Author: Editor's Desk, Tattva News

ఒక్కొక్కరుగా ముఖ్య నేతలు వెళ్లిపోతుండటంతో కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం జైవీర్ షెర్గిల్ మాట్లాడుతూ గాంధీలపై విరుచుకుపడ్డారు. ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడే పరిస్థితి ప్రస్తుతం పార్టీలో కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. పార్టీ చెప్పేదానికి, చేసే దానికి పొంతన లేకుండా పోయిందని విమర్శించారు. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా పార్టీ నిర్ణయాలు ఉండటం లేదని షెర్గిల్ ఆరోపించారు. సోనియా, రాహుల్, ప్రియాంకలను కలిసి పార్టీ పరిస్థితి గురించి వివరిద్దామని ఎంత ప్రయత్నించినా ఏడాదిగా తనకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి అంకితమై పనిచేశానని, తాను పార్టీ నుంచి తీసుకున్నదేమీలేదని స్పష్టం చేశారు. అధిష్టానం అడుగులకు మడుగులొత్తే వారికి అందలాలు దక్కుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు జైవీర్ షెర్గిల్ ప్రకటించారు. అధికార ప్రతినిధిగా హిందీ, ఇంగ్లీష్…

Read More

బిహార్‌ అసెంబ్లీలో బుధవారం జరిగిన బలపరీక్షలో నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం నెగ్గింది. బల పరీక్షలో నితీష్‌ సారథ్యంలోని మహా కూటమి సర్కార్‌కు 160 ఓట్లు వచ్చాయి. ఈ సందర్భంగా అసెం‍బ్లీలో ముఖ్యమంత్రి నితీష్‌ బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీలో మంచి వాళ్లకు చోటు లేదని వ్యాఖ్యానించారు. 2024లో తానేంటో నిరూపిస్తానని చాలెంజ్‌ చేశారు. 2024లో బీజేపీయేతర పార్టీలన్నింటినీ కలుపుకుని విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీలన్నీ కలిసివచ్చి మద్దతిచ్చినందుకు నితీశ్ ధన్యవాదాలు తెలిపారు. వాజ్‌పేయి, అద్వానీలే తన మాట వినేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు బీజేపీలో లేవని పేర్కొన్నారు. బల పరీక్షలో నితీష్‌ సర్కార్‌కు 164 మంది ఎమ్మెల్యేలు మద్దతిచ్చారు. 2017లో తేజస్వీ యాదవ్‌పై విబీజేపీతో బంధాన్ని తెంచుకున్న నితీశ్ ఆగస్ట్ 10న ఆర్జేడీ, కాంగ్రెస్ తదితర పార్టీలతో కలిసి సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేశారు. నితీశ్ సీఎంగా, తేజస్వీ ఉప ముఖ్యమంత్రిగా మొత్తం 31 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఆర్జేడీకి 16, జేడీయూకు 11 మంత్రిపదవులు…

Read More

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగించేందుకు అనుమతించడంతో పాటు, భద్రత కల్పించేలా రాష్ట్ర పోలీసు శాఖను ఆదేశించాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను బీజేపీ నేతలు కోరారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలిసి వినతి పత్రం అందజేసింది. బండి సంజయ్‌ అరెస్టు, యాత్ర అడ్డగింతకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. జనగాంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కుట్రపన్ని, ప్రజా సంగ్రామ యాత్రపై చేసిన దాడి, హైదరాబాద్‌లో సోమవారం బీజేపీ కార్యకర్తలపై పోలీసులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు జరిపిన దాడిపైనా విచారణ జరిపించాలని కోరారు. బండిసంజయ్‌ పాదయాత్ర సందర్భంగా రెచ్చగొట్టేందుకు టీఆర్‌ఎస్‌ ఎంతగా ప్రయత్నించినా, బీజేపీ కార్యకర్తలు సంయమనం పాటించారని తెలిపారు. జనగాం జిల్లా దేవరుప్పలలో, గద్వాలలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడులు చేశారని వివరించారు. లిక్కర్‌ స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ…

