Author: Editor's Desk, Tattva News

తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని భద్రాచలం సమీపంలోని ఏటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయితీలు తీర్మానించాయి. ప్రస్తుతం ఆయా గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. రాష్ట్ర విభజన సమయంలో ఏడు మండలాలను ఎపిలో కలిపిన సమయంలో ఈ ఐదు గ్రామాలను సైతం విలీనం చేశారు.  ఆ సమయంలో ఈ ఐదు పంచాయతీలు భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉండేవి. భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం రూరల్ మండలం, కూనవరం, విఆర్ పురం, చింతూరు మండలాలు అలాగే పినపాక నియోజకవర్గంలో బూర్గంపాడు మండలంలోని కొన్ని గ్రామాలు, అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని కుకునూరు, వేలేరుపాడు మండలాలను ఎపిలో కలిపారు. వీటితో పాటు ఐదు గ్రామాలు సైతం ఎపి పరిధిలోకి వెళ్లాయి. అయితే, గోదావరికి భారీ వరద వస్తే భద్రాచలం పట్టణానికి వరద ముప్పు ఉంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఐదు గ్రామాలను తెలంగాణకు కేటాయిస్తే ఆయా ఊర్ల నుంచి కరకట్ట నిర్మించి గోదావరి…

Read More

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో గురువారం సోనియా గాంధీ ఈడీ ముందు హాజరయ్యారు. అనుకున్న సమయానికి కన్నా ముందే విచారణను నిలిపివేసింది. ఇటీవల కోవిడ్‌ నుండి కోలుకున్నానని ఇడి అధికారులకు విజ్ఞప్తి చేయగా.. ఆమెను అనుకున్న సమయాని కన్నా ముందుగా విడిచిపెట్టినట్లు అధికారులు తెలిపారు. దాదాపు మూడు గంటలపాటు ఈడీ అధికారులు సోనియాఫై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మూడు గంటలోనే 20 ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది. ఆరోగ్య కారణాలతో ఆమె చేసిన ప్రత్యేక విజ్ఞప్తిని పరిగణించిన ఈడీ అధికారులు తొలిరోజు విచారణను త్వరగానే ముగించారు. ఆమె కోసం 50 ప్రశ్నలు సిద్ధం చేశారని తెలుస్తోంది. మధ్యాహ్నం రెండున్నరకు ఆమె ఇంటికి వెళ్లేందుకు అనుమతించారు. మళ్లీ సోమవారం విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు.రాహుల్ గాంధీని విచారించిన ఐదు రోజుల్లో అడిగిన ప్రశ్నలనే సోనియా గాంధీని కూడా అడిగి ఉండవచ్చని ఈడి వర్గాలు తెలిపాయి. యంగ్ ఇండియా (వైఐ), అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ (ఏజేఎల్) మధ్య జరిగిన డీల్‌లో…

Read More

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాకరంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ అర్హత ఇచ్చే అర్హత లేదని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టుబడులకు అనుమతులు లేవని ప్రకటించింది. జాతీయ హోదా ప్రాజెక్టు పథకంలో ఏ ప్రాజెక్టునైనా చేర్చాలంటే కేంద్ర జల కమీషన్ (సీడబ్ల్యుసి) అధ్యయనం తప్పనిసరి కేంద్రం చెబుతోంది. ఆ తర్వాత ప్రాజెక్ట్‌ సలహా కమిటీ ఆమోదం పొందాలని పేర్కొంది. పెట్టుబడుల అనుమతి కేంద్రం నుంచి తీసుకోవాలని తెలిపింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు తీసుకోలేదని కేంద్రం అంటోంది. లోక్‌సభలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ ఈ విషయమై కేంద్ర వైఖరిని స్పష్టం చేస్తూ లిఖితపూర్వక సమాధానిచ్చారు. 2016, 2018లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ప్రధాని నరేంద్ర మోదీని సీఎం కేసీఆర్ కలిశారు. ఈ సందర్భంగా కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరరానికి జాతీయ హోదా లభిస్తే ప్రాజెక్టు నిర్మాణంలో అనేక…

