Author: Editor's Desk, Tattva News

శ్రీలంక అధ్యక్షుడు గొటాబయ రాజపక్స దేశం వదిలి పారిపోవడంతో పరిస్థితులు అదుపుతప్పడంతో భద్రతా బలగాలు ఎమర్జెన్సీ ప్రకటించాయి. తాత్కాలిక తాత్కాలిక అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన  ప్రధాని రణిల్‌ విక్రమసింఘే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై మిలిటరీ, పోలీసులతో చర్చలు జరిపి నిరసనకారులపై కనిపిస్తే కాల్చివేయాలనే సంచలన నిర్ణయానికి వచ్చారు. మే 10వ తేదీన కూడా దాదాపు ఇలాంటి ఆదేశాలే జారీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది అక్కడి ప్రభుత్వం. ఇప్పటికే తన ఒక్కగానొక్క ఇంటికి నాశనం చేశారని బాధలో ఉన్న ప్రధాని రణిల్‌ విక్రమసింఘేకు.. తాజా పరిణామాలు మరింత అసహనానికి గురి చేస్తున్నాయి. దీంతో షూట్‌ ఎట్‌ సైట్‌ ఆర్డర్స్‌కే మొగ్గు చూపారు. మరోవైపు లంకలో టీవీ ప్రసారాలు సైతం నిలిచిపోయాయి. మే 10వ తేదీన కూడా దాదాపు ఇలాంటి ఆదేశాలే జారీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది అక్కడి ప్రభుత్వం. ఇప్పటికే తన ఒక్కగానొక్క ఇంటికి నాశనం చేశారని బాధలో ఉన్న ప్రధాని రణిల్‌ విక్రమసింఘేకు.. తాజా…

Read More

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్న వేళ… 18 నుంచి 59 ఏళ్ల వారికి మూడో డోసును ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. 75 రోజుల పాటు కొనసాగే ఈ ప్రత్యేక కార్యక్రమం జులై 15 నుంచి ప్రారంభం కానున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దేశ జనాభాలో మెజారిటీ ప్రజలు తొమ్మిది నెలల క్రితం రెండు డోసులు తీసుకున్నారు. అయితే రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత వ్యాక్సిన్ల వల్ల పొందే యాంటీబాడీలు క్రమంగా క్షీణించిపోతున్నట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్)తోపాటు ఇతర అంతర్జాతీయ పరిశోధన సంస్థలు చెబుతున్నాయి. ఈ క్రమంలో బూస్టర్ డోసు ఇస్తే రోగనిరోధక స్పందనలను మరింత పెంచవచ్చని సూచిస్తున్నాయని జాతీయ వ్యాక్సినేషన్ ప్రక్రియలో కీలకంగా వ్యవహరిస్తోన్న ఓ అధికారి వెల్లడించారు. అధికారిక లెక్కల ప్రకారం దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌కు అర్హులైన వారిలో 96 శాతం మంది ఒక డోసు తీసుకోగా,…

Read More

ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వ విధానాలు, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన కారణంగానే తాను కేంద్ర మంత్రి పదవిని, ఆ తర్వాత బీజేపీలో పదవిని కూడా కోల్పోయానని సీనియర్ బిజెపి నాయకురాలు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి చెప్పుకొచ్చారు. అక్కడకు ఒకసారి పార్టీ అధ్యక్షునిగా అమిత్ షా జోక్యం చేసుకొని తన మంత్రి పదవి కాపాడారని తెలిపారు. గురు పూర్ణిమతో (జులై 13) ప్రారంభించి, రక్షాబంధన్ (ఆగష్టు 11) వరకు ట్విట్టర్ ద్వారా తన జీవితంలో జరిగిన ముఖ్య ఘటనలు క్లుప్తంగా తెలియ చేయడం ఆమె ప్రారంభించారు. గతంలో వివాదాలు సృష్టించిన పలు అంశాల గురించి ఆమె ప్రస్తావించారు. మొదటగా ఇచ్చిన 41 ట్వీట్ లలో ఈ ఆసక్తికరమైన అంశాలను ఉన్నాయి. `సంక్షిప్త ఆత్మకథ’ గా వీటిని పేర్కొన్నారు. తన ఆత్మకథను ప్రచురించడానికి ఇద్దరు పేరున్న ప్రచురణకర్తలు ముందుకు వచ్చినా తాను అంగీకరింపలేదని ఆమె చెప్పారు. ఆదివారం రాత్రి చేసిన ట్వీట్ల పరంపరలో, కేంద్ర హోం మంత్రి అమిత్ షా – అప్పుడు బిజెపి జాతీయ…

