Author: Editor's Desk, Tattva News

డైరెక్టర్‌ సుకుమార్‌, అల్లు అర్జున్‌ కాంబోలో వచ్చిన ‘పుష్ప ది రైజ్‌’ చిత్రం సంచలన విజయాన్ని అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం అల్లు అర్జున్‌ను పాన్‌ ఇండియా స్టార్‌గా నిలిపింది. ఆ గుర్తింపుతోనే అర్జున్‌ న్యూయార్క్‌లో జరిగిన వార్షిక ఇండియన్‌ డే పరేడ్‌లో భారతదేశానికి గ్రాండ్‌ మార్షల్‌గా ప్రాతినిధ్యం వహించారు. సైమాలో ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు. తాజాగా ఆయనను మరో అవార్డు వరించింది. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ సిఎన్‌ఎన్‌ న్యూస్‌ 18 నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో వినోద రంగానికి సంబంధించి ‘ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2022’ అవార్డును అల్లు అర్జున్‌ అందుకున్నారు. ‘పుష్ప’లో నటనకిగానూ కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఈ అవార్డు అందించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. ‘భారతీయ సినిమా, భారతదేశం ఎప్పటికీ తలవంచవు. నేను ఉత్తరాది నుంచి అవార్డు అందుకోవడం ఇదే మొదటిసారి.…

Read More

ఉక్రెయిన్‌ని నాటో కూటమిలో చేర్చుకోవడం వల్ల మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని రష్యా అధికారి హెచ్చరించారు. రష్యన్‌ ఫెడరేషన్‌ భద్రతా మండలి డిప్యూటీ సెక్రటరీ అలెగ్జాండర్‌ వెనెడిక్టోవ్‌ మీడియాతో మాట్లాడుతూ..  ‘నాటో కూటమిలో ఉక్రెయిన్‌ చేరడమనేది ఆ దేశాధ్యక్షుడి దీర్ఘకాలిక ప్రాజెక్టులోని భాగం. అమెరికా మద్దతుతో ఉక్రెయిన్‌ నాటోలో చేరడం వల్ల అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది’ అని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఉక్రెయిన్‌ ప్రాంతాల్ని చట్టవిరుద్ధంగా రష్యా స్వాధీనం చేసుకోవడంపై ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ (యుఎన్‌జిఎ)  ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి భారత్‌ ఓటింగ్‌కి దూరంగా ఉంది. 143 మంది సభ్యుల యుఎన్‌జిఎలోని ఓటింగ్‌కి దూరంగా ఉన్న 35 మంది సభ్యులలో భారత్‌ ఒకటి.  ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానానికి దూరంగా ఉన్న తర్వాత భారత్‌.. ఉక్రెయిన్‌లో పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం, పౌరుల మరణాలతో సహా ఘర్షణలు తీవ్రం కావడంపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. …

Read More

ఉపఎన్నిక జరుగుతున్న సమయంలో మునుఁగొండ నియోజకవర్గంలో ఒకేసారి 25,000 కోట్ల ఓటర్లను చేర్పించడం పట్ల బిజెపి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ఇవ్వన్నీ అధికార పార్టీ టిఆర్ఎస్ చేర్పించిన నకిలీ ఓట్లే అని ఆరోపిస్తున్నది. సాధారణంగా ఉపఎన్నిక సందర్భంగా ఏదైనా నియోజకవర్గంలో 2,000కు మించి కొత్త ఓట్లు చేర్చిన సందర్భం లేదని అంటూ, ఈ ఓట్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నది. ఈ విషయమై ఒక వంక పార్టీ అధికార ప్రతినిధి, న్యాయవాది రచనా రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, బీజేపీ ప్రతినిధి వర్గం కేంద్ర మంత్రి మురళీధర్, ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్, మాజీ ఎమ్యెల్సీ ఎన్ రామచంద్రరావులతో కలసి ఢిల్లీలో ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేసింది. ఓటర్ల జాబితా పిటిషన్‌పై హైకోర్టులో పిటిషన్ తరపున న్యాయవాది రచనా రెడ్డి గురువారం వాదనలు వినిపించారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ల నమోదు జరిగిందని, ఫార్మ్ 6 ప్రకారం కొత్తగా దాదాపు 25 వేల ఓట్లు నమోదు చేసుకున్నారని కోర్టుకు…

