గత టిడిపి ప్రభుత్వం విపక్ష సభ్యులపై నిఘా వేసేందుకు ఇజ్రాయెల్ నుంచి పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేసి వినియోగించిందన్న ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ఏపీ అసెంబ్లీ హౌస్ కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. భూమన కరుణాకరెడ్డి చైర్మన్ గా ఈ పెగాసస్ సభా సంఘాన్ని స్పీకర్ అప్పట్లో ప్రకటించారు. తాజాగా, భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని కమిటీ మధ్యంతర నివేదికను రూపొందించింది. ఈ నివేదికను మంగళవారం సభ ముందు ఉంచారు. గత ప్రభుత్వం డేటా చోరీకి పాల్పడినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు పేర్కొన్నారు. అయితే, దీనిపై సేకరించాల్సిన సమాచారం చాలా ఉందని, అనేకమందిని విచారించాల్సి ఉందని భూమన చెప్పారు. ఇందుకు సంబంధించి లోతైన పరిశోధన చేస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వానికి ఓటు వేయని వారి సమాచారాన్ని సేకరించారని, ప్రభుత్వం వద్ద స్టేట్ డేటా సెంటర్ లో ఉండాల్సిన సమాచారాన్ని టిడిపికి సంబంధించిన సేవామిత్ర యాప్…
Author: Editor's Desk, Tattva News
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) క్రికెట్లో కొత్త నిబందనలు తీసుకొచ్చింది. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయని ఐసీసీ వెల్లడించింది. క్రికెట్‌లో కొన్ని నియమాలను మార్చుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. సౌరభ్ గంగూలీ నేతత్వంలోని పురుషుల క్రికెట్ కమిటీ చేసిన సిఫార్సులను చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదించింది. ఈ నేపథ్యంలో మార్పులను ఐసీసీ వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం.. క్రీజులో ఉన్న బ్యాటర్ క్యాచ్ అవుట్ అయితే.. కొత్త బ్యాటర్ కచ్చితంగా స్ట్రైకింగ్ తీసుకోవాల్సిందే అని స్పష్టం చేసింది. బాల్ షైనింగ్ అయ్యేందుకు ఉమ్మిరాసే విధానాన్ని పూర్తిగా నిషేధించింది. ఫీల్డ్ లోకి వచ్చే కొత్త ప్లేయర్ రెండు నిమిషాల్లో స్ట్రైక్ తీసుకోవాలి. ఫీల్డింగ్ సైడ్ వాళ్లు కావాలని బ్యాటర్లను ఇబ్బంది పెడితే.. బ్యాటింగ్ సైడ్ వాళ్లకు 5 పరుగులు పెనాల్టీ రూపంలో అంపైర్ ఇవ్వొచ్చు. బౌలింగ్ టైంలో నాన్- స్ట్రైకర్ క్రీజులో లేకపోతే బౌలర్ ఔట్ చేయడాన్ని రనౌట్ గా…
మరో మూడు రోజులలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ల పక్రియ ప్రారంభించాల్సి ఉండగా, ఎన్నికపై కాంగ్రెస్ వర్గాల్లో అస్పష్టత కొనసాగుతున్నది. గాంధీ కుటుంభం వెలుపలి వ్యక్తిని అధ్యక్షునిగా ఎన్నికోవాలని అంటూ ఉన్నప్పటికీ గతంలో వలే తాను అధ్యక్ష పదవిని చేపట్టబోనని `భారత్ జోడో యాత్ర’లో ఉన్న రాహుల్ గాంధీ స్పష్టం చేయడం లేదు. అధ్యక్ష పదవిపై తగు సమయంలో స్పందిస్తానని మాత్రమే చెప్పారు. మరోవంక ఒకొక్క ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాహుల్ పేరును సిఫార్సు చేస్తూ తీర్మానాలు చేస్తున్నాయి. రాహుల్ పోటీకి సిద్ధపడితే ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే రాహుల్ పోటీలో లేని పక్షంలో ఈ పోటీకి ఇప్పటికి ఇద్దరు ప్రముఖ నాయకులు సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ పోటీకి సంసిద్ధత వ్యక్తం చేశారు. థరూర్ సోమవారం పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలసి ఈ…
