ఢిల్లీలోని కుతుబ్ మీనార్ కేసులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సాకేత్ కోర్టుకు మంగళవారం ప్రత్యుత్తరం సమర్పించింది. కుతుబ్ మీనార్ స్మారక చిహ్నాన్ని విష్ణు స్తంభంగా మార్చాలని డిమాండ్ చేస్తూ హిందూ పిటిషనర్లు సాకేత్ కోర్టును అభ్యర్థించారు. కుతుబ్ మినార్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ధ్వంసం చేసిన 27 ఆలయాలను పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ కోర్టు జూన్ 9వ తేదీకి రిజర్వ్ చేసింది. మంగళవారంనాడు ఢిల్లీలోని సాకేత్ కోర్టులో దీనిపై విచారణ జరిపింది. కుతుబ్ మీనార్ ఉన్న ప్రదేశంలో ఆలయాన్ని పునరుద్ధరించాలని హిందూ పిటిషనర్ల అభ్యర్థనను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్‌ఐ) వ్యతిరేకించింది. కుతుబ్ మీనార్ 1924 సంవత్సరం నుంచి రక్షిణ స్మారక చిహ్నంగా ఉందని, దీని నిర్మాణాన్ని ఇప్పుడు మార్చలేమని ఎఎస్‌ఐ పేర్కొంది. కుతుబ్ మీనార్‌కు రక్షిత హోదాను మంజూరు చేసే సమయంలో స్మారక చిహ్నం వద్ద ఆరాధన పునరుద్దరణకు అనుమతించం అని ఆర్కియాలజికల్ సర్వే…
Author: Editor's Desk, Tattva News
ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు ఎక్కువగా సాగుతున్న గంజాయి స్మగ్లింగ్ పై ఇక్కడ పోలీసుల నిఘా పెరుగుతూ ఉండడంతో మహిళలను వినియోగించడం ద్వారా వారి కళ్ళు కప్పే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడైనది. ఇద్దరు మహిళలకు ఎక్కువ కమీషన్ ఇస్తామని ఆశ చూపి స్మగ్లింగ్‌లో భాగస్వాములను చేయగా ఒక కారులోంచి మరో కారులోకి మారుస్తుండగా పక్కా సమాచారం ఉండటంతో దాడి చేసిన పోలీసులు పట్టుకున్నారు. మహిళలు పాల్గొనడం మొదటిసారిగా చూసి వారు నివ్వెర పోయారు. పెద్దఅంబర్‌పేట అవుటర్‌రింగ్‌రోడ్డు పై హయత్‌నగర్ పోలీసులు ఏకంగా 470 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఇద్దరు మహిళలు ఉండటం గమనార్హం. వాహనాల్లో మహిళలుంటే పెద్దగా తనిఖీ చేయరనే నమ్మకంతో స్మగ్లర్లు మహిళలను భాగస్వాములను చేశారు. ఎక్కువ కమీషన్ ఆశచూపి మహిళలను భాగస్వాములను చేశారు. తూర్పుగోదావరి జిల్లానుండి కార్లలో 470కిలోల గంజాయిని కార్లలో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. పక్కా సమాచారంలో హయత్‌నగర్ పోలీసులు పెద్దఅంబర్‌పేట వద్ద కార్లనుండి మరో కార్లలోకి గంజాయిని…
పెట్రోల్, డీజిల్ పన్నుల్లో రాష్ట్రాలు తమ వాటాను తగ్గించుకోవాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సూచించడం పట్ల తమిళనాడు ఆర్థికమంత్రి పళనివేల్ త్యాగరాజన్ తీవ్రంగా మండిపడ్డారు. అధ్వాన్నంగా పనిచేసే వ్యక్తుల నుంచి తమకు డిక్టేషన్ అవసరం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘భారతదేశంలోని ఏ ప్రభుత్వం దగ్గర లేని అత్యుత్తమ గణాంక ఫలితాలలో ఒకటి మా వద్ద ఉంది. మేము రెవెన్యూ లోటు రూ.60 వేల కోట్ల నుంచి దాదాపు రూ.40 వేల కోట్లకు తగ్గించాము. మన ఆర్థిక లోటు కేంద్ర ప్రభుత్వం కంటే సగం. మన తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే రెండింతలు. జాతీయ ద్రవ్యోల్బణం 8 శాతంగా ఉన్నప్పుడు మన ద్రవ్యోల్బణం 5 శాతం మాత్రమే’ అని చెప్పుకొచ్చారు. `మేం ఏం చేస్తున్నామో మాకు తెలుసు. మేము ఏం చేయాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. మాకంటే అధ్వాన్నంగా…
