సుదీర్ఘకాలం తరువాత కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ఒక బహిరంగ కార్యక్రమంలో పాల్గన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతున్న భారత జోడో యాత్రలో ఆమె గురువారం పాల్గొన్నారు. తన కుమారుడు రాహుల్ గాంధీ, మరికొంత మంది కాంగ్రెస్ సీనియర్ నేతలతో కలిసి 75 ఏళ్ల సోనియాగాంధీ కొన్ని కిలోమీటర్లు నడిచారు. గురువారం ఉదయం కర్ణాటకలో మాండ్య జిల్లాలో జక్కనహల్లి, కరద్య మధ్య సోనియాగాంధీ పాద యాత్ర సాగింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకార సోనియా పాదయాత్ర 30 నిమిషాల పాటు మాత్రమే జరగాల్సి ఉన్నా చివరికి రెండు గంటల పాటు జరిగిందని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ట్వీట్ చేశారు. సోనియా గాంధీ, రాహుల్‌గాంధీతో కలిసి నడచినవారిలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు డికె శివకుమార్ తదితర నాయకులు ఉన్నారు. తమ అధ్యక్షురాలు యాత్రలో పాల్గనడంతో కాంగ్రెస్ కార్యకర్తల ఉత్సహం మిన్నంటింది. ఉత్సాహం నిండిన స్వరాలతో బిగ్గరగా నినాదాలు…
Author: Editor's Desk, Tattva News
అంతరిక్ష వినియోగంలో సుస్థిరతను సాధించే దిశగా భారతదేశం అగ్రగామిలో దూసుకు పోతోందని ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్‌లో ‘వరల్డ్ స్పేస్ వీక్ సెలబ్రేషన్స్-2022’ను గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను జరుపుకోవడం వెనుక అంతరిక్ష సాంకేతికత, దాని స్పష్టమైన ప్రయోజనాలను సామాన్య ప్రజలు, విద్యార్థులకు చేరువ చేసే లక్ష్యం ఉందని వివరించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష శిథిలాలను పర్యవేక్షించడానికి ‘ప్రాజెక్ట్ ఎన్‌ఇటిఆర్‌ఎ’ను ప్రారంభించినట్లు చెప్పారు. ఇది అంతరిక్ష ఆస్తులను రక్షించడం, తదుపరి ప్రణాళికకు సహాయపడుతుందని తెలిపారు. విపత్తు నిర్వహణ, వాతావరణ అంచనా, మత్స్యకారులకు సముద్ర నావిగేషన్, ఓషనోగ్రఫీ, టెలిమెడిసిన్, టౌన్ ప్లానింగ్, కమ్యూనికేషన్, డిటిహెచ్, మొబైల్ కనెక్టివిటీ మొదలైన అనేక ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా ఇస్రో ప్రశంసనీయమైన సేవలందించడం హర్షణీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో…
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగుతుంది. ఇప్పటికే ముర్మును రాష్ట్రపత్ని అని వ్యాఖ్యానించిన అధిర్ రంజన్ చౌదరి అనంతరం ఆమెకు క్షమాపణలు చెప్పారు. కాగా, మరో కాంగ్రెస్ నేత కూడా అధిర్ రంజన్ మార్గంలోనే నడుస్తూ రాష్ట్రపతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆయన స్పందన కోరుతూ జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) నోటీసులు జారీ చేసింది. రెండు రోజుల క్రితం గుజరాత్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించిన సందర్భంగా దేశవ్యాప్తంగా వాడుతున్న ఉప్పులో 76 శాతం గుజరాత్‌లోనే తయారవుతున్నదని చెప్పారు. ఇదే సమయంలో గుజరాత్ మోడల్‌ను ముర్ము కీర్తించారు. దీనిపై స్థానిక కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా రాష్ట్రపతిని `చెంచా’ అంటూ తిట్ల వర్షం కురిపించాడు. ఆమె తీరు మరీ సిల్లీగా ఉన్నదని వ్యాఖ్యానించాడు. ఉదిత్ రాజ్ తీరుపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) తీవ్ర ఆగ్రహం…
