Author: Editor's Desk, Tattva News

భారత సంతతికి చెందిన ప్రఖ్యాత రచయిత సల్మాన్ రష్దీపై (75) శుక్రవారం అమెరికాలో దాడి జరిగింది. కత్తిపోట్ల కు గురయ్యారు. న్యూయార్క్ సాహిత్య ఉత్సవంలో (లిటరరీ ఫెయి ర్) ఆయన ఓ ప్రసంగ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక్కడి చౌటాయూక్యూ సంస్థలో స్టేజీపైకి వచ్చి ప్ర సంగించనుండగా ఓ వ్యక్తి వచ్చి ఆయనను కత్తితో పొడిచారని, అంతా చూస్తూ ఉండగానే 10 నుంచి 15 సార్లు కత్తితో పొడిచారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. వెంటనే ఆ వ్యక్తిని అడ్డుకున్నారని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. దాడి వివరాలు పూర్తిగా వెంటనే తెలియలేదు. వేదికపై పడిపోయిన రష్దీని వెంటనే అక్కడినుంచి కిందకు తీసుకువెళ్లి, ఓ హెలికాప్టర్‌లో న్యూయార్క్ సిటీలోని ఓ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. నిందితుడ్ని న్యూజెర్సీకి చెందిన హదీ మటర్‌(24)గా గుర్తించారు. సల్మాన్‌ రష్ది ఓ కన్ను కోల్పోయే అవకాశాలున్నాయని ఆయన బుక్‌ ఏజెంట్‌ ఆండ్రూ వైలీ ఓ మీడియా సంస్థకు తెలిపారు. వైలీ…

Read More

ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌పై దాడి కేసులో నమోదైన ఎఫ్.ఐ.ఆర్ కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీ తిరుగుబాటు నేత, నర్సాపురం ఎంపీ కే. రఘురామకృష్ణ రాజుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం శుక్ర‌వారం కొట్టేసింది. త‌న‌పైనా, త‌న కుమారుడిపైనా న‌మోదైన కేసును కొట్టేయాలంటూ ర‌ఘురామ‌కృష్ణరాజు ఇటీవ‌లే సుప్రీంకోర్టులో క్వాష్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. శుక్రవారం ఈ పిటిషన్ విచారణకు రాగా, రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్‌కు వ్యతిరేకంగా పోలీసు శాఖ తరఫున కీలక వాదనలు వినిపించారు. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌ను ర‌ఘురామ‌రాజు అనుచ‌రులు ఇంట్లో బంధించి హింసించార‌ని, దానికి సంబంధించిన ఆధారాలు త‌మ వ‌ద్ద ఉన్నాయ‌ని పోలీసుల త‌ర‌ఫు న్యాయవాది పేర్కొన్నారు. రఘురామకృష్ణ రాజుకు భద్రత కల్పిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బందితో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌పై దాడి చేయించారని, దాడికి పాల్పడిన సీఆర్పీఎఫ్ సిబ్బంది సస్పెండ్ అయ్యారని వెల్లడించారు. అదే స‌మ‌యంలో అద‌నపు స‌మాచారం కోసం ర‌ఘురామ‌రాజు…

Read More

ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీకి ఎనిమిదేళ్లు పూర్తి అయింది. అయినా ఆయనకు ప్రజాదరణ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రజాదరణతో ఆయనకు సమీపంలో జాతీయ స్థాయిలో మరే నాయకుడు కూడా లేరు. తాజాగా ఇండియాటుడే- సీ ఓటర్‌ నిర్వహించిన సంయుక్త సర్వేలో ఈ విషయం వెల్లడైంది. గత రెండేళ్లుగా దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం ఓవైపు, మరోవైపు కరోనా సంక్షోభం, పెట్రోల్‌ ధరల మంట తదితర సమస్యలతో ఎన్డీఏ నేతృత్వంలోని ప్రభుత్వం సతమతమవుతోంది. అయినా ప్రధానిగా నరేంద్ర మోదీకి ప్రజాదరణ మాత్రం తగ్గలేదు. 53 శాతం మంది ప్రజలు తదుపరి ప్రధాన మంత్రిగా తిరిగి నరేంద్ర మోదీ కొనసాగాలని కోరుకుంటున్నారని తాజా సర్వేలో వెల్లడైంది. మోదీ తర్వాత స్థానాల్లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి 9 శాతం, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లి సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు 7శాతం మంది మాత్రమే ప్రధానిగా ఆమోదం తెలిపారు. మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి…

