Author: Editor's Desk, Tattva News

హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ నిబంధనలను పోలీసులు అక్టోబర్ 1 నుండి అమలు ప్రారంభించారు. ప్రధానంగా ట్రాఫిక్‌ సజావుగా సాగేందుకు, వాహనచోదకులకు ఎటువంటి ఆటంకంలేకుండా చూసేందుకు కొత్త నియమాలు అమల్లోఉంటాయని ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు. ఇక నుండి ట్రాఫిక్‌ కూడళ్ళవద్ద ఎరుపురంగు సిగ్నల్‌ వచ్చిన తరువాత గీత దాటితే రూ. 100 జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఫ్రీ లెప్ట్‌ విధానంను ట్రాఫిక్‌ పోలీసులు గతంలోనే అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇకపై ఫ్రీలెప్ట్‌ కు అంతరాయం కలిగిస్తే రూ. 1000 జరిమానా విధిస్తామని స్పష్టంచేశారు. హైదరాబాద్‌ మహానగరంలో రోజు రోజుకు వాహనాల వినియోగం పెరుగుతోంది. దీనితో సంఖ్య పెరుగుతోంది. 30లక్షల పైచిలుకు వాహనాలు రోడ్లమీదకు వస్తున్నాయని పోలీసులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొన్ని కొత్త చట్టాలను కూడా అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఆపరేషన్‌ రోపే పేరుతో చర్యలు చేపట్టారు. గతంలో రోడ్డు ప్రమాధాలు నివారించేందుకు పోలీసులు ద్విచక్ర…

Read More

కరోనా మహమ్మారి మనకు నేర్పిన అతిపెద్ద పాఠం పర్యావరణ మార్పు గురించేనని, ఇది పర్యావరణానికి నష్టం కలిగించకుండా మానవులు వ్యవహరించే విధానంపై ఆధారపడి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్యస్వామినాథన్‌ తెలిపారు. ప్రజలందరి జీవితాలు పర్యావరణంతో ముడిపడి ఉన్నాయని ఆమె చెప్పారు. పాకిస్తాన్‌ వరదల మాదిరిగానే, ప్రపంచ వ్యాప్తంగా బలహీనవర్గాలు బాధపడుతున్నారని, ఇలాంటి నష్టాలు ఏ దేశమైనా ఎదుర్కోవచ్చని పేర్కొంటూ సమానత్వంపై దృష్టి పెట్టడం, పేదలకు సహాయం చేయడం చాలా ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. ప్రజారోగ్య విధానం, సరైన వివరాలు, పరిశోధన ప్రాముఖ్యత కూడా అత్యవసరమని ఆమె స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌లు శరీరంపై ప్రభావం చూపుతున్నాయని, వాటి వలన కలిగే ప్రమాదాల కన్నా ప్రయోజనాలు అధికమని ఆమె తెలిపారు. బూస్టర్‌ డోస్‌ తీసుకున్న తర్వాత కూడా చాలా మంది కరోనా బారిన పడుతున్నారన్న మీడియాప్రశ్నపై స్పందిస్తూ వ్యాక్సిన్‌ వ్యాధి తీవ్రతను అడ్డుకుంటుందని డా. స్వామినాథన్ చెప్పారు. వ్యాక్సిన్ల కారణంగానే మహమ్మారి…

Read More

హైదరాబాద్ లోని ఎల్‌అండ్ మెట్రోరైల్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎకనమిక్ టైమ్స్ ఇన్‌ఫ్రా ఫోకస్ అవార్డు 2022ను రవాణా రంగం విభాగంలో అందుకుంది. ఎల్ అండ్ టీఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండీ సీఈఓ కెవీబీరెడ్డి ఈ ట్రోపీని డిల్లీలోని హయత్ రీజెన్సీ వద్ద నిర్వహించిన ఎకనమిక్ టైమ్స్ ఇన్‌ఫ్రా ఫోకస్ సమ్మిట్ అవార్డుల వద్ద అందుకున్నారు. హైదరాబాద్‌లో ప్రపంచ శ్రేణి నగర రవాణా వ్యవస్దను రూపొందించినందుకు అవార్డు అందజేశారు. సేవలు, నిర్వహణ పరంగా పలు మైలురాళ్లను చేరుకుంది. ఈవార్డు అందుకోవడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేసిన కెవీబీరెడ్డి మాట్లాడుతూ ఈగుర్తింపును అందించిన ఎనకమిక్ టైమ్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. “ప్రపంచంలో అతిపెద్ద ఎలివేటెడ్ మెట్రో నెట్‌వర్క్‌ను పిపీపీ నమూనాలో నిర్మించాలనే మా ప్రయత్నాలకు ఈ అవార్డు ఓ నిదర్శనం, మా సేవలు, నిర్వహణ సమర్దతతో మేము స్దిరంగా అత్యున్నత ప్రమాణాలను సృష్టిస్తూనే ఉన్నాం. ఇప్పుడు దేశంలో ఆధారపడతగిన నగర రవాణా మాధ్యమంగా ఇది నిలిచింది” అని…

