లకు ఒక బూత్ ఉంటుంది. ఢిల్లీలోనికాంగ్రెస్ ప్రధాన కార్యాలయంతో పాటు, దేశంలోని అన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) కార్యాలయాల్లో పోలింగ్ జరుగుతుంది. రహస్య బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ బాక్స్‌లు ఇప్పటికే సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ…
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడని యోగ గురువు బాబా రామ్‌దేవ్ ఆరోపించారు. సినిమా హీరోల మత్తుమందు సంబంధాల గురించి అందరికీ తెలిసిందే అంటూ పూర్తి నిజాలు ఆ దేవుడికే తెలుసు అని ఆయన పేర్కొన్నారు. ముంబై కేంద్రంగా తారల డ్రగ్స్ వ్యవహారాలపై, మత్తుమందుల పార్టీలపై ఆయన స్పందించి తమ వ్యాఖ్యలతో వివాదానికి దారితీశారు. పేరు మోసిన నటుడు షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ సంబంధిత ఘటన గురించి అందరికి తెలిసిందే అని గుర్తు చేశారు. డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఆరంభిస్తూ చిత్ర పరిశ్రమ ఒక్కటే కాదు, రాజకీయాలలో కూడా డ్రగ్స్ దందాలు విస్తరించుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మొరాదాబాద్‌లో జరిగిన ఆర్యవీర్, వీరాంగణ సదస్సులో ఆయన మాటలు వైరల్ అయ్యాయి. షారూక్ కొడుకు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. జైలుకు కూడా వెళ్లాడు. హీరోయిన్ల విషయం అయితే తనకు తెలియదని, అది ఆ భగవంతుడికే తెలుసునని వ్యాఖ్యానించారు. మత్తుమందు అలవాటు నుంచి…
రూపాయి క్షీణించడం లేదని, డాలర్ బలపడుతోందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థికవ్యవస్థ, కరెన్సీలతో పోలిస్తే రూపాయి చాలా మెరుగ్గా ఉందని ఆమె తెలిపారు. ఇటీవల రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 82.69కి పడిపోవడంపై అమెరికా పర్యటనలో ఉన్న ఆమె స్పందిస్తూ రూపాయి విలువ మరింత క్షీణించకుండా చూస్తామని చెప్పారు. రూపాయి విలువను స్థిరీకరించడానికి ఆర్‌బిఐ ప్రయత్నిస్తోందని చెబుతూ భారతీయ కరెన్సీ విలువను నిర్ణయించడానికి మార్కెట్‌లో జోక్యం చేసుకోవడం లేదని స్పష్టం చేశారు. వాస్తవానికి డాలర్ రేటు పెరగడం, డాలర్‌కి అనుకూలంగా మారకం రేటు పెరగడంతో రూపాయి విలువ నిలిచిపోయి వుండవచ్చని ఆమె పేర్కొన్నారు. యుద్ధం నిత్యావసరాల ధరలను పెంచిందని, అభివృద్ధి చెందిన దేశాలలో ద్రవ్యోల్బణం రికార్డుస్థాయిలో పెరగడానికి దారితీసిందని తెలిపారు. కాగా, ప్రపంచ మార్కెట్లలో సమస్యలు ఉన్నప్పటికీ మన దేశ ఆర్ధిక వ్యవస్థ బలహీనపడబోదని నిర్మలా సీతారామన్ భరోసా వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో…
న్యాయం పొందడం ఆలస్యం కావడం ఈ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. సమర్థవంతమైన దేశానికి, సామరస్యపూర్వకమైన సమాజానికి సున్నితమైన న్యాయవ్యవస్థ అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. చట్టంలో అస్పష్టత సంక్లిష్టతను సృష్టిస్తుందని, అందువల్ల పేద ప్రజలు సైతం సులభంగా అర్థం చేసుకునే విధంగా ‘ఈజ్ ఆఫ్ జస్టిస్’ను తీసుకురావడం కోసం తేలిగ్గా అర్థమయ్యే విధంగా ప్రాంతీయ భాషల్లో కొత్త చట్టాలను రాయాల్సిన అవసరం ఉందని ప్రధాని చెప్పారు. న్యాయపరమైన భాష పౌరులకు ఒక అడ్డంకిగా మారకూడదని కూడా ఆయన తెలిపారు. గుజరాత్‌లోని కేవాడియా జిల్లాలో ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’కి దగ్గర్లో ఉన్న ఏక్తానగర్‌లో రెండు రోజలు పాటు జరిగే న్యాయశాఖ మంత్రులు, న్యాయ కార్యదర్శుల అఖిల భారత సదస్సును శనివారం ప్రధాని వీడియో లింక్ ద్వారా ప్రారంభిస్తూ గత ఎనిమిదేళ్లలో తమ ప్రభుత్వం 1500కు పైగా పాతబడిన కాలం…
విశాఖలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అధికార వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ లో నిర్వహించిన విశాఖ గర్జనకు వైస్సార్సీపీ నేతలు, కార్య కర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మంత్రులు, నేతలు తిరిగి వెళుతున్న సమయంలో వారి కార్లపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో టిటిడి బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటు మంత్రుల కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. మంత్రులు జోగి రమేశ్, రోజా కార్ల అద్దాలను జనసైనికులు ధ్వంసం చేశారు. కార్లపై పిడిగుద్దులతో జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊహించని దాడితో మంత్రులు, నేతలు షాక్ కు గురయ్యారు. రోజా కారుపై జనసేన మహిళా కార్యకర్తలు చెప్పులు, చీపుర్లను విసిరారు. జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ కు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వచ్చారు. తమ అధినేతకు స్వాగతం పలికేందుకు ఎయిర్‌పోర్టు వద్దకు పెద్దఎత్తున జనసేన శ్రేణులు చేరుకున్నాయి. అదే సమయంలో విశాఖ గర్జన కార్యక్రమానికి మద్దతు తెలిపిన అనంతరం కార్యక్రమాన్ని…
రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికలలో పోటీ పడుతున్న మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ ఎన్నికలు జరుగుతున్న తీరుపట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. తనపై పోటీ చేస్తున్న మరో మాజీ మంత్రి మల్లిఖార్జున్ ఖర్గే `గాంధీ కుటుంభం’ నిలబెట్టిన అభ్యర్థిగా అనధికారికంగా పార్టీ వర్గాల నుండి మద్దతు లభిస్తుండటం, తన పట్ల నిరాదరణ వ్యక్తం చేస్తుండడం పట్ల బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పిసిసి అధ్యక్షులు, పార్టీ సీనియర్లు అందరు ఖర్గేకు బహిరంగంగా మద్దతు ప్రకటిస్తూ తాను పర్యటనలకు వెడుతుంటే మొఖం చాటేస్తున్నారని వాపోయారు. పైగా, ఓటర్ల జాబితా సహితం అస్తవ్యస్తంగా ఉన్నదని విమర్శలు గుప్పించారు. `పీసీసీ డెలిగేట్ల జాబితాలు పొంతన లేకుండా ఉన్నాయని, అందువల్ల పీసీసీ డెలిగేట్లను సంప్రదించడానికి తన బృందం చాలా ఇబ్బందులుపడిందని తెలిపారు. గాంధీ కుటుంబం’ కారణంగా తనకు పార్టీలో ప్రముఖులు సహాయ నిరాకరణ చేస్తున్నట్లు అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి…