Author: Editor's Desk, Tattva News

పోల‌వ‌రం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని , లేకపోతే భద్రాచలం కు పెను ముప్పు రాబోతుందని  తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వాఖ్యలపై ఏపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా,  పోల‌వ‌రం ప్రాజెక్టు ప్రాథ‌మిక డిజైన్ మార్చి మూడు మీట‌ర్లు ఎత్తు పెంచుకున్నారని,  దీని వ‌ల్లే భ‌ద్రాచ‌లానికి వ‌ర‌ద వ‌చ్చింద‌ని,  ఎత్తు త‌గ్గించాల్సిన బాధ్య‌త కేంద్రం మీద ఉంద‌ని మంత్రి పేర్కొనడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  పోలవరం ఎత్తుపై కొత్త వివాదాన్ని సృష్టించొద్దని  నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలంగాణ మంత్రులు,  టిఆర్ఎస్ నేతలను కోరారు. పోలవరంతోనే భద్రాచలం మునిగిపోయిందనడం వాస్తవం కాదని స్పష్టం చేశారు.  45.72 మీటర్ల ఎత్తు వరకు కేంద్రం అనుమతులు ఇచ్చినట్లు గుర్తు చేశారు. అన్ని అంశాలు పరిశీలించాకే పోలవరానికి అనుమతులు వచ్చాయన్న అంబటి పోలవరం ముంపు ఉంటుందనే 7 మండలాలను ఏపీలో కలిపారని గుర్తుచేశారు. వరదల సమయంలో రాజకీయాలు తగవని మంత్రి అంబటి హితవు పలికారు. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌…

Read More

హర్యానాలో మైనింగ్‌ మాఫియా అత్యంత కిరాతకానికి ఒడిగట్టింది. నుహ్ లో రాళ్ల అక్రమ మైనింగ్‌ను ఆపడానికి వెళ్లిన ఓ సీనియర్‌ పోలీసు అధికారిని ట్రక్కుతో గుద్దించి.. హత్య చేసింది. ఆరావళి పర్వత శ్రేణి సమీపంలోని పచ్‌గావ్‌లో అక్రమంగా రాళ్లను తవ్వుతున్నట్లు డిఎస్‌పి ర్యాంక్‌ అధికారి సురేంద్ర సింగ్‌ బిష్ణోయ్ కు సమాచారం అందింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో పోలీసు బృందంలో కలిసి అక్కడకు వెళ్లగా వారిని చూసి అక్రమ మైనింగ్‌ పాల్పడుతున్న వారు అక్కడి నుండి పారిపోయారు. అయితే అప్పటికే లోడ్‌ అయి వెళుతున్న వాహనాలను ఆయన అడ్డుకున్నారు.  ఓ ట్రక్కు డ్రైవర్‌.. వేగంగా వచ్చి పోలీసు అధికారిని ఢకొీట్టడంతో  ఆయన మృతి చెందారు.  ఆ సమయంలో డిఎస్‌పి పక్కన ఉన్న గన్‌మన్, డ్రైవర్ పక్కకు దూకి తమ ప్రాణాలను రక్షించుకోగలిగారని పోలీసు అధికారులు తెలిపారు. అనంతరం నిందితుడు ఆ ప్రాంతం నుండి పారిపోయాడు. నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన…

Read More

భారత్-చైనా సరిహద్దులో 19 మంది కార్మికులు అదృశ్యం కాగా ఒకరు విగతజీవిగా కనిపించారు. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని కురుంగ్ కుమే జిల్లాలో 19 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు గ‌ల్లంతు అయ్యారు. వీరి ఆచూకీ రెండు వారాలుగా తెలియలేదు.  ఈ విషయం ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. అయితే వీరిలో ఒకరి మృతదేహం సమీపం లోని నదిలో లభ్యమైనట్టు కథనాలు వస్తున్నాయి. మిగిలిన వారు కూడా నదిలో కొట్టుకుపోయి ఉండొచ్చని అనధికారికంగా భావిస్తున్నారు. దీంతో అదృశ్యమైన కూలీల కోసం అధికారులు గాలింపు ముమ్మరం చేశారు.   రాజ‌ధాని ఇటాన‌గ‌ర్‌కు 300 కిలోమీట‌ర్ల దూరంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అరుణాచల్ ప్రదేశ్ లోని మారుమూల కురుంగ్ కుమే జిల్లాలోని దమిన్ సర్కిల్ లో సరిహద్దు రహదారుల సంస్థ ( బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్‌ఓ ) రోడ్డు నిర్మాణ పనులు చేపట్టింది. ఇక్కడ పనిచేసేందుకు ఓ కాంట్రాక్టర్ 19 మంది కూలీలను అస్సాం నుంచి తీసుకొచ్చారు. అయితే బక్రీద్…

