Author: Editor's Desk, Tattva News

మహారాష్ట్రలో అనూహ్య పరిణామాలతో రాజకీయ సంక్షోభం నెలకొనే పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికార కూటమిలోని శివసేన పార్టీ ఎమ్మెల్యే, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్‌నాథ్‌ షిండే మరో 11 మంది ఎమ్యెల్యేలతో కలసి వేరు కుంపటి పెట్టి సంకీర్ణ ప్రభుత్వాన్ని సంక్షోభం వైపు తీసుకెళ్తున్నారు. గుజరాత్‌ సూరత్‌లోని ఓ హోటల్‌లో ఆయన ఎమ్మెల్యేలతో క్యాంప్‌ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అనధికార సమాచార ప్రకారం మరో ఐదుగురు స్వతంత్ర ఎమ్యెల్యేలతో పాటు 20 మందికి పైగా ఉన్నట్లు చెబుతున్నారు. థానేకు చెందిన ప్రముఖ నేతగా ఏక్‌నాథ్‌ షిండే ఆ ప్రాంతంలో శివ సేన బలోపేతానికి ఎంతో కృషి చేశారు. అయితే తన శాఖల్లో(అర్బన్‌ డెవలప్‌మెంట్‌తో పాటు పబ్లిక్‌ వర్క్స్‌) సీఎం ఉద్దవ్‌ థాక్రే, ఆయన తనయుడు టూరిజం మంత్రి అయిన ఆదిత్యా థాక్రేల జోక్యం ఎక్కువగా ఉండడంతో ఆయన రలిగిపోతున్నారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ నుంచి నిధుల కేటాయింపుల విషయంలోనూ షిండేతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు…

Read More

ప్రస్తుతం యోగా ప్రపంచం నలుమూలలా విస్తరించిందని, యోగా ఆత్మవిశ్వాసం కలిగించడంతో పాటు జీవన విశ్వాసం ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మైసూర్ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా ఫర్ హ్యుమానిటీ నినాదంతో ఈ ఏడాది ఉత్సవాలు జరుగుతున్నాయి.  ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ యోగాను గుర్తించిన ఐక్యరాజ్య సమితితో సహా ప్రపంచ దేశాలకు మోడీ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం యోగా ప్రపంచ నలుమూలలా విస్తరించిందని చెప్పారు.  కొన్నేళ్ల క్రితం ఇళ్లు, ఆధ్యాత్మిక కేంద్రాల్లోనే యోగా కనిపించేదని గుర్తు చేశారు.  కరోనా విపత్తు సమయంలోనూ యోగా నిర్వహించామని, సమాజంలో శాంతి నెలకొల్పుతుందని, సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. జీవన విధానానికి మార్గంగా నిలుస్తుందని ప్రధాని కొనియాడారు. వ్యక్తికే పరిమితం కాదని సక్రమంగా మానవాళికి ఉపయుక్తంగా ఉందని సూచించారు.  యోగా సందేశాన్ని సకల మానవాళికి చేరవేయాలని చెబుతూ  ఐక్యరాజ్యసమితి, ఇతర దేశాలు యోగా సందేశాన్ని చేరవేస్తున్నాయని తెలిపారు.…

Read More

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రి నుంచి సోమవారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. సోనియా గాంధీ జూన్ 12న కరోనా సమస్యలతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ‘కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం సాయంత్రం సర్ గంగారామ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.’ అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు. డిశ్చార్జ్ అయినప్పటికీ ఇంట్లోనే మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సోనియాకు సూచించినట్లు ఆయన తెలిపారు. కాగా మనీలాండరింగ్ కేసుకు సంబంధించి సోనియా గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరు కావాల్సి ఉంది జూన్ 8న ఆమెను ఈడీ ముందు హాజరు కావాలని అధికారులు కోరారు. అయితే జూన్ 1న సోనియాకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఈడీ నుంచి సమయం కావాలని కోరారు. ప్రస్తుతం ఆమె కోలుకోవడంతో జూన్ 23న ఏజెన్సీ ముందు హాజరు కావాలని సోనియా గాంధీకి ఈడీ తాజాగా సమన్లు జారీ చేసింది. మరోవైపు నాలుగో రోజైన…

