Author: Editor's Desk, Tattva News

ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఐదో అతిపెద్ద దేశంగా అవతరించిందని బ్లూమ్‌బర్గ్‌ తాజాగా ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. ఇంతకాలం ఈ స్థానంలో ఉన్న బ్రిటన్‌ను దాటేసిందని తెలిపింది. అంతర్జాతీయ ద్రవ్య నిది సంస్థ (ఐఎంఎఫ్‌) నుంచి సేకరించిన జిడిపి గణంకాల ప్రకారం.. 2021 చివరి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ టాప్‌-5 స్థానంలోకి వచ్చిందని పేర్కొంది. ఆ త్రైమాసికంలో భారత జిడిపి 854.7 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.68.13 లక్షల కోట్లు)గా ఉండగా.. బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ 816 బిలియన్‌ డాలర్లు (రూ.65.04 లక్షల కోట్లు)గా నమోదయ్యిందని తెలిపింది.బ్లూమ్‌బర్గ్‌ రిపోర్ట్‌ ప్రకారం పదేళ్ల క్రితం భారత్‌ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో 11వ స్థానంలో ఉండగా, బ్రిటన్‌ 5వ స్థానంలో ఉంది. భారత్‌ వేగంగా అభివఅద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. కాగా ఇరు దేశాల మధ్య జనాబా, తలసరి ఆదాయాలు, పేదరికం, మానవ వనరుల అభివృద్థి సూచీ, వైద్య సౌకర్యాల కల్పన…

Read More

2022 సెప్టెంబర్ 17న ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’గా పాటించాల‌ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ సమావేశం నిర్ణయించింది. రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి అడుగుపెట్టి ఈ నెల 17వ తేదీ నాటికి 75 సంవత్సరాల్లోకి అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలోనే ఘనంగా వజ్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించుకుంది. మంత్రివర్గ నిర్ణయాలు * సెప్టెంబర్ 16న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలతో భారీ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయం * సెప్టెంబర్ 17న సీఎం కేసీఆర్ పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండా ఆవిష్కరించి, ప్రసంగించనున్నారు. అదే రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు.. మున్సిపాలిటీ, పంచాయతీ కేంద్రాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు జాతీయ…

Read More

చాలా ఉత్కంఠను రేకెత్తిస్తున్న బ్రిటిష్ ప్రధాన మంత్రి ఎన్నికలో విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్‌ను ఓడించి బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రి అవుతారని పోల్స్ అంచనాలు వెల్లడిస్తున్నాయి. బ్రిటిష్ కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ పోటీ ఫలితాలను సోమవారం 11.30 జిఎంటి లేదా భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ప్రకటించనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ ఎన్నికల ఓటింగ్ శుక్రవారం ముగిసింది, లిజ్ ట్రస్ వచ్చే వారం విజేతగా పేర్కొనబడుతుందని, బోరిస్ జాన్సన్ తర్వాత యూకె తదుపరి ప్రధాన మంత్రిగా నియమితులు అవుతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. విదేశాంగ కార్యదర్శి ట్రస్, మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్ మధ్య జరిగిన రన్-ఆఫ్ ఫలితం సోమవారం ప్రకతీస్తారు. జాన్సన్ మరుసటి రోజు క్వీన్ రెండవ ఎలిజబెత్ కి అధికారికంగా తన రాజీనామాను సమర్పించడానికి ముందు ఈ ప్రకటన చేశారు. సుమారు రెండు లక్షల మంది కన్జర్వేటివ్…

Read More

తెలంగాణలో అమలవుతున్న పథకాల్లో కేంద్రం వాటా 60 శాతం ఉందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కేంద్రం నిధులు వాడుకున్నప్పుడు ప్రధాని ఫొటో ఎందుకు పెట్టరని ఆమె ప్రశ్నించారు. ఆదిలాబాద్‌లో ప్రాజెక్టుకు హైదరాబాద్ ఎంపీ ఫొటో పెట్టి ప్రచారం చేస్తారా అంటూ ఆమె నిలదీశారు. కామారెడ్డి జిల్లాలో పర్యటన సందర్భంగా రేషన్ కార్డు దారులకు కేంద్రం కూడా ఉచితంగా ఇస్తున్నపుడు రేషన్ దుకాణాల్లో ప్రధాని ఫొటో పెట్టకపోవడంపై తాను కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంపై రాష్ట్ర ఆర్ధిక మంత్రి టి హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేయడంపై ఆమె తీవ్రంగా స్పందించారు. తానేమి మాట్లాడానో హరీష్ రావు తెలుసుకొని మాట్లాడాలని ఆమె సూచించారు. ‘‘ఫైనాన్స్ కమిషన్ ఫార్ములా ప్రకారం రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నాం. నిధులను పక్కదారి పట్టించకుండా డిజిటలైజేషన్ చేశాం. ఈ రాష్ట్రానికి ఎక్కువ, ఆ రాష్ట్రానికి తక్కువ ఇవ్వడం ఉండదు. రాష్ట్రాల పన్నును నిర్ణయించేది ఫైనాన్స్ కమిషన్.. నా చేతుల్లో ఏమీ ఉండదు” అని ఆమె తేల్చి…

