మాజీ సైనికులు సహా వివిధ వర్గాలతో దాదాపు రెండేళ్లపాటు విస్తృత స్థాయి చర్చలు జరిపిన తర్వాతే అగ్నిపథ్ పధకాన్ని ఏకాభిప్రాయంతో తీసుకువచ్చామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. కేవలం రాజకీయ కారణాలతోనే తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సైనికుల నియామక ప్రక్రియలో ఈ పథకం విప్లవాత్మక మార్పులను తీసుకు వస్తుందని చెప్పారు. ఈ పథకం కింద రక్షణ దళాల్లో నియమితులయ్యే వారికి శిక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. దీని గురించి తప్పుడు అపోహలను కొంతమంది ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది కొత్త పథకం కాబట్టి కొందరిలో కొంత అయోమయం ఉండవచ్చని పేర్కొన్నారు. దేశం పట్ల ప్రజలకు క్రమశిక్షణా భావం, గౌరవభావం ఉండాలని తాము కోరుకుంటున్నామని చెబుతూ దేశంలోని సైనికుల ఆత్మస్థైర్యం దిగజారేలా చేద్దామా? అని ఆయన రాజకీయ పార్టీల నిరసనలను ప్రస్తావిస్తూ ప్రశ్నించారు. ఈ పథకం కింద నియమితులయ్యే వారికి రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పారా…
Author: Editor's Desk, Tattva News
సికింద్రాబాద్ అల్లర్లలో రూ.12 కోట్ల ఆస్తినష్టం జరిగిందని డివిజనల్ మేనేజర్ గుప్తా వెల్లడించారు. నిన్న జరిగిన ఘటనపై డిఎం శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. రైలు ఇంజిన్లు 5, 30 బోగీలు ధ్వంసమయ్యాయని తెలిపారు. రైళ్ల రద్దుతో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని రైల్వే డిఎం గుప్తా పేర్కొన్నారు. రైళ్లలో తరలిస్తున్న ప్రయాణికుల సామాగ్రి భారీగా ధ్వంసమైందని డిఎం వెల్లడించారు. పార్సిల్ కార్యాలయం పూర్తిగా ధ్వంసమైందన్నారు. పూర్తిస్థాయి నష్టం అంచనా వేస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయని గుప్తా చెప్పారు. పవర్ కార్(డీజిల్ ట్యాంకర్)కు భారీ ప్రమాదం తప్పిందని డిఎం స్పష్టం చేశారు. పవర్ కారుకు మంటలంటుకుంటే భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం అన్ని రైల్వే గూడ్స్ ను పునరుద్ధరణ చేశామన్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్ లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. 52 మంది అరెస్ట్ ఇలా ఉండగా, సికింద్రాబాద్ అల్లర్ల ఘటనలో 52…
ప్రముఖ సింగర్ శ్రీ రామచంద్ర హోస్ట్ గా చేస్తున్న ఇండియన్ ఐడల్ ఫినాలే ఎపిసోడ్‌లో వాగ్ధేవి విజేతగా నిలిచింది. మెగాస్టార్ చేతుల మీదుగా ట్రోఫీని అందుకుని మొదటి తెలుగు ఇండియన్ ఐడల్‌గా నిలిచింది. ట్రోఫీతో పాటు వాగ్దేవికి రూ.10 లక్షల బహుమానం, గీతా ఆర్ట్స్ నుండి రానున్న సినిమాలో పాట పాడే అవకాశం కూడా వచ్చింది. మొదటి రన్నరప్‌గా నిలిచిన శ్రీనివాస్‌కు 3 లక్షలు, రెండవ రన్నరప్‌గా నిలిచిన వైష్ణవికి 2 లక్షల బహుమానం ఇచ్చారు. అంతేకాకుండా చిరంజీవి తన తదుపరి సినిమా ‘గాడ్‌ఫాదర్’లో వైష్ణవికి పాట పాడే అవకాశం ఇచ్చారు. సింగర్ కార్తిక్ తను సంగీతం అందించనున్న నెక్స్ట్ సినిమాలో వాగ్దేవికి ఛాన్స్ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వాగ్దేవి తన సంతోషాన్ని..ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ షోని ఆహా సంస్థ రియాలిటీ నిర్వహించి.. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టాలెంటెండ్ సింగర్స్‌కు గొప్ప అవకాశాన్ని కల్పించింది. ఈ షోలో సంగీత దర్శకుడు…