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లాలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు అంకితం చేసిన ఒక గుడి వెలుగులోకి వచ్చింది. భరత్‌కుండ్ సమీపంలోని పూర్వా గ్రామంలోని ఈ గుడిలో యోగి ఆదిత్యనాథ్‌ను రాముడి అవతారంగా ఏర్పాటు చేశారు. ఆలయంలో ప్రతిష్టించిన యోగీ విగ్రహం ముందు రోజూ రెండు సార్లు ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. పూజల అనంతరం భక్తులకు ప్రసాదం కూడా పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. భరత్‌కుండ్ రాముడు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు అతని సోదరుడు భరత్ అతనికి వీడ్కోలు పలికిన ప్రదేశం అని నమ్ముతారు. అయోధ్యలో రాముడి జన్మభూమికి 25 కి.మీల దూరంలో భరత్‌కుండ్ సమీపంలో ఫైజాబాద్- ప్రయాగ్‌రాజ్ హైవే వద్ద ఈ ఆలయాన్ని అయోధ్య నివాసి ప్రభాకర్ మౌర్య నిర్మించారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించే వ్యక్తిని పూజిస్తానని 2015లో మౌర్య ప్రతిజ్ఞ చేశారు. మౌర్య మాట్లాడుతూ తాను రాముడి కోసం చేసినట్లే రోజూ యోగి ఆదిత్యనాథ్ విగ్రహం ముందు…
బ్రిటన్ చరిత్రలో అత్యధిక కాలం రాణిగా కొనసాగిన ఎలిజబెత్‌ా2 అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో సోమవారం ముగిశాయి. బ్రిటన్, యూరప్‌లోనిఇతర దేశాల నుంచి లక్షలాది మంది రాణి అంత్యక్రియల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బ్రిటన్ పౌరులు ఆమెకుకనీుటితో వీడ్కోలు పలికారు. రాణి అంత్యక్రియల్లో అమెరికా అధ్యక్షుడు బైడెన్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా దాదాపు 500 మంది ప్రపంచ నేతలు, మొత్తంగా దాదాపు 2వేల మంది అతిథులు పాల్గొన్నారు. బకింగ్‌హం ప్యాలెస్‌లో రాజు చార్లెస్‌ను కలుసుకొని సంతాపం తెలిపారు.అత్యంత పురాతనమైన వెస్ట్‌మినిస్టర్ అబే చర్చిలో ప్రార్థనల అనంతరం రెండు నిమిషాలపాటు అక్కడ హాజరైనవారు మౌనం పాటించారు. ఈ ఘట్టంతో బ్రిటన్ రాజుగా ఛార్లెస్‌ా3 పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించినట్టే. చర్చి వద్ద జాతీయ గీతాలాపనతో ఎలిజబెత్ అంత్యక్రియల ఘట్టం పూర్తయ్యింది. దీనికంటే కొద్ది నిమిషాల ముందు ప్రార్థనలు జరిగే సమయంలో అక్కడును గంటను 96 సార్లు మోగించాడు. రాణి ఎలిజబెత్…
టిఆర్ఎస్ నేతలను డంపింగ్ యార్డ్ వద్ద కట్టేయండి అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా దమ్మాయిగూడ చౌరస్తా సభలో మాట్లాడుతూ కేసీఆర్ మీకు మానవత్వం ఉంటే జవహర్ నగర్ కు రావాలని హితవు చెప్పారు. బీజేపీకి అధికారమివ్వండి.. డంపింగ్ యార్డ్ సంగతి తేలుస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్రలో దారి వెంట ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్న సంజయ్ ను జవహర్ నగర్, దమ్మాయిగూడా ప్రజలు ప్రధానంగా ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ను తరలించాలని సంజయ్ ని కోరారు. మేడ్చల్ ఆర్టీసీ డిపో ఆస్తులను కెసిఆర్ తనఖా పెట్టాడని సంజయ్ ఆరోపించారు. రోడ్లు కూడా వేయలేని దుస్థితి కేసీఆర్ ప్రభుత్వానిదేనని ధ్వజమెత్తారు. రూ.110 కోట్లతో డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానన్న ట్విట్టర్ టిల్లు హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. ప్రజల సమస్యలను పరిష్కరించలేని టీఆర్ఎస్ నేతలు భూకబ్జాలు, కమీషన్ల పేరుతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.…
పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. హిమాచల్ ప్రదేశ్ లోని ధరంశాలలో జరుగుతున్న వివిధ రాష్ట్రాల పర్యాటక మంత్రుల సదస్సులో రెండో రోజు ఆయన అక్కడి ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, పర్యాటక శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, తమిళ్ నాడు, మిజోరాం, బీహార్, అస్సాం, గోవా, మహారాష్ట్ర, ఒడిశా, జమ్మూ కాశ్మీర్, లదాఖ్, రాజస్థాన్, కర్ణాటక, మణిపూర్, సిక్కిం రాష్ట్రాల మంత్రులు, కార్యదర్శులు ఈ సదస్సులో పాల్గొన్నారు. తమ రాష్ట్రాల్లో జరుగుతున్న పర్యాటకాభివృద్ది, సమస్యల గురించి చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున టూరిజం ఎండీ మనోహర్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కరోనా కారణంగా ప్రభావితమైన పర్యాటక రంగాన్ని మళ్లీ పట్టాలెక్కించడానికి…