Read More

నిరంకుశ పోకడలకు పోతున్న కేసీఆర్ ప్రభుత్వం పతనం కాక తప్పదని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ హెచ్చరించారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ అరెస్టును ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలపాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బిజెపి నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టులకు బిజెపి బెదరబోదని, కేసీఆర్ కుటుంబ పాలన, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని కొనసాగిస్తామని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సంబంధించిన లిక్కర్ స్కాంలో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయని, దీని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. లిక్కర్ స్కాంలో కవితకే కాదు, ఆమె తండ్రి కేసీఆర్‌కు ఉన్న సంబంధాలు కూడా త్వరలోనే వెలుగులోకి వస్తాయని చుగ్…

Read More

శివసేన అధికారిక గుర్తును ఉద్ధవ్ థాక్రే, ఏక్‌నాథ్ షిండే వర్గాల్లో ఎవరికి కేటాయించాలనే విషయాన్ని తేల్చేందుకు ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ఈ వ్యవహారంపై మొత్తం 8 ప్రశ్నలను రూపొందించింది. ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గురువారం దీనిపై విచారణ జరిపి తీర్పు వెలువరించనున్నది. గురువారం వరకు శివసేన ఎన్నికల గుర్తు (విల్లు, బాణం)ను ఎవరికి కేటాయించాలనే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఎన్నికల కమిషన్‌కు సుప్రీం కోర్టు సూచించింది. శివసేన పార్టీ తమదే అని ఉద్ధవ్, షిండే వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. ”గురువారంనాడు విస్తృత ధర్మాసనం ముందు ఈ అంశం విచారణకు వస్తుంది. పార్టీ గుర్తుకు సంబంధించి ఎన్నికల కమిషన్ ప్రొసీడింగ్స్‌ను బెంచ్ నిర్ణయిస్తుంది” అని సీజేఐ ఎన్.వి.రమణ, న్యాయమూర్తులు కృష్ణమురారి, హిమా కోహ్లితో కూడిన బెంచ్ మంగళవారంనాడు పేర్కొంది. ఎమ్మెల్యేల అనర్హత, ఇతర సాంకేతిక అంశాలపై ఉద్ధవ్, ఏక్‌నాథ్…

Read More

వివాదాస్పద వీడియోను విడుదల చేసి మంగళవారం అరెస్ట్ అయినా బీజేపీ శాసనసభ పార్టీ నేత రాజాసింగ్ ను ఒక వంక బీజేపీ సస్పెండ్ చేయడంతో పాటు, ఎందుకు పార్టీ నుండి బహిష్కరింప కూడదో సెప్టెంబర్ 2 లోగా వివరణ ఇవ్వాలని అంటూ షోకాజ్ నోటీసు జారీచేసింది. పార్టీ పదవుల నుండి కూడా తొలగించింది. మరోవంక, రాజాసింగ్‌కు నాంపల్లి 14వ అదనపు మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు మొదటి బెయిల్ తిరస్కరించి 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే, ఆయన న్యాయవాదుల వాదనలు విన్నతర్వాత కోర్ట్ తిరిగి బెయిల్ మంజూరు చేసింది. రాజాసింగ్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదాస్పదం కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రాజాసింగ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. రాజాసింగ్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పోలీసులు అరెస్ట్‌ చేయడం చట్టవిరుద్దమని అంటూ 41 సీఆర్పీసీపై ఆయన న్యాయవాదులు వాదించారు. రాజాసింగ్‌ న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన కోర్టు పోలీసులు అరెస్ట్‌ చేసిన విధానం సరిగా లేదని…

Read More

వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదాస్పద నగ్న వీడియో వ్యవహారంపై పారదర్శక విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా నేతల బృందం డిమాండ్ చేసింది. ‘డిగ్నిటీ ఫర్ వుమెన్’ పేరుతో మహిళా నేతల బృందం మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు జాతీయ మహిళా కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ సహాయంతో రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకున్న మహిళా నేతలు రాష్ట్రపతితో పాటు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి డా. భారతి పవార్, జాతీయ మహిళా కమిషన్‌కు విడివిడిగా ఫిర్యాదులు అందజేశారు. 2019 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. భయాందోళనల మధ్య రాష్ట్రంలోని మహిళలు జీవనం సాగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత కొన్నేళ్లలో మహిళలపై నేరాలు 21.45 శాతం పెరిగాయని, అయితే రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టం పేరు చెప్పి ప్రజల్ని తప్పుదోవపట్టిస్తోందని తెలిపారు. ప్రజా…

