Author: Editor's Desk, Tattva News

గత కొన్ని రోజులుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడింది. కాస్త ఉపశమనం పొందేలా కేంద్రం చర్యలు తీసుకొంది. లీటర్ పై రూ. 8, డీజిల్ పై రూ. 6 ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్రం శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాలు పన్ను తగ్గించే విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రం సూచించింది. దీంతో పలు రాష్ట్రాలు స్పందిస్తున్నాయి. కేరళ, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తుల పన్నును తగ్గించాయి. కేరళ ప్రభుత్వం పెట్రోల్ పై రూ. 2.41, డీజిల్ పై రూ. 1.36 తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ పెట్రోల్ పై రూ. 2.48, డీజిల్ పై రూ. 1.36 తగ్గించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ వెల్లడించారు. ఒడిశా పెట్రోల్ పై రూ. 2.23, డీజిల్ పై రూ. 1.36 తగ్గించింది. పన్నులు తగ్గించడం విషయంలో…

Read More

మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతి కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ ను  పోలీసులు ఎ-1 నిందితుడిగా ప్రకటించడంతో కాకినాడలో రాజకీయంగా కలకలం చెలరేగుతుంది. ముందు అనుమానస్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులు మృతుడి కుటుంభం సభ్యులు, దళిత సంఘాలకు చెందినవారు పెద్ద పెట్టున నిరసన చేపట్టడంతో హత్యకేసుగా మార్చారు.  దీంతో ఏ క్షణమైనా ఎమ్మెల్సీని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. తన భర్త మృతదేహానికి పోస్టుమార్టం చేయడానికి ముందుగా ఎమ్మెల్సీని అరెస్టు చేయాలంటూ సుబ్రహ్మణ్యం భార్య రెండు రోజులుగా పోరాడి పోలీసులపై తీవ్రమైన వత్తిడి తెచ్చింది.   అంతకుముందు పోలీసులు రోజంతా ఎంత ఒత్తిడి తెచ్చినా ఆమె తన ‘పట్టు’ వీడలేదు. ‘నా భర్త మృతదేహం కుళ్లిపోయినా ఫరవాలేదు.. కానీ, పోస్టుమార్టానికి అంగీకరించేది లేదు’ అని ఆమె  తేల్చిచెప్పారు. మార్చురీ వద్దకు బలవంతంగా తీసుకెళ్లినా శవ పంచనామాకు ఆమె అంగీకరించలేదు. ఈ దశలో ‘పోలీసులు నన్ను కొట్టారు’ అని ఆమె చేసిన విడుదల చేసిన ఆడియో సందేశం శనివారం…

Read More

బీహార్‌, అసోం, మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌ తదితర రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, పిడుగులు పడటం, కొండచరియలు విరిగిపడటంతో బీహార్‌లో 33 మంది, అసోంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అసోంలో మరో ఏడుగురు గల్లంతయ్యారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఎనిమిదిమంది, మేఘాలయలో ముగ్గురు భారీ వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. బీహార్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. పలుచోట్ల వృక్షాలు నేలకూలాయి. 16 జిల్లాల్లో మరణించిన 33 మంది కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఆదేశించినట్లు బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల వద్ద, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు. బీహార్‌లో 33 మంది మరణించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అసోంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నాగోన్‌, హౌజారు, కాచర్‌,…

Read More

తెలంగాణలో కరోనా అదుపులోకి వచ్చిందని ఊపిరి పీల్చుకుంటున్న వేళ వివిధ దేశాలను వెంటాడుతున్న బీఏ4 కరోనా వేరియంట్‌ హైదరాబాద్‌ను తాకడంతో వైద్య వర్గాలు, ప్రజల్లో ఆందోళన నెలకొంది. కరోనా వైరస్‌ వ్యాప్తిలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోయాయి. వైరస్‌ వ్యాప్తి కట్టడికి కరోనా టీకా కూడా అందుబాటులోకి వచ్చింది. అయినా కరోనా వైరస్‌ వ్యాప్తి మాత్రం ఇంకా కొనసాగతూనే ఉంది. ఇప్పటికే పలు దేశాల్లో తీవ్రస్థాయిలో వ్యాప్తిలో ఉంది.  రోజు రోజుకు కొత్త వేరియంట్లతో విరుచుకుపడుతూ అత్యంత ప్రమాదకరంగా వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. రోజుకో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా బీఏ4 కరోనా వేరియంట్‌ ఈ నెల 9న దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో నమోదు అయింది. ఈ వేరియంట్‌ దేశంలోని మిగతా నగరాలకు వ్యాప్తి చెందే ప్రమాదముందని భారత వైద్య పరిశోధనా మండలి ఆందోళన వ్యక్తం చేస్తోంది. కరోనా బారిన పడి కోలుకున్న వారికీ, రెండు డోస్‌ల టీకా తీసుకున్న వారీకీ ఈ వేరియంట్‌ సోకుతున్నట్లు నిర్దారణ అయింది.…