అగ్నిపథ్ లో పథకం ఎవ్వరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేస్తూ ఇందులో చేరడం అదనపు అర్హత మాత్రమే అని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వివరణ ఇచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలిసి శుక్రవారం అక్కడ నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. కుట్రపూరితంగానే అగ్నిపథ్ పై ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా విధానం మెక్సికో, సింగపూర్, థాయిలాండ్ దేశాల్లో అమల్లో ఉందని ఆయన గుర్తు చేశారు. భారత్ లో కూడా ఇది తప్పనిసరి కాదని చెబుతూ దేశ భక్తి, నైపుణ్యం పెంచే ప్రయత్నం ఈ పథకం ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. స్వచ్ఛందంగా ఇష్టపడే వాళ్లే చేరవచ్చని వెల్లడించారు. ఆందోళనల ఫలితంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని కేంద్ర మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి ఆందోళనకారులు ధర్నా చేస్తుంటే పోలీసులు…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ శనివారం తన 100వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా గాంధీనగర్‌లోని ఆమె నివాసంలో తన తల్లి హీరాబెన్ మోదీని కలిసి, కాళ్లను కడిగిన మోదీ ఆ నీళ్లను కళ్లకు అద్దుకున్నారు. అనంతరం తల్లికి మిఠాయిలు తినిపించిన ప్రధాని మోదీ ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. మరోవైపు హీరాబెన్ మోదీ 100 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నారు. ఆమె తన చిన్న కొడుకు పంకజ్ తో కలిసి గాంధీనగర్‌లో నివసిస్తోంది. 100 ఏళ్ల వయస్సులో కూడా హీరాబెన్‌కు ఎలాంటి వ్యాధి లేదు. ఆమె సాధారణ ఆహారాన్ని ఇష్టపడుతుంటారు. అదే ఆమె ఆరోగ్య రహస్యం కావచ్చు. ప్రధాని మోదీ తల్లి ప్రత్యేకమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడరు. తాను తినే ఆహారాన్ని తానే వండుకోవడానికి ఇష్టపడుతుంటారని సమాచారం. ఎక్కువ మసాలా, నూనె ఉన్న ఆహారాన్ని ఆమె తీసుకోరు. అన్నం, కిచిడి, చపాతి, పప్పు వంటివి ఆమె ఆహారంలో ఉంటాయి.…
జమ్ముకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను ఈ ఏడాది చివరలో నిర్వహించే అవకాశముందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం సూచనప్రాయంగా వెల్లడించారు. కేంద్ర మంత్రి ప్రస్తుతం జమ్ముకాశ్మీర్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. జమ్ములోని పహల్గామ్ రిసార్ట్‌లోని జవహర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ అండ్ వింటర్ స్పోర్ట్స్‌లోని హిమాలయన్ మ్యూజియాన్ని రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జమ్ముకాశ్మీర్‌లో పునర్వవిభజన ప్రక్రియ ఇటీవలే పూర్తయిందని, కాశ్మీర్‌లో 47 స్థానాలు, జమ్ములో స్థానాలు 43 నుంచి 90కి పెరిగాయని చెప్పారు. ‘ఈ ఏడాది చివరికల్లా జమ్ముకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. సైనిక భద్రతా సంసిద్ధతను సమీక్షించేందుకు జమ్ముకాశ్మీర్‌లో పర్యటిస్తున్న రాజ్‌నాథ్ కల్నల్ కెఎస్‌మాల్ బౌల్డర్ క్లైంబింగ్ వాల్‌ను కూడా ప్రారంభించినట్లు అధికార ప్రతినిధి తెలిపారు. అలాగే, దేశంలోని ప్రీమియర్ పర్వతారోణ సంస్థ యొక్క కార్యనిర్వాహక మండలి, జనరల్ బాడీ సమావేశాల్లోనూ మంత్రి…
ఎన్నికల్లో ఒక అభ్యర్థి రెండు సీట్ల నుంచి పోటీ చేయరాదనే ప్రతిపాదనను ఎన్నికల సంఘం మరోమారు ప్రస్తావించింది. పలు స్థానాల పోటీ నిషేధంపై నిర్ణయం తీసుకునే దిశలో కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సి ఉందని ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ సూచించారు. అయితే ఎన్నికల విధానంలో సంస్కరణల ప్రక్రియలో ప్రధానమైన ఈ అంశం కొత్తదేమీ కాదు. 2004లోనే ఈ ప్రతిపాదన వచ్చింది. ఒక్క అభ్యర్థి పలు లేదా రెండు స్థానాల నుంచి పోటీకి దిగడం ఎన్నికల సక్రమ ప్రక్రియకు ఎంతవరకు దోహదం చేస్తుందనే ప్రశ్నను ఎన్నికల సంఘం ప్రస్తావించింది. ఈ అంశాన్ని ఇప్పుడు ఎన్నికల ప్రధానాధికారి న్యాయ మంత్రిత్వశాఖకు చెందిన లెజిస్లేటివ్ కార్యదర్శితో జరిపిన ఇష్టాగోష్టిలో చర్చించారు. ఒక అభ్యర్థి రెండు చోట్ల నుంచి పోటీకి దిగడం రెండుచోట్లా గెలిస్తే రాజీనామా చేయడం, ఉప ఎన్నికకు దారితీయడం వంటి పరిణామాలు తలెత్తుతున్నాయి. అభ్యర్థి ఒక్క సీటు పోటీ అంశం కార్యరూపం దాల్చకపోతే, ఉప…
