పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ ను ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు శనివారం మీడియాలో కధనాలు వెలువడ్డాయి. పంజాబ్ కు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన గత ఏడాది ఆ పదవికి రాజీనామా చేయమనడంతో కాంగ్రెస్ కు రాజీనామా చేసి, పంజాబ్ జన కాంగ్రెస్ అనే పార్టీని ఏర్పాటు చేశారు. బిజెపితో పొత్తు ఏర్పాటు చేసుకొని, ఆ పార్టీ గుర్తు పైననే ఆయన పార్టీ అభ్యర్థులు పోటీ చేయగా తాను స్వయంగా ఓటమి చెందడమే కాకుండా, తన పార్టీ నుండి కూడా ఎవ్వరిని గెలిపించుకోలేక పోయారు. 80 ఏళ్ల కెప్టెన్ అమరీందర్ వెన్నెముక శస్త్రచికిత్స కోసం ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. ఆయన తిరిగి రాగానే తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. గత ఆదివారం ప్రధాని ఆయనకు ఫోన్ చేసి, ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేయడంతో ఈ కధనాలు వెలువడినట్లు కనిపిస్తున్నది. తన పార్టీని బీజేపీలో విలీనం చేయడం గురించి…
Author: Editor's Desk, Tattva News
దేశంలో రాష్ట్రపతి ఎన్నికలు అసాధారణ పరిస్థితుల్లో జరుగుతున్నాయని చెబుతూ ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటం కాదని, ఇద్దరు వ్యక్తుల గుర్తింపు కోసం జరిగే పోరాటం అంతకన్నా కాదని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా స్పష్టం చేశారు. శనివారం జలవిహార్‌లో సిన్హాకు మద్దతుగా టీఆర్‌ఎస్ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొంటూ ఇది రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్న పోరాటంగా తెలిపారు. శంలో పరిస్థితులు దిగజారుతుంటే చూస్తూ ఉండలేమని చెబుతూ విశాల భారత పరిరక్షణ కోసమే తమ పోరాటమని యశ్వంత్ వెల్లడించారు. చాలా రోజులుగా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని చెబుతూ రాష్ట్రపతి ఎన్నిక తర్వాత కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఇప్పుడు చేసే పోరాటం భారత్ భవిష్యత్తు కోసం. మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం చేసేది అని సిన్హా తెలిపారు. విశాల భారత పరిరక్షణ కోసం జరిగే పోరాటంలో విద్వేష పూరిత ప్రసంగాలు సమాజానికి మంచివి కాదని హితవు చెప్పారు. విద్వేషాన్ని పెంచి పోషించే ఆగడాలు జరుగుతుంటే ప్రధాని మౌనం వహించడం పట్ల …
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు శనివారం మధయ్న్నాం హైదరాబాద్ వస్తున్న ప్రధానిమోదీకి స్వాగతం పలికే కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు దూరంగా ఉండనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకనున్నారు. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి తలసాని ఇప్పటివరకు ప్రధానికి రెండుసార్లు స్వాగతం పలికారు. కాగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే పది ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసింది. సిర్పూర్ కాగజ్‌నగర్, విశాఖపట్నం, బెంగళూరు ప్రాంతాల నుంచి ఇవి రాకపోకలు సాగిస్తాయని అధికారులు తెలిపారు. ప్రధాని మోదీ విమానాశ్రయంలో దిగడానికి కొన్ని గంటల ముందు బేగంపేట విమానాశ్రయంలో ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కేసీఆర్ స్వాగతం పలకనున్నట్లు అధికార వర్గాలు తెలిపారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంలో సీఎం కేసీఆర్ దూరంగా ఉండటం ఆరు నెలల్లో ఇది మూడోసారి కావడం…
