తెలంగాణ ప్రజల్లో బిజెపిపై నమ్మకం పెరుగుతోందని డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. బిజెపి జాతీయ కార్యవర్గ సామవేశాల ముగింపు సందర్భంగా ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బిజెపి విజయ సంకల్ప బహిరంగ సభలో సభలో ఆయన తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చి తీరుతుందని భరోసా వ్యక్తం చేసారు. బిజెపిని ఆశీర్వదించేందుకు వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే తెలంగాణలో సత్వర అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే ప్రతి పట్టణం, పల్లె అభివృద్ధి చెందుతాయని ప్రధాని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసం వచ్చానన్న మోదీ, రాష్ట్ర అభివృద్ధే బిజెపి ప్రాధాన్యత అని ప్రకటించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం రాష్ట్ర ప్రజలు పట్టాలు వేస్తున్నారని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. బిజెపి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోందని చెబుతూ బడుగు, బలహీన వర్గాల కోసం బిజెపి ప్రభుత్వం ఎంతో…
Author: Editor's Desk, Tattva News
బ్యాంకును మోసం చేసిన మనీలాండరింగ్ కేసులో తమిళనాడులోని చెన్నైలో శరవణ స్టోర్ (గోల్డ్ ప్యాలెస్)కు చెందిన రూ. 234.75 కోట్ల విలువ చేసే చరాస్థులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) జప్తు చేసింది ఈ ఏడాది ఏప్రిల్ 25న సిబిఐ, ఎకనామిక్ అఫెన్స్ వింగ్ (ఇఒడబ్ల్యు) దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం ఇడి కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపడుతోంది. చెన్నైలోని టి-నగర్‌లో ఉన్న ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్‌ను మోసం చేసేందుకు స్టోర్ భాగస్వామ్యులు పల్లకుదురై, పి. సుజాత, వైపి శిరవణ్‌తో సహా గుర్తు తెలియని ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులతో కలిసి కుట్రపన్నారన్న ఆరోపణలు వచ్చాయి. దర్యాప్తులో శరవణ స్టోర్ (గోల్డ్ ప్యాలెస్) రుణాల కోసం బ్యాంకును సంప్రదించినట్లు వెల్లడైంది. ఈ సంస్థ విక్రయాలు, ఇతర ఆర్థిక లావాదేవీల్లో తేడాలు గుర్తించినట్లు అధికారి తెలిపారు. అదేవిధంగా మరొక మనీలాండరింగ్ కేసులో ‘ద లాటరీ కింగ్’ వ్యవస్థాపక చైర్మన…
వైసిపి పాలకులు క్రిమినల్స్‌కు వత్తాసు పలుకుతున్నారని, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, శాంతి భద్రతలను కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విషఫలమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఎమ్మెల్యేలకు సమయం లేదు కానీ ప్రెస్‌మీట్లు పెట్టి బూతులు తిట్టడానికి సమయం ఉంటుందా అని ప్రశ్నించారు. ”జనవాణి – జనసేన భరోసా” పేరుతో విజయవాడలో ఆదివారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ ప్రజలనుంచి 427 మంది ప్రతినిధులు సుమారు 25 లక్షల మందికి సంబందించిన సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని చెబుతూ సామాన్య ప్రజానీకం సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు వారి గొంతుకగా తాము నిలుస్తామని, ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై వత్తిడి పెంచుతామని స్పష్టం చేశారు. వైసిపి అధినేత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని ధ్వజమెఎత్తుతూ ఎవరైనా పథకాలు గురించి ప్రశ్నిస్తే వారి గొంతు నొక్కుతున్నారని, అంతటితో ఆగకుండా పోలీసు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని…
