Author: Editor's Desk, Tattva News

నిరాడంబ‌ర జీవితానికి నిద‌ర్శ‌నంగా చెప్పుకొనే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు వాహనాలు కొనుగోలు చేసేందుకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి రూ.1.44 కోట్లు ఖర్చు చేసిందని తేలడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కార్ల కోసం దాదాపు 45 లక్షల రూపాయలు ఖర్చు చేశారు.  ఈ విషయాలు సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడయ్యాయి. కేజ్రీవాల్ ఈ ఏప్రిల్ లో రూ. 36 లక్షల ఖరీదు గల ఎంజీ గ్లోస్టర్‌ కారులో కనిపించారు. అంతకు ముందు రెండు టొయోటా ఇన్నోవా వాహనాలు వాడారు. అలాగే, మద్రా ఆల్టురాస్ జీ4లో కనిపించారు. దీని ధర కూడా రూ. 32 లక్షల కంటే ఎక్కువ. వీటన్నింటికి కలిపి ఢిల్లీ సర్కారు కోటిన్నర వరకు ఖర్చు చేసినట్టు తెలిసింది. 2015 ఎన్నికలకు ముందు, కేజ్రీవాల్ తాను ‘విఐపి సంస్కృతి’ని నిషేధిస్తానని ప్రకటించారు. అదే సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 49…

Read More

కుంభవృష్టి కారణంగా దక్షిణ కశ్మీర్‌లోని అమర్‌నాథ్‌ గుహ సమీపంలో వరదలు సంభవించిన 2 రోజుల తర్వాత జమ్ము నుంచి అమర్‌నాథ్ యాత్రను ప్రభుత్వం నిలిపివేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణమని ఆదివారం వెల్లడించింది. దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్ క్యాంప్‌లకు జమ్ము నుంచి కొత్త బ్యాచ్‌లను అనుమతించబోమని ఓ అధికారి స్పష్టం చేశారు.  కాశ్మీర్‌లోని 2 బేస్ క్యాంపులకూ జమ్ము నుంచి యాత్రను నిలిపివేస్తున్నట్టు అధికారి స్పష్టం చేశారు. తీవ్ర ప్రతికూల వాతావరణమే ఇందుకు కారణమని చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా కుంభవృష్టి సంభవించింది. మెరుపు వరదల్లో కొట్టుకుపోయి ఏకంగా 16 మంది కన్నుమూశారు. దాదాపు 35 మంది ఆచూకీ లభ్యంకాలేదు. అప్పటి నుంచి అక్కడ ప్రతికూల వాతావరణం కొనసాగుతోన్న విషయం తెలిసిందే.  కాగా, పవిత్ర గుహ సమీపంలో కుంభవృష్టి అనంతరం వరదలు వెల్లువెత్తడంతో 16 మంది మృతి చెందిన ఘటనతో పాక్షికంగా నిలిపివేసిన…

Read More

మహారాష్ట్రలో కేబినెట్‌ విస్తరణ వచ్చే వారంలో ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే చెప్పారు. ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో సంపూర్ణ చర్చల తర్వాత మంత్రి మండలి కూర్పు ఉంటుందని తెలిపారు. శనివారం షిండే, ఫడ్నవీస్‌లు ఢిల్లీలో సుడిగాలి పర్యటన చేపట్టారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలుసుకున్నారు. అనంతరం సంయుక్తంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే చెబుతున్న మాటల్ని షిండే తోసిపుచ్చారు. 164 మంది ఎమ్మెల్యేలతో తమ ప్రభుత్వం బలంగా ఉందని, పూర్తి కాలం తను పదవిలో ఉంటానని ధీమాగా చెప్పారు. ఒకప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఫడ్నవీస్‌ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కావడం పట్ల అసంతృప్తిగా లేదా అన్న ప్రశ్నకు తాను పార్టీ ఆదేశాలకు అనుగుణంగానే నడుచుకుంటానని బదులిచ్చారు.…

Read More

రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 175 సీట్లలో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని వైసిపి కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దిశా నిర్ధేశం చేశారు. రెండు రోజుల పాటు జరిగిన వైసిపి ప్లీనరీలో శనివారం మధ్యాహ్నం ఆయన ముగింపు ప్రసంగం చేశారు. ‘2024 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ప్రతి కార్యకర్త పని చేయాలి. చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలు గల్లంతవుతాయి. బాబుకు ఓటు వేయడం అంటే వాటిని నిలిపివేయాలని కోరినట్టే. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి. విస్తృతంగా ప్రచారం చేయాలి.’ అని ఆయన చెప్పారు. అంతకుముందు వైసిపి శాశ్వత (జీవిత కాలపు జాతీయ) అధ్యక్షునిగా జగన్మోహన్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఇతరులెవ్వరూ నామినేషన్లు వెయ్యక పోవడంతో జీవితకాలపు జాతీయ అధ్యక్షునిగా జగన్‌ ఏకగ్రీవంగా ఎనిుకయ్యారని కార్యకర్తల హర్షధ్వానాల మధ్య విజయసాయి రెడ్డి ప్రకటించారు. రెండోరోజు పరిపాలనా వికేంద్రీకరణ, సామాజిక సాధికారత, వ్యవసాయం, పరిశ్రమలు-ప్రోత్సాహకాలు,…