మార్గదర్శి చిట్‌ఫండ్ కేసులో ఆ సంస్థ అధినేత రామోజీరావుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా సమాధానమివ్వాలని ఆదేశించింది. మార్గదర్శి ఛిట్‌ఫండ్ కేసులో సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. సోమవారం నాటి విచారణలో పిటిషనర్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తరఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. విచారణ అనంతరం పిటిషనర్ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టు ఆవరణలోనే మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ కావడంతో మళ్లీ కదలిక వచ్చిందని, నాలుగు వారాల్లోగా రామోజీ రావు, ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు నోటీసులకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపానారు. కేసులో ఏపీ ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషించనుందని వెల్లడించారు. పిటీషన్‌లో పొందుపరిచిన అంశాలన్నింటినీ ధర్మాసనం పరిగణలోకి తీసుకుందని, వాటన్నింటికీ నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులు ఇచ్చిందని చెప్పారు. ఇదే కేసులో రామోజీ…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు విషయం ఇప్పుడు సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో శాసనసభ నియోజకవర్గాల పెంపుపై కేంద్ర ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ నియోజక వర్గాలను పెంచాలని, కానీ, ఇంత వరకూ ఆ ప్రక్రియను మొదలు పెట్టలేదంటూ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె.పురుషోత్తమ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఏపీలోని 175 అసెంబ్లీ సీట్లను 225కి, తెలంగాణలోని 119 సీట్లను 153కి పెంచాలని రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 26లో ఉందని, కానీ, ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ప్రక్రియను మొదలు పెట్టలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది రావు రంజిత్ వివరించారు. జమ్ము కశ్మీర్…
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. జర్మనీలోని మ్యునిచ్‌లో జరిగిన అంతర్జాతీయ వాణిజ్య సమావేశాలకు వెళ్లిన పంజాబ్ సీఎంను ఫ్రాంక్‌ఫర్ట్ ఎయిర్‌పోర్ట్‌లో దించేసినట్లు తెలుస్తోంది. లుఫ్తాన్సా విమానం ఎక్కేందుకు వచ్చిన సీఎం భగవంత్‌ను అధికారులు విమానం నుంచి గెంటివేసినట్లు తెలుస్తోంది. పూర్తిగా మద్యం సేవించి మత్తులో వచ్చిన సీఎం మాన్ విమానాశ్రయంలో నడవలేకపోయారని ఆరోపణలు వచ్చాయి. శనివారం ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. సోయి లేకుండా తాగి ఉన్న సీఎం భగవంత్ మాన్‌ను లుఫ్తాన్సా విమాన అధికారులు దించి వేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దీని వల్లే ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశాలకు మాన్ రాలేకపోయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పంజాబ్ సీఎం తాగి ఉండడం వల్లే విమానం 4 గంటలు ఆలస్యంగా బయలుదేరినట్లు కొన్ని రిపోర్ట్‌లు చెబుతున్నాయి. పెట్టుబడులు ఆకర్షించేందుకు జర్మనీ వెళ్లిన పంజాబ్ సీఎంకు అక్కడ చేదు అనుభవం ఎదురవ్వడం వల్లే ఫుల్‌గా తాగినట్లు ఆరోపణలు వస్తున్నాయి.…