అన్నాడీఎంకేలో నాయకత్వం విషయమై మాజీ ముఖ్యమంత్రులు పళనిస్వామి, పన్నీరుసెల్వంల మధ్య చెలరేగిన వివాదం ప్రస్తుతం భారత ఎన్నికల కమీషన్ ముంగిటకు చేరింది. పార్టీలో పరిణామాలపై పన్నీరు సెల్వం ఈసీకి ఫిర్యాదు చేశారనే సమాచారంతో పళని శిబిరం వ్యూహాలకు పదును పెట్టింది. గత వారం జరిగిన అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశంలో కోర్టు ధిక్కారం జరిగినట్టు హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలైంది. తనకు వ్యతిరేకంగా పళని శిబిరం దూకుడు పెంచడంతో ఎత్తుకు పైఎత్తు వేసే పనిలో పన్నీరు సెల్వం ఉన్నారు. సమన్వయ కమిటీ కన్వీనర్ అనుమతి లేకుండా జూలై 11న మరో మారు సర్వసభ్య సమావేశానికి ఏర్పాట్లు చేయడం వంటి పరిణామాలను వివరిస్తూ పన్నీరు సెల్వం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఆ సమావేశాన్ని అడ్డుకోవడమే కాకుండా, రెండాకుల చిహ్నాన్ని మరోమారు స్తంభింపజేయడానికి తగ్గ వ్యూహాల్లో పన్నీరు ఉన్నట్టు ప్రచారం జోరందుకుంది. ఇది కాస్త పళని శిబిరంలో కలవరాన్ని రేపినా, సమర్థంగా ఎదుర్కొనేందుకు తగిన వ్యూహాలకు…
Author: Editor's Desk, Tattva News
తెలంగాణలో సాగుతున్న కుటుంబ, అవినీతి పాలనను అంతమొందిస్తామని ప్రజలకు చెప్పేందుకే జూలై 3న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బహిరంగ సభకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరిస్తూ జులై 2, 3 తేదీల్లోజరిగే జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్ షాతో పాటు 18 రాష్ట్రాల సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు హాజరవుతున్నందున ఈ సమావేశాలు చారిత్రాత్మకం కానున్నాయని చెప్పారు. 130 కోట్ల దేశ ప్రజల సంపూర్ణ మద్దతు తెలంగాణకు ఉంటుందని నమ్ముతున్నామని చెబుతూ దాదాపు 20 సంవత్సరాల క్రితం అప్పటి ప్రధాని వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ హైదరాబాద్‌లో వైస్రాయ్ హోటల్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యారని గుర్తు చేశారు. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే సభకు విజయ్ సంకల్ప్ సభ అని నామకరణం…
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని టాప్ 20 స్థిరమైన నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ నిలిచింది. ఈ జాబితాలోని దేశ నగరాల్లో మూడో స్థానంలో భాగ్యనగరం ఉంది. బెంగళూరు, ఢిల్లీ తర్వాత హైదరాబాద్కు ఈ పేరు దక్కింది. ఆ తర్వాత ప్లేస్లో ముంబై సిటీ ఉంది. ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ తన తాజా నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ‘యాక్టివ్ క్యాపిటల్ ఏసియా పసిఫిక్- రైజింగ్ క్యాపిటల్ ఇన్ అన్‌సర్టెన్ టైమ్స్’ పేరుతో ఒక జాబితా విడుదల చేసింది. పట్టణీకరణ ఒత్తిడి, వాతావరణ ప్రమాదం, కర్బన ఉద్గారాలు, ప్రభుత్వ కార్యక్రమాల ఆధారంగా 36 నగరాలకు రేటింగ్ ఇచ్చింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో సింగపూర్, సిడ్నీ, వెల్లింగ్టన్, పెర్త్, మెల్బోర్న్ వంటి నగరాలు వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో మొదటి ఐదు గ్రీన్-రేటెడ్ నగరాల జాబితాలో ఉన్నాయి. ఇక.. ఏపీఏసీ సస్టైనబిలిటీ ఇండెక్స్ 2021లోని మొదటి ఇరవై స్థిరమైన నగరాల్లో నాలుగు భారతీయ నగరాలున్నాయి. ఇందులో బెంగళూరు, ఢిల్లీ…
