Author: Editor's Desk, Tattva News

అన్నయ్య చిరంజీవి కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని జనసేన పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు స్పష్టం చేశారు. కేవలం సినీ రంగం,వారి సమస్యలకే పరిమితమవుతున్నారని చెప్పారు.  మెగా ఫ్యాన్స్‌ ఎవరితో ఉండాలన్నది వారి వ్యక్తిగత విషయమని అంటూ వారంతా జనసేన వైపే ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.  మూడు రోజులుగా ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటిస్తున్న ఆయన, విశాఖలోని జనసేన ప్రాంతీయ కార్యాలయంలో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ .తాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఎంపీ,ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లేదని, ,కేవలం పార్టీ పటిష్టతకు ఏమి ఆశించకుండా పనిచేస్తానని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసం పాదయాత్రలు చేసే అవకాశం లేదని, ఆ తరహాలోనే ఏదైనా యాత్ర చేపట్టే అవకాశముందని నాగబాబు తెలిపారు. ఎన్నికల జరుగుతాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే బూత్‌ కమిటీల నియామకంతో పాటు, పార్టీ నాయకులను పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ తాము…

Read More

ప్రేమ వివాహాలు అంటేనే చాలామందికి గుర్తుకు వచ్చేది ఆర్య సమాజ్. ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోని సందర్భంలో ఆర్యసమాజ్ కు వెళ్లి పెళ్లి చేసుకోవడం సర్వసాధారణమైంది. పెళ్లి అనంతరం ఆర్యసమాజ్ ఇచ్చే సర్టిఫికెట్లు చట్టపరంగా చెల్లుబాటు అవుతున్నాయి. అయితే ఆర్య స‌మాజ్‌లో జ‌రిగే వివాహాలపై సుప్రీంకోర్టు శుక్రవారం సంచ‌ల‌న తీర్పును వెలువ‌రించింది. ఆర్య స‌మాజ్‌లో జ‌రిగే పెళ్లిళ్లు, ఆ సంస్థ ఇస్తున్న స‌ర్టిఫికెట్లను గుర్తించ‌బోమ‌ని తెలిపింది. పెళ్లిళ్లు చేయడం ఆర్య సమాజ్ పని కాదని జస్టిస్ అజయ్ రస్తోగి, బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. సమర్థవంతమైన ప్రభుత్వ అధికారులు మాత్రమే వివాహ ధ్రువీకరణ పత్రాలను జారీ చేయగలరని సుప్రీం స్పష్టం చేసింది. ఆర్య స‌మాజ్ ఉన్నది పెళ్లిళ్లు చేయ‌డానికి కాద‌న్న సుప్రీంకోర్టు కుల, మ‌తాల‌కు అతీతంగా ప్రేమించుకున్న యువ‌త పెద్దల అంగీకారం లేక‌పోవ‌డంతో నేరుగా ఆర్య స‌మాజ్‌ను ఆశ్రయిస్తున్నారని చెప్పింది. అలా వచ్చిన యువ జంట‌ల‌కు ఆర్య స‌మాజ్ పెళ్లిళ్లు చేస్తోందని, ఇలా జ‌రిగిన పెళ్లిళ్లపై…

Read More

ఆసియాలో అత్యంత ధనవంతుడిగా మళ్లీ ముఖేశ్ అంబానీ స్థానం దక్కించుకున్నారు. భారత కుబేరుల జాబితాలో తొలిస్థానం కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ అంబానీ, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ పోటీ పడుతున్నారు.  సుదీర్ఘకాలం పాటు భారత కుబేరుడిగా అగ్రస్థానంలో కొనసాగిన అంబానీని, కొన్ని నెలల క్రితం అదానీ వెనక్కి నెట్టారు. అదానీ గ్రూపు కంపెనీ షేర్లు అనూహ్యంగా రాణించడమే అందుకు కారణం. తాజాగా (జూన్ 3న) అదానీని అంబానీ వెనక్కి నెట్టారు. దీంతో భారత్ తో పాటు ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా ముఖేష్ అంబానీ నిలిచారు.  బ్లూమ్ బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం ముఖేశ్ అంబానీ 99.7 బిలియన్ డాలర్లతో ప్రపంచ కుబేరుల జాబితాలో 8వ స్థానంలో ఉన్నారు. 2022లో ఆయన సంపద 9.69 బిలియన్ డాలర్లు ఎగబాకింది. అదే జాబితాలో అదానీ 98.7 బిలియన్ డాలర్లతో  9వ స్థానంలో కొనసాగుతున్నారు. భారత కుబేరుల…

