Author: Editor's Desk, Tattva News

రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీల కిందకు ఏం వస్తాయి.. ఏం రావో తేల్చడం చాలా కష్టంగా మారుతోందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేమని తెలిపింది. ఈ ఉచిత హామీల అంశాన్ని తేల్చేందుకు ఓ కమిటీ వేయాలనుకుంటున్నట్టు వెల్లడించింది. ఎన్నికల ప్రయోజనాల కోసం ఓటర్లకు ఉచితాలను పంపిణీ చేయడానికి పార్టీలు చేస్తున్న ప్రయత్నాలను నియంత్రించాలంటూ న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ వేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వం లోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఉచిత హామీలు ఒక్కటే ఎన్నికల్లో గెలుపును నిర్ణయిస్తాయని చెప్పడం సరికాదని తెలిపారు. కొన్ని పార్టీలు అనేక వాగ్దానాలు చేసినప్పటికీ ఎన్నికల్లో గెలవలేక పోతున్నాయి. అంతేకాక, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాథి హామీ వంటి పథకాలు పౌరులు గౌరవంగా జీవించేందుకు దోహదపడుతున్నాయి అని చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ అభిప్రాయపడ్డారు. “ఉచిత విద్య, వైద్యం, తాగునీరు అందించడం…

Read More

అమెరికాలోని టెక్ కంపెనీలలో సహితం  కులం పేరిట వివక్షతను ఎదుర్కొంటున్నట్లు వెల్లడైంది. నైపుణ్యం ఉన్నప్పటికీ దళితులైన అభ్యర్థులను ఉన్నతస్థాయి అధికారులుగా నియమించేందుకు టెక్‌ సంస్థలు వెనకాడుతున్నాయి. ఈ వివక్షపై అమెరికా న్యాయస్థానంలో దావా కూడా దాఖలైంది.  ఈ కేసు ద్వారా అక్కడ భారతీయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివక్షలు వెలుగుచూశాయని రాయిటర్స్‌ సర్వేలో తేలింది. కులం అనే వర్గాన్ని కొన్ని కంపెనీలు పెద్దగా పట్టించుకోవడం లేదని తేల్చింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన టెక్‌ కంపెనీలు అమెజాన్‌, డెల్‌, మెటా, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ సహా అనేక కంపెనీలు తమ కంపెనీ నిబంధనల్లో కుల వివక్ష కేటగిరిని చేర్చడం లేదని పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద లిస్టెడ్‌ కంపెనీ అయిన ఆపిల్‌ జాతి, మతం, లింగం, వయస్సు, మూలాలతో పాటు కులం ఆధారంగా ఉద్యోగుల మధ్య వివక్షతను నిషేధించడానికి సుమారు రెండేళ్ల క్రితమే ఈ పాలసీని తీసుకువచ్చినట్లు తెలిపింది. ఐబిఎం టెక్‌ సంస్థ కూడా కులం కేటగిరీని తమ కంపెనీ నిబంధనల్లో…

Read More

మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చుట్టూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) ఉచ్చు బిగిస్తోంది. ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్న రూ. 200 కోట్ల దోపిడీ కేసులో జాక్వెలిన్‌ను ఈడీ నిందితురాలిగా పరిగణించింది. ఈ మేరకు ఈ కేసులో దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్‌షీటులో ఆమె పేరును చేర్చింది. దోపిడీ చేసిన డబ్బు నుంచి నటి లబ్ధి పొందినట్టు దర్యాప్తులో గుర్తించామని ఈడీ వర్గాలు వెల్లడించాయి. సుకేశ్ చంద్రశేఖర్ దోపిడీ దారని జాక్వెలిన్‌కు ముందే తెలుసని, అయినప్పటికీ అతడితో సాన్నిహిత్యాన్ని కొనసాగించారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ నుంచి జాక్వెలిన్ ఖరీదైన బహుమతులు అందుకున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అత్యంత ఖరీదైన డిజైనర్ బ్యాగులు, జిప్ సూట్లు, వజ్రాల చెవిపోగులు, బ్రాస్‌లెట్, మినీ కూపర్, ఇలా దాదాపు రూ. 10 కోట్ల విలువైన కానుకలను…