Read More

అంతర్జాతీయంగా వాణిజ్యపరంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ నుంచి ఎగుమతులు ‘సముచిత స్థాయిలో‘ వృద్ధి చెందే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. బడా ఎగుమతిదారులు, ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిళ్లతో సమాలోచనలు జరుపుతున్నామని, ఎప్పటికప్పుడు పరిణామాలను సమీక్షిస్తున్నామని ఆయన తలిపారు. ‘ధర, నాణ్యత పరంగా మన ఎగుమతులకు ప్రత్యేకత ఉంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను బట్టి ఎగుమతుల అంచనాలు ఉంటాయి‘ అని గోయల్‌ చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో 2022–23లో 450–500 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులను ఎగుమతి చేయడం సాధ్యపడేదేనా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ప్రభుత్వం నిర్దిష్ట లక్ష్యమేదీ విధించుకోలేదని ఆయన పేర్కొన్నారు. నూతన విదేశీ వాణిజ్య విధానం (ఎఫ్‌టీపీ)పై స్పందిస్తూ వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనడంతో ప్రస్తుత పాలసీని ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకూ పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. గతేడాది జూన్‌తో…

Read More

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు ఉరకలేస్తున్నాయి. రోడ్లపై వరదనీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో, నీటి, విద్యుత్‌ సరఫరా స్థంభించిపోయింది. ఈదురుగాలులు, జడివానల దెబ్బకు భారీ చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరుగుతున్నాయి.  భారీ వర్షాలతో దేశవ్యాప్తంగా 14 మంది మృతి చెందారు. వేలాది మంది నిరాశ్రయలయ్యారు. గుజరాత్‌లోనే ఏడుగురు మృతి చెందారు. దేశంలో అనేక ప్రాంతాల్లో మరో ఐదు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, న్యూఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, హర్యానాల్లో భారీ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది.  భారీ వర్షాల కారణంగా గుజరాత్‌ అతలాకుతలమయ్యింది. 24 గంటల వ్యవధిలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా గోడ కూలి ఏడుగురు మరణించారు.  అహ్మదాబాద్‌, రాజ్‌కోట్‌ సహా పలు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. ఉరుములు, వరదనీటిలో కొట్టుకొని పోవడం,…

Read More

సామాజిక న్యాయంలో భాగంగా ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మంగళగిరి సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో మంగళవారం వైసిపి ఎమ్మెల్యేలు, ఎంపీలతో ద్రౌపది ముర్ము సమావేశం అయ్యారు.  ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ” వైసిపి తరపున మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులంతా ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలి. రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి గిరిజన మహిళకు అవకాశం లభించింది” అని తెలిపారు. మొదటి నుంచి వైసిపి ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపిస్తూ వస్తోందని పేర్కొంటూ ఈ విషయంలో పార్టీ నిర్ణయాన్ని బలపర్చాలని, ఒక్క ఓటు కూడా వృథా కాకూడదని కోరారు. జులై 18న మాక్‌ పోలింగ్‌ కూడా నిర్వహిస్తామని చెప్పారు. “మాక్‌పోలింగ్‌లో పాల్గన్న తర్వాతే ఓటింగ్‌కు వెళ్లాలి. ఎంపీల తరపున విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలు బాధ్యతలు తీసుకుంటారు. అలాగే విప్‌లు, మంత్రులు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం…

Read More

శ్రీలంకలో ఏర్పడ్డ తీవ్ర సంక్షోభంతో కడుపు మండిన ప్రజలు తిరుగుబాటు చేయడంతో భయాందోళనకు గురైన ఆ దేశ అధ్యక్షుడు గొటబయ రాజపక్సే దేశం నుండి పరారయ్యాడు.మరోవంక, అధ్యక్ష పదవి చేపట్టడానికి ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస సంసిద్ధత వ్యక్తం చేశారు.  తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంక  ప్రజాగ్రహాలతో రగులుతుండంతో తమ పదవులకు  అధ్యక్ష, ప్రధాని ఇద్దరూ రాజీనామా చేయవలసి రావడంతో అధికార పదవులు చేపట్టడానికి నాయకులెవ్వరూ సాహసించడం లేదు. అయితే, ప్రతిపక్ష నేత సజిత్‌ ప్రేమదాస అధ్యక్ష పదవి చేపట్టడానికి  ముందుకొచ్చారు.  ఆయన  బీబీసీతో మాట్లాడుతూ గొటబాయ రాజపక్సా అధికారం నుంచి దిగిన వెంటనే అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తానని చెప్పారు. ఆయన పార్టీ సమగి జన బలవెగయ (ఎస్‌జేబీ) ఇప్పటికే ఇతర పక్షాలతో ఈ అంశంపై చర్చలు జరిపిందని తెలిపారు. ఒక వేళ ఖాళీ ఏర్పడితే తాను నామినేషన్‌ వేసేందుకు సిద్ధమని ప్రకటించారు.  తాము ప్రజలను మోసం చేయడానికి గద్దెనెక్కబోమని, శ్రీలంకను ఈ సంక్షోభం నుంచి బయటపడేయటానికి అనుకున్న ప్రణాళికను…