అవినీతి ఆరోపణలపై తన మంత్రివర్గ సహచరుని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తొలగించడమే కాకుండా, ఆ తర్వాత కొద్దిసేపటికే అతనిని అరెస్ట్ కూడా చేశారు. స్వతంత్ర భారత దేశంలో గతంలో ఒక సారి కేవలం ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం మాత్రమే అవినీతి ఆరోపణలపై ఓ మంత్రిని తొలగించింది. ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ సింగ్లా అవినీతికి పాల్పడినట్టు బలమైన ఆధారాలు కనుగొనడంతో సీఎం ఈ చర్య తీసుకున్నారు. వివిధ కాంట్రాక్టులపై అధికారుల నుంచి 1 శాతం కమిషన్‌ను వసూలు చేసేవారని మంత్రిపై ఆరోపణలు వచ్చాయి. సింగ్లాపై వచ్చిన ఫిర్యాదులతో ఆయనను పదవి నుంచి తొలగించినట్టు మాన్ చెప్పారు. టెండర్లపై అధికారుల నుంచి ఒక శాతం కమీషన్ డిమాండ్ చేశారంటూ మంత్రి సింగ్లాపై సీఎం మాన్ కు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలోనే అంతర్గత విచారణ చేపట్టిన సీఎం మాన్మం త్రికి ఉద్వాసన పలికారు. అనంతరం సింగ్లాపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. తమ ప్రభుత్వంలో…
జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న క్వాడ్ దేశాధినేతల సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ చొరవతో భారత్, జపాన్ లతో సహా 12 దేశాలతో కలిపి చైనా వ్యతిరేక ఆర్ధిక కూటమి ‘ఇండో-పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్‌వర్క్ (ఐపీఈఎఫ్)’ ఏర్పడింది. ఆర్థిక, వాణిజ్య రంగాల్లో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకునే దిశగా ఏర్పడిన ఈ కూటమిలో దేశాలకు ప్రపంచ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో 40 శాతం వాటా ఉండడం గమనార్హం. సోమవారం టోక్యోలో జరిగిన కీలక సమావేశంలో జో బైడెన్, భారత్, జపాన్ ప్రధానులు నరేంద్ర మోదీ, ఫుమియో కిషిదా తదితర దేశాధినేతల సారథ్యంలో ఆ మేరకు కొత్త ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన ఇతర దేశాలలో ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, ఇండోనేసియా, మలేసియా, న్యూజిలాండ్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం, బ్రూనే ఉన్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంత సానుకూల అభివృద్ధికి అమెరికా కట్టుబడి ఉందని ఈ సందర్భంగా బైడెన్ చెప్పారు. ఎగుమతి-దిగుమతులు,…
భారత్ జపాన్‌లు సహజసిద్ధ స్నేహ భాగస్వాములని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా టోక్యోకు చేరిన ప్రధాని తొలిరోజు సోమవారం భారతీయ సంతతిని ఉద్ధేశించి ప్రసంగించారు. భారతదేశానికి జపాన్ నుంచి తరాల నుంచి నిరంతర సాయం అందుతోందని, భారతదేశ ప్రగతి పథంలో జపాన్ పెట్టుబడులు కీలక పాత్ర వహించాయని ప్రధాని తెలిపారు. ముందుగా చెప్పాలంటే ఈ తూర్పు దేశంతో భారత్ అనుబంధం ఆధ్మాత్మికం తరువాతి క్రమంలో ఇది ఇతర రంగాలలో పరస్పర సహకారానికి, శిఖర స్థాయిలో ఆత్మీయతానుబంధానికి దారితీసిందని ప్రవాస భారతీయులతో భేటీలో హర్షం వ్యక్తం చేశారు. క్వాడ్ నేతల సదస్సుకు జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జపాన్ పర్యటనకు వచ్చారు. ఇరు దేశాలు ప్రకృతిసిద్ధమైన స్నేహసంబంధాలను సంతరించుకున్నాయని, అందుకే ఈ బంధం కాలానికి అతీతంగా మరింత ధృఢం అవుతోందని మోదీ పేర్కొన్నారు. ఇప్పుడు ఉద్రిక్తతల ప్రపంచానికి బుద్ధ భగవానుడి నిర్ధేశిత పథం అత్యవసరం…
