Author: Editor's Desk, Tattva News

‘‘రాజకీయాలు అర్థం కాకపోతే ఇంటికెళ్లి వంట చేసుకోపో” అంటూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్ సిపి) ఎంపీ సుప్రియా సూలేపై మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ చేసిన అనుచిత వాఖ్య రాజకీయ దుమారం రేపుతున్నది. చంద్రకాంత్ వ్యాఖ్యలపై నెటిజెన్లు బీజేపీయేతర పక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్లపై స్టే విధించడంతో గత కొన్ని నెలలుగా మహారాష్ట్రలో రాజకీయాలు  వేడెక్కాయి. ఓబిసి  రిజర్వేషన్ల కోసం న్యాయస్థానాల్లో జరిగిన పోరాటంలో ఉద్దవ్‌ థాక్రే సర్కార్‌ ఓడిపోయిందని బిజెపి ఆరోపిస్తుండగా, కేంద్రమే సరైన డేటాను అందించడం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం  ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఎన్ సిపి అధినేత శ‌ర‌ద్ ప‌వార్ కుమ‌ర్తె, ఎంపీ సుప్రియా సూలే మాట్లాడుతూ,  బిజెపి పాలిత మధ్యప్రదేశ్‌కు ఓబిసి రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు నుంచి ఎలా ఉపశమనం లభించిందని ప్రశ్నిస్తూ ‘‘మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చి ‘ఎవరినో’ కలిశారు.. అకస్మాత్తుగా ఏం జరిగిందో తెలియడం లేదు. మరో…

Read More

రెడ్లకు పగ్గాలిస్తేనే తెలంగాణాలో కాంగ్రెస్ కు మనుగడ అంటూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వాఖ్యలో ఆ పార్టీలో రాజకీయ దుమారం రేపుతున్నాయి.  రాహుల్ గాంధీ పర్యటన  సందర్భంగా ఐక్యతా నినాదం వినిపించిన ఆ పార్టీ నేతలలో ఈ వాఖ్యలు చిచ్చు పెట్టిన్నట్లయింది.  పలువురు నేతలు రేవంత్ రెడ్డి వాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ వాఖ్యలు ఖండిస్తున్నారు.  పిసిసి ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అయితే ఈ విషయమై రేవంత్ కు ఓ బహిరంగ లేఖ వ్రాస్తూ ఈ వాఖ్యాలను ఖండిస్తూ వెంటనే మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి వివరణ వివాదం ద్వారా ఏర్పడిన గందరగోళాన్ని నివారించాలని హితవు చెప్పారు. ఒక్క రెడ్డి సామాజిక వర్గంతోనే ప్రభుత్వం ఏర్పడేదంటే సుమారు ఏడు సంవత్సరాలు పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేతగా జానారెడ్డి, కొత్తగా పార్టీలో చేరినా మీకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినా 2018లో పార్టీ ఓటమి పాలైందని గుర్తు…

Read More

2001లో అటల్ బిహారీ వాజ్పేయ్ జాతికి అంకితం చేసిన ఐఎస్ బి ఇప్పుడు ఆసియాలోని టాప్ బిజినెస్ స్కూళ్లలో ఒకటిగా నిలిచిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవంలో మోదీ పాల్గొంటూ ఐఎస్ బీ లో ఇప్పటి వరకు శిక్షణ తీసుకున్న 50 వేల మంది దేశ విదేశాల్లో పెద్ద పెద్ద కంపెనీలను నడుపుతున్నారని తెలిపారు.  స్టార్టప్ లు, యూనికార్న్ ల నిర్మాణంలోనూ వారి భాగస్వామ్యం ఉండటం దేశానికి గర్వకారణమని ప్రధాని ప్రశంసించారు.  ఐఎస్ బి త‌న ప్ర‌యాణంలో కీల‌క మైలురాయిని చేరింద‌న్నారు. ఐఎస్ బి ఈ స్థాయికి రావ‌డం వెనుక చాలా మంది కృషి ఉంద‌ని చెప్పారు.  వ‌చ్చే 25ఏళ్ల‌కు రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నామని చెబుతూ ఆ ప్ర‌ణాళిక‌ల్లో  ఐఎస్ బికి చాలా కీల‌క పాత్ర ఉంటుంద‌ని ప్రధాని  పేర్కొన్నారు. జి20 దేశాల్లో భార‌త్ అతి వేగంగా అభివృద్ధి చెందుతోంద‌ని పేర్కొంటూ ఇంట‌ర్నెట్ వాడ‌కంలో భార‌త్ రెండో స్థానంలో ఉంద‌ని, …