మహారాష్ట్ర శాసన మండలి ఛైర్మన్‌గా మామ, అసెంబ్లీ స్పీకర్‌గా అల్లుడు ఎన్నికై రికార్డు సృష్టించారు. ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే వర్గం మద్దతుతో స్పీకర్‌గా ఎన్నికైన బిజెపి నేత రాహుల్ నర్వేకర్, మండలి ఛైర్మన్‌గా రామ్‌రాజే నాయక్‌కు స్వయానా అల్లుడు. అయితే మామ మాత్రం ఎన్‌సిపి (నేషనల్ కాంగ్రెస్ పార్టీ) కి చెందిన వ్యక్తి కాగా, అల్లుడు మాత్రం బీజేపీ నేత కావడం విశేషం. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ నర్వేకర్ (45) ఈ పదవిని చేపట్టిన పిన్న వయస్కుడని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. ముంబై లోని కొలాబా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాహుల్ నర్వేకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శివసేన యూత్ విభాగం అధికార ప్రతినిధిగా ఉన్న ఆయన 2014 లో పార్టీని విడిచిపెట్టి ఎన్‌సీపీలో చేరారు. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే దూరం పెట్టడం వల్లే పార్టీని వీడిపోతున్నట్టు అప్పట్లో పేర్కొన్నారు. 2014లో మవాలా…
ఉదయ్ పూర్ తరహాలోనే మరొక వ్యక్తిని హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఓ మందుల దుకాణ యజమాని ఉమేష్ ప్రహ్లాద్‌రావు కోల్హే గత నెలలో హత్యకు గురయ్యారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి బహిష్కృత నేత నుపూర్ శర్మ సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలిపినందుకు ఈయనను హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. గత నెల 21న రాత్రి పదిగంటలకు ఇంటికి వెళుతున్న ఉమేశ్‌ను మోటార్ బైక్‌పై వచ్చిన కొంత మంది వెంబండించి కత్తులతో దాడి చేసి నరికి చంపేశారు. తొలుత దోపిడీ కేసుగా భావించగా ఇప్పుడు ఉదరుపూర్ ఘటన అనంతరం దీనిపై దృష్టి సారించగా ఉమేష్ పోస్టే కారణమని నిర్ధారించారు. ఈ హత్యకు కుట్ర పన్నిన నిందితుడు ఇర్ఫాన్ ఖాన్, ముదస్సిర్ అహ్మద్, షారూక్ పఠాన్, అబ్దుల్ షేక్ తస్లీమ్, షోయమ్ ఖాన్, అతిబ్ రషీద్, యూసఫ్ ఖాన్‌లను అరెస్టు చేశారు. …
హైదరాబాద్ లో జరుగుతున్న రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలలో హైదరాబాద్ డిక్లరేషన్ పేరుతో హెచ్‌ఐసీసీ వేదికగా కీలక రాజకీయ తీర్మానాన్ని ఆమోదించేందుకు బిజెపి సిద్ధమైన్నట్లు తెలుస్తున్నది. ఇప్పటివరకు అధికారంలో ఉన్న రాష్ట్రాలు, ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు, వాటితో పాటు ఇకపై అధికారం కొనసాగించాల్సిన రాష్ట్రాల్లో పరిస్థితులపై ఈ సమావేశాలలో చర్చిస్తున్నారు. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకోవడమే ప్రధాన ఎజెండాగా కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి అనే నినాదాన్ని హైదరాబాద్ వేదికగా ఇవ్వడానికి బిజెపి సిద్దమైన్నట్లు రెండు, మూడు రోజులుగా తెలంగాణ అంతటా పర్యటిస్తున్న కేంద్ర మంత్రులు, బిజెపి జాతీయ నాయకుల వాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పాటు దేశ ఆర్థిక, సామాజిక పరిస్థితులకు సంబంధించిన విషయాలపై జాతీయ కార్యవర్గం చర్చించనుంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ఇక్కడున్న 119 నియోజకవర్గాల్లో పర్యటించిన నేతల అభిప్రాయాలను కార్యవర్గం తెలుసుకోనుంది. ఆదివారం సాయంత్రం విజయ సంకల్ప సభ పేరుతో నిర్వహించే బహిరంగ సభ ద్వారా టి …
సుమారు పది రోజుల పాటు నాటకీయ రాజకీయ పరిణామాల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శివసేన తిరుగుబాటు నేత ఏకనాథ్ షిండే సోమవారం అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమవుతున్నారు. సంఖ్యాబలం దృష్ట్యా ఆయన బలపరీక్షలో నెగ్గడం పట్ల ఎవ్వరికీ అనుమానాలు లేవు. అయితే, అంతటితే ఆయనకు సమస్యలు తీరే అవకాశాలు కనిపించడం లేదు. మరో వారం రోజుల తర్వాత సుప్రీం కోర్టులో జరిగే పరిణామాలను బట్టి ఆయన రాజకీయ భవిష్యత్ నిర్ణయమయ్యే అవకాశం ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి నోటీసు పంపడం దీనికి ప్రధాన కారణం. శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు కూడా ఈ ఎమ్మెల్యేలను సోమవారం జరిగే బలపరీక్షలో ఓటు వేయకుండా నిషేధించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్లను జూలై 11న విచారిస్తామని కోర్ట్ స్పష్టం చేసింది. విప్ జారీ చేసినా పార్టీ సమావేశానికి హాజరు కాలేదని డిప్యూటీ స్పీకర్ ఈ ఎమ్మెల్యేలకు…