కులాలవారీగా జనాభా లెక్కల సేకరణ జరపడం దేశంలో విభజన ధోరణులు పెంచుతుందని అంటూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక వంక తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, ఈ అంశంపైనే బీజేపీని ఢీ కొనడానికి ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. ఈ అంశంపై వచ్చే వారంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. బహుశా ఈ నెల 27న ఈ సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓ కార్యక్రమానికి హాజరైన నితీశ్ ను కులాలవారీగా జనాభా లెక్కల సేకరణపై చర్చించేందుకు ఈ నెల 27న అఖిలపక్ష సమావేశం జరగబోతోందని వార్తలు వస్తున్నాయని విలేకర్లు ప్రస్తావించినపుడు ఈ తేదీన సమావేశం నిర్వహించడానికి చాలా పార్టీలు అంగీకరించాయని చెప్పడం గమనార్హం. ఈ సమావేశాన్ని నిర్వహించే తేదీ విషయంలో అన్ని పార్టీల సమ్మతి అవసరమని తెలిపారు. బిహార్‌లో జేడీయూ, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. కులాలవారీ జన గణనపై బీజేపీ ఇంకా ఎటూ…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత పాదయాత్రను జూన్ నెల 23 నుండి జూలై 12 వరకు 20 రోజుల పాటు చేపట్టాలని నిర్ణయించారు. అట్లాగే 4వ విడత పాదయాత్రను సైతం ఆగస్టులోపు పూర్తి చేయనున్నారు. మొత్తంగా 3, 4 విడతల పాదయాత్రలో భాగంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా పాదయాత్ర చేసేలా ప్రణాళిక రూపొందించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాదయాత్ర గురించి ప్రకటించారు. మొదటి, రెండో విడత పాదయాత్రల్లో భాగంగా బండి సంజయ్ 67 రోజులు పాదయాత్ర చేసి 828 కిలోమీటర్లు నడవడమే కాకుండా దాదాపు 11 లక్షల మంది ప్రజలు ఇందులో భాగస్వాములయ్యారు. రెండు విడతల పాదయాత్రలో భాగంగా 13 జిల్లాల్లోని 9 ఎంపీ, 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నడవడంతో పాటు 66 సభలు…
ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానించాలని తెలంగాణ మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అర్భన్ ప్రాంతాలకు కూడా ఉపాధి హామీ చేసుకునే వీలు కల్పించాలని కోరింది. ఉపాది హామీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఉపాధి హామీ నిధులలో ఎలాంటి కోతలు విధించకుండా… గత ట్రాక్ రికార్డు ఆధారంగా ప్రస్తుతం జరుగుతున్న పనులను చూసి రాష్ట్రానికి కనీసం 16 కోట్ల పని దినాలను ఆమోదించాలని డిమాండ్ చేసింది. అలాగే ప్రజోపయోగ పనులు చేస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రోత్సహించాలని ఉపాధి హామీ కౌన్సిల్ తీర్మానించింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం కింద కేంద్రం ఇప్పటికే బకాయి పడిన రూ 97.35 కోట్లను వెంటనే చెల్లింలని డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగానే ఎస్‌సి, ఎస్‌టిలకు ప్రత్యేకంగా పేమెంట్స్ ఇవ్వాలని…
సీతారామ శాస్త్రి అక్షరాలు నిత్య చైతన్య కిరణాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. సీతారామ శాస్త్రి జయంతి సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో ‘కవితన రచనల ద్వారా అమరత్వం పొందుతాడు. తను భౌతికంగా లేకపోయినా తను సమాజానికి అందించిన అక్షర కిరణాల ద్వారా స్ఫూర్తినిస్తాడు. పంచ భూతాలలో కలసిపోయినా రాబోయే తరానికి దిశానిర్దేశం చేస్తూనే ఉంటారు. అలాంటి ఒక గొప్ప కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆయన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ నమస్సుమాంజలి’ అని పేర్కొన్నారు. `శాస్త్రి జయంతి సందర్భంగా విడుదలైన ‘సిరివెన్నెల సీతారామ శాస్త్రి సమగ్ర సాహిత్యం’ మొదటి సంపుటి చూశాక- ఆ అక్షర తపస్విని మొదటిసారి రుద్రవీణ సినిమా సమయంలో కలసిన సందర్భం గుర్తుకు వచ్చింది. అన్నయ్య చిరంజీవి నటించిన ఈ సినిమాకు నాగబాబు అన్నయ్య నిర్మాతగా ఉన్న ఈ చిత్రానికి నేను సహ నిర్మాతగా ఉంటూ నిర్మాణంలో పాలుపంచుకొన్నాను’ అని గుర్తు చేసుకున్నారు. `ఆ సందర్భంలో శాస్త్రితో…