ఆంధ్ర ప్రదేశ్ లో తయారయ్యే మద్యంలో హానికరమైన రసాయనాలు ఉన్నాయని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. మద్యం ఎవరు తయారు చేస్తున్నారో చెప్పమంటే చెప్పరని, చంద్రబాబు నాయుడు లైసెన్స్ ఇచ్చారని అంటున్నారని, అయితే ఏపీలో ఉన్న బ్రాండ్స్ ఇతర రాష్టాలలో ఎక్కడ లేవని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. పాత బ్రాండ్స్ ఇప్పుడు ఒక్కటి కూడా దొరకడం లేదని, కొత్త కొత్త బ్రాండ్స్ మార్కెట్‌లోకి వస్తున్నాయని చెబుతూ జగనన్న విద్య దీవెన, జగనన్న వసతి దీవెనలాగా ఇప్పుడు మద్యం నిషేధం పధకానికి జగనన్న వితంతు దీవెన అని పేరు పెట్టాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. మద్యాన్ని ఇంతకు ముందు బేవరైజేస్ కార్పొరేషన్ తయారు చేసేదని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు, 20 మద్యం కంపెనీల నుంచి బ్రాండ్స్ కొంటున్నామని అధికారులు అంటున్నారని అంటూ దొంగ స్కీమ్స్ పెట్టి దొంగ నాటకాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో పాత బ్రాండ్స్ ఎందుకు దొరకడం లేదు? దీనికి సమాధానం చెప్పాలని రఘురామ…
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో హిందూ టైలర్ కన్హయ్యా లాల్ ఘటన పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న మతఛాందస్సవాద ఉగ్రసంస్థకు చెందిన స్లీపర్ సెల్స్ పనేనని ఇంటెలిజెన్సీ వర్గాలు భావిస్తున్నాయి. ఏ సంస్థకు చెందినవారో పేరు వెల్లడించకపోయినప్పటికీ ఈ దిశగా దర్యాప్తును ముమ్మరం చేశాయి. ఈ కిరాతక హత్యకు సంబంధించి మరో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు సమాచారం. 10 మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్యా లాల్ ను దుండగులు పదునైన కత్తితో 26 సార్లు నరికినట్టు పోస్టుమార్గం నివేదికలో వెల్లడైంది. తలపై 8-10 సార్లు నరికారు. దీంతో తీవ్ర రక్తస్రావం కారణంగానే అతడు చనిపోయాడని రిపోర్ట్ తేల్చింది. హత్య జరిగిన తీరును బట్టి పక్కా పథకం ప్రకారమే ఈ ఘటన జరిగిందని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనకు ఐసిస్ ఉగ్రవాదకు సంస్థకు లేదా పాక్ ఉగ్రవాద సంస్థకు లింకులున్నాయా? అనే అనుమానాలూ వ్యక్తమవవుతున్నాయి. జాతీయ దర్యాప్తు…
మాంసం, చేపలు, పెరుగు, పన్నీర్, తేనె వంటి ప్రీ-ప్యాక్డ్, లేబుల్డ్ ఆహార వస్తువులపైనా వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) విధించనున్నారు. ఈ మేరకు జిఎస్‌టి మండలి ఆమోదం తెలిపింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో రాష్ట్రాల మంత్రులతో కూడిన జిఎస్‌టి మండలి సమావేశమైంది. అదేవిధంగా చెక్‌ల జారీకి బ్యాంకులు వసూలు చేసే ఛార్జీలపైనా పన్ను వసూలు చేస్తారు. అంతరాష్ట్ర పరిధిలో పసిడి, విలువైన రాళ్లను రవాణా చేసేందుకు రాష్ట్రాలు ఇ-వే బిల్లు జారీ చేసేందుకు జిఎస్‌టి మండలి అనుమతినిచ్చింది. పన్ను ఆదాయాల్లో మరింత వాటాను రాష్ట్రాలు కోరుతున్న నేపథ్యంలో మండలి ఈ నిర్ణయాలు తీసుకుంది. జిఎస్‌టి నమోదిత వ్యాపారాలకు నిబంధనలు, అధిక పన్ను చెల్లింపుదార్ల ఎగవేతల తనిఖీకి సంబంధించి మంత్రుల బఅందం (బిఒఎం) నివేదికకు మండలి ఆమోద్రముద్ర వేసింది. రోజుకు ఆసుపత్రి గది అద్దె రూ.5000 (ఐసియు మినహాయింపు) పైబడితే.. రోగుల నుంచి వసూలు చేసే దానిపై 5 శాతం జిఎస్‌టి…
అత్యవసర వినియోగానికి మరో రెండు కోవిడ్ వ్యాక్సిన్లకు డిసిజిఐ అనుమతినిచ్చింది. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా దేశీయంగా తయారైన ఎంఆర్‌ఎన్‌ఎ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) అనుమతినిచ్చింది. జెన్నోవా బయో-ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తి చేసిన ఈ టీకాను 18 ఏళ్లు నిండినవారికి అందించవచ్చని తెలిపింది. ఇతర ఎంఆర్‌ఎన్‌ఎ వ్యాక్సిన్ డోసుల మాదిరి వీటిని జీరో ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సిన అవసరం లేదు. 2-8 డిగ్రీల వద్ద కూడా జెన్నోవా వ్యాక్సిన్‌ను నిల్వ చేసుకోవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. 7-11 ఏళ్ల వయసు చిన్నారుల కోసం సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) తయారుచేసిన కొవొవాక్స్ టీకాకూ డిసిజిఐ అనుమతినిచ్చింది. ఇందుకు సంబంధించి ఎస్‌ఐఐలో ప్రభుత్వ నియంత్రణ వ్యవహారాల విభాగం డైరెక్టర్ ప్రకాశ్‌కుమార్ సింగ్ ఈ ఏడాది మార్చి 16 న దరఖాస్తు చేశారు. దీన్ని పరిశీలించిన కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థకు చెందిన నిపుణుల కమిటీ.. అత్యవసర…