Read More

ఆర్థిక నేరస్థుడు సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్న రూ. 200 కోట్ల దోపిడీ కేసులో బాలీవుడ్ నటి నోరా ఫతేహీని ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. ఢిల్లీ పోలీస్ ఆర్థిక నేరాల విభాగం ఆమెను నాలుగు రంటలపాటు విచారించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో గతంలోనూ ఫతేహీ విచారణ ఎదుర్కొన్నారు. మరో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తోపాటు నోరా ఫతేహీకి కూడా సుకేశ్ ఖరీదైన బహుమతులు వచ్చినట్టు ఈడీ విచారణలో తేలింది. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గతంలో సుకేశ్, నోరాను ముఖాముఖి కూర్చోబెట్టి విచారించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఈడీ తమ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. అయితే 2020 డిసెంబర్ 12 కి ముందు తాను సుకేశ్‌తో మాట్లాడలేదని నోరా ఫతేహీ దర్యాప్తు అధికారులకు తెలిపింది. కానీ సుకేశ్ మాత్రం తాను నటితో మాట్లాడినట్టు చెప్పడం గమనార్హం. నోరాకు సుకేశ్ ఓ లగ్జరీ బీఎండబ్లు కారును బహుమతిగా ఇచ్చినట్టు ఈడీ గుర్తించింది.…

Read More

నటి, బీజేపీ నాయకురాలు సొనాలీ ఫోగెట్ హత్య కేసు విచారణలో మరో కీలక విషయం వెలుగు చూసింది. కోట్లాది రూపాయల విలువైన ఆమె ఆస్తిని సొంతం చేసుకునేందుకు అధిక మోతాదులో మాదకద్రవ్యాలు వచ్చినట్టు కేసులో ప్రధాన నిందితుడు, ఫోగట్ వ్యక్తిగత సహాయకుడు (పిఎ) సుధీర్ సాంగ్వాన్ అంగీకరించాడు. నేరం చేసినట్టు సాంగ్వాన్ ఒప్పుకున్నాడని గోవా పోలీసుల సన్నిహిత వర్గాలు తెలిపాయి. సోనాలి ఫోగట్‌కు మాదక ద్రవ్యాలు ఇచ్చేందుకు సుఖ్విందర్ సహాయం తీసుకున్నట్టు కూడా సాంగ్వాన్ అంగీకరించారు. గోవా పోలీసుల కస్టడీలో ఉన్న సాంగ్వాన్ ఈ విషయాలు ఒప్పుకున్నాడు. విచారణలో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు హిసార్ లోని ఫోగట్ నివాసం లో గోవా పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. నేరం చేసినట్టు నిందితులు ఒప్పుకున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో కోర్టులో అడ్డం తిరుగుతుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఫోగట్ హత్య కేసులో అరెస్టయిన సాంగ్వాన్, సుఖ్వీందర్‌లకు సంబంధించిన బలమైన మరిన్ని సాక్షాలను గోవా పోలీసులు సేకరిస్తున్నారు.…

Read More

అన్నాడీఎంకేలో ఆధిపత్యం కోసం పన్నీరు సెల్వం, పళనిస్వామి మధ్య జరుగుతున్న న్యాయపోరాటం రోజుకొక మలుపు తీసుకొంటున్నది. ప్రస్తుతంకు అన్నాడీఎంకే నాయకత్వం పళనిస్వామికే దక్కింది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళని ఎంపికకు పరోక్షంగా శుక్రవారం మద్రాసు హైకోర్టు ద్విసభ్య బెంచ్‌ ఆమోదం తెలిపింది. జూలై 11న జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంపై సింగిల్‌ బెంచ్‌ విధించిన స్టేను రద్దు చేయడంతో ప్రధాన కార్యదర్శిగా పళని ఎన్నికకు తెలిపినట్లు అయింది. అయితే, ద్విసభ్య బెంచ్‌ తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీకోర్టులో అప్పీలుకు వెళ్లనున్నామని పన్నీరు సెల్వం ప్రకటించారు. జూలై 11వ తేదీ జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం ద్వారా పళనిస్వామి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. దీనిని వ్యతిరేకిస్తూ పన్నీరు సెల్వం దాఖలు చేసిన పిటిషన్‌ను గత నెల న్యాయమూర్తి జయచంద్రన్‌ బెంచ్‌ విచారించి, సర్వసభ్య సమావేశానికి స్టే విధించింది. జూన్‌ 23వ తేదీకి ముందు అన్నాడీఎంకేలో ఉన్న పరిస్థితులు కొనసాగే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పళని స్వామి శిబిరానికి…