Read More

గత వారం దేశంలో గోధుమలు, బియ్యం చిల్లర, టోకు ధరలు తగ్గాయి. గోధుమ పిండి ధరలు లో స్థిరంగా ఉన్నాయి. కనీస మద్దతు ధర పెరగడంతో గత రెండు సంవత్సరాలుగా గోధుమలు, బియ్యం ధరలు ఎక్కువ లేదా తక్కువ పెరిగాయి. ధరలు నియంత్రించడానికి 2021-22లో ఒఎంఎస్ఎస్ ద్వారా బహిరంగ మార్కెట్ లోకి 80 ఎల్ఎంటీ ఆహార ధాన్యాలను విడుదల చేయడంతో ధరలు తక్కువగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం గోధుమలు, బియ్యంతో సహా నిత్యావసర వస్తువుల ధరలను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకుంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నెలకొన్న అంతర్జాతీయ రాజకీయ అనిశ్చితి కారణంగా ఆహార భయాల సేకరణ తక్కువగా ఉండడంతో ఇంతవరకు ఒఎంఎస్ఎస్ ద్వారా బహిరంగ మార్కెట్ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు. అయితే, ప్రతి వారం ధరల పరిస్థితిని సమీక్షిస్తున్న కేంద్రం ధరలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉంది. ధరలు మరింత పెరగకుండా చూడడానికి ప్రభుత్వం మార్చ్ 13…

Read More

ఉగ్రవాదుల భారీ కుట్రను హైదరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి నేతలపై దాడులతో పాటు పేలుళ్లకు జాహిద్ కుట్ర పన్నాడు. ఉగ్రవాద కార్యకలాపాల కోసం యువకులను జాహిద్ రిక్రూట్ చేసుకున్నాడు. ఇప్పటికే ఆరుగురు యువకులను ఉగ్రవాద సంస్థల కోసం జాహిద్ రిక్రూట్ చేసుకున్నాడు. అబ్దుల్ జాహెద్, మాజ్ హసన్ ఫారూఖ్, మహ్మద్ సమియుద్దీన్ లను అరెస్టు చేసి, వారి నుంచి నాలుగు హ్యాండ్ గ్రెనేడ్ లు, రూ.5.50 లక్షల నగదు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ముసారాంబాగ్ లో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు జాహిద్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అబ్దుల్ జాహెద్ కు పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐతో లింకులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లో ఉగ్రదాడులు చేసేందుకు పాక్ నుంచే అతడికి నిధులు, నాలుగు హ్యాండ్ గ్రెనేడ్స్ అందాయని వెల్లడించారు.  దసరా ఉత్సవాలను జాహిద్ అండ్ టీమ్ టార్గెట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దసరా రోజు జరిగే ఉత్సవాల్లో…

Read More

బతుకమ్మ పండుగను దేశవ్యాప్తంగా నిర్వహిస్తన్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బంజారాహిల్స్ సాగర్ సొసైటీలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలలో ముఖ్య అతిథిగా పాల్గొంటూ సాధారణంగా దేవున్ని పూజించడానికి పూలను వాడుతామని, అలాంటి పూలను పూజించే పండుగ బతుకమ్మ అని చెప్పారు. అలాంటి సద్దుల బతుకమ్మ కోసం చిన్నప్పుడు ఎంతో ఆతృతగా ఎదురు చూసేవాడినని గుర్తు చేసుకున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్ద పీట వేస్తోందని, ఈ క్రమంలోనే బతుకమ్మ పండుగను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక ఇండియా గేట్ వద్ద కేంద్ర ప్రభుత్వం తరపున బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించామని, ఆ కార్యక్రమానికి తెలుగువారితో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారని చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను కూడా దేశవ్యాప్తంగా నిర్వహించామని మంత్రి తెలిపారు. కాగా, ఎన్ని భాషలు, ఎన్ని ప్రాంతాలు, ఎన్ని మతాలున్నా భారతదేశమంతా ఒక్కటేనని,…

Read More

దేశంలో పరిశుభ్రమైన నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ వరుసగా ఆరోసారి టాప్‌లో నిలిచింది. సూరత్‌, ముంబై నగరాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వే వివరాలను శనివారం విడుదల చేశారు. ‘స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డ్స్ 2022’లో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో నిలువగా, గుజరాత్‌, మహారాష్ట్ర తర్వాత స్థానాల్లో రాణించాయి. పెద్ద నగరాల కేటగిరిలో ఇండోర్‌, సూరత్‌ అగ్రస్థానంలో ఉన్నాయి. గత ఏడాది మూడో స్థానంలో ఉన్న విజయవాడ దానిని కోల్పోయింది. ఆ స్థానాన్ని నవీ ముంబై దక్కించుకుంది. కాగా, ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన విశాఖపట్నం నాలుగో స్థానంలో, విజయవాడ ఐదో స్థానంలో ఉన్నాయి. మధ్య ప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ ఆరో స్థానంలో, తిరుపతి ఏడో స్థానంలో, మైసూర్‌ ఎనిమిదో స్థానంలో, దేశ రాజధాని న్యూఢిల్లీ తొమ్మిదో స్థానంలో, ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌ పదో స్థానంలో నిలిచాయి. శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…