Read More

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు మరో 17 నెలలో జరుగవలసి ఉండగా, ఇప్పటి నుండే ముందస్తు ఎన్నికల వేడి రాజుకొంటున్నది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సై అంటే సై అంటున్నాయి. మోదీ సర్కారుపై అగ్గిమీద గుగ్గిలమవుతున్న సీఎం కేసీఆర్ దమ్ముంటే ముందస్తు ఎన్నికల డేట్ ఫిక్స్ చేయాలని, తాను కూడా సిద్ధమని బీజేపీకి సవాల్ విసిరారు. దానిపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎ న్నికలు ఎప్పుడొచ్చినా రెడీ అంటూ ప్రతి సవాల్ విసిరారు. మరోవంక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సైతం ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటూ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికలకు 2023 నవంబర్ వరకు గడువుంది. 2014లో తొలిసారి అధికారం చేపట్టిన కేసీఆర్ గడువుకు 9 నెలల ముందే అసెంబ్లీని రద్దు చేశారు. ఈసారి కూడా ఆయన అదే వ్యూహాన్ని అమలుచేస్తారని ప్రతిపక్షాల అనుమానిస్తున్నాయి. అందుకే ఒకవైపు బీజేపీని రెచ్చగొడుతూనే మరోవైపు ఎన్నికల తేదీ ప్రకటిస్తే అసెంబ్లీ రద్దు…

Read More

నూతన పార్లమెంటు భవనం పైకప్పుపై కాంస్యంతో తయారు చేసిన జాతీయ చిహ్నాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఆవిష్కరించారు. 9,500 కిలోల బరువు, 6.5 మీటర్ల ఎత్తుతో కూడిన నాలుగు సింహాలతో కూడిన జాతీయ చిహ్నాన్ని పార్లమెంటు భవనంపై నెలకొల్పడం రాజ్యాంగ స్పూర్తికే విరుద్ధమన్న విమర్శలు వస్తున్నాయి.. జాతీయ చిహ్నం ఆవిష్కరించిన తరువాత ప్రధాని మోడీ కొత్త పార్లమెంటు భవనం నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పనుల్లో నిమగమైన ఇంజినీర్లతో పాటు కార్మికులతో మోడీ మాట్లాడారు.. ‘పార్లమెంటు నిర్మాణంలో పాలుపంచుకున్న శ్రమజీవులతో నేను అద్భుతంగా సంభాషించాను. వారి ప్రయత్నాలకు మేము గర్విస్తున్నాము. మన దేశానికి వారు చేసిన సహకారాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాం’ అని మోడీ అన్నారు. టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ పార్లమెంటు నూతన భవనాన్ని నిర్మిస్తోంది. దీనికి హెచ్‌సిపి డిజైన్‌, ప్లానింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూపకల్పన చేసింది. నూతన పార్లమెంటు భవన నిర్మాణం కోసం రూ.971 కోట్లు…

Read More

సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌చార్జ్ తరుణ్‌‌‌‌చుగ్‌‌‌‌ సవాల్‌‌‌‌ విసిరారు. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని, టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ను ఓడించడానికి ప్రజలు కూడా రెడీగా ఉన్నారని వెల్లడించాయిరు. ప్రభుత్వాన్ని రద్దు చేయకుండా, ఎన్నికల తేదీలు ప్రకటించాలని బీజేపీని సవాల్ చేయడం ఆయన చేతగానితనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ఎన్నికల తేదీలు నిర్ణయించేది బీజేపీ కాదని, ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుందని గుర్తు చేశారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు ధైర్యం ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఎన్నికలు పెట్టాలని కోరారు. పరేడ్‌‌‌‌గ్రౌండ్‌‌‌‌లో జరిగిన బీజేపీ సభకు ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి కేసీఆర్‌‌‌‌‌‌‌‌ వణుకుతున్నారని, ఆ భయంతోనే ఇలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. సభలో లక్షలాది మంది మోదీ, మోదీ అని అరవడాన్ని కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కుటుంబమంతా కూర్చుని టీవీలో లైవ్‌‌‌‌ చూసి భయపడుతున్నారని చెప్పారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వానికి ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని, ప్రజలు ఆ పార్టీని సాగనంపాలని నిర్ణయించుకున్నారని, మోదీ డబుల్…

Read More