వరుసగా రెండు దశలలో ప్రజా సంగ్రామ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేయడం, పలువురు కేంద్ర మంత్రులు, నాయకులు హాజరై ప్రశంసలు కురిపించడం, రెండోసారి ముగింపు సభలో అయితే `కేసీఆర్ ను ఓడించడానికి సంజయ్ చాలు’ అంటూ ఆయనే కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థి అనే సంకేతం అమిత్ షా ఇవ్వడంతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆనందోత్సవాలతో మునిగి పోతున్నారు. ఇక వచ్చే ఎన్నికలలో బిజెపి అధికారంలోకి వస్తుందని, తానే ముఖ్యమంత్రి కాబోతున్నానని హావభావాలు ఆయనలో కనిపిస్తున్నాయి. పైగా కొన్ని సభలలో `కాబోయే సీఎం’ అంటూ కొందరు ప్రసంగిస్తున్న, నినాదాలు ఇస్తున్నా ఆయన కనీసం వారించే ప్రయత్నం చేయడం లేదు. సహజంగానే ఈ పరిణామం పలువురు సీనియర్ నేతలలో తీవ్ర అసంతృప్తి కలిగిస్తున్నది. సంజయ్ సహితం నాయకత్వంకు పోటీగా భావించే వారిని దూరంగా ఉంచేందుకు, ప్రాధాన్యత ఇవ్వకుండా కట్టడి చేసేందుకు చేయవలసిన ప్రయత్నాలు చేస్తున్నట్లు విమర్శలు చెలరేగుతున్నాయి. దానితో మీడియాలో ఎంత హైప్…
Author: Editor's Desk, Tattva News
త్రివిధ దళాలకు నియామకాల్లో భారీ సంస్కరణలు తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. టూర్ ఆఫ్ డ్యూటీ/అగ్నిపథ్ పథకంలో భాగంగా భారత సైన్యం, భారత నావికా దళం, భారత వాయు సేనలలో నియమితులయ్యే నూటికి నూరు శాతం మందిని నాలుగేళ్ళ తర్వాత విధుల నుంచి విడుదల చేయాలని, ఓ నెల తర్వాత మాత్రమే వీరిలో 25 శాతం మందిని పూర్తి స్థాయిలో సర్వీస్ లోకి తీసుకోవాలని ప్రతిపాదించారు. టూర్ ఆఫ్ డ్యూటీ స్కీమ్ తుది రూపంపై చర్చలు జరుగుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ తుది రూపానికి త్వరలోనే ఆమోదం లభించి, దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నూతనంగా నియమితులైన వారిలో కొందరిని శిక్షణ కాలంతోపాటు మూడేళ్ళ సర్వీస్ పూర్తయిన తర్వాత విడుదల చేయాలని ప్రారంభ ప్రతిపాదనలు చెప్తున్నాయి. ఐదేళ్ళ కాంట్రాక్చువల్ సర్వీస్ అనంతరం మరింత మందిని విడుదల చేసి, చివరికి దాదాపు 25 శాతం మందిని పూర్తి స్థాయిలో సర్వీస్ లకు నియమించాలని…
శతజయంతి ఉత్సవాలు పూర్తయ్యే సంవత్సరంలోగా ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చేందుకు కృషి చేయాలని వైసిపి తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌ను పెను నినాదంగా మార్చి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేలా చేస్తామని ప్రతిఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని సూచించారు. శత జయంతి సందర్భంగా శనివారం పార్లమెంట్ ప్రాంగణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి రఘురామకృష్ణరాజు నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ అందరివాడే గానీ కొందరి కాదని అంటూ ఆయన ఆశయ సాధన కేవలం జగన్మోహన్ రెడ్డితో మాత్రమే సాధ్యమని విజయవాడలో తమ పార్టీ కార్యకర్తలు ప్లెక్సీలు కట్టారని తెలిపారు. రామారావు పార్టీలకు అతీతుడనే విషయం ఈ ఒక్క ఘటనతో స్పష్టమవుతుందని వివరించారు. మహా నాయకుడు ఎన్టీఆర్ నిద్రాహారాలు మాని కష్టపడి సినిమా రంగంలో పైకి ఎదిగారని, తన చిత్రాల ద్వారా సామాజిక చైతన్యం కలిగించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ 60వ ఏట రాజకీయాల్లోకి వచ్చి చరిత్ర సృష్టించారని తెలిపారు. సంక్షేమ పథకాలకు…