Read More

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు కేవలం 6 పోర్టులుంటే, మనం ఏకంగా మరో 4 పోర్టులను అదనంగా నిర్మించబోతున్నామని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. అంటే ఈ ఐదేళ్లలో మరో 4 పోర్టులు- భావనపాడు, కాకినాడ గేట్‌వే పోర్టు, మచిలీపట్నం, రామాయపట్నం రానున్నాయని తెలిపారు. వీటి ద్వారా మరో 100 మిలియన్‌ టన్నుల కెపాసిటీ వస్తుందని చెప్పారు. నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టు తొలి దశ నిర్మాణ పనులకు బుధవారం ఆయన భూమి పూజ చేసి ప్రారంభిస్తూ రాష్ట్రంలో ప్రస్తుతం కృష్ణపట్నం, కాకినాడలో 3, విశాఖపట్నం, గంగవరం ప్రాంతాల్లో పోర్టులు ఉన్నాయని, వీటిలో విశాఖపట్నం పోర్టు 70 మిలియన్‌ టన్నుల సామర్థ్యం కలిగి ఉంటే, మిగిలిన పోర్టుల కెపాసిటీ 158 మిలియన్‌ టన్నులు ఉన్నదని వివరించారు. కొత్తగా వస్తున్న నాలుగు పోర్టులతో పాటు రాష్ట్రంలో 9 ఫిషింగ్‌ హార్బర్లు- బుడగట్లపాలెం, పూడిమడక, ఉప్పాడ, బియ్యపుతిప్ప, మచిలీపట్నం, నిజాంపట్నం,…

Read More

దేశవ్యాప్తంగా ఉన్న 4,982 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల(కెజిబివి)లో 696 అంటే, దాదాపు 15 శాతం విద్యాలయాలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. వీటికి అదనంగా 2022-23 విద్యా సంవత్సరంలో మరో 20 విద్యాలయాలను తెలంగాణకు కేటాయించిన ప్రధానమంత్రి  నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక వర్గాలకు, మైనారిటీలకు, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన ఆడ పిల్లలకు మంచి విద్యను అందించాలన్న ఉద్దేశ్యంతో దేశవ్యాప్తంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పాఠశాల విద్య ,అక్షరాస్యత విభాగానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ పథకం సమగ్ర శిక్షా అభియాన్ కార్యక్రమంలో భాగంగాన్నారు.  మరింత ఎక్కువమందికి పాఠశాల విద్యను అందుబాటులోకి తీసుకురావడం, బడుగు బలహీన వర్గాలు మరియు అణగారిన వర్గాల పిల్లలను ఒకే చోట చేర్చి వారి మధ్య సమానత్వ…

Read More

ఇటీవల కురిసిన భారీ వర్షాలు , వరదలకు రూ.1400కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర సర్కార్ కేంద్రానికి నివేదిక పంపింది. వెంటనే తక్షణ సాయం కింద రూ.వెయ్యి కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జులై నెలలో భారీ వర్షాలు కురిసాయి. వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం ఇదే మొదటిసారి అని చాలామంది చెప్పుకొచ్చారు. ముఖ్యంగా గోదావరి మట్టం రికార్డు స్థాయిలో ప్రవహించింది. భద్రాచలం వద్ద దాదాపు 36 ఏళ్ల తర్వాత 70 అడుగుల మేర గోదావరి ప్రవహించింది. దీంతో పట్టణంలోని పలు కాలనీ లు నీటమునగా..ముంపు గ్రామాలు దాదాపు వారం పాటు నీటిలోనే ఉండిపోయాయి. ప్రస్థుం శాంతించడం తో అంత ఊపిరి పీల్చుకున్నారు. ఇక కడెం ప్రాజెక్ట్ సైతం ప్రమాద స్థాయికి చేరుకుంది. ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనే భయానకంగా వరద పోటెత్తింది. ఇక వందల…

Read More

 భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి జరుగుతున్న ఎన్నికలలో వేగంగా ముందడుగు వేస్తున్నారు. ఆ పదవికి చేరుకోవడంకు చాలా సమీపంలో ఉన్నట్లు కనిపిస్తున్నారు.  ప్రధాని పదవికి పోటి పోటీ పడుతున్న తుది ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరిగా నిలిచారు. ఫలితంగా సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నారు. అధికార కన్జర్వేటివ్‌ పార్టీ నేత, బ్రిటన్‌ నూతన ప్రధాని స్థానం కోసం జరుగుతున్న పోటీలో ఐదో రౌండ్‌ ఎన్నికలోనూ గెలిచి తుదిపోరుకు చేరారు. ఐదో రౌండ్‌లో రెండో స్థానంలో నిలిచిన విదేశాంగ శాఖ కార్యదర్శి లిజ్‌ ట్రస్‌తో తుది పోరులో అమీతుమీ తేల్చుకోనున్నారు. టోరీ పార్టీ లీడర్‌షిప్‌ విధానంలో జరుగుతున్న ఈ ఎన్నికలో భాగంగా బుధవారం జరిగిన చివరి, ఐదో రౌండ్‌లో ముగ్గురు అభ్యర్థులు పోటీపడ్డారు. ఇందులో రిషీ సునాక్‌ 137 ఓట్లతో అగ్రస్థానం సాధించగా, 113 ఓట్లతో ట్రస్‌ రెండో స్థానంలో నిలిచారు. రిషికి గట్టి పోటీ ఇస్తుందని భావించిన పెన్నీ…