అమెరికాలో అపహరణకు గురైన 8 నెలల చిన్నారి (కుమార్తె) సహా నలుగురు సభ్యుల భారతీయ సిక్కు కుటుంబం హత్యకు గురైందనికాలిఫోర్నియా అధికారులు ఈ ప్రకటించారు. ఇది భయంకరమైనదని, అర్థం లేనిదని అంటూ కంట్రీ శాంతి భద్రతల చీఫ్ వెర్న్ వార్న్ కే వ్యాఖ్యానించారు. 36 ఏళ్ల జస్ దీప్ సింగ్, 27 ఏళ్ల జస్లీన్ కౌర్, వారి ఎనిమిది నెలల చిన్నారి అరూహి దేరి, వారి సమీప బంధువు అమన్ దీప్ సింగ్ (39) ఇండియానా రోడ్డు, హచిసన్ రోడ్డు సమీపంలో నిర్జీవంగా కనిపించినట్టు తెలిపారు. ఓ వ్యవసాయ కార్మికుడు వీరి మృత దేహాలను చూసి అధికారులకు సమాచారం ఇచ్చినట్టు వార్న్ కే వెల్లడించారు. గత సోమవారం ఉదయం వీరంతా అపహరణకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన చూసి తనకు వచ్చిన కోపాన్ని వర్ణించలేనని పోలీసు అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. జీసస్ మాన్యుయేల్ సల్గాడో అనే వ్యక్తి ఈ హత్యలకు పాల్పడినట్టు…
రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు జరిపిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ బహుమతి లభించింది. క్లిక్ కెమిస్ట్రీతోపాటు బయోఆర్థోగోనల్ కెమిస్ట్రీలను అభివృద్ధి చేసినందుకు గానూ శాస్త్రవేత్తలు కరోలిన్ ఆర్ బెర్టోజీ, మార్టెన్ మెల్డల్, కే బ్యారీ షార్ప్‌లెస్‌లను ఈ ఏడాది నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. గతేడాది రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డుకు ఇద్దరు ఎంపికకాగా ఈసారి ముగ్గురు విజేతలుగా నిలిచారు. పరమాణువు నిర్మాణంలో నూతన విధానమైన ఆర్గానోక్యాటలసిస్ అభివృద్ధి చేసినందుకు గాను 2021లో బెంజిమిన్ లిస్ట్, డేవిడ్ మెక్‌మిల్లన్‌లకు ఈ అవార్డు దక్కింది. రసాయన శాస్త్రాన్ని పర్యావరణహితంగా మార్చిన ఆ విధానం మానవాళికి ఎంతో ఉపయుక్తంగా ఉందని సెలక్షన్ కమిటీ అభిప్రాయపడింది. ఇప్పటివరకు వైద్య విభాగంతోపాటు భౌతిక, రసాయనశాస్త్రాలలో నోబెల్ బహుమతుల విజేతలను ప్రకటించారు. ఆర్థిక రంగం, సాహిత్యం, శాంతి బహుమతులకు ఎంపికైన వారి పేర్లను వెల్లడించాల్సి ఉంది. నోబెల్…
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డి ఆర్ ఐ) ఈశాన్య ప్రాంతంలో బంగ్లాదేశ్ మరియు మయన్మార్ యొక్క ఈశాన్య సరిహద్దుల ద్వారా బంగారం స్మగ్లింగ్‌లో ఊపందుకుందనే విషయం ఇటీవల బంగారం స్వాధీనం చేసుకోవడం ద్వారా నిర్ధారణ అయింది. గతంలో స్మగ్లింగ్ కోసం ఈ సరిహద్దులను ఉపయోగించినప్పటికీ, గత మాత్రమే 121 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న 11 కేసులు ఇప్పటికీ స్మగ్లర్లు ఈశాన్య కారిడార్‌ను రహస్య మార్గాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. నిర్ధిష్ట ఇంటెలిజెన్స్‌తో పాటు పాట్నా, ఢిల్లీ మరియు ముంబయిలో మూడు సమన్వయ తనిఖీల్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ రూ. 33.40 కోట్ల విలువైన 65.46 కిలోల విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. దేశీయ కొరియర్ సరుకులో ఐజ్వాల్ నుంచి ముంబైకి బంగారాన్ని రవాణా చేశారు. బంగారాన్ని గోనె సంచులలో దాచి ఉంచారు. ఇదే మార్గంలో అక్రమంగా రవాణా చేస్తున్న మరో కేసులో, మయన్మార్ నుంచి అక్రమంగా తరలిస్తున్న…
త్వరలో ఎన్నికలు జరుగనున్న హిమాచల్ ప్రదేశ్ లో రూ 3,650 కోట్ల విలువైన పలు ప్రాజెక్ట్ లకు శ్రీకారం చుట్టడం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజయదశమి పర్వదినం రోజున ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గతంలో కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోని ఈ పర్వత ప్రాంతం ఇప్పుడు కేంద్రం, రాష్ట్రాలలో బిజెపి అధికారంలో ఉండడంతో డబల్ ఇంజిన్ ప్రభుత్వాలు వేగంగా అభివృద్ధి చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్ నేతలు శంకుస్థాపనలు మాత్రమే చేసేవారని, ఎన్నికల ముగిశాక ప్రాజెక్టులను మర్చిపోయేవారంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలను ఆరంభించిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. హిమాచల్‌ప్రదేశ్ పర్యటనలో భాగంగా ఒక ఎయిమ్స్ హాస్పిటల్, ఒక ఇంజనీరింగ్ కాలేజీని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులకు 2017లో శంకుస్థాపన చేశామని గుర్తుచేశారు. దేశ రక్షణలో ఎంతోమంది హీరోలను అందించిన రాష్ట్రంగా హిమాచల్‌ప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఎయిమ్స్ ప్రారంభించిన…
