ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్‌లో ఘటనలే కలకలం సృష్టిస్తున్న జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులకు ప్రేరణ కలిగించాయా? అవుననే చెబుతున్నారు అందులో ప్రధాన నిందితులు. పోలీస్ విచారణలో ఈ విషయం వారు వెల్లడించినట్లు తెలిసింది. పైగా, మైనర్ నిందితుల్లో నేరం చేశామనే ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదని పోలీసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కరడుగట్టిన నేరస్థులు కూడా.. పోలీసు కస్టడీ, సీన్ రీ-కన్‌స్ట్రక్షన్, ఉన్నతాధికారులు విచారణకు జంకుతారని, కానీ ఈ కేసులో మైనర్లు మాత్రం వీవీఐపీల పిల్లలు కావడంతో, తమకున్న పలుకుబడి కారణంగా తమను ఎవ్వరు ఏమీ చేయలేరన్న ధీమా కావచ్చు వారంతా తాపీగా ఉన్నట్లు తెలిసింది. ఎలాంటి కలవరం, తప్పుచేశామనే బాధ లేకుండా, తమలోతాము పరస్పరం నిందలు వేసుకుంటున్నారని సమాచారం. పోలీసు కస్టడీలో విచారణ సందర్భంగా.. ‘‘దొరికిపోతామనుకోలేదు’’ అని చెబుతూ.. కార్పొరేటర్ కుమారుడు, సాదుద్దీన్‌లదే తప్పని చెబుతూ.. పరస్పరం ఒకరిపై మరొకరు నిందలు వేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఐదుగురు మైనర్ నిందితులకు…
Author: Editor's Desk, Tattva News
ఊహాగానాలకు స్వస్తి పలుకుతూ జూలై 18న జరగనున్న రాబోయే రాష్ట్రపతి ఎన్నికలకు తాను అభ్యర్థిని కాదని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశారు. “నేను రాష్ట్రపతి రేసులో లేను” అని ప్రకటించారు. ఆయన సారధ్యం వహిస్తున్న జెడి(యు) నేతలు గత నాలుగు నెలలుగా భారత రాష్ట్రపతి పదవికి అందరికి ఆమోదయోగ్యం కాగల అభ్యర్థిగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరును ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను ఇటీవల ప్రకటించిన తర్వాత, ఆ పార్టీ శిబిరం నుండి ఈ మేరకు ప్రకటనలు వెలువడ్డాయి. ఆ పార్టీకి చెందిన బీహార్ మంత్రి శ్రవణ్ కుమార్ జూన్ 9న ఒక టీవీ ఛానెల్‌తో ఇలా అన్నారు: “నితీష్ కుమార్‌కి అద్భుతమైన పార్లమెంటరీ, శాసనసభ కెరీర్ ఉంది. ఆయన భారత రాష్ట్రపతికి మంచి అభ్యర్థి కావచ్చు. అలా జరిగితే మనమందరం చాలా గర్వపడతాం. ఇది బీహార్‌కు కూడా గర్వకారణం”. అయితే, శనివారం మరో అదే పార్టీకి…
కరోనా వంటి మహమ్మారులు, ఆహార కొరత, వాతావరణ మార్పులు, ప్రాంతీయ ఘర్షణలు వంటి పలు సంక్షోభాలను ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్నాయని డబ్ల్యుటిఓ డైరెక్టర్ జనరల్ నగొజి ఒకొన్జొ-ఇవెలా పేర్కొన్నారు. ఈ కష్టాలు, ఇబ్బందులను అధిగమించి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో కోలుకునేలా అందరం కలిసికట్టుగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. జెనీవాలోని డబ్ల్యుటిఓ ప్రధాన కార్యాలయంలో ఆదివారం డబ్ల్యుటిఓ 12వ మంత్రిత్వ స్థాయి సమావేశం ప్రారంభమైంది. రెండేళ్లకోసారి జరిగే ఈ సమావేశాల్లో 164 సభ్య దేశాలకు చెందిన వాణిజ్య మంత్రులు, ఇతర సీనియర్ అధికారులు పాల్గంటున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో వాణిజ్య సంఘాల ప్రతినిధులు, సభ్యులు కోవిడ్ వ్యాక్సిన్లకు ట్రిప్స్ (వాణిజ్య సంబంధిత అంశాల మేథోసంపత్తి హక్కులు) రద్దు, కరోనాపై పోరు, మత్స్య రాయితీలు, వ్యవసాయం, ఆహార భద్రత వంటి అంశాలపై చర్చిస్తారు. దీనితో పాటు డబ్ల్యుటిఓ సంస్కరణలు, భవిష్యత్తులో దాని ప్రాధాన్యతలపై కూడా…
