గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద మరో సంచలనం సృష్టించాడు. చెస్ వరల్డ్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్కు ఈ ఏడాదిలో రెండోసారి దిమ్మదిరిగే షాకిచ్చాడు. చెస్ బుల్ మాస్టర్స్ ఆన్ లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్లో భారత్కు చెందిన 16 ఏళ్ల ప్రజ్ఞానంద దెబ్బకు కార్ల్సన్ చిత్తయ్యాడు. శుక్రవారం జరిగిన ఐదో రౌండ్లో కార్ల్సన్తో తలపడ్డ ప్రజ్ఞానంద 41 ఎత్తుల్లో ప్రపంచ చెస్ ఛాంపియన్పై విజయం సాధించాడు. 40వ మూవ్లో కార్ల్సన్ చేసిన తప్పుతో ప్రజ్ఞానంద గెలుపు సులువైంది. నిజానికి ఇరువురు ఆటగాళ్లు ఎత్తుకు పైఎత్తులు వేయడంతో ఒక దశలో మ్యాచ్ డ్రా అయ్యే సూచనలు కనిపించినా చివరకు కార్ల్సన్కు ఓటమి తప్పలేదు. ఈ విజయంతో టోర్నీలో ప్రజ్ఞానంద 12 పాయింట్లతో ఐదో స్థానంలో నిలవగా, 15 పాయింట్లతో కార్ల్ సన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. జ్ఞానానంద చేతిలో కార్ల్సన్ ఓటమి పాలవడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎయిర్…
Author: Editor's Desk, Tattva News
తెరపై తాము రాజకీయ విరోధులం అన్నట్లుగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కనిపిస్తుంటారు. తమ రాష్ట్ర ప్రయోజనాలకు పొరుగున ఉన్న ముఖ్యమంత్రి విఘాతం కలిగిస్తున్నారని అంటూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటారు. కానీ లోపాయికారిగా ఇద్దరు కుమ్మక్కై ఆర్ధిక దోపిడీకి పాల్పడుతున్నట్లు స్పష్టం అవుతున్నది. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా వారు ఎంపిక చేసిన అభ్యర్థుల తీరు ఈ అంశాన్ని స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాల నుండి మొత్తం ఏడుగురిని రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేస్తే, వారిలో కేవలం వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మాత్రమే తొలినుండి ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. అంతకన్నా జగన్ ఎదుర్కొంటున్న అవినీతికి సంబంధించి సిబిఐ, ఈడీ కేసులలో జగన్ మొదటి ముద్దాయి అయితే, విజయసాయి రెండో ముద్దాయి. ఇద్దరు కలసి గతంలో 16 నెలలో జైలులో గడిపి, ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. అవినీతి కేసులు ముందుకు సాగకుండా కట్టడి చేసేందుకు ఢిల్లీ స్థాయిలో వ్యవహారాలు నడపడమే ఆయన…
వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్రామ పంచాయతీల నిధులు రూ,,7660 కోట్లు దొంగిలించినట్లు ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్ర ప్రదేశ్ సర్పంచుల సంఘాలు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి ఫిర్యాదు చేశాయి. ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ నాయకత్వంలో గవర్నర్ ను కలిసి రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయతీల సర్పంచులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. 2018 నుంచి 2022 వరకు 14, 15 వ ఆర్థిక సంఘాల నిధులను కేంద్ర ప్రభుత్వం రూ,, 7,660 కోట్లను రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు పంపించిందని గుర్తు చేశారు. అయితే, సర్పంచులకు తెలియజేయకుండా, చెక్కుల పై సర్పంచుల సంతకాలు తీసుకోకుండా, పంచాయతీ బోర్డు తీర్మానాలు లేకుండా అక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించి, తన స్వంత అవసరాలకు, స్వంత పథకాలకు వాడేసుకుందని ఆరోపించారు. రాత్రికి రాత్రే అడ్డగోలుగా నిధులు దారి మళ్లించడంతో పంచాయితీ ఖాతాలు జీరో /నిల్ బ్యాలెన్స్ చూపిస్తున్నాయని తెలిపారు. దీంతో సర్పంచులు ఖంగుతిన్నారని, గ్రామాల…