Read More

బాసర ట్రిపుల్‌ఐటీలో విద్యార్థుల వారం రోజులుగా జరుపుతున్న ఆందోళనపై ప్రతిష్టంభన వీడింది. విద్యాశాఖ ఉన్నతాధికారులతో పాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా భారీ వర్షంలో గతరాత్రి వచ్చి చర్చించడం, నెలరోజుల్లో డిమాండ్లన్నీ నెరవేరుస్తమని హామీ ఇవ్వడంతో.. ఆందోళన విరమణకు విద్యార్థులు అంగీకరించారు. ఇప్పటికే నిర్మల్‌ కలెక్టర్‌ ముషరఫ్‌ అలీ, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు రెండుసార్లు విద్యార్థులతో చర్చించి విఫలమయ్యారు. తాజాగా సబితా ఇంద్రారెడ్డి సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు బాసర చేరుకున్నారు. ఆమెతోపాటు ఆర్జీయూకేటీ ఇన్‌చార్జి వీసీ రాహుల్‌ బొజ్జా, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.వేణుగోపాలాచారి, ముధోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, నిర్మల్‌ కలెక్టర్‌ ముషరఫ్‌ అలీ, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ఆర్జీయూకేటీ కొత్త డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సతీశ్‌కుమార్‌ తదితరులు క్యాంపస్‌కు వచ్చారు. తొలుత దాదాపు యాభై మంది విద్యార్థులతో అధికారులు చర్చించాక.. రాత్రి 10.25 గంటల సమయంలో మంత్రి సబిత వారితో మాట్లాడారు. సోమవారం…

Read More

తెలంగాణలో కేసీఆర్ స‌ర్కార్ నిరంకుశ పాల‌న‌ సాగుతోందని, ఏ ప‌థ‌కాన్ని స‌రిగ్గా అమ‌లు చేయ‌డం లేదనిధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యానికీ కోత పెట్టారని రూపాయికి కిలో బియ్యం కూడా సరిగా ఇవ్వడం లేదని, రేషన్ దుకాణాలకు సకాలంలో బియ్యం సరఫరా చేయకపోవడంతో పేదల కడుపు మాడుతోందని ఆమె విమర్శించారు.  సర్వర్ డౌన్, సిగ్నల్ ప్రాబ్లమ్స్, వేయింగ్, బయోమెట్రిక్ మెషీన్లు పనిచేయకపోవడం వంటి కారణాలతో రాష్ట్ర‌వ్యాప్తంగా వేలాది పేద కుటుంబాలు బియ్యం అందక తిప్పలు పడుతున్నాయని ఆమె పేర్కొన్నారు. రేషన్  దుకాణాల ద్వారా ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. కానీ గడువును 20వ తేదీ వరకు పొడిగించినా బియ్యం అందని పరిస్థితి నెలకొందని ఆమె తెలిపారు. ప్ర‌భుత్వం తీరు వ‌ల్ల ప్ర‌జ‌లే కాదు..డీల‌ర్లూ న‌ష్ట‌పోతున్నారని, రేషన్ దుకాణాలకు రావాల్సిన కోటాను ఆలస్యంగా ఇస్తుండడంతో డీల‌ర్లు ఇబ్బందులు పడుతున్నారని విజయశాంతి ధ్వజమెత్తారు. ప్రతి నెలా 1 నుంచి…

Read More

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయడానికి మహాత్మా గాంధీ  మానవుడు,  పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ తాజాగా నిరాకరించారు. ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రతిపాదించిన మాజీ ఉప ప్రధాని, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫారూఖ్ అబ్దుల్లా కూడా తిరస్కరించారు.  దానితో ప్రతిపక్దాలు ఏకగ్రీవంగా ప్రతిపాదించిన ముగ్గురు కూడా ఎన్నికలలో పోటీకి విముఖత చూపడంతో మరో అభ్యర్హ్డిని ఎంపిక చేయవలసి ఉంది. ఈ విషయమై మంగళవారం ప్రతిపక్ష నేతలు శరద్ పవార్ నేతృత్వంలో సమావేశం  అవుతున్నారు.   ఈ సందర్భంగా గోపాలకృష్ణ గాంధీ మాట్లాడుతూ.. దేశ అత్యున్నత పదవికి పోటీ చేయాలని చాలా మంది గొప్ప నేతలు తనను అడగడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే విషయాన్ని లోతుగా పరిశీలించిన తర్వాత రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థి విపక్షాల ఐక్యతతో పాటు యావత్ దేశ…

Read More

జులై 1 నుండి కేంద్ర ప్రభుత్వం నూతన టిడిఎస్‌ (మూలం నుండి పన్ను మినహాయింపు) నిబంధనలను ప్రవేశపెట్టనుంది. ఈ నూతన నిబంధనలతో సోషల్‌మీడియా మార్కెటింగ్‌, వైద్యులపై పన్ను భారం పడనుంది. సేల్స్‌ ప్రమోషన్‌ కోసం కొన్ని సంస్థలు ఆఫర్‌లను ప్రకటిస్తుంటాయి. వ్యాపారం నుండి పొందే ప్రయోజనాలపై (టిడిఎస్‌)ద్వారా పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నూతన టిడిఎస్ నిబంధనలతో వీటిపై కూడా పన్ను విధించనున్నారు. సంవత్సరంలో రూ.20 వేల కంటే అధిక ప్రయోజనాన్ని అందించే ఏ వ్యక్తి అయినా పది శాతం టిడిఎస్‌కి అర్హులని ప్రకటించింది. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ (సిబిడిటి) కొత్త నిబంధన వర్తింపుపై మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆదాయపు పన్ను చట్టం, 1961 కొత్త సెక్షన్‌, 194ఆర్‌ని కొత్తగా జత చేయడం ద్వారా టిడిఎస్‌ నిబంధనను ప్రవేశపెట్టింది. వ్యాపారం వృద్ధిలో భాగంగా కొన్ని కంపెనీలు వైద్యులకు అందించే ఉచిత మెడిసిన్‌ శాంపిల్స్‌తో పాటు…