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం రేపటితో తెరపడేనా అంటే అవుననే అంటున్నాయి సంబంధిత వర్గాలు. జూన్ 30న బలపరీక్షకు రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆదేశించారు. మంగళవారం రాత్రి ఢిల్లీలో పార్టీ కేంద్ర నాయకులతో సమాలోచనలు జరిపి తిరిగి వాస్తు మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవీస్ నేరుగా గవర్నర్ ను కలిశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మెజార్టీ కోల్పోయారని, వెంటనే బలపరీక్షకు ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు. దీంతో గవర్నర్ గురువారం బలపరీక్ష నిరూపించుకోవాలని ఉద్ధవ్‌కు బుధవారం ఉదయం ఆదేశాలు జారీ చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాన్ని వీడియోలో రికార్డ్ చేయాలని గవర్నర్ ఆదేశించారు. గురువారం ఉదయం 11 గంటలకు సమావేశమయ్యే ఏకైక అజెండా ఫ్లోర్ టెస్ట్ అని గవర్నర్ పేర్కొన్నారు. ఇప్పటికే గువహటిలోని ఓ హోటల్‌లో మకాకం వేసిన శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు గురువారం ముంబయికి చేరుకోనున్నారు. ఆ అసమ్మతి వర్గంంలో 39 మంది శివసేన ఎమ్మెల్యేలతో…
మహ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఓ టైలర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇద్దరు వ్యక్తులు పట్టపగలే కన్హయ్య లాల్ అనే వ్యక్తిపై.. అతని దుకాణంలోనే ఘాతుకానికి పాల్పడ్డారు. అచ్చం ఉగ్ర సంస్థ ఐసిస్ దుండగులను తలపించేలా గొంతు కోసి క్రూరంగా పొట్టన పెట్టుకున్నారు. పైగా దాన్ని రికార్డు చేసి వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ మాల్దాస్‌లో మంగళవారం జరిగిన ఈ దారుణం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. బీజేపీ సస్పెండ్ నేత నూపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థించినందుకే హత్య చేశామంటూ హంతకులు మరో వీడియో పోస్టు చేశారు. పైగా ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఇలాగే చంపుతామని హెచ్చరించారు. ప్రవక్త వివాదం తాలూకు జ్వాలను రగిలించింది ఆయనేనని ఆరోపించారు. హత్యకు వాడిన కత్తిని చూపిస్తూ, ‘ఇది మోదీ (ప్రధానిని ఉద్దేశిస్తూ) మెడ దాకా కూడా చేరుతుంది’ అంటూ బెదిరించారు. నిందితులను రియాజ్ అక్తర్, గౌస్ మొహమ్మద్‌గా గుర్తించారు. రియాజ్…
భారత్‌లో 54 శాతం మంది వాస్తవ సమాచారం కోసం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపైనే ఆధారపడుతున్నట్లు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ (ఒయుపి) ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడించింది. ‘ది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్’ పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనంలో వాస్తవాలను ఎలా గుర్తిస్తారు? వాటిని పొందే మారాలను బట్టి ఎలా అంచనా వేస్తారు? అనే అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుని అంచనా వేశారు. తప్పుడు సమాచారం, కల్పిత వార్తలకు సంబంధించిన భయాలున్నప్పటికీ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తాము వెతికే, పంచుకునే సమాచారమే వాస్తవవమైన సమాచారం అని ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా యూజర్లు నమ్ముతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ నమ్మకం స్థాయి ఎక్కువగా ఉండడం విశేషం. కాగా వాస్తవ సమాచారం కోసం వెతికేటప్పుడు ప్రపంచవ్యాప్తంగా 37 శాతం జనం సోషల్ మీడియా వైపు మొగ్గు చూసుతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. మెక్సికన్లు, దక్షిణాఫ్రికా వాసుల్లో అ…