రెండు దశాబ్దాల తర్వాత జులై 2,3 తేదీలలో హైదరాబాద్ లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. కరోనా మహమ్మారి మొత్తం దేశాన్ని కకావికలం కావించిన తర్వాత – రెండున్నరేళ్ల తర్వాత మొదటిసారిగా పూర్తి స్థాయిలో బిజెపి జాతీయ నేతలు అందరు ఓ చోట సమావేశం అవుతున్నారు. జెపి నడ్డా పార్టీ సారధ్యం వహించిన తర్వాత మొదటిసారిగా ఈ సమావేశాలు ఈ స్థాయిలో జరుగుతున్నాయి. ఈ సమావేశాలను హైదరాబాద్ లో ఓ విడిదిగా జరపడం కాకుండా, భారీ లక్ష్యాలు, రాజకీయ వ్యూహాలతో జరపాలని జాతీయ నాయకత్వం నిర్ణయించింది. ముఖ్యంగా ఇప్పుడు మొత్తం పార్టీ దృష్టి 2024 నాటి ఎన్నికలపైనే ఉన్నదన్నది అందరికి తెలిసిందే.2014 ఎన్నికలలో కన్నా, 2019 ఎన్నికల్లో మరిన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకున్న బిజెపి ఈ పర్యాయం ఇంకా ఎక్కువ స్థానాలను గెల్చుకోవడమే కాకుండా, ఇప్పటి వరకు పార్టీ అంతగా విస్తరింపని ప్రాంతాలకు విస్తరింపడం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది.…
దేశీయ మార్కెట్‌లో చమురుకు కటకట ఉండకుండా చేసేందుకు ఎగుమతి పన్నుల చట్రంలోకి డీజిల్ పెట్రోలు, విమాన ఇంధన వనరులను కేంద్రం తీసుకువచ్చినట్లు తెలుస్తున్నది. పెట్రోలు డీజిల్ ఎగుమతులపై పన్నులు విధించడంతో పాటు విమాన ఇంధనం (ఎటిఎఫ్) విదేశాలకు ఎగుమతి చేసినా ఈ సుంకం పరిధిలోకి వస్తుందని ప్రకటించింది. రిలయన్‌స ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి సంస్థలు విదేశాలకు పెట్రో ఉత్పత్తులు, జెట్ ఫ్యూయల్‌ను ఎగమతి చేస్తున్నాయి. ప్రస్తుత ఉక్రెయిన్ సంక్షోభ దశలో భారత్‌కు అందే రష్యా ముడిచమురు కోటా ఎక్కువగా ఉంటుంది. దీనిని పేరొందిన బ్రాండ్ల చమురు కంపెనీలు తక్కువ ధరలకు రాబట్టుకుని తమ శుద్ధి కర్మాగారాలలో తగు విధంగా శుభ్రపర్చి ఇంధన అవసరాలు ఉన్న ఐరోపా దేశాలకు ఎక్కువ స్థాయిలో ఎగుమతి చేస్తున్నాయి. ఇప్పుడు కేంద్రం విధించిన ఎగుమతి పన్నులతో ఎగుమతి కోటాను బట్టి సంస్థలు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. మరో వైపు స్థానికంగా దేశీయ స్థాయిలో క్రూడాయిల్‌ను ఉత్పత్తి చేసే ఒఎన్‌జిసి, వేదాంత లిమిటెడ్ వంటివాటిపై…
మహారాష్ట్రంలో ఏక్‌నాథ్ షిండే సారథ్యంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం బలపరీక్షకు ముహూర్తం ఖరారైంది. 2, 3 తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. స్పీకర్ పదవికి బిజెపి ఎంఎల్‌ఎ రాహుల్ నర్వేకర్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఒకవేళ స్పీకర్ పదవికి ఎన్నిక అవసరమైతే జూలై 3న నిర్వహించనున్నారు. అదే జరిగితే 4న బలపరీక్ష నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శాసన సభలో తన మెజారీటిని నిరూపించుకోనున్నారు. ఈ నెల 3, 4 తేదీల్లో అసెంబ్లీ సమావేశానికి గవర్నర్ కోశ్యారీ ఉత్తర్వులిచ్చారు. దీని ప్రకారం 4న షిండే ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకోనుంది. మూడో తేదీన స్పీకర్ ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. శనివారం మధ్యాహ్నం 12.30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. బీజేపీ నుంచి కోలాబా శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ నర్వేకర్ స్పీకర్ పదవికి నామినేషన్ వేశారు. ఈ పదవికి బీజేపీ పోటీ…
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా విద్యుత్ వాహనాలను మరింత ప్రొత్సహించేందుకు జిహెచ్‌ఎంసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దినదినాభివృద్ధి చెందుతున్న నగరంలో రోడ్ల అభివృద్దికి ప్రాధాన్యతనివ్వడం సిగ్నల్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దుతున్న క్రమంలో వాహన సంఖ్య పెరగడంతో వాహన కాలుష్యం అంతే పెరిగింది. వాహన కాలుష్యం, చమురు వినియోగాన్ని తగ్గించేందుకు విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశేష కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ వాహనాల ఖరీదు ఎక్కువైనా పెరుగుతున్న ఇంధన ధరల వలన ప్రజలు మక్కువ కనబరుస్తున్నారు. దానికి తోడు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాల వలన కూడా విద్యుత్ వాహనాల వాడకం పెరుగుతున్నది. దేశంలో 2030 నాటికి అన్ని రకాల ఈ -వెహికిల్స్ రెండు, మూడు చక్రాల వాహనాలు, బస్సులు, కార్లు ఎక్కువ శాతం వినియోగానికి తీసుకొని రావడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక విధానాలు రూపొందించి విద్యుత్ వాహనాల కంపెనీల ఏర్పాటు చేసేందుకు…