Read More

తెలంగాణలోని ప్రతి పార్టీ కార్యకర్తను భాగస్వామిగా చేయడం ద్వారా జులై 2, 3 తేదీలలో హైదరాబాద్ లో జరుగనున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలను దిగ్విజయం చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా జులై 3 సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే బహిరంగ సభకు 10 లక్షల మందిని సమీకరించాలని ప్రయత్నం చేస్తున్నారు.  రాష్ట్రంలోని 34 వేల పోలింగ్ బూత్ కార్యకర్తలను, కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ది పొందిన వారితోపాటు సామాన్య ప్రజలు కూడా బహిరంగ సభకు తరలివచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్  తెలిపారు.  జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే హోటల్ నోవాటెల్ ను ఏర్పాట్ల స్టీరింగ్ కమిటీ సభ్యులతో పాటు సంజయ్ సందర్శించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.  ఎన్ఈసీ సమావేశ ఏర్పాట్ల జాతీయ ఇంఛార్జీ అరవింద్ మీనన్ తోపాటు మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్…

Read More

దక్షిణాదిలో కర్ణాటక తర్వాత పార్టీ అధికారం చేపట్టగల అవకాశాలు గల ఏకైక రాష్ట్రంగా తెలంగాణను భావిస్తున్న బిజెపి అగ్రనాయకత్వం ఈ విషయమై వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ప్రారంభించింది. తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ ను ఇటీవలే ఉత్తర ప్రదేశ్ నుండి రాజ్యసభకు పంపింది. ఏకంగా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను జులై 2,3 తేదీలలో హైదరాబాద్ లో జరుపనుంది.  ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలలో బిజెపి మాత్రమే రాజకీయ ప్రత్యామ్న్యాయం అనే సంకేతం రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం కోసం పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నది. మరోవంక, మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్యెల్యే ఈటెల రాజేందర్ ను కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించి, ఆదివారం రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై సమాలోచనలు జరపడం ప్రాధాన్యత సంతరింప చేస్తుకున్నది.  తెలంగాణాలో బిజెపి పట్ల ఆదరణ పెరుగుతున్నా క్షేత్రస్థాయిలో ప్రజలతో కలసి పనిచేసే నాయకత్వం మాత్రం అంతంత మాత్రంగా…

Read More

2025 నాటికి తెలంగాణలో పట్టణ జనాభా 50 శాతానికి చేరుకునే అవకాశం ఉందని, ఈ పట్టణీకరణ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే రెండున్నర దశాబ్దాల ముందుందని దేశ అత్యున్నత ప్రణాళిక సంస్థ నీతిఆయోగ్‌ ఓ నివేదికలో తెలిపింది. ప్రస్తుతం దేశంలోని పట్టణజనాభా జాతీయ సగటు మొత్తం జనాభాలో 31.16 శాతంగా ఉండగా,  తెలంగాణ మొత్తం జనాభాలో పట్టణ జనాభా 46.8 శాతంగా నమోదైందని నీతి ఆయోగ్‌ వెల్లడించింది. ఈ అంశంలో తెలంగాణ కంటే తమిళనాడు, కేరళ రాష్ట్రాలు మాత్రమే ముందున్నాయి. దేశంలో పట్టణీకరణ అధికంగా మూడు రాష్ట్రాలలో ఉంది. ఇందులో తమిళనాడు మొత్తం జనాభాలో సగటున 48.45 శాతం పట్టణ జనాభాను నమోదు చేస్తే కేరళలో 47.23 శాతం నమోదైంది. తెలంగాణ తర్వాత మహారాష్ట్ర 45.23 శాతంతో ఉంది. నగరాలను ఆర్ధిక వృద్ధి ఇంజన్‌లుగా పరిగణిస్తున్న నీతి ఆయోగ్‌ పట్టణ ప్రాంతాల్లో ఆర్ధిక కార్యకలాపాల ప్రభావం వాటి చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఉపాధి ఆదాయ స్థాయిలలో బహుళ…

Read More