Read More

తెలంగాణ భవిష్యత్తు, గౌరవం కోసం బీజేపీ పోరాటం చేస్తుందని చెబుతూ రాష్ట్రంలో మార్పు తీసుకురావాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, ఈసారి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ పర్యటన సందర్భంగా బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో ఘనస్వాగతం పలికిన బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘పట్టుదలకు తెలంగాణ ప్రజలు పెట్టింది పేరు’ అని కొనియాడుతూ తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఏ లక్ష్యం కోసం అమరులు ప్రాణ త్యాగాలు చేశారో.. ఆ ఆశయాలు ఇంకా నెరవేరలేదని పేర్కొన్నారు. కుటుంబ పాలన కోసం తెలంగాణ ఉద్యమం జరగలేదని స్పష్టం చేశారు. కుటుంబ పాలన కారణంగా యువతకు రాజకీయాల్లో అవకాశాలు రావడం లేదని చెబుతూ కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పించడమే తన సంకల్పమని స్పష్టం చేశారు. తెలంగాణలో కుటుంబ పాలన చేసేవాళ్లు దేశ ద్రోహులంటూ మండిపడ్డారు. కుటుంబపాలన ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి  కుంటుపడిందని తెలిపారు.  తెలంగాణ వచ్చిన ప్రతీసారీ…

Read More

దేశం గర్వించే విధంగా మొదటిసారిగా భారత సైన్యంలో యుద్ధ విమాన పైలెట్ గా కెప్టెన్ అభిలాష బరాక్ నిలిచారు. విజయవంతగా శిక్షణను పూర్తి చేసిన తర్వాత కంబాట్ ఏవియేటర్ గా చేరిన మొదటి మహిళగా ఆమె రికార్డుకెక్కారు. నాసిక్ లో జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్, కల్నల్ కమాండెంట్ ఆర్మీ ఏవియేషన్ అధికారి అభిలాషకు వింగ్స్ బ్యాడ్జి ప్రదానం చేశారు.  ఈ నేపథ్యంలో భారత ఆర్మీ ఏవియేషన్ చరిత్రలో గోల్డెన్ లెటర్ డే అంటూ ఆర్మీ ట్వీట్ చేసింది. అంతకు ముందు ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్ లో మహిళలు గ్రౌండ్ డ్యూటీలలో మాత్రమే ఉండేవారు. గత ఏడాది జూన్ లో తొలిసారిగా ఇద్దరు మహిళలు హెలికాప్టర్ పైలెట్ శిక్షణకు ఎంపికయ్యారు.  ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్ లో కంబాట్ ఏవియేటర్ శిక్షణ నిమిత్తం మొత్తం 15 మంది మహిళా అధికారులు ఆసక్తి కనబరిచారని.. అయితే పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్, మెడికల్ టెస్టుల్లో ఇద్దరు…

Read More

మహారాష్ట్రలోని రవాణా మంత్రి అనిల్‌ పరాబ్‌ నివాసంపై గురువారం ఉదయం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) సోదాలు జరుపుతున్నది.  రత్నగిరి జిల్లాలోని దాపోలి తీర ప్రాంతంలో భూమి కొనుగోలు ఒప్పందంలో మంత్రి అవతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయని, దీంతో అనిల్‌పై మనీలాండరింగ్‌ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు  ఇడి  తెలిపింది.   అనిల్‌తో పాటు పలువురు నివాసాలపై ఏకకాలంలో సోదాలు జరిపింది. పూణె, ముంబయి, దాపోలి ప్రాంతాలతో పాటు అనిల్‌ నివాసంలో ఈ సోదాలు జరిగాయి. 2017లో అనిల్‌ దాపోలీ ప్రాంతంలో ఓ భూమిని రూ.కోటికి కొనుగోలు చేశారు. దాన్ని 2019లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.  ఆ తర్వాత 2020లో ముంబయికి చెందిన కేబుల్‌ ఆపరేటర్‌ సదానంద్‌ కడమ్‌కు రూ.1.10కోట్లకు ఆ భూమిని విక్రయించారు. అయితే 2017-2020 మధ్య ఆ భూమిలో పరబ్‌ తన వ్యాపార భాగస్వామి సదానంద్‌తో కలిసి నిబంధనలకు వ్యతిరేకంగా ఒక రిసార్ట్‌ను నిర్మించినట్లు ఆరోపణలు వచ్చాయి.  దీనిపై ఐటి శాఖ గతంలో…

Read More

జమ్మూకాశ్మీర్‌లో బుధవారం రాత్రి వరుస దాడులకు ఉగ్రదాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో టీవీ నటిని కాల్చి చంపడం కలకలం రేపింది. ఉగ్రదాడుల్లో ఆమె మేనల్లుడు తీవ్రంగా గాయపడ్డాడు. బూద్గామ్‌ జిల్లాలో సామాన్య పౌరుల ఇళ్లను టార్గెట్‌ చేసి కాల్పులకు తెగబడ్డారు. కాగా, బుధవారం రాత్రి.. ఇంట్లో ఉన్న టీవీ నటి అమ్రీన్‌ భట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే పరిస్థితి విషమించడంతో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో ఆమె పదేళ్ల మేనల్లుడు ఫర్హాన్‌ జుబీర్‌కు కూడా బుల్లెట్‌ గాయమైనట్టు పోలీసులు వెల్లడించారు. తీవ్ర గాయాలపాలైన ఫర్హాన్‌ జుబైర్‌(10) అనే బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెడకు అయిన బుల్లెట్‌ గాయం వల్ల అమ్రీన్‌ ఆస్ప్రతికి వచ్చే దారిలోనే ప్రాణాలు కోల్పోయారని వైద్యులు తెలిపారు. ఇక, అమ్రీన్‌ మేనల్లుడు ఫర్హాన్‌ చేతికి బుల్లెట్‌ గాయమవ్వగా వైద్యులు చికిత్స చేస్తున్నారు.ఇదిలా ఉండగా నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే…