Read More

క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించే గడువు దాటిపోయినప్పటికీ వినియోగదారులపై అదనపు భారం పడకుండా ఆర్బీఐ వెసులుబాటు కల్పించింది. కొంత మంది గడువు తేదీ మరిచిపోతుంటారు. ఇలా సకాలంలో బిల్లు చెల్లించని వినియోగదారులపై క్రెడిట్‌ కార్డు జారీ సంస్థలు భారీగా ఆలస్య రుసుము, వడ్డీ, ఇతర అదనపు ఛార్జీలు వేస్తుంటాయి. దీని వల్ల సిబిల్‌ స్కోర్‌పైనా ప్రభావం పడుతుంది. ఇలా చెల్లించే గడువు తేదీ మర్చిపోయిన వినియోగదారులకు ఆర్బీఐ వెసులుబాటు కల్పించింది. ఇటీవల ఆర్బీఐ క్రెడిట్ కార్డు విషయంలో కొత్త నిబంధనలు తీసుకు వచ్చింది. దీని ప్రకారం క్రెడిట్‌ కార్డు జారీ చేసే సంస్థలు, క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీలకు బకాయి పడిన రోజుల గురించి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. గడువు ముగిసిన మూడు రోజుల వరకు వినియోగదారులపై ఎలాంటి అదనపు రుసుములు విధించకూడదు. గడువు తేదీ ముగిసిన విషయాన్ని సమాచారం ద్వారా తెలిపి, చెల్లించేందుకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. మూడు రోజుల తర్వాత కూడా…

Read More

కర్ణాటక హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. హిజాబ్ పై ధర్మాసనం భిన్న అభిప్రాయాలతో తీర్పు నిచ్చింది. ఇద్దరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు వెలువరించారు. విద్యార్థినుల చదువుకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, కర్ణాటక ప్రభుత్వ ఉత్తర్వును రద్దు చూస్తూ జస్టిస్ సుధాన్షు ధులియా తీర్పునిచ్చారు. జస్టిస్ హేమంత్ గుప్తా కర్ణాటక హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఈ అంశాన్ని సిజెఐ ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు. ‘హిజాబ్‌ అనేది వారి ఎంపికకు సంబంధించినది. కానీ దీనికంటే ఉన్నతమైనది ఆడపిల్లల చదువు అని నా అభిప్రాయం అన్నారు. దీంతో తుది తీర్పు కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి ఈ కేసును సిఫార్సు చేస్తున్నట్లు జస్టిస్‌ హేమంత్‌ గుప్తా వెల్లడించారు. క‌ర్నాట‌క హిజాబ్ వివాదాన్ని ఇప్పుడు మ‌రింత విస్తృత ధ‌ర్మాస‌నం విచారించ‌నున్న‌ది. భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్న నేప‌థ్యంలో.. ఈ కేసును సీజేఐ ముందుకు తీసుకువెళ్తున్నామ‌ని ధ‌ర్మాస‌నం అభిప్రాయ‌ప‌డింది. ఇక హిజాబ్…

Read More

ఐదేళ్లు కంటే ఎక్కువ కాలంపాటు ఎంపిలు, ఎమ్మెల్యేలపై ఎన్ని  క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని సర్వోనుత న్యాయస్థానం హైకోర్టులను ప్రశ్నించింది. పెండింగ్‌ కేసుల సంఖ్యతోపాటు ట్రయల్స్‌ను త్వరితగతిన ముగించేందుకు తీసుకున్న  చర్యలకు సంబంధించిన అఫిడవిట్లను నాలుగు వారాల్లో దాఖలు చేయాలని దేశంలోని అన్ని హైకోర్టులను సుప్రీం కోర్టు ఆదేశించింది.  ఐదేళ్లకుపైబడి పెండింగ్‌లో ఉను అన్ని కేసులలో సంబంధిత హైకోర్టుల నుంచి నివేదికను కోరాలని అమికస్‌ క్యూరీ, సీనియర్‌ న్యాయవాది విజరు హన్సారియా అభ్యర్థన మేరకు ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.  దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమాకోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారించింది. 768 మంది పార్లమెంట్‌ సభ్యుల్లో దాదాపు 400 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని న్యాయవాది హన్సారియా ధర్మాసనానికి తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోనిసెక్షన్‌ 8కి ఈ రిట్‌ పిటిషన్‌ సవాలుగా ఉందని,…

Read More

మొబైల్ యాప్ ద్వారా పెట్టుబడులు అంటూ రూ. 903 కోట్ల మేరకు మోసానికి సంబంధించిన బండారాన్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బయటపెట్టారు. అధిక వడ్డీ ఆశ చూపి ప్రజల నుంచి మొబైల్ యాప్స్ ద్వారా పెట్టుబడులు సేకరించి మోసానికి పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠా గుట్టును రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ సి.వి.ఆనంద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఢిల్లీకి చెందిన నవనీత్ కౌశిక్ తాను ఆర్బీఐ లైసెన్సులు పొందిన రంజన్ మనీ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, కేడీఎస్ అనే మనీ చేంజింగ్ ఎక్స్ఛేంజీల ద్వారా రూ.903 కోట్ల మనీలాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తించామని పేర్కొన్నారు. రంజన్ మనీ కార్పొరేషన్ ద్వారా 7 నెలల్లోనే రూ.441 కోట్లను, కేడీఎస్ ద్వారా 38 రోజుల్లోనే రూ.462 కోట్లను డాలర్లుగా మార్చి విదేశాలకు పంపారని దర్యాప్తులో వెల్లడైందని పేర్కొన్నారు. ఈ రెండు మనీ చేంజింగ్ ఎక్స్ఛేంజీలు ఫెమా యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించాయని తెలిపారు. ఈ…