Read More

దేశంలో చాలా కాలం త‌ర్వాత తొలిసారి పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు ఉజ్వల పధకం క్రింద గ్యాస్ ధరలను సహితం భారీగా తగ్గిస్తూ  కేంద్ర ప్ర‌భుత్వం శ‌నివారం సాయంత్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 మేర ఎక్సైజ్ సుంకాన్ని త‌గ్గిస్తున్న‌ట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వ‌రుస ట్వీట్లు చేశారు.  దీంతో పెట్రోల్‌పై రూ.9.50, డీజిల్‌పై రూ.7 మేర తగ్గుతుందని ఆమె ప్ర‌క‌టించారు. అయితే ఈ ప్ర‌క‌ట‌న‌పై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ కాసేప‌టి క్రితం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు.  ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలే త‌మ‌కు తొలి ప్రాధాన్య‌మంటూ ఆయ‌న స‌ద‌రు ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. శ‌నివారం తీసుకున్న కీలక నిర్ణ‌యాల్లో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు భారీగా త‌గ్గేలా తీసుకున్న నిర్ణ‌యంతో ప‌లు రంగాల‌కు సానుకూల ప్ర‌భావం ల‌భించ‌నుంద‌ని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.  ఈ నిర్ణ‌యంతో దేశ ప్ర‌జ‌ల‌కు ఊర‌ట లభించ‌నుంద‌ని, వారి జీవితాల‌ను మ‌రింత సుల‌భ‌త‌రం…

Read More

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటన సందర్భంగా శనివారం పలువురు నేతలతో సమాలోచనలు ప్రారంభించారు. తొలుత సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీలో తుగ్లక్‌ రోడ్‌-23లోని కేసీఆర్ నివాసంలో ఇద్దరు నేతలు విందు సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల గురించి ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. ప్రత్యామ్నాయ కూటమి, ప్రాంతీయ పార్టీల అవసరం గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ త‌ర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. సౌత్ మోతీ భాగ్ లోని ఆ స్కూల్‌ని సంద‌ర్శించి అక్కడి సౌల‌తులు, తరగతి గదులను పరిశీలించారు. స‌ర్కారు స్కూళ్ల‌లో ప‌రిస్థితుల‌పై కేజ్రీవాల్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీరిరువురు ఢిల్లీలోని మొహల్లా క్లినిక్ లను కూడా సందర్శించారు. ఢిల్లీ విద్యా విధానం దేశానికే ఆదర్శమని సీఎం కేసీఆర్ కొనియాడారు. దేశమంతటా ఢిల్లీ తరహా విద్యావిధానం ఉండాలని ఆకాంక్షించారు. కానీ కేంద్రం తెచ్చిన…

Read More

జలుబు వంటి లక్షణాలకు కారణమయ్యే ఓ సాధారణ వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఒక్క ఏడాది లోనే లక్షమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా ఐదేళ్లలోపు చిన్నారుల్లోనే ఈ మరణాలు అత్యధికంగా సంభవిస్తున్నాయని తెలియజేసింది.  ఈ అధ్యయన నివేదిక ది లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైంది. చిన్నారుల్లో రెస్పిరేటరీ సైన్‌సైటియల్ వైరస్ (ఆర్‌ఎస్‌వి) ప్రభావాన్ని అంచనా వేసేందుకు బ్రిటన్ పరిశోధకులు తాజా అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా ఒక్క 2019 లోనే ఆరు నెలల లోపు వయసున్న 45 వేల మంది చిన్నారులు ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టు గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్‌ఎస్‌వీ వైరస్ బారిన పడుతోన్న ప్రతి ఐదుగురిలో ఒకరు చనిపోతున్నట్టు తెలిపారు. చిన్నారులు పుట్టిన 28 రోజుల నుంచి ఆరు నెలల మధ్య కాలం లోనే ఆర్‌ఎస్‌వీ మరణాల ముప్పు అధికంగా ఉందన్న నిపుణులు వైద్య సదుపాయం ఉన్న ప్రాంతాల్లో ఈ ముప్పు తక్కువగానే…