Read More

ఆగస్టు 30న జరిగే వినాయక చవితి పండుగతో పాటు సెప్టెంబర్‌ 9న జరిగే గణేశ్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయనున్నట్టు రాష్ట్ర పశు సంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ తెలిపారు. విగ్రహాల నిమజ్జనం కోసం నగరంలో ఉన్న 25 పాండ్స్‌కు అదనంగా మరో 50 పాండ్స్‌ను ప్రత్యేకంగా నిర్మిచ నున్నట్టు మంత్రి చెప్పారు. భాగ్యనగర్‌ గణేశ్‌ సమితితోపాటు వివిధ వర్గాలతో సర్కార్‌ మంగళవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో జరిపిన శాంతి సమావేశంలో హోంమంత్రి మహమూద్‌ అలీ, నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటి మేయర్‌ శ్రీలత, ఎంఎల్‌సీ ప్రభాకర్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామక్రిష్ణరావు, హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరి రవిగుప్త, అదనపు డీజీపి జితెందర్‌, దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు మెంబర్‌ నీతుకుమారి ప్రసాద్‌, పోలీస్‌ కమిషనర్లు సీవి.ఆనంద్‌, మహేష్‌ బగవత్‌, స్టీఫెన్‌ రవింద్ర, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌, కలెక్టర్‌ అమయకుమార్‌,…

Read More

ప్రపంచమంతా కరోనా నుండి పూర్తిగా కోలుకోకముందే ఒమిక్రాన్‌ ఆందోళన ప్రారంభమయ్యింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఈజీగా తీసుకోవద్దని, అది సీరియస్‌ ఫ్లూగా పరిణమించే అవకాశం ఉందని సీరం సంస్థ సీసీఈఓ అదర్‌ పూనావాలా హెచ్చరించారు. ఇప్పటికే ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఎదుర్కొనే టీకాను మోడెర్నా రూపొందించగా, దీని వినియోగానికి బ్రిటన్‌ ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. కాగా, ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే టీకాపై ప్రయోగాలు కొనసాగుతున్నాయని, త్వరలోనే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని అదర్‌ పూనావాలా వెల్లడించారు. రానున్న 6 నెలల్లో ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశముందని తెలిపారు. కరోనా నియంత్రణకు కోవిషీల్డ్‌ టీకాను రూపొందించిన సీరం సంస్థ తాజాగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ తయారీపై కార్యాచరణను ముమ్మరం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తగ్గుతున్నట్లు కనిప్పిస్తున్నా పలు దేశాల్లో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. దీంతో వాటిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ల అభివృద్ధి తప్పనిసరవుతోంది. ఈ క్రమంలో ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే టీకాపై ప్రయోగాలు సాగుతున్నాయని..…

Read More

రాజస్థాన్‌లో దళిత బాలుడి హత్య అధికార కాంగ్రెస్‌ పార్టీలో కలకలం రేపింది. ప్రతిపక్ష బీజేపీ నుంచే కాకుండా సొంత పార్టీ నుంచి కూడా గెహ్లాట్‌ ప్రభుకిత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. తొమ్మిదేళ్ల దళిత విద్యార్థి మృతి తనను తీవ్రంగా కలచివేసిందని బారన్‌ – అత్రుకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పనాచంద్ మేఘ్వాల్ తన రాజీనామాను ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌కు పంపారు.  కేసు విచారణలో పోలీసుల నాన్చుడు ధోరణికి వ్యతిరేకంగా రాజీనామా చేసినట్టు మేఘ్వాల్ వెల్లడించారు.  అగ్రవర్ణాల కోసం ఉద్దేశించిన కుండలోని నీరు తాగినందుకు ఇంద్రకుమార్‌ మేఘవాలా దళిత విద్యార్థిని చెయిల్‌ సింగ్‌ అనే టీచర్‌ చావ బాదాడు. బాధిత చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు వదిలాడు.  రాజస్తాన్‌లోని జలోర్‌ జిల్లాలోని సురానా గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. దీనిపై ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి.  దళిత బాలుడి మృతిపై కాంగ్రెస్ పార్టీలో రాజకీయ డ్రామా మొదలైంది.  మొదటి నుంచి అశోక్‌…

Read More

భారత్, అమెరికా దేశాలు ఎంతగా ఆందోళన వ్యక్తం చేసినా, శ్రీలంక బేఖాతరు చేస్తూ అనుమతులు ఇవ్వడంతో చైనా నిఘా నౌక “యువాన్ వాంగ్5” మంగళవారం ఉదయం 8.30 గంటల సమయంలో హంబన్‌టొట రేవుకు చేరుకొంది. శ్రీలంక రేవుకు నౌక చేరుకున్న కొన్ని గంటల తరువాత తాము అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగానే సాగరగర్భ శాస్త్రీయ పరిశోధన కార్యకలాపాలను నిర్వహిస్తున్నామని, దీని ప్రభావం ఏ దేశ భద్రతా ప్రయోజనాలపై ఉండబోదని చైనా ప్రకటించింది.  కొలంబో అధికార వర్గాల సమాచారం ప్రకారం హిందూ మహాసముద్ర రీజియన్‌లో నౌకల సైనిక సామర్ధాలను ఉటంకిస్తూ భారత్, అమెరికా దేశాలు రెండూ తమ ఆందోళనలను శ్రీలంక ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ అందోళనలపై చైనా విదేశీ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ స్పందిస్తూ యువాన్ వాంగ్ నౌక సాగర పరిశోధనలకే అంతర్జాతీయ చట్టం ప్రకారం పరిమితమవుతుందని, ఇందులో మూడో పక్షం జోక్యం చేసుకోరాదని స్పష్టం చేశారు.  ఏదేశం భద్రత, ఆర్థిక…