Read More

ముఖ్యమంత్రి వై ఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసుపై జరుగుతున్న సిబిఐ దర్యాప్తులో పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన కుమార్తె డా. వై ఎస్ సునీతారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.   ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు.. కేసులో ఏమాత్రం పురోగ‌తి సాధించ‌లేక‌పోతున్నార‌ని ఆరోపిస్తూ వివేకా కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.  ఈ కేసులో నిందితులుగా ఉన్న వారే ద‌ర్యాప్తు అధికారుల‌పై కేసులు పెడుతున్నారంటూ ఆమె త‌న పిటిష‌న్‌లో ప్ర‌స్తావించారు. పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ  దర్యాప్తుకు ఆటంకం కలిగిస్తున్నట్లు పేర్కొన్నారు.  ఇకపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కేసు విచారణ జరిగేలా తగిన ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె కోరారు.  ఏపీలో న్యాయం జరగకపోవడమే కాకుండా, తీవ్ర జాప్యం అయ్యే అవకాశాలున్నాయని పేర్కొంటూ వేరే రాష్ట్రానికి వివేకా కేసు విచారణను తరలించాలని కూడా పిటీషన్‌లో సునీతా కోరారు. సునీతారెడ్డి కేంద్ర,…

Read More

 రాఖీ పౌర్ణమి సందర్భంగా డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలకు రూ.4 వేల కోట్ల వడ్డీబకాయిల విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండిసంజయ్‌ బహిరంగ లేఖ వ్రాసారు.  గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్‌), పట్టణపేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా), ఎస్‌హెచ్‌జి లకు ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ బకాయిలు రూ.4 వేల కోట్ల వరకు పేరుకుపోయాయని తెలిపారు.  టీఆర్‌ఎస్‌ ఎనిమిది సంవత్సరాల పాలనలో డ్వాక్రా గ్రూపులను నిర్వీర్యం చేశారని విమర్శించారు.  2021-22 బడ్జెట్‌లో మహిళాగ్రూపులకు వడ్డీ చెల్లించేందుకు రూ 3 వేల కోట్లు కేటాయించినా ఇప్పటికీ అమలు కాలేదని ధ్వజమెత్తారు. 2022- 23 బడ్జెట్‌లో రూ.1250 కోట్లు కేటాయించినా ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదని మండిపడ్డారు.  ప్రభుత్వం నుండి వడ్డీ రాయితీ లభిస్తుందని ఆశతో రుణాలు తీసుకున్న మహిళలు ప్రభుత్వ నిర్వాకంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.  కోటి ఆశలతో కోట్లాడి సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ అసమర్థ విధానాలు, పాలన, మహిళా వ్యతిరేకత కారణంగా తెలంగాణలోని…

Read More

బీహార్‌ ముఖ్యమంత్రిగా నితీష్‌కుమార్‌ మరొసారి బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్ర శాసనసభలో బలపరీక్షకు వెనుకడుగు వేస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రెండు వారల తర్వాత, ఈ నెల 24 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కొత్తగా ఏర్పాటైన జెడియు, ఆర్‌జెడి ప్రభుత్వం తన మెజార్టీని నిరూపించుకోవాల్సి ఉంది.  బీజేపి ఎమ్‌ఎల్‌ఎ అయిన విజయ్ కుమార్ సిన్హా స్పీకర్ పదవికి రాజీనామా ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయన ఉండగా బలపరీక్షకు నితీష్ జంకుతున్నట్లు తెలుస్తున్నది. అందుకనే ముందుగా,  నితీశ్ కుమార్ ప్రభుత్వం ఆయనపై అవిశ్వాస తీర్మానం ఇచ్చింది.  అసెంబ్లీ సమావేశాల తొలి రోజున దీనిపై చర్చించి ఓటింగ్ నిర్వహిస్తారు. కొత్త ప్రభుత్వం తమ బలపరీక్ష కంటే ముందుగా ప్రస్తుత స్పీకర్‌ను మార్పు చేయాలని కోరుకుంటోంది. ఇప్పటికే 55 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌ విజరు కుమార్‌ సిన్హాకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం కోసం విజ్ఞప్తి చేశారు.  నిబంధనల ప్రకారం ఇలాంటి విజ్ఞప్తి చేసిన రెండు వారాల…