Read More

భారత్‌లో విపరీతంగా పెరిగిపోతున్న వాయుకాలుష్యం చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్టు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. వాయు కాలుష్యం కారణంగా చిన్నారులు శ్వాస సంబంధిత సమస్యలతోపాటు ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారని తేలింది. అహ్మదాబాద్‌లో వాయు కాలుష్యం కారణంగా దాదాపు 21 శాతం మంది ఈ సమస్యలతో బాధపడుతున్నట్టు అధ్యయనం పేర్కొంది. మొత్తంగా 12,635 మంది చిన్నారుల్లో 2,682 మంది చిన్నారులు వాయు కాలుష్యం కారణంగా ఈ సమస్యలు ఎదుర్కొంటున్నట్టు వివరించింది. ముఖ్యంగా ఆరేళ్లలోపు చిన్నారుల్లో శాస్వ సంబంధిత సమస్యలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా గాలిలో ధూళి కణాల (పీఎం 2.5)కు గురైనప్పుడు పెద్దలకంటే శిశువులు, చిన్నారులే ఎక్కువగా రుగ్మతలకు గురవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇందుకు కారణం చిన్నారులు, పిల్లల్లో ఊపిరితిత్తులు బలహీనంగా ఉంటాయని, వాయు మార్గాలు చిన్నగా ఉంటాయని, అలాగే, చాతీ గోడలు బలహీనంగా ఉండడమేనని అధ్యయనకారులు చెబుతున్నారు. రోగ నిరోధకశక్తి కూడా వారిలో అంతంత మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు.…

Read More

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ తర్వాత ఆమె తనయ ప్రియాంక గాంధీకి కూడా శుక్రవారం కరోనా సోకింది. తనకు తేలికపాటి లక్షణాలతో కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలిందని ప్రియాంక గాంధీ శుక్రవారం ట్వీట్ చేశారు. కరోనా మార్గదర్శకాల ప్రకారం తాను హోం క్వారంటైన్‌లో ఉన్నానని ప్రియాంక పేర్కొన్నారు. తనను కలిసిన వారు, పరిచయం ఉన్నవారు కూడా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రియాంక గాంధీ సూచించారు. బుధవారం సాయంత్రం సోనియాగాంధీకి స్వల్ప జ్వరం వచ్చిందని, కొన్ని కరోనా లక్షణాలు ఉండడంతో గురువారం ఉదయం ఆమెకు కరోనా పరీక్ష చేశారు. ఆ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా వెల్లడించారు. ప్రస్తుతం సోనియా ఐసొలేషన్‌లో ఉన్నారని, ఆమెకు అవసరమైన వైద్య సహాయం అందుతోందని తెలిపారు. గత వారం రోజులుగా సోనియా పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుసుకున్నారని, వారిలో కూడా కొందరికి కరోనా పాజిటివ్‌…

Read More

కేంద్ర ప్రభుత్వ పాలనలో ఉన్న జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద దాడులు, ముఖ్యంగా లక్షిత హత్యలు కొనసాగుతూ ఉండడం, కాశ్మీరీ పండిట్లు, ఇతర హిందువులను ఎంపిక చేసి కాల్చిపారవేస్తూ ఉండడంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తున్నది. బ్యాంక్‌ మేనేజర్‌ హత్యను మర్చిపోకముందే.. ఉగ్రవాదులు మరో అఘాయిత్యానికి పాల్పడ్డారు. కాశ్మీర్‌లోని బుద్గాంలో గురువారం రాత్రి ఇద్దరు వలస కూలీలపై కాల్పులు జరిపారు. ఓ వలస కూలీ మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. క్షతగాత్రుడ్ని ఆసుపత్రికి తరలించారు. సెంట్రల్‌ కాశ్మీర్‌ జిల్లాలోని చదూరా ప్రాంతంలోని మాగ్రేపోరా వద్ద ఇటుక బట్టీలో పనిచేస్తున్న ఇద్దరు వలస కూలీలపై కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తిని బీహార్‌కు చెందిన దిల్‌ఖుష్‌ కుమార్‌గా గుర్తించారు. ఇటీవల జమ్ముకాశ్మీర్‌లో పౌరులు, ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడుతున్నారు. గురువారం రాజస్తాన్‌కు చెందిన బ్యాంక్‌ మేనేజర్‌ విజరు కుమార్‌ను పొట్టనబెట్టుకున్నారు.అంతకు రెండు రోజుల…

Read More

రాష్ట్రాల హక్కులను నరేంద్ర మోదీ  ప్రభుత్వం హరించివేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి  చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గుదిబండగా మారిందని ఆయన విమర్శించారు. గురువారం హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకల్లో సిఎం కెసిఆర్‌ జాతీయ జెండా ఎగురవేశారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ బలమైన కేంద్రాం బలహీనమైన రాష్ట్రాలనేది కేంద్ర ప్రభుత్వం కుట్రపూరిత సిద్దాంతమని విమర్శించారు. రాష్ట్రాలకు రావాల్సిన వాటాను ఎగ్గొట్టేందుకు పన్నులను సెస్సుల రూపంలోకి మార్చి కేంద్రం వసూలు చేస్తున్నదనీ, రాష్ట్రాల వాటాగా రావాల్సిన లక్షలాది కోట్ల రూపాయలను కేంద్రం నిస్సిగ్గుగా హరిస్తోందని విమర్శించారు. రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను దెబ్బతీస్తూ రకరకాల ఆంక్షలు విధిస్తోందని ఆరోపించారు.రాష్ట్రాల హక్కుల హననాన్ని ఇక నుంచైనా మానుకోవాలని డిమాండ్‌ చేశారు. భారత దేశంతోపాటు స్వాతంత్య్రం సాధించుకున్న దేశాలు సూపర్‌ పవర్‌గా ఎదుగుతుంటే మనం ఇంకా కులం, మతం రొంపిలో కుమ్ములాడుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మత పిచ్చి తప్ప వేరే…