మనీలాండరింగ్ కేసులో అరెస్టైన ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌కు అక్కడి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కాగా, ఆయన బెయిల్ పిటిషన్‌పై మంగళవారం ఢిల్లీ కోర్టు వాదనలు విననుంది. కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్ లావాదేవీల కేసులో మే 30న సత్యేంద్ర జైన్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 2015-16లో హవాలా నెట్‌వర్క్ ద్వారా జైన్ కంపెనీలకు, షెల్ కంపెనీల నుంచి సుమారు రూ. 4.81కోట్ల వరకు ముట్టినట్టు ఈడీ దర్యాప్తులో గుర్తించింది. రెండు నెలల క్రితం సత్యేందర్, ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ, ఇటీవల ఆయనను అరెస్టు చేసింది. జైన్‌ను కోర్టులో ప్రవేశ పెట్టగా జూన్ 9వరకు న్యాయస్థానం ఈడీ కస్టడీకి అనుమతించింది. విచారణ కోసం మరో ఐదు రోజులు అనుమతించాలని ఈడీ కోరగా, దాన్ని జూన్ 13 వరకు పొడిగించింది.…
మనదేశంలో బెట్టింగ్, గ్యాబ్లింగ్‌లు చట్టరిత్యా నేరం. అయితే వాటిని ప్రోత్సహించడం వల్ల యువత తప్పుదారి పట్టడమే కాకుండా, సామాజిక ఆర్థిక ప్రమాదాలు తలెత్తే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అడ్వైజరీ తెలిపింది. అందుకే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అండ్ ఆన్‌లైన్ మీడియా సంస్థలు సంబధిత యాడ్స్‌ను ప్రసారం చేయకూడదని స్పష్టం చేసింది. అంతేకాదు థర్డ్ పార్టీ ఆన్‌లైన్ అడ్వటైజ్మెంట్ సంస్థలు, పబ్లిషర్లు బెట్టింగ్, గ్యాబ్లింగ్ యాడ్స్‌తో ఇండియన్ యూజర్లను టార్గెట్ చేయడం నిలిపివేయాలని విడుదల చేసిన స్పష్టం చేసింది. ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్,ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ (ఎఫ్‌ఐఎఫ్‌ఎస్) ప్రకారం..38 శాతం వార్షిక వృద్ధితో 2025 నాటికి ఈ ఫ్యాంటసీ స్పోర్ట్స్ మార్కెట్ విలువ రూ.1.5లక్షల కోట్లుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, కేంద్రం తాజా నిర్ణయం త్వరలో పూర్తి స్థాయిలో అమలు కానుంది. దీంతో 4.5 బిలియన్ డాలర్ల…
ఓ రేవ్ పార్టీలో డ్రగ్స్ సేవించిన బాలీవుడ్ సీనియర్ నటుడు శక్తికపూర్ కుమారుడు సిద్ధార్థకపూర్ ను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని ఎంజీ రోడ్డులో రేవ్ పార్టీ జరుగుతున్న హోటల్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. సుమారు 35 మంది నుంచి నమూనాలు తీసుకుని ల్యాబ్ కు పంపించారు. అందులో సిద్ధార్థ కపూర్ సహా ఆరుగురు డ్రగ్స్ సేవించినట్టు పరీక్షల్లో తేలింది. డ్రగ్స్ సేవించి పార్టీకి వచ్చారా.. లేక హోటల్లో పార్టీకి వచ్చిన తర్వాత డ్రగ్స్ సేవించారా.. ఎక్కడి నుంచి వీరికి డ్రగ్స్ సరఫరా అయ్యాయి..తదితర కోణాల్లో పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. “సిద్ధార్థ కపూర్ డ్రగ్స్ సేవించినట్టు పరీక్షలో పాజిటివ్ వచ్చింది. అతడ్ని ఉల్సూర్ పోలీసు స్టేషన్ కు తరలించాం’’ అని బెంగళూరు ఈస్ట్ డివిజన్ డీసీపీ భీమశంకర ఎస్ గులేద్ తెలిపారు. హీరోయిన్ శ్రద్ధా కపూర్ సోదరుడే సిద్ధార్థ కపూర్. 2020లో వచ్చిన వెబ్ సిరీస్ భౌకాల్ లో…
బిజెపి అభ్యర్ధికి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని రాష్ట్రపతి ఎన్నికలలో నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిపక్షాలు మాజీ ఉప ప్రధాని, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ అభ్యర్థి అయితే పలు ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చే అవకాశం లేదని స్పష్టం కావడంతో పవార్ అయితే అందరికి ఆమోదయోగ్యంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికలలో పోటీ చేయడానికి శరద్ పవార్ కూడా సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ అధినేత సోనియాగాంధి ప్రతినిధిగా కలిసిన రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేకు పవార్ తన సమ్మతిని వ్యక్తం చేసిన్నల్టు చెబుతున్నారు. వాస్తవానికి ఆయన ఆదివారం సోనియా గాంధీతో భేటీ కావలసి ఉంది. అయితే ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో సాధ్యం కాలేదు. మరోవంక, ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ సహితం ఆదివారం పవార్ ను కల్సి ఎన్నికలలో పోటీచేయవలసిందిగా అభ్యర్ధించారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆయన అభ్యర్థిత్వం పట్ల సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. టిఎంసి అధినేత్రి మమతా…