Read More

వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పై తాను గజ్వేల్ నుండి పోటీ చేస్తానని బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. తన ప్రస్థానం గజ్వేల్‌ నుంచే ప్రారంభమైందని గుర్తు చేస్తూ ఇక్కడి నుంచి పోటీకి సంబంధించి ఇప్పటికే తాను క్షేత్ర స్థాయిలో కార్యాచరణ చేపట్టినట్లు వెల్లడించారు.  పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ మంత్రివర్గం నుండి రాజీనామా చేసి,  బీజేపీలో చేరి ఆమెపైనే పోటీ చేసి, ఆమెను ఓడించిన సువేందు అధికారి తరహాలో  కేసీఆర్ ను ఓడించి తీరుతానని భరోసా వ్యక్తం చేశారు.  త్వరలో బీజేపీలోకి భారీగా చేరికలుంటాయని, ఇందుకు సీక్రెట్ ఆపరేషన్ నడుస్తున్నట్లు తెలిపారు.  అధికార టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని చెబుతూ ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ గ్రాఫ్ జారుడు బండ మాదిరి పడిపోతుందని స్పష్టం చేశారు.  బీజేపీకి చెందిన నలుగురు కార్పోరేటర్లను టీఆర్ఎస్ చేర్చుకుంటే చూస్తూ ఊరుకుంటామా? అంటూ ప్రశ్నించారు. అందుకు టీఆర్ఎస్ పై ప్రతీకారం కచ్చితంగా తీర్చుకుంటామని హెచ్చరించారు.  కాగా, కేసీఆర్ ను ఢీ కొట్టాలంటే ఈగోలు పక్కన…

Read More

కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహంతో పలాయనం దేశాధ్యక్షుడు గొటబయా రాజపక్షా పలాయనం చిత్తగించడంతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తీవ్రంగా మారింది. అఖిల పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఇందుకు వీలుగా రాజీనామా చేస్తానని ప్రధానమంత్రి రణీల్‌ విక్రమ్‌ సింఘే తెలిపారు. మరోవంక, అధ్యక్షుడు కూడా ఈ నెల 13న రాజీనామా చేయనున్నట్లు స్పీకర్ వెల్లడించారు.  అధ్యక్షుడుగా గొటబయా రాజపక్సా రాజీనామా చేస్తే ఆయన స్థానంలో రణీల్‌ విక్రమసింఘె అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గొటబయా రాజపక్సా పలాయనం నేపథ్యంలో శ్రీలంక నావికా దళానికి చెందిన ఒక యుద్ధ నౌకలోకి సూట్‌కేసులు తరలిస్తున్న వీడియోలు దుమారం రేపాయి. ఆ సూట్‌కేసులు అధ్యక్షుడు రాజపక్సావేనని స్థానిక మీడియా కథనాలు ఇస్తోంది.  పలాయనం చిత్తగించిన అధ్యక్షుడు గొటబయా రాజపక్స సురక్షితంగానే ఉన్నారని సైనిక వర్గాలు వెలిపాయి. ‘ఆయన ఇప్పటికీ అధ్యక్షుడే. అందువల్ల మిలటరీ యూనిట్‌ ఆయనకు రక్షణ కల్పిస్తోంది.’ అని ఆ…

Read More

సంస్కృత భాషను ప్రతి ఒక్కరికీ చేరవేయడాన్ని ప్రజాఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పిలుపిచ్చారు. శనివారం బెంగళూరులోని కర్ణాటక సంస్కృత విశ్వవిద్యాలయం 9వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్ట్రపతి, సంస్కృత భాష పరిరక్షణ అవసరాన్ని ప్రస్తావించారు. భారత దేశ ఆత్మను అధ్యయనం చేయడంలో సంస్కృత భాషను ప్రతి ఒక్కరు అధ్యయనం చేయడం చాలా అవసరమని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికంగా వస్తున్న మార్పులను సద్వినియోగం చేసుకుంటూ సంస్కృతంతో పాటు ఇతర ప్రాచీన భారతీయ భాషలను సంరక్షించు కోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రాచీన రాత ప్రతులు, శిలాశాసనాలు, శాసనాల డిజిటలీకరణ, వేదాధ్యయన రికార్డింగ్, తత్సంబంధిత పుస్తకాల ప్రచురణలను చేపట్టడంతో పాటుగా సంస్కృత భాష్యాలను సులువుగా నేర్చుకోవడంతో పాటు, అర్థం చేసుకునేందుకు వీలైన అంశాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. తత్వ, మత సంబంధమైన అంశాలను తెలుసుకునేందుకు మాత్రమే సంస్కృతాన్ని పరిమితం చేయకూడదని స్పష్టం చేశారు. ఆయుర్వేదం, యోగ, సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు,…