Read More

గృహ వినియోగదారులకు మరింత భారం కలిగించే విధంగాఎల్‌పిజి సబ్సిడీనిమొత్తంగా ఎత్తివేస్తున్నట్లు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. కేవలం ఉజ్వల లబ్ధిదారులకు మాత్రమే ఇకపై పరిమిత సబ్సిడీ లభిస్తుందని పేర్కొంది. మిగిలిన వారందరూ తమ సిలిండర్‌కు మార్కెట్‌ ధర చెల్లించాల్సిందే. ఉజ్వల పథకం కింద గ్యాస్‌ కనెక్షన్లు పొందిన తొమ్మిది కోట్ల మంది మహిళలు, ఇతర లబ్ధిదారులకు మాత్రమే ఇకపై ఈ సబ్సిడీ అందనుంది. చమురు కార్యదర్శి పంకజ్‌ జైన్‌ ప్రకటించారు. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఎల్‌పిజి వినియోగదారులకు సబ్సిడీ ఇవ్వడం లేదని, ఇకపై ఉజ్వల లబ్ధిదారులకే ప్రస్తుతమిస్తున్న సబ్సిడీ కొనసాగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా 30.5 కోట్ల ఎల్‌పిజి కనెక్షన్లు వుండగా, అందులో తొమ్మిది కోట్ల వరకు ఉజ్వల లబ్ధిదారులు వున్నారు. అంటే మిగిలిన 21 కోట్ల మందికీ సబ్సిడీ లేకుండా పోయింది. 2020 జూన్‌ నుండి వంట గ్యాస్‌పై సబ్సిడీని కేంద్రం చెల్లించడం లేదని, మార్చి 21న…

Read More

తనను పార్టీ నుండి సస్పెండ్ చేయడంపై వైసీపీ నాయకత్వంపై మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మండిపడ్డారు. పైగా, సీఎం జగన్‌ మోహన్ రెడ్డి కన్నా ముందే తాను రాజకీయాల్లోకి వచ్చానని, తన రాజకీయ ప్రస్థానంలో ఎక్కడ అవినీతి లేదని అంటూ నేరుగా పార్టీ అధినేత పైననే ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సస్పెన్షన్‌పై పార్టీ నియమావళి పాటించలేదని తప్పుబట్టారు. తనపై పార్టీకి ఫిర్యాదు చేసింది ఎవరు?, ఏమని చేశారు? అని ప్రశ్నించారు. కనీసం తనతో మాట్లాడకుండానే సస్పెన్షన్ ఆదేశాలు ఇచ్చారని విమర్శించారు. ఎవరి ఒత్తిడితో తనను సస్పెండ్‌ చేశారో చెప్పాలని కొత్తపల్లి పట్టుబట్టారు. వైసీపీ క్రమశిక్షణా సంఘం తీరుపై న్యాయ పోరాటం చేస్తానని హెచ్చరించారు. రోజు పార్టీని విమర్శిస్తున్న ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు. ‘‘పార్టీ నుంచి నన్ను సస్పెండ్‌ చేయడానికి కారణం ఏమిటి? నాపై ఫిర్యాదు చేసింది ఎవరు? షోకాజ్‌ నోటీసు ఇవ్వకుండా, రాత్రికి రాత్రే నన్ను సస్పెండ్‌…

Read More

కేంద్ర ప్రభుత్వం ఎంతగా విముఖత చూపుతున్నప్పటికీ బిజెపి భాగస్వామి అయిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తమ రాష్ట్రంలో బిజెపితో సహా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని కులాలవారీ జనన సేకరణకు ముందుకెళుతున్నారు. నితీశ్ కుమార్ నేతృత్వంలోని బిహార్ మంత్రివర్గం కులాల వారీ జనాభా లెక్కల సేకరణకు ఆమోదం తెలిపింది. 2023 ఫిబ్రవరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాలని గడువు విధించింది. దీని కోసం కంటింజెన్సీ ఫండ్ నుంచి రూ.500 కోట్లు కేటాయించింది. బిహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అమీర్ సుభానీ గురువారం మీడియాతో మాట్లాడుతూ కులాలవారీ జనాభా లెక్కల సేకరణకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ ప్రక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరినాటికి పూర్తి కావాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. సాధారణ పరిపాలనా శాఖ నోటిఫికేషన్‌ను జారీ చేసిన వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆగంతుక నిధి నుంచి రూ.500…

Read More