Read More

సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థాన విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 17న ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర సాంస్కృతిక వ్యవహారాలు, హోంశాఖల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించనుంది. ఈ ఉత్సవాల్లో కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షా, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డితోపాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై పాల్గొననున్నారు. ఈ ఉత్సవాలను హైదరాబాద్‌ స్టేట్‌ విలీన దినోత్సవంగా కాకుండా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వ శాఖలు భావిస్తున్నట్లు సమాచారం. పరేడ్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర హోంశాఖ పరిధిలోని ఏడు సాయుధ దళాలతో నిర్వహించే సైనిక కవాతు సందర్భంగా అమిత్‌ షా సైనిక వందనం స్వీకరించనున్నారు. మరోవంక, నిజాం పాలన నుంచి తెలంగాణకు స్వాతంత్రం లభించి 75 ఏళ్లు నిండనున్న సందర్భంగా పక్షం రోజుల పాటు వజ్రోత్సవాలు…

Read More

పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లోని రద్దీగా ఉండే మసీదులో శుక్రవారం పేలుడు సంభవించి, కనీసం 18 మంది మరణించారు, ఇందులో ఒక ప్రముఖ మత గురువు, తాలిబాన్ అధికారులు , స్థానిక వైద్యుడు ఉన్నారు. కనీసం 21 మంది గాయపడ్డారు. గుజర్గా మసీదులో పేలుడు సంభవించింది. పశ్చిమ నగరంలోని హెరాత్‌లోని గుజార్‌గా మసీదులో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించింది. స్థానికుల కథనం ప్రకారం రహమాన్‌తోపాటు 20 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 200 మంది గాయపడ్డారు. ఈ పేలుడులో గత రెండు దశాబ్దాలుగా దేశంలోని పాశ్చాత్య-మద్దతు గల ప్రభుత్వాలను విమర్శించి ఆఫ్ఘనిస్తాన్ అంతటా ప్రసిద్ధి చెందిన ప్రముఖ మత గురువు ముజీబ్-ఉల్ రెహ్మాన్ అన్సారీ మరణించారు. అన్సారీ తాలిబాన్‌లకు సన్నిహితుడు. ముస్లింలకు పవిత్రమైన శుక్రవారంనాడు మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించింది. ప్రార్థనలు చేసేందుకు పెద్ద ఎత్తున ముస్లింలు హాజరైన సమయంలో ఈ పేలుడు సంభవించడంతో మృతులు, క్షతగాత్రుల సంఖ్య…

Read More

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా హైదరాబాద్ రాక సందర్భంగా హైదరాబాద్ ప్రముఖ బాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కావడం సంచలనం కలిగించింది. కేవలం సినిమాల గురించే వారిద్దరూ మాట్లాడుకొన్నారని కిషన్ రెడ్డి, ఇతర బిజెపి నాయకులు చెప్పినా రాజకీయ అంశాలు సహితం ప్రస్తావనకు వచ్చిన్నట్లు డా. కె లక్ష్మణ్ స్పష్టంగా చెప్పారు. తెలంగాణాలో పాగా వేయాలని చూస్తున్న బిజెపి వ్యూహాత్మకంగా ఈ భేటీ ఏర్పాటు చేయించినట్లు, అందుకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి సహకరించినట్లు తెలుస్తున్నది. అయితే బిజెపిని జాతీయ స్థాయిలో ఎదుర్కొంటా అని కాలుదువ్వుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో ప్రేక్షక పాత్ర వహిస్తారని ఎవ్వరూ భావించలేము. బాలీవుడ్ నుంచి ఈ నెల 9న విడుదలకు ముస్తాబవుతున్న మరో భారీ బడ్జెట్ మూవీ ‘బ్రహ్మస్త్ర’ ప్రచారం కోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం స్టూడియోలో భారీ స్థాయిలో శనివారం జరుగవలసిన ప్రీ-రిలీజ్ ఉత్సవం ఆకస్మికంగా రద్దుకావడం యాదృచిక్కం కాదని తెలుస్తున్నది. నగరంలో గణపతి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో తగు…

Read More