సాగునీటిపారుదల ప్రాజిెక్టుల విషయంలో కేంద్రం చూపుతున్న నిర్లక్ష్యం, పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, ఏపీ నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న ప్రాజెక్టులపై దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ (ఎస్‌జడ్‌సీ) ఎదుట తెలంగాణ రాష్ట్రం ప్రస్తావనకు తెచ్చింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదిలో న్యాయమైన నీటి కేటాయింపుల కోసం సెక్షన్-3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్‌ను వేయాలని కోరింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై 8 ఏళ్లు గడుస్తున్నా కొత్త ట్రిబ్యునల్ వేయకపోవటం, ఉన్న ట్రిబ్యునల్‌కు నదీ జలాల పంపిణీ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం విన్నవించకపోవటంతో తెలంగాణ ప్రాంత ఆయకట్టు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొంది. ప్రత్యేకించి కృష్ణా బేసిన్‌లో తెలంగాణ ఆయకట్టు ప్రాంతం ఎక్కువగా ఉన్నందున నదీ జలాలను ఏపీ, తెలంగాణ మధ్య 50:50శాతం పంచాలని జోనల్ కమిటీ సమావేశానికి తేల్చి చెప్పింది. ఇప్పుడున్న 66:34 శాతం మేర కృష్ణా జలాల పంపిణీతో తీవ్ర అన్యాయం జరుగుతోందని స్పష్టం చేసింది.…
భూసేకరణ జీవో 80ఏ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ జిల్లా అరెపల్లిలో రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన తీన్మార్ మల్లన్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు రైతులను నెట్టేసి, తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసి వేలేరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. సాయంత్రం స్వంత పూచికత్తుపై వదిలిపెట్టారు. జీఓ 80ను వ్యతిరేకంగా ఆరెపల్లిలో రైతులు పోచమ్మ ఆలయం వద్ద గ్రామ సభ నిర్వహించగా వారికి మద్దతుగా వెళ్ళితే అరెస్టు చేయడంతో పాటు అక్రమ కేసు నమోదు చేశారని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. కేసులకు భయపడేది లేదని, ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించిన జీవో 80ఏ ను రద్దు చేసే వరకు రైతుల పక్షాన పోరాడుతానని స్పష్టం చేశారు. గ్రామంలో ప్రశాంతంగా గ్రామ సభ పెట్టుకుంటే పోలీసులు వచ్చి సభను భగ్నం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతమందిని అరెస్ట్ చేసిన ఉద్యమం…
నిత్యావసరాలంటే ఉప్పు, పప్పు, బియ్యం మాత్రమే కాదని, మహిళలు రుతుక్రమంలో వాడే శానిటరీ ప్యాడ్స్ కూడా నిత్యావసరాలే… కాదు కాదు అత్యవసరాలు అని ‘డిగ్నిటీ డ్రైవ్’ అనే స్వచ్ఛంద సేవా వ్యవస్థాపకురాలు రెనే గ్రేస్ స్పష్టం చేస్తున్నారు. ప్రతినెలా మహిళలు రుతుక్రమ సమయంలో ఎదురయ్యే సమస్యలపై ఆ సమయంలో ఆడవాళ్లు పాటించాల్సిన పరిశుభ్రతపై ఆమె అవగాహన పెంచుతున్నారు. కేవలం తనకెదురైన సంఘటన ద్వారానే ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు ఆమె చెబుతోంది. ఈ సంస్థ ద్వారా వందలాది మంది మహిళలకు ప్రతినెలా శానిటరీ ప్యాడ్స్‌ను అందజేస్తోంది. మే 28వ తేదీన రుతు పరిశుభ్రతా దినోత్సవం. ఈ సందర్భంగా ఈ సంస్థను స్థాపించడానికి తన పనిమనిషి కుమార్తే కారణమని చెబుతోంది. ‘ఒకరోజు ఆమె తన పదమూడేళ్ల కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లెందుకు డబ్బు అడిగింది. తనకేమైంది.. ఎందుకు హాస్పటల్‌కి అని అడగ్గా.. ఆ విషయాన్ని చెప్పడానికి కూడా ఆమె బిడియపడింది. పాపకు అక్కడ ఇన్‌ఫెక్షన్ వచ్చిందనీ, చీము పట్టిందనీ, చెప్పలేక…
తిరుమలలో శ్రీవారి ప్రసాదం తయారీకి ఉపయోగించేందుకు సరఫరా చేస్తున్న జీడిపప్పుతో నాణ్యతా లోపం పట్ల టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ మార్కెటింగ్ గోడౌన్‌ను ఆయన శనివారం స్వయంగా ఆకస్మికంగా తనిఖీ చేసి, ప్రసాదాల తయారీకి ఉపయోగించేందుకు సిద్ధం చేసిన జీడిపప్పును పరిశీలించారు. మూడు కంపెనీలు జీడిపప్పు సరఫరా చేస్తుండగా ఒక కంపెనీ సరఫరా చేసిన జీడిపప్పులో దుమ్ము, విరిగిపోయినవీ చాలా ఎక్కువ శాతం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆ కంపెనీ కాంట్రాక్టును రద్దు చేయమని అధికారులను ఆదేశించారు. టీటీడీ విధించిన ప్రమాణాలకంటే ఎక్కువగానే దుమ్ము, విరిగిన జీడిపప్పు ఉన్నాయని అధికారులు చైర్మన్‌కు వివరించారు. మిగిలిన రెండు కంపెనీలు సరఫరా చేసిన జీడిపప్పు టెండర్ నిబంధన మేరకు నాణ్యతగా ఉన్నట్లు గుర్తించారు. నాణ్యత సరిగాలేని జీడిపప్పు సరఫరా చేసిన సంస్థ కాంట్రాక్టు వెంటనే రద్దు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం యాలకులు మూట విప్పించి అవి స్పెసిఫికేషన్స్ మేరకు ఉన్నాయా లేదా అని అధికారులను అడిగారు. …