Read More

త్వరలో భారతీయులు ఐరోపాలోనూ నేరుగా యూపీఐ, రూపే ద్వారా చెల్లింపులు చేయొచ్చు. ఎలాంటి తడబాటు లేకుండా ఫోన్ నుంచి డిజిటల్ పేమెంట్స్ ను జరపొచ్చు. ఇందుకోసం ఐరోపా దేశాల్లో డిజిటల్ పేమెంట్ సేవలు అందించే ప్రముఖ కంపెనీ ‘వరల్డ్ లైన్’ తో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) జట్టు కట్టింది. పరస్పరం కలిసి పనిచేసేందుకు సంబంధించి ఈ రెండు కంపెనీలు అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీంతో డిజిటల్ లావాదేవీల విప్లవం దిశగా భారత్ మరో ముందడుగు వేసినట్లయింది. రానున్న రోజుల్లో యూరప్ దేశాల్లో భారతీయులు ఫోన్ల నుంచి జరిపే యూపీఐ చెల్లింపులకు వరల్డ్ లైన్ కు చెందిన క్యూఆర్ కోడ్ వ్యవస్థ సపోర్ట్ చేస్తుంది. ఆయా దేశాల్లోని అన్ని పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) యంత్రాలలోనూ రూపే డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా భారతీయులు చెల్లింపులు చేయొచ్చు. ప్రధానంగా భారత్ నుంచి ఐరోపా దేశాలకు వెళ్లే టూరిస్టులకు, విద్యార్థులకు ఈ…

Read More

రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వారికి రెండున్నర నెలల (78 రోజుల) దీపావళి బోనస్ ను ప్రకటించింది. 11.27 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు మొత్తం రూ.1823 కోట్లను పండుగ బోనస్ గా చెల్లిస్తామని వెల్లడించింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కాగా, ప్రభుత్వ రంగంలోని మూడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ల నష్టాల భర్తీకి రూ.22 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. 2020 జూన్ నుంచి 2022 జూన్ మధ్యకాలంలో ఎల్పీజీ గ్యాస్ ను మార్కెట్ ధర కంటే తక్కువకు ఆయిల్ కంపెనీలు విక్రయించిన సందర్భాల్లో జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ఈ గ్రాంట్ ను వినియోగిస్తామని స్పష్టంచేశారు. ఈ వ్యవధిలో ఎల్పీజీ ధరలు…

Read More

మైడెన్‌ ఫార్మాస్యూటికల్స్‌కి హర్యానా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అధికారులు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు తయారీ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించింది. అలాగే నవంబర్‌ 14 నాటికల్లా షోకాజ్‌ నోటీసులకు సమాధానమివ్వాలని ఆదేశించారు. దగ్గు, జలుబు నివారణకు సిరప్‌లు వినియోగించి ఆఫ్రికా దేశమైన గాంబియాలో 66 మంది చిన్నారులు మరణించిన సంగతి తెలిసిందే. హర్యానాలోని సొనెపట్‌ కేంద్రంగా మైడెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఉత్పత్తిచేసిన నాలుగు సిరప్‌ల కారణంగానే సెప్టెంబరులో ఈ మరణాలు సంభవించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) ధ్వజమెత్తింది. పలువురు చిన్నారుల్లో కిడ్నీలు దెబ్బతినడానికీ ఇవే కారణమని తెలిపింది. ప్రొమెథాజైన్‌ ఓరల్‌ సొల్యూషన్‌, కొఫెక్స్‌మలిన్‌ బేబీ కాఫ్‌ సిరప్‌, మాకోఫ్‌ బేబీ కాఫ్‌ సిరప్‌, మాగ్రిప్‌ ఎన్‌ కోల్డ్‌ సిరప్‌లుగా వీటిని పేర్కొంది. ఈ మందుల సరఫరా, వినియోగాన్ని తక్షణమే నిలిపివేయాలని ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. సోనెపట్‌లోని సిరప్‌ తయారీ కేంద్రంలో చేపట్టిన తనిఖీల్లో ఆ సంస్థ 12 నిబంధనలను…

Read More