Read More

అత్యున్నత న్యాయస్థానం నుంచి ఊహించని స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాక బెదిరింపులు, వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయని బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. మహమ్మద్ ప్రవక్తపై చేసిన వాఖ్యలతో పార్టీ పదవి నుండి తొలగింపుకు గురై, వివాదాస్పదంగా మారిన ఆమె గత నెలలో `ఉపశమనం’ కోసం ఆశ్రయిస్తే, సుప్రీమ్ కోర్ట్ తన వినతిని తిరస్కరించడంతో పాటు, తనపై `దారుణం’గా వాఖ్యలు చేయడం పట్ల దేశ వ్యాప్తంగా పెను దుమారంకు కారణం కావడం తెలిసిందే. మరోమారు సోమవారం సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఆమె, తన అరెస్టును నిలువరించాలని, తనపై దాఖలైన తొమ్మిది కేసులను ఒకేదానిగా ఢిల్లీకి బదిలీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ  మరోసారి కోర్టులో అభ్యర్థించారు.  గతంలో విచారణ సందర్భంగా ఆమె అభ్యర్థనపై స్పందించిన బెంచ్‌.. సంబంధిత హైకోర్టు(ఢిల్లీ)ను సంప్రదించాలని ఆమె తరపు న్యాయవాదికి సూచించారు. అయినప్పటికీ ఆమె మరోసారి సుప్రీంను ఆశ్రయించడం విశేషం. జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం జులై…

Read More

నీట్ పరీక్షలో విద్యార్థినుల లోదుస్తులు విప్పించి, వాటిని పక్కన పడవేసిన తర్వాతనే పరీక్షా హాల్‌లోకి అనుమతించిన ఆదివారం కేరళలో జరిగిన ఘటన దేశంలో కలకలం సృష్టిస్తున్నది. కేరళ రాష్ట్రం కొల్లం జిల్లా ఆయుర్‌లోని మాత్రో మా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ విషయమై ఓ బాధిత యువతిని తన లోదుస్తులు తీసేస్తేనే నీట్ పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతిస్తామని బలవంతం చేసినట్లు కోటరక్కరా డిప్యూటీ ఎస్‌పికి ఆమె తండ్రి ఫిర్యాదు చేయడంతో ఈ దురాగతం వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా బయోమెట్రిక్ ఏజెన్సీ సిబ్బంది నిర్వాకం వల్ల పరీక్ష సరిగా రాయలేకపోయినట్లు ఫిర్యాదులో తెలిపారు. కేవలం తన కుమార్తెనే కాకుండా మొత్తం విద్యార్థునులను ఆ విధంగా వేధించారని, ఎటువంటి కరోనా నిబంధనలు పాటించకుండా ఆ లో దుస్తువులను ఓ స్టోర్ గదిలో కుప్పగా పడవేశారని, దానితో 90 శాతం మంది విద్యార్దునులు ఎంతో మనోవేదనకు గురై, పరీక్షను సరిగ్గా వ్రాయలేక పోయారని ఆమె…

Read More

ప్రస్తుతం పనిచేసిన వాళ్లకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తానన్న ముఖ్యమంత్రి, వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన మీద అలిగినా పరవా లేదని, పనిచేయని వాళ్లకు టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తనతో పాటు ఎమ్మెల్యేలు కలిసి పనిచేస్తేనే వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిచే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పారు. ఏపీలో అధికార వైసీపీ చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సోమవారం జరిపిన సమీక్షలో పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షుడు, రీజనల్‌ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొందరు సీరియస్‌గా తీసుకోవడం లేదని సిఎం మండిపడ్డారు.  ఐదుగురు ఎమ్మెల్యేలు కేవలం ఐదు రోజుల్లోనే ముగించారని చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో ఒక్క రోజు మాత్రమే తిరిగిన వారి జాబితాలో మాజీ మంత్రి ఆళ్ల నాని, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి ఉన్నారని చెప్పారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి కేవలం రెండు…