దసరా పండుగ వేళ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కొత్త జాతీయ పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)గా ఉన్న పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్చడంతో పాటు టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ పార్టీ కార్యవర్గం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులందరూ ఆమోదించారు. దీంతో మధ్యాహ్నం 1.19 గంటలకు బీఆర్ఎస్ పార్టీ పేరును సీఎం కేసీఆర్ ప్రకటించారు. అనంతరం పార్టీ పేరులో మార్పు చేయాలని కోరుతూ ఎన్నికల సంఘానికి సమర్పించనున్న దరఖాస్తు పత్రాలపై సంతకాలు చేశారు. మరోవైపు టీఆర్ఎస్ పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ చేసిన తీర్మానాన్ని గుర్తించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి పార్టీ జనరల్ సెక్రెటరీ లేఖ రాశారు. పార్టీ పేరు మారుస్తూ సీఎం కేసీఆర్ సంతకం చేసిన వెంటనే తెలంగాణ భవన్ ఎదుట పెద్ద ఎత్తున పటాకులు కాలుస్తూ సంబురాలు చేశారు కార్యకర్తలు. సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన సీఎం…
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక ఆత్మగౌరవం కోసమే జరుగుతోందని పేర్కొంటూ టీఆర్ఎస్ పార్టీకి చరమ గీతం పాడేలా మునుగోడు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇవ్వబోతున్నారని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పతనం ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందని చెబుతూ ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని, కనీసం ప్రజలకు విద్య, వైద్యం ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని మండిపడ్డారు. యువత బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణను కుటుంబ పాలన నుంచి రక్షించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్ కోసం మునుగోడు ప్రజలు ధర్మం వైపు ఉండి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించకుండా అడుగడుగునా అడ్డుకున్నారని, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడినా మైకులు కట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు ప్రజల ఆవేదనను సర్కారు ఏనాడూ పట్టించుకోలేదని అంటూ సీఎం కేసీఆర్ కొడుకు, బిడ్డ, అల్లుడు అక్రమంగా వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అక్టోబర్ 2 నుండి బీహార్ లో చేపట్టిన జన సురాజ్ యాత్ర చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. దాదాపు 3,500 కిలోమీటర్ల మేరకు జరుప దలచిన ఈ పాదయాత్ర ద్వారా బీహార్ లో ఓ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఈ యాత్ర పూర్తయిన తర్వాత రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే ఇదే సమయంలో ముఖ్యమంత్రి, జెడియు అధ్యక్షుడు నితీశ్ కుమార్ జాతీయ రాజకీయాల్లో అడుగులు వేయాలని ప్రయత్నాలు ప్రారంభించడంతో పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలతో బీహార్ రాజకీయాలు ఆకట్టుకొంటున్నాయి. గతంలో ప్రశాంత్ కిశోర్ జేడీయూలో చేరి ఉపాధ్యక్ష పదవి చేపట్టారు. అంతేకాదు, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తో జతకట్టి అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించేందుకు సహకరించారు. ఆర్జేడీ ని వదిలి, తిరిగి బిజెపితో చేరినందుకే అసమ్మతి వ్యక్తం చేస్తూ నితీష్ కుమార్ కు దూరమయ్యారు. అయితే ఇప్పుడు తిరిగి…