నుపుర్ శర్మ చేసిన వాఖ్యల సాకుతో రాష్ట్రంలో అల్లర్లకు పాల్పడిన వారికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చుక్కలు చూపిస్తున్నది. ప్రయాగ్‌రాజ్, కాన్పూర్ తదితర ప్రాంతాల్లో శుక్రవారం మసీద్ లో ప్రార్ధనల అనంతరం విధ్వంస చర్యలకు పాల్పడినవారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం ప్రారంభించింది. ఈ ఘటనలతో సంబంధం ఉన్న వ్యక్తుల ఆస్తులను అధికారులు వరుసగా రెండో రోజూ ధ్వంసం చేశారు. శనివారం బుల్డోజర్లతో వెళ్లి నిందితుల అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు.. ఆదివారం కూడా ఆ పనిని కొనసాగించారు. ప్రయాగ్‌రాజ్ అల్లర్ల సూత్రధారి అయిన జావేద్ అహ్మద్ అక్రమంగా నిర్మించిన ఇంటిని కూల్చివేశారు. మే 10న నోటీసులు ఇచ్చామని, మే 24న సమాధానమిస్తానన్న జావేద్ స్పందించకపోవడంతో మే 25న కూల్చివేత ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జావేద్ ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నాడు. షహరాన్‌పూర్‌లో ఇద్దరు నిందితుల అక్రమ నిర్మాణాలను కూడా బుల్డోజర్లతో కూల్చివేశారు. యూపీలో ఆందోళనకారులపై ఇద్దరు పోలీసులు లాఠీలు ఝళిపిస్తున్న 30 సెకన్ల…
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని సర్పంచ్ లకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఎన్డీఏ పాలనకు ఎనిమిదేళ్ల పూర్తయిన సందర్భంగా పంచాయతీ సర్పంచ్‌లకు మోదీ ఓ లేఖ వ్రాస్తూ ఈ ఎనిమిదేళ్లలో గ్రామస్థాయిలో వారందించిన సహకారాన్ని, చేసిన సేవల్ని కొనియాడారు. మానవత్వం కోసం యోగా అనే థీమ్‌తో ఈ ఏడాది నిర్వహిస్తున్న యోగా డేని సర్పంచులు తమ, తమ గ్రామాల్లో ఏదైనా పురాతన పర్యాటక కేంద్రాన్ని లేదంటే నదీ తీరంలో నిర్వహించాలని గ్రామంలో ప్రతీ ఒక్కరూ యోగా చేసేలా ప్రోత్సాహించాలని ప్రధాని ఆ లేఖలో పేర్కొన్నారు. యోగా డే రోజు తీసిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకొని ఇతరుల్లో స్ఫూర్తి నింపాలని సూచించారు. పంచాయతీలకు సాధికారత కల్పించి గ్రామస్వరాజ్యం సాధించడంలో ఎనిమిదేళ్లలో భారత్ కొత్త మైలురాళ్లను అధిగమించిందని ప్రధాని తెలిపారు. కేంద్రం చేపడుతున్న సంక్షేమ పథకాల ఫలాలు అందరికీ చేరేలా కృషి చెయ్యాలని సర్పంచులకు ఆయన పిలుపునిచ్చారు. 75 ఏళ్ల…
జూబ్లీ హిల్స్‌లో జరిగిన సంఘటనపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం స్పందించక పోవడం వల్లే రాష్ట్రం లో బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అత్యాచారాలకు పాల్పడుతున్న ఎంఐఎం, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులకు సంబంధించిన వారి వీపులను ప్రజలు త్వరలోనే పగలగొడతారని హెచ్చరించారు. ఆదివారం ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్‌లో 5 రోజుల కిందట అత్యాచారానికి గురైన మైనర్ బాలిక కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర మహిళా నాయకులతో కలసి సంజయ్ పరామర్శించారు. తెలంగాణలో బాలికలకు, పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. నేరస్థులను ఎలా కట్టడి చేయాలో ఉత్తర్‌ప్రదేశ్ వెళ్లి తెలుసుకోవాలని సంజయ్ సీఎం కేసీఆర్‌కు హితవు చెప్పారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సలహాలు తీసుకుని, తెలంగాణలో అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అత్యాచారాల నియంత్రణపై చిత్తశుద్ధి ఉంటే, నేరస్థుల పాలిట సింహస్వప్నంగా మారిన యోగిని స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. నేరాల పట్ల కఠినంగా వ్యవహరించక పోవడం, ఘటన జరిగిన…