Read More

 శ్రీలంకలో కొత్త నాయకత్వం కోసం బుధవారం జరిగిన ఓటింగ్‌లో యూఎన్‌పీ పార్టీ అధినేత రణిల్‌ విక్రమసింఘె శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బుధవారం ఉదయం 10 గంటలకు పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కాగానే ఓటింగ్‌ జరిగింది. రహస్య బ్యాలెట్‌ విధానంలో జరిగిన ఈ ఎన్నికలో రణిల్‌ విజయం సాధించారు.  శ్రీలంక అధ్యక్ష పదవికి ఎన్నికైన తర్వాత రణిల్‌ పార్లమెంట్‌లో మాట్లాడుతూ ”దేశం తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. మన ముందు పెను సవాళ్లున్నాయి. ప్రస్తుతం ఈ ద్వీపదేశం నిత్యావసరాలు తీర్చుకోలేని స్థితిలో అల్లాడిపోతోంది. దీన్నుంచి బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధితో చర్చలు జరుపుతోంది” అని తెలిపారు. ప్రస్తుత సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు కలిసి పనిచేద్దామని ప్రతిపక్ష నేత సాజిత్‌ ప్రేమదాస, మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనలతోపాటు ఎంపీలను విక్రమసింఘే కోరారు. అందరితోనూ చర్చలకు తాను సిద్ధమని ప్రకటించారు. తనను వ్యతిరేకిస్తున్న శ్రీలంక తమిళ నేతలనూ దేశ పునర్నిర్మాణంలో చేతులు కలపాలని కోరారు. …

Read More

పాకిస్థాన్ దేశంలో మరో దారుణం జరిగింది. 21 ఏళ్ల అమెరికా మహిళపై  పాకిస్థాన్ హోటల్‌లో  సామూహిక అత్యాచారం జరిగింది.పాకిస్థాన్‌ దేశానికి టూరిస్ట్ వీసాపై  వచ్చిన అమెరికా మహిళ గత ఏడు నెలలుగా ఆ దేశంలో నివసిస్తున్నారు. పంజాబ్ ప్రావిన్స్‌లో 21 ఏళ్ల అమెరికన్ యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పాక్ పోలీసులు తెలిపారు. డి.జి.కి చెందిన హిల్ స్టేషన్ ఫోర్ట్ మన్రోలోని ఒక హోటల్‌లో ఈ సంఘటన జరిగింది. అమెరికన్ అమ్మాయి తన సోషల్ మీడియా స్నేహితురాలు ముజ్మల్ సిప్రా ఆహ్వానంపై కరాచీ నుంచి ఫోర్ట్ మన్రోకి వచ్చింది. ‘‘మేం ఫోర్ట్ మన్రోలోని ఒక హోటల్‌లో బస చేశాం.  అక్కడ ఇద్దరు నిందితులు నాపై సామూహిక అత్యాచారం చేశారు నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి వీడియో కూడా తీశారు’’ అని అమెరికా మహిళ తన ఫిర్యాదులో ఆరోపించింది. పాక్ బోర్డర్ మిలిటరీ పోలీసులు ఇప్పటికే సిప్రాను అరెస్టు చేశారు.…

Read More

సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకువచ్చిన సరికొత్త పథకం అగ్నిపథ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ పథకం రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ అడ్వకేట్‌ శర్మ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.  శర్మతో పాటు హర్ష్‌ అజయ్ సింగ్‌, రవీంద్ర సింగ్‌ షెకావత్‌ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. అయితే పెండింగ్‌లో ఉన్న అన్ని పిటిషన్లను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. కేరళ, పంజాబ్‌, హర్యానా, పాట్నా, ఉత్తరాఖండ్‌లో ఉన్న పిటిషన్లన్నీంటిని ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని లేదా ఢిల్లీ హైకోర్టు నిర్ణయం వచ్చేంత వరకు విచారణను నిలిపివేయాలని జస్టిస్‌ చంద్రచూడ్‌, సూర్యకాంత్‌, ఎఎ్‌ బప్పన్న నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది.అయితే ఈ విచారణ సందర్భంగా జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ శర్మపై చమత్కారంతో కూడిన ప్రశంసలు చేశారు. ‘మీరు వీరుడని, కానీ అగ్నివీర్‌ కాదు’ అంటూ శర్మనుద్దేశించి జోక్‌ చేశారు. అయితే శర్మ అనేక రకాల సమస్యలపై…

Read More