Read More

బ్రిటిష్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ రాజీనామా ప్రకటించడంతో, ఆ పదవి కోసం పోటీపడుతున్న వారిలో మొదటి వరుసలో ఉన్న భారత సంతతికి చెందిన మాజీ ఆర్ధిక మంత్రి రిషి సునాక్ కు భార్య గండం ఎదురవుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఆమె విదేశీ సంబంధాలు,  ఆదాయాలపై  ఏర్పడిన వివాదాలు గతంలో ఆయనను ఇరకాటంలోకి నెట్టాయి.  తాజాగా, ఆయన భార్య, బిలియనీర్ అక్షత మూర్తి జర్నలిస్టులకు టీ అందించడం అందించడం సహితం  వివాదం రేపింది. ఈ వివాదం రాజకీయంగా దుమారం రేపుతున్నది. తమ నివాసం వద్ద ఉన్న జర్నలిస్టులకు ఆమె టీ బిస్కట్లను అందిస్తూ ఉండగా అసలు వివాదానికి దారితీసింది.  జర్నలిస్టులకు ఆమె అత్యంత ఖరీదైన ఒక్కొక్కటి 38 పౌండ్లు విలువ పలికే ఎమ్మా లెసి టీకప్పులలో టీ అందించారు. టీ కప్పులకే ఇంతటి ఖర్చా? ఎందుకింత విలాసం? దిగిపోయిన ప్రధాని జాన్సన్ తరహాలోనే ఈ కుటుంబం డబ్బులు వెదజల్లుతుందా? అని నెట్‌లో పెట్టిన ఫోటోలపై తీవ్రస్థాయి…

Read More

మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన నాయకత్వంపై ఆ పార్టీ ఎమ్యెల్యేలే ఏకనాథ్ షిండే నాయకత్వంలో తిరుగుబాటు జరిపి, ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడం, బిజెపి మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఇతర బిజెపియేతర ప్రభుత్వాలున్న ఇతర రాష్ట్రాలలో సహితం అటువంటి `షిండే’ల కోసం అన్వేషణ జరుగుతుందా? బిజెపి ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ మాటలు అటువంటి అనుమానాలు కలిగిస్తున్నాయి. టీఆర్‌ఎస్ లోకట్టప్పలు సిద్ధంగా ఉన్నారని, మహారాష్ట్ర తరహాలో వారంతా తిరుగుబాటు చేస్తారని ఢిల్లీలో ప్రకటించి ఓ బాంబు పేల్చారు. టీఆర్‌ఎస్‌లో కూడా కట్టప్పలున్నారని, వాళ్లు ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. పుత్ర వాత్సల్యం కారణంగా మహారాష్ట్ర, బీహార్‌ ప్రభుత్వాలు ఎలా కూలిపోయాయో తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా అలాగే కూలిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీలో కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి చేరిక కేవలం ట్రైలర్‌ మాత్రమేనని అసలు సినిమా ముందున్నదని హెచ్చరించారు. అంటే కేసీఆర్ నాయకత్వంపై తిరుగుబాటుకు తెరవెనుక రంగం సిద్దమవుతున్నదా?…

Read More

టెస్లా అధినేత, బిలియనీర్‌ ఎలన్‌ మస్క్‌ ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ట్విట్టర్‌ కొనుగోలు ఒప్పందం నుండి తప్పుకున్నారు. నకిలీ ఖాతాల సంఖ్య విషయంలో తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసిందని ఆరోపిస్తూ 44 బిలియన్ల డాలర్ల డీల్‌ నుండి వైదొలిగారు.  ట్విట్టర్‌కు సంబంధించిన ఫేక్‌ లేదా స్పామ్‌ అకౌంట్లకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని పలుమార్లు కోరినప్పటికీ సదరు సంస్థ విఫలమైందని..ఇది కంపెనీ పనితీరుకు ప్రాథమికమైనదని ఎలన్‌ మస్క్‌ తరపు న్యాయమూర్తులు తెలిపారు. అయితే తాము న్యాయపోరాటానికి దిగుతామని ట్విట్టర్‌ చైర్మన్‌ బ్రెట్‌ టేలో తెలిపారు.  ఎలన్‌ మస్క్‌తో విలీన ఒప్పందాన్ని అమలు చేసేందుకు చట్టపరమైన చర్యలకు వెళతామని చెప్పారు. ఎలన్‌మస్క్‌కు ఒప్పంద ధరకు కంపెనీని అప్పగించేందుకు, నిబంధనల ప్రకారం లావాదేవీలు ముగించేందుకు సంస్థ కట్టుబడి ఉందని వెల్లడించారు. నిబంధన ప్రకారం ఈ డీల్‌ను ఎలన్‌ మస్క్‌ పూర్తి చేయకపో బ్రేకప్‌ ఫీజు కింద ఒక బిలియన్‌ డాలర్‌ చెల్లించాల్సి ఉంటుంది. కాగా,…

Read More