Read More

ఢిల్లీలోని కరోనా రోగుల నమూనాల్లోని మెజారిటీ నమూనాల్లో ఒమిక్రాన్ కొత్త ఉప వేరియంట్ బీఎ 2.75 బయటపడినట్టు లోక్‌నాయక్ జైప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి అధికారులు వెల్లడించారు. ఈ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపామని, ఈ వారంలో వాటిని విశ్లేషించడమౌతుందని మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ కుమార్ తెలిపారు.  అనుమానంతో 90 మంది నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా, ఒమిక్రాన్ ఉపవేరియంట్ బీఏ 2.75ను గుర్తించామని, టీకాలు తీసుకున్నవారిపైనా, యాంటీబాడీలు ఉన్నవారిపైనా ఈ ఉపవేరియంట్ ప్రభావం చూపుతుందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. గత రెండు వారాలుగా ఢిల్లీలో కొవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.  ఆగస్టు 1 నుంచి 10 వరకు 19,760 కేసులు నమోదయ్యాయి. ఇదికాక నగరం లోని కంటైన్‌మెంట్ జోన్లలో దాదాపు 50 శాతం వరకు పెరిగాయి. బుధవారం ఢిల్లీలో 2146 కేసులు నమోదు కాగా, కరోనాతో ఎనిమిది మంది మృతి చెందారు. పాజిటివిటీ రేటు 17.83 శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది.  కేసులను…

Read More

పశ్చిమ్‌ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జి సన్నిహితుడు, బీర్‌భూం జిల్లా టీఎంసీ అధ్యక్షుడు అనుబ్రతా మండల్‌ను గురువారం సీబీఐ అరెస్టు చేసింది. 2020 నాటి పశువుల అక్రమ రవాణా కేసు విచారణలో భాగంగా ఆయన నివాసంలో ఈ అరెస్టు చోటుచేసుకుంది. పశువుల అక్రమ రవాణా కేసుకు సంబంధించి సీబీఐ అనుబ్రతకు 10 సార్లు సమన్లు జారీ చేసింది. ఆనారోగ్య సమస్యలను కారణంగా చూపి, దర్యాప్తు సంస్థ విచారణకు ఆయన గైర్హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏమీ లేదని కోల్‌కతాకు చెందిన ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రి వెల్లడించడంతో అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ కేసు విచారణలో భాగంగా గురువారం ఉదయం అనుబ్రత నివాసానికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. వారి వెంట 30 కార్ల కాన్వారు కూడా వచ్చింది. ఆయన్ను ఓ గదిలో ఉంచి గంటన్నరకు పైగా ప్రశ్నించింది. అయితే ఆయన విచారణకు సహకరించకపోవడంతో అరెస్టు చేసినట్లు…

Read More

రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో అనేక హామీలను గుప్పించి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో విఫలమైతే, ఆ పార్టీల గుర్తింపును రద్దు చేయడం తగదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ స్పష్టం చేశారు. ఈ కారణంతో గుర్తింపును రద్దు చేయాలనడం ప్రజాస్వామ్య వ్యతిరేకమని చెప్పారు. శాసన వ్యవస్థ కార్యకలాపాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటోందనే అపవాదు ఇప్పటికే ఉందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు ఇష్టానుసారం ఉచిత పథకాలను ప్రకటిస్తున్నాయని, అధికారం చేపట్టిన తర్వాత వాటిని అమలు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ నేపథ్యంలో సమగ్ర మార్గదర్శకాలను జారీ చేయాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.   ఉచిత పథకాల హామీలపై పూర్తి వివరాలను సమర్పించాలని రాజకీయ పార్టీలను ఆదేశించింది. ఈ సమాచారం పూర్తిగా వచ్చిన తర్వాత, ఎంత వరకు జోక్యం…

Read More

భారతీయ సంప్రదాయంలో రాఖీ పౌర్ణమి విశిష్టమైన స్థానం కలిగి ఉంది. ఈ పండుగను రక్షాబంధన్ (రాఖీ) పండుగ గానూ, జంధ్యాల పూర్ణిమ, వైఖానస మహర్షి జయంతి గాను, హయగ్రీవ జయంతి గాను , వరుణ పూజల రూపంలో ఈ పూర్ణిమను ఉత్సవంగా అందరూ జరుపుకుంటారు.  అందం, బంధం కలగలసిన పండుగ రాఖీ పౌర్ణమి. ఈ పండుగకు పురాణాల ప్రకారం ఎన్నో అర్థాలున్నా, అన్నా చెల్లెళ్ల బాంధవ్యానికి, బాధ్యతకు ప్రతీకగానే దీనికి ఎక్కువ గుర్తింపు ఉంది. రాఖి పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, శ్రా వణ పౌర్ణమి, రక్షికా పూర్ణిమ…ఇలా పలు రూపాల్లో ఈ పండుగను జరుపుకోవడం విశేషం. అన్నదమ్ములు నూతన యజ్ఞో పవీతాన్ని ధరిస్తే అక్కాచెల్లెళ్లు వారికి హారతి ఇచ్చి కుంకుమ దిద్ది, తీపిని తినిపిస్తారు.  నిండు చంద్రుని పూర్ణిమ శోభల ను పుడమి స్వీకరించే రోజు. రసమయమైన చంద్రకళలు షోడశం గా పూర్ణంగా అందే ఈ దినం ధ్యా నానికి ఆరాధనకీ…

Read More