కొన్ని రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై శుక్రవారం నుంచి నిషేధం అమలులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేయించేందుకు తగు విధంగా అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేశాయి. ముందుగానే ఈ ప్లాస్టిక్ నిషేధం అమలు గురించి ప్రచారం సాగించాయి. సంబంధిత ప్లాస్టిక్ వస్తువుల తయారీ, పంపిణీ, నిల్వలు చేయడం లేదా వాటిని అమ్మడం వంటి కార్యకలాపాలలో ఉన్న కంపెనీలు, ఏజెన్సీల మూసివేతకు నోటీసులు వెలువరించారు. కాగా,ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులపై విధించిన నిషేధాన్ని ఉల్లంఘిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ హెచ్చరించారు. నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి లక్ష రూపాయల జరిమానా, లేదంటే ఐదేళ్ల జైలు శిక్ష తప్పదని స్పష్టం చేశారు. 19 ఎస్‌యూపీ వస్తువులపై విధించిన నిషేధాన్ని ఉల్లంఘించే యూనిట్లకు ఈ నెల 10వ తేదీ వరకు నోటీసులు జారీ చేస్తామని, ఆ తర్వాత మాత్రం చర్యలు…
మే నెలలో 19 లక్షల భారతీయుల ఖాతాలను నిషేధించినట్టు మెటా సారధ్యంలోని మెసేజింగ్ యాప్ ‘వాట్సప్’ ప్రకటించింది. వాట్సప్ గ్రీవెన్స్ ఛానల్ నిబంధనల అతిక్రమణలను గుర్తించే సొంత వ్యవస్థల ద్వారా యూజర్ల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా నిషేధం విధించినట్టు వివరించింది. ఈ మేరకు మే నెల ‘యూజర్-సేఫ్టీ’రిపోర్టులో వాట్సప్ ప్రతినిధి వెల్లడించారు. అందిన ఫిర్యాదులు.. వాటిపై తీసుకున్న చర్యల వివరాలను రిపోర్టులో పేర్కొన్నామన్నారు. ఇండియన్ వాట్సప్ ఖాతాలను నంబర్‌కు ముందు ఉండే +91 ద్వారా గుర్తించొచ్చని పేర్కొన్నారు. శుక్రవారం విడుదలైన యూజర్- సేఫ్టీ రిపోర్ట్ ప్రకారం.. మే 1 నుంచి మే 31,2022 మధ్యకాలంలో 19.10 లక్షల భారతీయుల వాట్సప్ ఖాతాలపై నిషేధపు వేటుపడింది. యూజర్ల నుంచి నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ అందిన తర్వాత చర్యలు తీసుకున్నారు. కాగా అంతక్రితం నెల ఏప్రిల్‌లో 16 లక్షల ఖాతాలు, మార్చి నెలలో 18.05 లక్షల ఖాతాలపై వాట్సప్ బ్యాన్ విధించింది. డూప్లికేట్ ఫిర్యాదులు మినహా మిగతావాటన్నింటిపైనా చర్యలు తీసుకున్నట్టు వాట్సప్…
పాకిస్తాన్‌లో విద్యుత్ సంక్షోభం తీవ్రమైంది. ఈ ప్రభావం అక్కడి టెలికం రంగంపై చూపిస్తోంది. ఈ విద్యుత్ కోతలతో చేతులెత్తేసిన టెలికం ఆపరేటర్లు మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తామని హెచ్చరించారు ‘దేశ వ్యాప్తంగా ఎక్కువ సేపు విద్యుత్ కోతలు ఎదుర్కొంటున్నందుకు మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తాం’ అని టెలికం ఆపరేటర్లు హెచ్చరించారు. ఈ విద్యుత్ కోతల కటకట వల్ల వారి కార్యకలాపాలకు సమస్యలు, ఆటంకాలు ఎదురౌతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారుని నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డు (ఎన్‌బిటి) ట్విట్టర్‌లో పేర్కొంది. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ, జూలై నుంచి లోడ్ షెడ్డింగ్ పెరుగుతుందని హెచ్చరించారు. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్‌జీ) అవసరమైన పరిమాణంలో సరఫరాకావడం లేదని తెలిపారు. దీని కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. విద్యుత్తు సంక్షోభం నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం ప్రభుత్వోద్యోగుల పని గంటలను తగ్గించింది. వారానికి ఆరు రోజులకు బదులుగా ఐదు రోజులు మాత్రమే ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తున్నాయి.…