Read More

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండడంతో హాస్పిటల్‌లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోందని అధికారులు మంగళవారం తెలిపారు. కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. పాజిటివ్ కేసులు, రీఇన్‌ఫెక్షన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని తెలుస్తోంది. ఢిల్లీ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సైతం ప్రజలను అప్రమత్తం చేస్తూ ట్వీట్ చేశారు. సోమవారం నాటికి ఢిల్లీలో పాజిటివిటీ రేటు 14.57 శాతంగా ఉంది. దాంతో పాటు ఎనిమిది మంది చనిపోయారు. ఈ వివరాలను ఆరోగ్య శాఖ డేటా తెలిపింది. గత 12 రోజుల్లో 2 వేలకు పైగా వ్యాధిగ్రస్తులయ్యారు. లాన్సెట్ కమిషన్ సభ్యురాలు, ప్రజారోగ్య నిపుణురాలు డాక్టర్ సునీలా గర్గ్ మాట్లాడుతూ “రికవరీ రేటు బాగానే ఉంది. కానీ కేసులు పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. 9000 బెడ్లలో 500 బెడ్లు నిండాయి. 2129 ఐసియూ బెడ్లలో 20 నిండాయి. ప్రస్తుతం వెంటిలేషన్‌పై 65 మంది రోగులున్నారు.…

Read More

గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపరకు చెందిన వైస్సార్సీపీ సీనియర్ నేత వుయ్యురు శివ రామిరెడ్డి పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయనకు పవన్‌ కల్యాణ్‌ తమ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.  జనసేన పార్టీలో చేరడం తనకు సంతోషంగా ఉన్నదని ఈ సందర్భంగా శివరామిరెడ్డి మీడియాతో తెలిపారు.గత 35 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నా తనకు ఎమ్మెల్యేగా అవకాశం రాకపోవడంతో గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చి..ఆయన జనసేన కండువా కప్పుకున్నారు. వుయ్యూరు శివరామిరెడ్డి 1987 లో టీడీపీలో చేరి.. మూడేండ్ల పాటు మండల అధ్యక్షుడిగా ఉన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ప్రారంభించడంతో ఆయన వంచన చేరి గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడయ్యారు.  2012 లో వైస్సార్సీపీలో చేరారు. జగన్‌ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు విసుగు చెంది పవన్‌ కల్యాణ్‌ వెంట నడిచేందుకు నిర్ణయించుకున్నట్లు శివరామిరెడ్డి చెప్పారు. 

Read More

మునుగోడు కాంగ్రెస్ ఎమ్యెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు, శాసనసభ్యత్వానికి సహితం రాజీనామా చేయడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఉప ఎన్నిక అంటూ జరిగితే తెలంగాణ  రాజకీయ గమనాన్ని మార్చే విధంగా ఫలితాలు ఉండే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలను కృతనిశ్చయంతో ఉన్న బిజెపి ఇప్పటికే ఆ దిశలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ఉండగా, ఈ ఉప ఎన్నిక అవకాశం రావడంతో మరింత ఉత్సాహంగా ఉరకలు వేస్తున్నది. పైగా ఈ ప్రాంతంలో బలమైన నేపధ్యం గల రాజగోపాలరెడ్డి బీజేపీలో చేరడంతో, బిజెపిని ఎదుర్కోవడం టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు జీవన్మరణ పోరాటంగా మారనున్నది.  మనుగోడు ఉప ఎన్నిక ఫలితం మీదే తెలంగాణలో తమ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉందని, అది గెలవకపోతే తమ రాజకీయ మనుగడ ప్రశ్నార్ధకం కాగలదని ఆందోళనలు రెండు పార్టీలను వెంటాడుతున్నాయి.  దానితో ఈ ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధించి, తెలంగాణాలో రాబోయే ప్రభుత్వం తమదే అన్న సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేయడం కోసం బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.…

Read More