Read More

పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికీ పూర్తవుతుందో కేంద్రమే చెప్పాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి  వడ్డే శోభనాద్రీశ్వరరావు స్పష్టం చేశారు. ప్రముఖ రైతు నాయకుడు కొల్లి నాగేశ్వరరావు ద్వితీయ వర్ధంతి సభలో సామాజిక ఉద్యమకారుడు టి.లక్ష్మీనారాయణ రచించిన, కొల్లి నాగేశ్వరరావు అధ్యయన కేంద్రం ప్రచురించిన, “పోలవరం ఎన్నటికి సాకారమయ్యేను!” చిరు పుస్తకాన్ని విజయవాడలో ఆయన ఆవిష్కరించారు. ఈ  ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితుల్లో కేంద్ర జలవనరుల శాఖ ఉందని ఈ సందర్భంగా వడ్డే ధ్వజమెత్తారు. పెరుగుతున్న ప్రాజెక్ట్ అంచనాలను కేంద్రమే భరించాలన్నాని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం జాతీయ రహదారుల కోసం కోట్లు ఖర్చు చేస్తోంది కానీ వ్యవసాయానికి నిధులు మాత్రం నామమాత్రంగా ఇస్తున్నారని ఆయన విమర్శించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన హితవు చెప్పారు.  ఆంధ్రప్రదేశ్ జీవనాడి, జాతీయ ప్రాజెక్టు, పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణంలో నెలకొన్న అనిశ్చితికి కారణం  మోదీ,  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే కారణమని ఈ సభలో  ప్రసంగించిన…

Read More

మానవ అక్రమ రవాణాను కట్టడి చేయడం కోసం జారీచేసిన జిఓను అమలు పరచడంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు ట్రాఫికింగ్ భాదితులతో పనిచేస్తున్న హెల్ప్  సంస్థ,   రాష్ట్ర స్థాయి సెక్స్ వర్కర్స్ , సర్వైవర్స్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఫోరమ్ విముక్తి  జరిపిన అధ్యయనంలో వెల్లడైంది, జనవరి 2015 నుండి ఆగస్టు 2020 వరకు ఈ జిఓ అమలు స్థితిని అర్థం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీఐ దరఖాస్తులు  దాఖలు చేసింది. 20 ఏప్రిల్ 2022 న మహిళా అభివృద్ధి శిశు  సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లో జిఓ అమలు చేసిన్నట్లు తెలిపారు.  అయితే, ఎటువంటి కారణం లేకుండానే అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో వారి ప్రతిస్పందన విఫలమైందని, సమాధానమిచ్చిన ప్రశ్నలు కూడా రాష్ట్రంలోని క్షేత్ర స్థాయిలో అమలు తీరుకు వాస్తవ పరిస్థితికి భిన్నంగా అనేక వైరుధ్యాలను కలిగి ఉన్నాయి. దానితో అందించిన సమాచారం ఖచ్చితత్వాన్ని ప్రశ్నార్ధకం చేశాయి. ఈ అంశాలను మీడియా సమావేశంలో విముక్తి ఉపాధ్యక్షురాలు …

Read More

మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం, మాజీ నటి, ఎంపీ నవనీత్‌ రాణా దంపతుల మధ్య రాజకీయ వైరం మరింత ఉధృతం అవుతున్నది. తాజాగా బృహన్‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) శనివారం ఎంపీ నవనీత్ రాణా, మహారాష్ట్రలో ఎమ్మెల్యే అయిన ఆమె భర్త రవి రాణాకు నోటీసులు జారీ చేసింది. మహారాష్ట్రలోని ఖార్‌ ప్రాంతంలో నవనీత్‌ రాణా దంపతులు తమ ఇంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు బీఎంసీ గుర్తించారు. ఈ క్రమంలో వారి ఫ్లాట్‌ వద్ద అక్రమ నిర్మాణాన్ని ఏడు రోజుల్లో తొలగించాలని బీఎంసీలు అధికారులు నోటీసులు పంపించారు. లేనిపక్షంలో బీఎంసీ చర్యలు తీసుకొని కూల్చివేస్తుందని హెచ్చరించారు.  ఈ క్రమంలోనే ఎం ఎం సి చట్టంలోని సెక్షన్ 475-ఎ ప్రకారం ఫ్లాట్ యజమానికి జరిమానాతో పాటుగా జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.  కాగా, మాజీ నటి, ఎంపీ నవనీత్‌ కౌర్‌, ఆమె భర్త రవి రానాలు హనుమాన్‌ చాలీసా…

Read More