ఈసారి ఎన్నికల్లో 40 శాతం యువతకే టిక్కెట్లు ఇవ్వనున్నట్టు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అనంతపురం జిల్లా టిడిపి విస్తృత స్థాయి సమావేశంలోనూ, సోమందేపల్లిలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలోనూ ఆయన మాట్లాడుతూ ప్రజల్లో ఉండి పార్టీ కోసం పనిచేసే వారికే టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. మాజీ మంత్రి పరిటాల రవి హత్య నిందితులను శిక్షించి ఉంటే వైఎస్ వివేకా హత్య జరిగి ఉండేది కాదని స్పష్టం చేశారు. ప్రజలు ఆలోచించాలి రాష్ట్రాన్ని కాపాడుకుంటారా.. మరో శ్రీలంక చేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. 151 సీట్లు ఇచ్చింది నీ కేసుల కోసమా జగన్? అని ప్రశ్నించారు. కోడి కత్తి కేసులో జగన్ తేలుకుట్టిన దొంగలా ఉన్నారని చంద్రబాబు తప్పుబట్టారు. ‘‘ఎంత గొప్పవాడవయ్యా జగన్ గొడ్డలి పోటును గుండెపోటుగా మార్చావు. నారాసుర రక్తచరిత్ర అంటూ నేను చంపానని నా దగ్గరే కత్తి పెడతారు.…
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తెలంగాణలోని మూడో వంతు స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు రోజుల పర్యటన చేపడుతూ ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. పవన్ వ్యాఖ్యలతో అభిమానులు, కార్యకర్తలు ఆనందంలో మునిగితేలుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన అన్ని వర్గాల వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతో మంది త్యాగాలు చేశారన్నారు. సామాజిక మార్పు కోసమే ‘జనసేన’ అని స్పష్టం చేశారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం ఎన్ని ఓటములైనా భరిస్తామని చెప్పారు. ఆంధ్రలోనే అధికారం ఆశించలేదని… తెలంగాణలో అధికారం ఎలా ఆశిస్తానని ప్రశ్నించారు. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాజకీయాల్లో కొత్త తరం రావాలని పిలుపిచ్చారు. జనసేనకు ప్రతి నియోజకవర్గంలో ఐదు వేల నుంచి ఆరు వేల ఓట్లు ఉన్నాయని.. తాము ఎన్నికల్లో గెలవకపోయినా,…
ప్రతిపక్షాలు అనవసర అనుచిత అంశాలను ప్రాధాన్యత క్రమపు విషయాలుగా చిత్రీకరించడానికి యత్నిస్తాయని, ఈ సాలె గూటిలోకి మనం వెళ్లకుండా మన పథంలో అంటే జాతీయ ప్రయోజనాల కోణంలోనే ముందుకు సాగాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ బిజెపి నాయకులు, కార్యకర్తలను హెచ్చరించారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరుగుతున్న బిజెపి కార్యవర్గ సమావేశంలో సభ్యులను ఉద్ధేశించి మోదీ వర్చువల్ పద్ధతిలో ప్రసంగిస్తూ కొన్ని రాజకీయ పార్టీలు ఏదో విధంగా దేశాన్ని ప్రధాన అంశాల నుంచి దారిమళ్లించే ఓ వలయాన్ని సృష్టిస్తాయని తెలిపారు. అయితే ఈ బోనులో పార్టీ నేతలు పడరాదని స్పష్టం చేశారు. కేవలం జాతీయ ప్రయోజనాలకు కట్టుబడి వ్యవహరించాలని హితవు చెప్పారు. ఈ ఎనిమిదేళ్లుగా తమ ప్రభుత్వం సుపరిపాలన, సామాజిక న్యాయానికి అంకితం అయిందని, దీనినే ఆలంభనగా చేసుకుని పార్టీ శ్రేణులు ప్రజల వద్దకు వెళ్లడం, ప్రజలను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లడం జరగాలని ప్రధాని సూచించారు. తేలిక మార్గాలను ఎంచుకుంటే ఫలితం ఉండదని తేల్చి చెప్పారు. అంకితభావం, శ్రమించడం వల్లనే…
జ్ఞాన్ వాపి మసీదు కేసు విచారణను వారణాసి జిల్లా జడ్జికి బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. యూపీ జ్యుడీషియల్ సర్వీసెస్ కు చెందిన అనుభవజ్ఞుడైన న్యాయవాది ఈ కేసులు విచారించాలని ఆదేశించింది. జ్ఞాన్ వాపి మసీదుకు సంబంధించి.. కమిటీ వేసిన పిటిషన్ పై విచారణను జూలై రెండో వారానికి వాయిదా వేసింది. జిల్లా జడ్జి ఈ కేసును విచారణ జరిపితే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని జస్టిస్ చంద్రచూడ్ బెంచ్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సర్వేలో కనిపించిన శివలింగం తదితర దేవతలను పూజించే హక్కులను కల్పించాలని హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా విచారణ జరపాలని జిల్లా జడ్జిని ఆదేశించింది. 20 – 25ఏళ్ల అనుభవమున్న వారణాజి జిల్లా జడ్జికి విచారణ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పింది. ఆయన నిర్ణయించేంత వరకు హిందూవుల ప్రార్థనలకు అనుమతిపై నిర్ణయం తీసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అప్పటివరకు శివలింగం రక్షణకు, ఈనెల 17న…