ఆంధ్ర ప్రదేశ్ లో ఏ ఎన్నికలు జరిగినా వాలంటీర్లకు డబ్బులు ఇచ్చి , అధికార అండతో లోబరుచుకుని తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకొనే ప్రయత్నం అధికార పక్షమైన వైసిపి చేస్తున్నట్లు బిజెపి నాయకుడు కారణం భాస్కర్ ఆరోపించారు. ఓటర్లతో చనువు ఏర్పాటు చేస్తుకుని, ప్రతి ఓటరుకు ఓటర్ స్లిప్పులు అందిస్తూ వాటితో పాటుగా ఓటరు కు వైఎస్ఆర్సిపి పార్టీ ఇచ్చిన డబ్బులను కూడా నేరుగా వారితోనే ఇచ్చే పధకం వేసుకున్నారని తెలిపారు. ఒకొక్క ఓటరుకు రూ 10,000 వరకు ఇచ్చే ఏర్పాట్లు చేసుకొంటున్నట్లు చెప్పుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ను నియమించి ప్రభుత్వాలు ఇచ్చే , వచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా వారి ద్వారానే జరగాలని ఒక మంచి ఉద్దేశం తోటి ఈ వ్యవస్థను ప్రారంభించినట్టుగా అందరం భావించామని ఆయన తెలిపారు. మొదట ఈ వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నప్పుడే వైఎస్సార్సీపీ నాయకుడు విజయ్ సాయి రెడ్డి 94 శాతం వాలంటీర్లు మన పార్టీ కార్యకర్తలే అని ప్రకటన…
ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రతి రోజు కనీసం ఒకరిద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆప్ఘనిస్థాన్ పార్లమెంటు మాజీ డిప్యూటీ స్పీకర్ ఫాజియా కూఫీ తెలిపారు. అవకాశాలు లేకపోవడం, మానసిక అనారోగ్యం వంటివి మహిళల ప్రాణాలు తీసేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జెనీవాలోని మానవ హక్కుల మండలిలో మహిళల హక్కుల సమస్యపై అత్యవసర చర్చ సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్ అభ్యర్థన మేరకు ఈ సమావేశం జరిగింది. తాలిబన్ దేశంలో మహిళలు, బాలికలకు విద్యాహక్కును కలిగి ఉండటంతో పాటు ప్రజాజీవితంలో భాగస్వామ్యం అయ్యేలా తాలిబన్ చర్యలు తీసుకోవాలని సమావేశం కోరింది. ఆఫ్ఘన్ మహిళలు దశాబ్దాలుగా తమ హక్కులు కోల్పోవడంతోపాటు తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్నాక వారి పరిస్థితి మరింత దుర్భంగా మారింది. ఈ నేపథ్యంలో హెచ్ఆర్‌సీ అత్యవసరంగా మహిళలు, బాలికల హక్కులపై చర్చించింది. ఈ సందర్భంగా ఫాజియా మాట్లాడుతూ దేశంలో ప్రతి రోజూ కనీసం ఒకరిద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం…
ప్రపంచవ్యాప్తంగా రానున్న 10 ఏళ్లలో కోటి మందికి పైగా బాల్య వివాహాలు జరిగే అవకాశం ఉన్నట్లు ‘ది లాన్సెట్’ జర్నల్ వెల్లడించింది. కరోనా తర్వాత ఈ పరిస్థితులు రావడం గమనార్హం. విద్యా వ్యవస్థలో ఏర్పడ్డ మార్పులు, పెరిగిపోతున్న పేదరికమే అందుకు ప్రధాన కారణమని లాన్సెట్ తన ఎడిటోరియల్‌లో అభిప్రాయ పడింది. ‘ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరికి 18 ఏళ్లలోపే వివాహం జరుగుతోంది. ఇది వారి ఆరోగ్యం, బాగోగులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బాల్య వివాహాల వల్ల యుక్తవయస్సులో గర్భధారణ, అనారోగ్యం బారిన పడటం, భర్త చేతిలో హింసకు గురవడం వంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్నాయి’ అని తెలిపింది. కరోనా మహమ్మారి రాకతో ప్రపంచవ్యాప్తంగా సమస్య మరింత జటిలమైందని పేర్కొంటూ పేదరికం పెరిగి, చదువు చట్టుబండలైందని ఆ ఫలితంగానే రానున్న దశాబ్ద కాలంలో కోటి మంది బాలికలకు బాల్య వివాహాలు జరగనున్నాయని పేర్కొంది. ఏటా 1.2 కోట్ల మంది బాల్యంలోనే వివాహ వ్యవస్థలోకి…