గూఢచర్యం కేసులో విచారణ కోసం వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజెను అమెరికాకు అప్పగించడానికి బ్రిటీష్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులపై బ్రిటన్ హోం మంత్రి ప్రీతి పటేల్ సంతకాలు చేశారు. బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయాన్ని పై కోర్టులో అసాంజె అప్పీల్ చేయనున్నారని వికీలీక్స్ ప్రకటించింది. అసాంజె దీనిపై అప్పీల్ చేయాల్సి వుంటుంది. అసాంజెను అమెరికాకు అప్పగించవచ్చని ఏప్రిల్‌లో బ్రిటీష్ కోర్టు ఇచ్చిన రూలింగ్‌ను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోం శాఖ తెలిపింది. ఆనాడు అసాంజె అప్పగింతను ఆమోదిస్తూ బ్రిటీష్ న్యాయమూర్తి, తుది నిర్ణయాన్ని మాత్రం ప్రభుత్వానికే వదిలివేశారు. ”పోరాడేందుకు ఈ రోజు ఆఖరు కాదు, కొత్త చట్టపరమైన పోరాటానికి ఇదొక ప్రారంభం మాత్రమే. చట్టపరంగానే అప్పీల్ చేస్తాం.” అని వికీలీక్స్ ట్విట్టర్‌లో పేర్కొంది. అసాంజెను అమెరికాకు అప్పగించడం అణచివేత చర్యగా, అన్యాయమైనదిగా, అప్పగింత క్రమాన్ని దుర్వినియోగం చేసేదిగా బ్రిటన్ కోర్టులు భావించడం లేదని హోం శాఖ…
‘అగ్నిపథ్‘ నిరసనలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అట్టుడుకుపోయే విధంగా ముందుగానే ఓ ‘రైల్వే స్టేషన్ బ్లాక్ ‘పేరుతో వాట్సాప్‌లో ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేసి.. సమాచారాన్ని షేర్ చేసుకున్నట్లు పోలీస్ విచారణలో వెల్లడైనది. గురువారం రాత్రే సుమారు 500 మంది నిరసనకారులు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. రైళ్లను ఆపేసి ఆందోళన వ్యక్తం చేయాలనుకున్నారు. ఈ క్రమంలో తొలుత స్టేషన్ బయట ఆందోళనలు చేపట్టిన యువత.. బస్సు అద్దాలు పగుల గొట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం స్టేషన్‌లోకి చొచ్చుకు వచ్చిన యువత అక్కడ విధ్వంసం సృష్టించినట్లు తెలుస్తోంది. ప్లాట్‌ఫాంలపై స్టాళ్లను పగులగొట్టడం, అక్కడే నిలిపి ఉంచిన రైళ్ల అద్దాలు పగుల కొట్టడం వంటి చర్యలకు దిగారు. రైల్వే పార్శిల్స్ విభాగం వద్ద ఉన్న సంచులను పట్టాలపై వేసి తగులబెట్టారు. ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు నిప్పు పెట్టడంతో హింస చెలరేగింది. వీరిని నిలువరించేందుకు పోలీసులు లాఠీఛార్జ్, భాష్పవాయువును ప్రయోగించారు. ఆందోళనలు సద్దుమణగకపోవడంతో గాల్లోకి రైల్వే…
కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నప్పటికీ ఇప్పటికీ కరోనా అనంతర రుగ్మతలతో పలువురు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ లక్షణాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 34 దేశాల్లో 700 మంది పిల్లలు అక్యూట్ హెపటైటిస్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ఈ వ్యాధితో పదిమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని ప్రకటించింది. ఈ అక్యూట్ హెపటైటిస్‌కు సంబంధించిన మొదటి కేసు బ్రిటన్‌లో బయటపడింది. ఈ ప్రమాదకర కాలేయ వ్యాధికి కారణం అంతుచిక్కడం లేదు. సాధారణంగా హెపటైటిస్‌కు హెపటైటిస్- ఎ, బి, సి, డి, ఇ అనే ఐదు వైరస్‌లు కారణమవుతాయి. కానీ ఈ అక్యూట్ హెపటైటిస్ కేసుల్లో ఈ వైరస్‌లు కనిపించలేదు. దీంతో ఇది పోస్ట్ కొవిడ్ లక్షణమని పరిశోధకులు తేల్చారు. ఇజ్రాయెల్‌కు చెందిన టెల్ అవీవ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కరోనా నుండి కోలుకున్న ఐదుగురు చిన్నారులపై అధ్యయనం నిర్వహించారు. ఈ పరిశోధనా ఫలితాలు…