బీజేపీ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. కాంగ్రెస్ సుదీర్ఘ కాలం దేశాన్ని పాలించినా పేదరికం, నిరుద్యోగం లాంటి సమస్యలు పరిష్కారం కాలేదని గుర్తు చేశారు. అయితే ప్రధానిగా మోదీ వచ్చాక ఒక్కొక్కటి సమస్యలు కొలిక్కి వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో భారత్ కు నేడు గౌరవం పెరిగిందని చెప్పారు. బయటి దేశాల నుంచి రక్షణ ఆయుధాల కొనుగోలు తగ్గాయని తెలిపారు. మహారాష్ట్రలోని పూణెలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన రాజ్ నాథ్ సింగ్, పూణేలోని డాక్టర్ డివై పాటిల్ విద్యాపీఠ్ విద్యార్థుల 13వ స్నాతకోత్సవంలో కూడా ప్రసంగించారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ సాధించేందుకు యువత కొత్త టెక్నాలజీలను రూపొందించాలని, ఆవిష్కరిం చాలని రక్షణ మంత్రి పిలుపునిచ్చారు. భారతదేశం తన అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండాలని భావిస్తున్నామని.. దేశీయ రక్షణ కొనుగోళ్లపై ప్రభుత్వం దృష్టి సారించిందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఏ…
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్ బూటకమని జస్టిస్ వి.ఎస్ సిర్పూర్కర్ కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు 387 పేజీలతో కూడిన రిపోర్టును సుప్రీంకోర్టుకు సమర్పించింది. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారని సిర్పూర్కర్ కమిషన్ నివేదికలో స్పష్టం చేసింది. పోలీస్ మ్యానువల్‌కు భిన్నంగా విచారణ జరిగినట్లు తేల్చింది. నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్న విషయాన్ని కూడా పోలీసులు దాచారని సిర్పూర్కర్ కమిషన్ చెప్పింది. పోలీసులు గాయపడి హాస్పిటల్ లో చేరినట్లు కట్టుకథ అల్లారని, సీసీటీవీ ఫుటేజీ దొరకకుండా చేశారని వెల్లడించింది. దిశ నిందితులు ముందుగా కాల్పులు జరిపారంటూ రిపోర్టులో అబద్దాలు రాశారని చెప్పింది. నిందితులను చంపాలనే ఉద్దేశంతోనే కాల్పులు జరిపారని అభిప్రాయపడింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌కు పాల్పడిన 10 మంది పోలీసులు సురేందర్, నర్సింహారెడ్డి, షేక్ లాల్ మదర్, మహ్మద్ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవి, వెంకటేశ్వర్లు అరవింద్ గౌడ్, జానకిరామ్, బాలు రాథోడ్, డి. శ్రీకాంత్‌పై 302 సెక్షన్…
భారత బాక్సర్ నిఖత్ జరీన్ దేశం గర్వపడే ప్రదర్శన చేసింది. 2022 ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు పసిడి పతకం సాధించింది. గురువారం జరిగిన మహిళల 52 కేజీల విభాగం పసిడి పోరులో థారులాండ్ బాక్సర్ జిట్‌పాంగ్ జుటామస్‌పై నిఖత్ జరీన్ ఏకపక్ష విజయం నమోదు చేసింది. ఐదుగురు న్యాయమూర్తులు నిఖత్ జరీన్‌ను ఏకగ్రీవ విజేతగా ఎంచుకున్నారు. 5-0తో తిరుగులేని విజయం సాధించిన అరంగేట్రంలోనే ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. గత 14 ఏండ్లలో ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకం సాధించిన రెండో భారత బాక్సర్‌గానూ నిఖత్ జరీన్ రికార్డు నెలకొల్పింది. ఈ సమయంలో దిగ్గజ బాక్సర్ ఎంసీ మేరీకోమ్ మాత్రమే ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పంచ్ సంధించింది. ఆరుసార్లు చాంపియన్ ఎంసీ మేరీకోమ్ (2002, 2005, 2006, 2008, 2010, 2018), సరితాదేవి (2006), జెన్నీ ఆర్‌ఎల్ (2006), లేఖ కెసి (2006)ల తర్వాత ప్రపంచ బాక్సింగ్ పసిడి…