Read More

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా సోమవారం ముగిసింది. పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు ఓటెయ్యగా.. రాష్ట్రాల అసెంబ్లీలలో ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్లమెంటులో దాదాపు 99.18శాతం ఓటింగ్ నమోదైంది. రాత్రికి వివిధ మార్గాల ద్వారా బ్యాలెట్ బాక్సులను అసెంబ్లీల నుంచి ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్కు తరలింఛారు. ఈ నెల 21న ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి. 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ ఎన్నికలో మెజార్టీ పార్టీలు ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకి మద్దతిచ్చాయి. కాంగ్రెస్, ఎన్సీపీ, సమాజావాది పార్టీల సభ్యులు సహితం కొందరు ఆమెకు ఓట్ వేశారు. ఆమె 63 శాతానికి పైగా మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని సమాచారం. పార్లమెంట్ హౌస్లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ లో ప్రధాని నరేంద్ర మోదీ తొలి ఓటు వేశారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, మన్సుఖ్ మాండవీయ,…

Read More

కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న తర్వాత కూడా కొందరిలో వ్యాధి లక్షణాలు దీర్ఘకాలం (లాంగ్ కొవిడ్) పాటు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 23 శాతం మంది బాధితుల్లో లాంగ్ కొవిడ్ లక్షణాలు కనిపిస్తున్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది. అంతేకాకుండా దాదాపు 12 వారాల పాటు ఈ లక్షణాలు బాధితులను వేధిస్తున్నట్టు తెలిపింది. ఈ అధ్యయనం సైంటిఫిక్ రిపోర్ట్ జర్నల్‌లో ప్రచురితమైంది. అమెరికా లోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాకు చెందిన నిపుణులు మార్చి 2020 నుండి మార్చి 2021 మధ్యకాలంలో ఓ అధ్యయనం చేపట్టారు. అక్కడి సెంటర్ ఫర్ ఎకనామిక్స్ సోషల్ రీసెర్చ్ జరిపిన సర్వే ఫలితాలను పరిగణన లోకి తీసుకుని అందులో దాదాపు 8 వేల మందిని పలు దఫాల్లో సంప్రదించి ఆరోగ్య వివరాలను సేకరించారు. కరోనా సోకిన సమయంలో కనిపించిన లక్షణాలు 12 వారాలకు పైగా కొనసాగుతున్నట్టు 23 శాతం మంది వెల్లడించినట్టు పరిశోధకులు పేర్కొన్నారు. సాధారణంగా…

Read More

రెండేళ్ల క్రితం  60 ఏళ్ళ వయస్సులోనే జులై 18, 2020లో ఆకస్మికంగా మృతి చెందిన పూసులూరి నారాయణస్వామి ఒక సాంప్రదాయ పేద బ్రాహ్మణ కుటుంభంలో. వలస కార్మికులకు పేరొందిన మహబూబ్ నగర్ జిల్లాలో ఆగష్టు 15, 1959న జన్మించారు. ఆయన తన జీవితమంతా గల్లిలలోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపైనా కూడా వలస కార్మికుల హక్కుల కోసం, వారి సాధికారికత కోసం  నిర్విరామంగా పోరాడారు.  ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వలస కార్మికులు, గల్ఫ్ దేశాలకు వెళ్లి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన కార్మికులు, అసంఘటిత కాంతికుల సంక్షేమం కోసం అవిశ్రాంత పోరాటం జరిపారు. గల్ఫ్ దేశాలలో ఎక్కడ తెలుగు వలస కార్మికుల ఇబ్బందులలో చిక్కుకున్నారని తెలిసినా వెంటనే పరిగెత్తేవారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసేవారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఇఎల్ఓ) వంటి సంస్థలను రంగంలోకి దింపేవారు. బహుశా అంత దూకుడుగా, అంకిత భావంతో వలస కార్మికుల మనుగడ కోసం పోరాడిన మరెవ్వరు భారత…

Read More

శ్రీలంకలో పరిస్థితులు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. మరోసారి ఎమర్జెన్సీ ప్రకటిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ఇటీవల ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. తీవ్ర ప్రజాగ్రహం నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణీల్‌ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆందోళనలు కాస్త సద్దుమణిగినట్లు కనిపించినా… మరోమారు దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధిస్తూ అధ్యక్షుడు రణీల్‌ విక్రమ సింఘే ఆదేశాలు జారీ చేశారు.  దేశ ప్రజలకు భద్రత కల్పించటం, ప్రజా రవాణా, నిత్యావసరాల సరఫరాకు ఆటంకం లేకుండా చూడటం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు  విక్రమ సింఘే తెలిపారు. 1959లోని 8వ చట్ట సవరణ, ప్రజా భద్రత ఆర్డినెన్స్‌(చాప్టర్‌ 40)లోని సెక్షన్‌ ప్రకారం తనకు అందిన అధికారల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వారం…

Read More