ఎనిమిదేళ్ల బిజెపి పాలనలో సిగ్గుతో తలదించుకునే స్థితికి తెచ్చే ఒక్క పనిచేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇన్నేళ్లుగా తాను తలవంచుకునే కారణం ఒకటి కూడా లేదని భరోసా ఇచ్చారు. దేశ ప్రజలకు సేవకుడిగా వ్యవహరిస్తానని చెప్పానని, ఈ క్రమంలో తాను శక్తివంచన లేకుండా పనిచేశానని ప్రకటించారు. ప్రజలు సిగ్గు పడే పరిస్థితిని తానెప్పుడూ తీసుకురాలేదని గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలోని అట్కోట్ పట్టణంలో 200 పడకల మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్‌ను ప్రారంభిస్తూ తెలిపారు. దేశ ప్రజలు సగర్వంగా నిలిచేలా చేసేందుకు పాటుపడ్డామని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఎనిమిదేళ్ల తమ పాలనలో తాను ఎటువంటి తప్పిదాలు చేయలేదని, పైగా ఇతరులు చేయడానికి కూడా అవకాశం కల్పించలేదని తేల్చి చెప్పారు. జనం సిగ్గుపడితే పాలకుల తప్పిదం అవుతుందని స్పష్టం చేశారు. దీనిని గుర్తులో పెట్టుకునే తాము వ్యవహరించామని వెల్లడించారు. తాను ఈ స్థాయిలో ఉండడానికి గుజరాతే కారణమని ప్రధాని మోదీ ప్రజల సమక్షంలో ప్రకటించారు. అందుకు ధన్యవాదాలు తెలియజేశారు.…
హెచ్చు టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యుపిఐ)తో ప్రమాదమేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. దీని ద్వారా రిటైల్ ద్రవ్యోల్బణం సూచీపై ఒత్తిడి పడొచ్చని పేర్కొంది. అధిక ధరల వల్ల పారిశ్రామిక ముడి సరుకులు, రవాణ, అంతర్జాతీయ సరఫరా వ్యయాలు కూడా పెరిగిపోతున్నాయని ఆర్‌బిఐ శుక్రవారం విడుదల చేసిన తన 2021-22 వార్షిక రిపోర్ట్‌లో పేర్కొంది. ”గడిచిన ఏడాదిలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. పలు అడ్డంకులు నెలకొనప్పటికీ రికవరీ దారిలోనే ఉంది. భవిష్యత్తు వృద్థి సరఫరా చెయిన్‌పై అధారపడి ఉంది. లక్ష్యానికి అనుగుణంగా ద్రవ్యోల్బణను నియంత్రించడం ద్వారా వృద్థికి మద్దతునివ్వాలని ఆర్‌బిఐ నిర్దేశించుకుంది” అని తెలిపింది. “డిమాండ్ పుంజుకోవడానికి ముఖ్యంగా మూలధన వ్యయాలను పెంచాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ భౌగోళిక ప్రతికూలాంశాలు వినియోగదారుల ద్రవ్యోల్బణాన్ని మరింత ఎగిసిపడేలా చేస్తున్నాయి. అంతర్జాతీయంగా చమురు, లోహాలు, ఎరువుల ధరలు వాణిజ్య, కరెంట్ లోటును మరింత పెంచుతున్నాయి.” అని ఈ రిపోర్ట్ పేర్కొంది. …
వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావడం పార్టీ మనుగడకు కీలకమని గ్రహించిన టిడిపి సంస్థాగతంగా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టుతున్నది. వచ్చే పార్వత్రిక ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే కేటాయిస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఒంగోలులో శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమైన మాహానాడులో ఆయన జ్యోతి వెలిగించి అధ్యక్షోపాన్యాసం చేస్తూ రాజకీయ పార్టీల్లో యువతను ప్రోత్సాహించాల్సిన అవసరం ఉందని, పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పార్టీ కోసం పని చేసే వాళ్లకే అవకాశాలు వస్తాయని స్పష్టం చేశారు. కాగా, వరుసగా మూడు సార్లు ఓటమి చెందిన వారికి పార్టీ సీటు ఇచ్చే ప్రసక్తి లేదని ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒంగోలు లో జరుగుతున్న మహానాడు మొదటి రోజు వెల్లడించారు. అదే విధంగా ఎవ్వరు కూడా పార్టీలో ఒకే పదవిలో వరుసగా రెండు సార్లు మించి కొనసాగరాదని కూడా తెలిపారు. ఆ విధానం మేరకు రెండు సార్లు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న తాను ఈ…