Read More

టెలికాం రంగంలో 5జీ సేవ‌లు విప్ల‌వాత్మ‌క మార్పులు తేనున్న‌ట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీలోని స్థానిక ప్రగతి మైదానంలో నాలుగు రోజులపాటు జరిగే ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ (ఐఎంసి) ఆరో ఎడిషన్‌ను ప్రారంభించి, 5 జి సేవలను శనివారం ప్రధాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5జి సేవల ప్రారంభం 21వ శతాబ్ధంలో దేశానికి చరిత్రాత్మక సంఘటనగా నిలుస్తుందని పేర్కొన్నారు. డిజిటల్‌ ఇండియా సాధించిన విజయంగా దీనిని ఆయన అభివర్ణించారు. ఈ సాంకేతికత ఆవిష్కరణతో ప్రతి ఇంటికీ ఇంటర్నేట్‌, సూతన సాంకేతిక పరిజ్ఞానం చేరగలదన్న నమ్మకం తనకుందని చెప్పారు. డిజిటల్‌ ఇండియా సంపూర్ణ లక్ష్య సాధన డిజిటల్‌ వివైస్‌ ధర, డిజిటల్‌ కనెక్టివిటీ, డిజటల్‌ డేటా ధర, డిజిటల్‌ ఫస్ట్‌ అప్రోచ్‌ అనే అంశాలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. 014లో దేశం నుండి మొబైల్‌ ఫోన్ల ఎగుమతి జరిగేది కాదని, ఇప్పుడు వేల కోట్ల రూపాయల విలువైన మొబైల్‌ ఫోన్లను…

Read More

ప్రముఖ హాస్యనటుడు, దివంగ‌త న‌టుడు అల్లు రామ‌లింగ‌య్య శ‌త దినోత్స‌వం సంద‌ర్భంగా ఆయన జ్ఞాపకార్థం హైదరాబాద్‌లో అల్లు అరవింద్‌ నిర్మించిన అల్లు స్టూడియోస్‌ను హైదరాబాద్ లో శనివారం ప్రారంభించారు. దాదాపు 10 ఎకరాల్లో ఏర్పాటైన ఈ స్టూడియో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అల్లు స్టూడియో హైదరాబాద్‌ సిటీ అవుట్ స్కర్ట్స్‌లో ఉన్న కోకా పేట్‌లో భారీగా నిర్మించారు. అత్యాధునిక టెక్నాలజీతో ఈ స్టూడియోస్‌ను నిర్మించారట. కాగా ఇందులో ‘పుష్ప’ పార్ట్‌-2 షూటింగ్‌ను చాలా వరకు జరుపనున్నట్లు టాక్. ఇప్పటికే పుష్ప సీక్వెల్‌కు సంబంధించిన పనులు ప్రారంభమైయ్యాయట. చిరంజీవి మాట్లాడుతూ ఎంతో మంది నటులున్నా కొద్దిమందికి మాత్రమే ఈ ఘనత, ఆప్యాయత లభిస్తుందని, రామలింగయ్యగారి వారసులుగా, కొడుకుగా వారు వేసిన బాటలో అల్లు అరవింద్‌ అగ్ర నిర్మాతగా, మనవలు, అల్లు బాబీ, బన్నీ, శిరీష్‌ వీళ్లు కూడా ఇదే సినిమారంగంలో అగ్ర స్థానంలో…

Read More

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌ నుంచి ఆక్రమించుకున్న డొనెట్క్స్‌, లుహాన్స్‌, జపోరిజియా, ఖేర్సన్‌ ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకుంటున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ శుక్రవారం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన విలీన ఒప్పందాలపై ఆయన సంతకం చేశారు. మాస్కోలోని క్రెమ్లిన్‌ భవనంలో జరిగిన కార్యక్రమంలో ఆ నాలుగు రీజియన్లకు సంబంధించిన నేతలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చలకు రావాలని ఉక్రెయిన్‌ను ఆహ్వానించిన ఆయన.. విలీన ప్రాంతాలను మాత్రం వదులుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ ప్రాంతాలను కాపాడుకోవడానికి దేనికైనా సిద్ధమని పేర్కొన్నారు. బాల్టిక్‌ సముద్రం కింద రష్యా నిర్మించిన గ్యాస్‌ పైప్‌లైన్లను పశ్చిమ దేశాలు ధ్వంసం చేస్తున్నాయని పుతిన్‌ ఆరోపించారు. రష్యాలో నాలుగు రీజియన్ల విలీనానికి సంబంధించిన ఒప్పందాలను ఆమోదించేందుకు రష్యా ఉభయ సభలు వచ్చే వారం సమావేశం కానున్నాయి. తాజా పరిణామాలపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా ఆక్రమణలో ఉన్న…

Read More