Read More

బిజెపియేతర పార్టీలు కూడా హిందువులలో తమ మద్దతును  పెంచుకోవాలని చూస్తున్న తరుణంలో, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) కర్నాటక యూనిట్ మతపరమైన విభజన కనిపిస్తున్న కోస్తా కర్ణాటకలో ముస్లిం సదస్సుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని అగ్రశ్రేణి మేధావుల్లో కొందరు వక్తలుగా పాల్గొనే ఈ కార్యక్రమం మే చివరి వారాంతంలో మంగళూరులో జరగాల్సి ఉంది.  వివిధ జిల్లాల నుంచి ఎంపికైన దాదాపు 2 వేల మంది ముస్లిం ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. సాంప్రదాయకంగా కార్మిక, ఆర్థిక విధాన సమస్యల చుట్టూ సదస్సులు నిర్వహించే పార్టీకి ఇదో  కొత్త రకమైన రాజకీయం. బహుశా సిపిఎం చరిత్రలో ఇటువంటి సదస్సు ఎక్కడా జరిపి ఉండదు.  ఎన్నికలలో పెద్దగా ప్రభావం చూపలేక పోతున్నా లక్షలాది మంది కార్మికులు, కర్షకులు సమీకరించడంలో దిట్టగా సిపిఎం దేశంలో పలు ప్రాంతాలలో గుర్తింపు మోపఁడుతున్నది. గిరిజనులు, దళితులు, మహిళలు, మైనారిటీల సమస్యలపై ఎంతగా మాట్లాడినా ఆ పార్టీ నాయకత్వం అగ్రవర్ణాలకే పరిమితమైనది.…

Read More

ఒక వంక పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావడం కోసం, ఎలాగైనా 2024 ఎన్నికలలో తగు ప్రభావం చూపించడం కోసం కాంగ్రెస్ నాయకత్వం సర్దుబాటు ధోరణులు ప్రదర్శిస్తూ కసరత్తు చేస్తుండగా, మరోవంక కీలకమైన నాయకులు వరుసగా ఆ పార్టీ నుండి నిష్క్రమిస్తున్నారు.  గత ఐదు నెలల్లో ఐదుగురు ప్రముఖ నాయకులు కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. కనీసం వారిని నిలవరించే ప్రయత్నం కూడా కాంగ్రెస్ నాయకత్వం చేయక పోవడం గమనార్హం.  కపిల్‌సిబల్‌ : ప్రముఖ న్యాయవాది, రాజకీయ వేత్త అయిన కపిల్‌ సిబల్‌కు అధిష్టానంతో సంబంధాలు చాలా తక్కువ. ఈ నెల ప్రారంభంలో ఉదరుపూర్‌లో జరిగిన సదస్సుపై స్పందిస్తూ..అధిష్టానం భ్రమలో కొనసాగుతోందని అన్నారు. పార్టీ నాయకత్వంలో సమూల మార్పులు చేపట్టాలంటూ జి-23 నేతలు సోనియాగాంధీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేతల బృందంలో కపిల్‌ సిబల్‌ కూడా ఒకరు. సునీల్‌ జాఖడ్‌ : గత నెల పార్టీని వీడిన పంజాబ్‌ కాంగ్రెస్‌ యూనిట్‌ మాజీ…

Read More

కాశ్మీర్ లోయలో క‌శ్మీర్ పండిట్లు అదృశ్య‌మ‌వుతున్నారని, వారి సంఖ్య తగ్గి వారు ఉనికి కోల్పోయే ప్రమాదం ఏరాడినదని  జ‌మ్మూ క‌శ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహ‌బూబా ముఫ్తీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇత‌ర రాష్ట్రాల ప్ర‌జ‌లు కశ్మీరీల కోసం వెత‌కాల్సిన స‌మ‌యం ఆసన్నమైందని ఆమె విచారం వ్యక్తం చేశారు.  “మేం చిన్న వ‌య‌స్సులో ఉన్న‌ప్పుడు ఈ ప్రాంతంలో కాశ్మీరీ పండిట్లు ఉన్నారు. కానీ ఈ రోజు నా పిల్లలు కాశ్మీరీ పండిట్లు అంటే ఎవ‌రు? వారు ఎలా క‌నిపిస్తారు? అని న‌న్నుఅడుగుతున్నారు. ఎందుకంటే వారు అదృశ్యమవుతున్నారు. వారి సంఖ్య తగ్గింది. అలాగే మేము కూడా దృఢంగా నిలబడలేకపోతే.. మా ఉనికిని కోల్పోయే అవ‌కాశం ఉంది” అంటూ ఆమె ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు.  జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ ముఖ్యమంత్రి  నేడు రైతుల నుండి…

Read More