భారత అటార్నీ జనరల్‌గా మళ్లీ పదవిని చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్‌ను సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి తిరస్కరించారు. గతంలో ఒకసారి భారత అటార్నీజనరల్‌గా పనిచేసిన రోహత్గి అక్టోబర్ 1 నుంచే మళ్లీ అటార్నీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్టు విస్తృత ప్రచారం జరిగింది. ఈ మేరకు కేంద్రం పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసినట్టు కూడా అనేక వాదనలు వినిపించాయి. అయితే తాజాగా వాటికి బ్రేక్ వేస్తూ అందుకు తాను సుముఖంగా లేనని ఆదివారం ప్రకటించారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్‌ను కాదనడం వెనుక ఎలాంటి ప్రత్యేక కారణం లేదని, మరోసారి ఆ పదవిని చేపట్టేందుకు తాను సుముఖంగా లేనని స్పష్టం చేశారు. గతంలో ఏజీగా పనిచేసిన రోహత్గి 2017లో ఈ బాధ్యతల నుంచి వైదొలగడంతో 15వ అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్‌ను నాడు ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత ఏజీ వేణుగోపాల్ పదవీకాలాన్ని పొడిగించారు. అది కూడా ఈ ఏడాది…
Author: Editor's Desk, Tattva News
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండడంతో ముఖ్యమంత్రి పదవికి పోటీ చేయమని `ఆదేశించడం’తో పాటు, ఆ స్థానంలో తన సన్నిహితుడు సచిన్ పైలట్ ను ఎంపిక చేసేందుకు రాహుల్ గాంధీ చేస్తున్న ప్రయత్నాలపై అశోక్ గెహ్లాట్ వర్గం బహిరంగంగా తిరుగుబాటుకు సిద్దమయింది. దానితో సచిన్ ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునేందుకు ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఎమ్యెల్యేల సమావేశం జరగనే లేదు. ఈ సమావేశం జరపడానికి ఏఐసీసీ పరిశీలకులుగా వచ్చిన మల్లిఖార్జున్ ఖర్గే, అజయ్ మకెన్ లు నిసాహయంగా తిరిగి వెళ్ళవలసి వచ్చింది. పైగా, ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వర్గానికి చెందిన 92 మంది ఎమ్మెల్యేలు అధిష్ఠానంపై తిరుగుబావుటా ఎగురవేస్తూ మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ఈ మేరకు తమ రాజీనామా పత్రాలను అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషికి గత రాత్రి సమర్పించారు. ఓవైపు సీఎంగా తానే కొనసాగుతానని గెహ్లాట్ పట్టుబడుతూ వస్తున్న గెహ్లాట్, ఒక వేళ రాజీనామా చేసినా రాహుల్…
మూతబడ్డ ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీని తెరువాలనే డిమాండ్ ఒకవైపు, గల్ఫ్ వలస కార్మికుల హక్కుల సాధన డిమాండ్ మరొకవైపు- ఈ రెండు డిమాండ్లను కలిపి ఒక వినూత్నమైన సాంస్కృతిక ఉద్యమానికి ఆదివారం నాడు కొందరు ఉద్యమకారులు శ్రీకారం చుట్టారు. బతుకమ్మ కన్నా గొప్పదైన సందర్భం, వేదిక ఇంకోటి లేదని ఈ ఏటి బతుకమ్మ సాక్షిగా వారు కార్యోన్ముఖులయ్యారు. అన్నదమ్ముల తోడు లేని ఆడబిడ్డ బతుకమ్మ ఎలా వెలవెల బోతోందో, ఒక చెల్లెలు గల్ఫ్ లో ఉన్న తన అన్నను సంబోదిస్తూ పాడే 14 నిమిషాల బతుకమ్మ పాటను ముత్యంపేటలో చెరుకు రైతులు, గల్ఫ్ కార్మికులు, ఆడపడచుల సమక్షంలో విడుదల చేశారు. కోరుట్ల నియోజక వర్గానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు సీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేని శ్రీనివాస రావు, గల్ఫ్ వలస కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న గల్ఫ్ జెఏసి రాష్ట్ర అధ్యక్షుడు గుగ్గిల్ల రవిగౌడ్ ఇద్దరూ కలిసి తెలంగాణాలో మరో ఉద్యమానికి నాంది…