Read More

ప్రధాన మంత్రినరేంద్ర మోదీ ఆగస్టు 25న రాత్రి 8 గంటలకు ‘స్మార్ట్ ఇండియా హాకథన్ 2022’ గ్రాండ్ ఫినాలే ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు. దేశంలో, ప్రత్యేకించి యువతీ యువకుల లో నూతన ఆవిష్కరణలకు సంబంధించినటువంటి స్ఫూరిని పెంపొందించేందుకు ప్రధాన మంత్రి నిరంతరం ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఇదే దార్శనికతను అనుసరిస్తూ, స్మార్ట్ ఇండియా హాకథన్ (ఎస్ఐహెచ్)ను 2017లో మొదలు పెట్టారు. ఎస్ఐహెచ్ అనేది సమాజం, సంస్థల, ప్రభుత్వం ఎదుర్కొనే అనేక చిక్కు సమస్యలను పరిష్కరించడాని కి విద్యార్థులకు ఒక వేదిక ను సమకూర్చేటటువంటి ఒక దేశవ్యాప్త కార్యక్రమం గా ఉన్నది. ఇది విద్యార్థులలో ఉత్పత్తి పరమైన నూతన ఆవిష్కరణ, సమస్యను పరిష్కరించడంలతో పాటుగా అంతవరకు అవలంబిస్తున్న ఆలోచన విధానానికి భిన్నం గా సరికొత్త ఆలోచనలను చేసే సంప్రదాయాన్ని నెలకొల్పాలని ధ్యేయంగా పెట్టుకొంది. ఎస్ఐహెచ్ లో నమోదులు చేసుకొంటున్న బృందాల సంఖ్య తొలి సంచికలో సుమారు 7500గా ఉండగా, తాజా అయిదో సంచిక కు వచ్చే…

Read More

మాజీ టిక్‌టాక్ స్టార్, హర్యానా బీజేపీ నేత సొనాలి ఫొగాట్ (42) సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. తన ఉద్యోగులతో కలిసి గోవాకు వెళ్లిన ఆమె అక్కడి అంజనా రెస్టారెంట్‌లో ఉన్న సమయంలో ఒంటో నలతగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు తెలిపారు. ఆమె మరణం వెనుక ఎలాంటి కుట్ర లేదని, ఫొగాట్ శరీరంపై ఎక్కడా గాయాల్లేవని గోవా డీజీపీ జస్పాల్ సింగ్ తెలిపారు. అయితే ఆమె మరణానికి స్పష్టమైన కారణాలేమిటనేది పోస్టుమార్టం నివేదిక వచ్చాకే వెల్లడవుతుందని చెప్పారు. సొనాలీ భౌతిక కాయాన్ని పోస్టుమార్టం కోసం బాంబోలిమ్ లోని గోవా ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. సొనాలీ ఫొగాట్ మరణం పట్ల హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ కట్టర్, డిప్యూటీ సిఎం దుశ్యంత్ చౌతాలా, బీజేపీ నేతలు ఓపీ దస్కర్, కుల్దీప్ బిష్ణోయ్ తీవ్ర సంతాపం తెలియజేశారు. సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉండే సోనాలీ ఫొగాట్…

Read More

బీజేపీ ఎమ్యెల్యే రాజాసింగ్ ను హైదరాబాద్ లో, పాదయాత్రలో ఉన్న రాష్ట్ర  బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను జనగామలో పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు.  రాజాసింగ్  అప్ లోడ్ చేసిన వివాదాస్పద వీడియోపై ముస్లింలు ఫిర్యాదు చేయడంతో  కేసు నమోదు చేసి ఆయన ఇంట్లోకి వెళ్లి అరెస్ట్ చేశారు. తెలంగాణలో రాముడిని కొలిచే వారికే విలువ లేదని, తిట్టే వారికే విలువ ఉందని మండిపడ్డాయిరు. ప్రధానికి కూడా కల్పించనంత భద్రత మునావర్ ఫారూఖికి ఇచ్చి..షో ప్రదర్శించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.  ఎమ్మెల్యే రాజాసింగ్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ లో రాత్రి నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. తమను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయనని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ కమిషనర్ కార్యాలయంతో పాటు భవానీ నగర్, డబీరపురా ,రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ ముందు ముస్లీం నేతలు  పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు.  అయితే తాను  ధర్మం కోసం తాను…

Read More