ఆదివారం ఉప్పల్ వేదికగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను 2-1 తేడాతో గెలుపొందింది. ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి 11 పరుగులు అవసరం కాగా తొలి బంతికే సిక్స్ బాదిన కోహ్లి (48 బంతుల్లో 63).. రెండో బంతికి భారీ షాట్ ఆడేందుకు యత్నించి ఔటయ్యాడు. దీంతో అందర్నీలో టెన్షన్ మొదలైంది. కానీ ఐదో బంతికి ఫోర్ బాది..టీమ్ ఇండియా కు విజయం అందించారు హార్దిక్ పాండ్య . ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఓపెనర్ కామెరూన్ గ్రీన్ (52), టిమ్ డేవిడ్ (54) ధాటిగా ఆడటంతో ఆసీస్ జట్టు 186/7 స్కోరు సాధించింది. 187 లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేఎల్ రాహుల్ (1) తొలి ఓవర్లోనే పెవిలియన్…
దేశంలో వరుసగా విద్యుత్ బైక్‌లు పేలిపోతుండడంతో అందుకు ప్రధాన కారణం వాటికి వాడే బ్యాటరీల నాణ్యత లోపాలే అని కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల బృందం కూడా నిర్ధారించింది. ఇటీవల ఓ బైక్ షాప్ లో జరిగిన అగ్నిప్రమాదం పెను విపత్తుకు దారితీసి, ఎనిమిది మంది మరణించడంతో ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారిస్తున్నది. అందులో భాగంగా త్వరలోనే రాష్ట్రంలో బ్యాటరీల నాణ్యతను గుర్తించే ల్యాబరేటరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. బ్యాటరీ తయారయినప్పుడు వాటి నాణ్యతను పరీక్షించడానికి దేశవ్యాప్తంగా ల్యాబరేటరీలు లేవు. తమిళనాడులో ఉన్న ల్యాబరేటరీని ఒక ప్రైవేటు కంపెనీని ఏర్పాటు చేసింది. అక్కడ బ్యాటరీల నాణ్యత పరీక్షించడానికి సరైన సిబ్బంది లేక నాణ్యత గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 1,000 బ్యాటరీల నాణ్యతను ఆ ల్యాబరేటరీలో పరీక్షించాల్సి వచ్చినప్పుడు అక్కడి సిబ్బంది 10 లోపు బ్యాటరీలను చెక్ చేసి మిగతావి కూడా ఒకే అని సర్టిఫికెట్…
చండీగఢ్ విమానాశ్రయం పేరును ”భగత్ సింగ్”గా మార్చుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగంలో ఆదివారం ప్రకటించారు. గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడికి నివాళిగా చండీగఢ్ విమానాశ్రయం పేరును ఇప్పుడు షహీద్ భగత్ సింగ్ గా మార్చుతున్నట్లు తెలిపారు. భగత్‌సింగ్ జయంతి ఈ నెల 28 న జరగనుండటంతో ప్రధాని ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.“ప్రియమైన దేశ వాసులారా మూడు రోజుల తరువాత సెప్టెంబర్ 28న అమృత్‌మహోత్సవ్‌లో ఒక ప్రత్యేకమైన రోజు. ఆరోజు భరత మాత సాహసపుత్రుడు షహీద్ భగత్‌సింగ్ జయంతి జరుపుకోనున్నాం. భగత్‌సింగ్‌కు నివాళిగా ఒక నిర్ణయం తీసుకున్నాం. చండీగఢ్ విమానాశ్రయానికి భగత్‌సింగ్ పేరు పెడుతున్నాం.” అని మోదీ ప్రకటించారు. చండీగఢ్ విమానాశ్రయం పేరు మార్చాలంటూ హర్యానా, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాల నుండి వినతులు వచ్చాయని చెప్పారు. పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చండీగఢ్ విమానాశ్రయం పేరును భగత్ సింగ్ గా మార్చాలని క్యాబినెట్ తీర్మానం చేసింది.…
ఈశాన్య భారతదేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రూపొందించిన ‘సింపో ఎన్ ఈ ‘ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో కేంద్ర పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రిజి.కిషన్ రెడ్డి ప్రారంభించారు. రెండు రోజుల పాటు సమావేశం జరుగుతుంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా 2022 సెప్టెంబర్ 24, 27 తేదీల్లో ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ‘సింపో ఎన్ ఈ ‘ని నిర్వహిస్తోంది. వర్చువల్ విధానంలో జరిగే సమావేశంలో ఈశాన్య భారతదేశంలో పర్యాటక రంగం అభివృద్ధికి గల అవకాశాలు, ఇంత కాలం ఎక్కువ గుర్తింపు పొందని పర్యాటక ప్రాంతాలకు గుర్తింపు సాధించేందుకు అనుసరించాల్సిన కార్యాచరణ కార్యక్రమాన్ని సమావేశం చర్చించి పర్యాటక రంగ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తారు. పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడే వివిధ ఆలోచనలు, సూచనలను వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులు, విధాన నిర్ణేతలు, సామాజిక మాధ్యమాలను ప్రభావితం చేయగల వ్యక్తులు, పర్యాటక సంస్థల ప్రతినిధులు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రతినిధుల నుంచి…
భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు అయ్యే 2047 నాటికి ఇస్లామిక్ రాజ్యం నెలకొల్పడం కోసం ప్రధాన మంత్రితో సహా దేశంలో పలువురు ప్రముఖుల లక్ష్యంగా పాపులర్ ఫ్రంట్ అఫ్ ఇండియా (పిఎఫ్ఐ) ఉగ్రవాద కార్యక్రమాలకు యువతను సమీకరిస్తున్నదని, సాయుధ దాడులకు శిక్షణ కూడా ఇస్తున్నదని దేశవ్యాప్తంగా సోదాలు జరిపిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) నిర్ధారణకు వచ్చింది. గత జూన్ 12న పాట్నా పర్యటనకు వెళ్లిన సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై దాడి జరపడం కోసం కొద్దిమందికి సాయుధ శిక్షణ కూడా వచ్చినట్లు వెల్లడైంది. అరెస్టు అయిన ప్రముఖ నేతల దగ్గరి నుంచి అత్యంత అభ్యంతరకర, తీవ్రస్థాయి సమాచారం, కీలక పత్రాలు లభించాయని ఎన్ఐఎ తెలిపింది. ఈ మేరకు ఎన్‌ఐఎ ప్రత్యేక న్యాయస్థానానికి రిమాండ్ రిపోర్టు అందించింది. కొచ్చిలో అరెస్టు అయిన పది మందిని తమ రిమాండ్‌కు పంపించాలని కోరుతూ ఈ వర్గాలు కోర్టుకు అత్యంత కీలకమైన రిమాండ్…
చైనా అధ్యక్షులు, కమ్యూనిస్టుపార్టీకి తిరుగులేని నేత జిన్‌పింగ్‌ను గృహనిర్బంధంలో ఉంచినట్లు సోషల్ మీడియా వార్తలు గుప్పుమంటున్నాయి. ఆయన నిరంకుశ వైఖరిని సహించలేక సైనిక తిరుగుబాటు జరిగిందని, ఇప్పుడు జీ బందీ అయ్యారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ వార్తలపై చైనా అధికార మీడియా గాని, చైనా కమ్యూనిస్ట్ పార్టీ గాని మౌనం పాటస్తుండడం గమనార్హం. ఈ మధ్యకాలంలో చైనా అధ్యక్షులు భారీ స్థాయిలో అధికారిక వ్యవస్థలో, సైనిక వర్గాలలో ప్రక్షాళనలకు దిగుతూ ఉండటంతో తదనంతర పరిణామాలతో దేశ అత్యంత శక్తివంతమైన సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పిఎల్‌ఎ) ఆయనను ఇంట్లోనే బందీగా చేసినట్లు చైనీయుల ట్వీట్లతో వెల్లడైంది. చైనాలో ఓ మాజీ భద్రతా అధికారికి స్థానిక కోర్టు యావజ్జీవ శిక్ష విధించినట్లు ఇటీవలే బ్లూమ్‌బెర్గ్ అనుబంధ టీవీ ఛానల్ తెలిపింది. జి జిన్‌పింగ్ ఇటీవలి కాలంలో అత్యంత కీలకమైన పార్టీపరంగా అంతర్గత సంక్లిష్టతలతో కూడిన భారీ మార్పులు చేర్పులు చేపడుతున్న దశలోనే…
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ భారత్ సహా అన్ని పొరుగుదేశాల తోనూ తాము శాంతిని కాంక్షిస్తున్నామని చెప్పడం పట్ల భారత్ విస్మయం వ్యక్తం చేసింది. ఢిల్లీ, పొరుగు దేశాలతో శాంతిని కోరుకునే వారే అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషించదని స్పష్టం చేసింది. షరీఫ్ ప్రసంగంకు భారత శాశ్వత బృందం తొలి సెక్రటరీ వినిటోధీటుగా సమాధానం ఇస్తూ పాకిస్తాన్ పై నిప్పులు చెరిగారు. 1993 నాటి ముంబయి బాంబు పేలుళ్లను ప్రస్తావిస్తూ శాంతిని కోరుకునేవారెవరూ అలాంటి హింసాత్మక దాడులకు కుట్రలు చేసిన వారికి ఆశ్రయం ఇవ్వరని మండిపడ్డారు. “భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేసేందుకు పాకిస్థాన్ ప్రధాని ఈ వేదికను ఎంచుకోవడం విచారకరం. తమ సొంత దేశంలో జరిగిన అకృత్యాలు బయటపడకుండా ఉండేందుకు, భారత్‌కు వ్యతిరేకంగా పాక్ చేస్తున్న చర్యలను సమర్థించుకునేందుకే ఆయన ఇలా మాట్లాడారు” అంటూ విమర్శించారు. “పొరుగు దేశాలతో శాంతిని కోరుకుంటున్నామని చెబుతున్నారు. అలాంటి…