కాశీ విశ్వనాథ్-జ్ఞాన్వాపి వివాదం కోర్టు గదుల్లో చర్చనీయాంశంగా మారడంతో, ఆర్‌ఎస్‌ఎస్ “చారిత్రక వాస్తవాలను” సమాజం ముందు “సరైన దృక్పథంలో” ఉంచాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేసింది. “ప్రస్తుతం జ్ఞానవాపి సమస్య నడుస్తోంది. కొన్ని వాస్తవాలు బహిరంగంగానే వస్తున్నాయి. వాస్తవాలు బహిరంగంగా రావాలని నేను నమ్ముతున్నాను” అని ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన దేవర్షి నారద్ పాత్రకర్ సమ్మాన్ సమరోహ్‌లో కార్యక్రమంలో పాల్గొంటూ ఏది ఏమైనప్పటికీ, నిజం ఎల్లప్పుడూ బయటకు రావడానికి ఒక మార్గాన్ని కనుగొంటుందని చెప్పారు. మీరు దానిని ఎంతకాలం దాచగలరు? అని ప్రశ్నించారు. “భారతదేశం సమ్మిళిత మైందనేడిది నిజం. ప్రజలు గంగా-జమున సంస్కృతి గురించి మాట్లాడుకుంటారు. కానీ తరువాత అది ఒకటిగా మారాలి. అది గంగగా మారాలి. అప్పుడే మనం కలిసి నడవగలం” అని స్పష్టం చేశారు. ఈ విషయమై ప్రజల్లో మేల్కొలుపును సృష్టించాల్సిన బాధ్యత ఉందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర…
Author: Editor's Desk, Tattva News
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ప్రసంగంను 2022-23 విద్యా సంవత్సరం నుండి కర్నాటక పాఠ్య పుస్తకాలలో పదవ తరగతి విద్యార్థులకు మొదటి భాషా సిలబస్‌లో చేర్చారు. రచయిత రోహిత్ చక్రతీర్థ నేతృత్వంలోని పాఠ్యపుస్తక పునర్విమర్శ కమిటీ మార్చిలో ఆ మేరకు సిఫార్సు చేసింది. “నిజవాడ ఆదర్శ పురుషుడు యరాగాబేకు?” అనే శీర్షికతో. (నిజమైన మార్గదర్శిగా ఎవరు ఉండాలి?) కన్నడ గద్య పాఠ్యపుస్తకంలో భాగంగా దీనిని ముద్రిస్తున్నారు. ఈ కమిటీ తన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. సిద్ధాంత పరంగా ఈ ప్రసంగాన్ని జోడించడం లేదని, పైగా అందుకోసం ఏ రాజకీయ పార్టీ లేదా సంస్థ నుండి ఎటువంటి ఒత్తిడి లేదని చక్రతీర్ధ స్పష్టం చేశారు. విద్యార్థులపై ఏ సంస్థ భావజాలాన్ని విధింపచేసే ప్రయత్నం కూడా కాదని తెలిపారు. “మేము హెడ్గేవార్‌ను ఓ రచయితగా ఎంచుకున్నాము. ఆయన భావజాలం లేదా సంస్థ ఆధారంగా కాదు” ఓ వార్త సంస్థకు…
మూడేళ్ళ తరవాత జమ్మూ కాశ్మీర్ లో అమర్‌నాథ్ కు ఈ ఏడాది అనుమతి ఇస్తునందున యాత్రికుల భద్రత పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. గత రెండేళ్లుగా కరోనా కారణంగా యాత్రకు అనుమతి ఇవ్వలేదు. అంతకు ముందు 2019లో ఆర్టికల్ 370 రద్దుతో పాటు, రాష్ట్ర హోదాను రద్దుచేసి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడంతో అల్లర్లు చెలరేగవచ్చని అర్ధాంతరంగా యాత్రను కుదించివేశారు. ఇటీవల కాలంలో సహితం కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులు లక్షిత దాడులకు పాల్పడుతూ ఉండడంతో యాత్రికుల భద్రతకు ఎటువంటి ప్రమాదం కాకుండా పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రెండు రోజుల క్రితం అత్యున్నత అధికారిక సమావేశంలో భద్రతాపరమైన ఏర్పాట్ల గురించి సమీక్ష జరిపి, తగు సూచనలు చేశారు. మొదటిసారిగా, యాత్రికులు అందరికి ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ట్యాగ్స్, రీడర్స్‌ను ఉపయోగించి యాత్రికులను వైర్‌లెస్ విధానంలో నిరంతరం గమనించే ఏర్పాటు చేస్తున్నారు. ఆర్ఎఫ్ఐడీ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటీఫికేషన్. ఇది ట్యాగ్స్, రీడర్స్‌తో…
సమాజంలో అణగారిన వర్గాలకు, నిరుపేదలకు విద్యను చేరువ చేసేందుకు, మెరుగైన విద్యను అందించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో విద్యార్ధులు సైతం భాగస్వాములు కావాలని గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయడు పిలుపిచ్చారు. దేశంలో విద్యారంగంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి, అందరికీ సమానమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. విద్య, సామాజిక – ఆర్థిక అభివృద్ధి విషయంలో సమాజంలో ఏ ఒక్కరూ వెనుకబడి ఉండడానికి వీలు లేదనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని ఆయన సూచించారు. తమిళనాడులోని నీలగిరి దగ్గర ఉన్న లవ్‌డేల్ లోని లారెన్స్ పాఠశాలను బుధవారం ఉపరాష్ట్రపతి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను, ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, మార్పునకు అత్యంత కీలకమైన అంశంగా విద్యను అభివర్ణించారు. అది గుణాత్మకమైన ఒత్తిడిని అందిస్తూనే, దేశ అభివృద్ధి వేగానికి ఊతం ఇస్తుందని తెలిపారు. ఇవాళ భారతదేశం ప్రపంచంలోని అగ్రగామి దేశాల్లో ఒకటిగా ఎదిగేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. భారత్ లో 65 శాతం కంటే ఎక్కువ…
వైసీపీ సర్కార్ ఛార్జీల పెంపుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ చేపట్టిన `బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వస్థలమైన కడప జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రెండో రోజులపాటు పర్యటిస్తూ జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. కడపలో వైసీపీ సర్కార్ ను లక్ష్యంగా చేసుకొంటూ ప్రజల నాది చూస్తుంటే జగన్ పై తీవ్రమైన వ్యతిరేకత ఉందని తెలుస్తుందని స్పష్టం చేశారు. బాదుడే బాదుడు ప్రతి ఇంటికి చేరిందని, కడప లో ఉత్సహం రెట్టింపు అయిందని చెబుతూ గత మూడు సంవత్సరాల్లో జగన్ అరాచకాలు అంతా ఇంత కాదని ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు కూడా బాదుడే బాదుడు కొనసాగుతోందని, జగన్ పాలనలో వీర బాదుడు చెస్తున్నాడని విమర్శించారు. శ్రీలంక లో రాజపక్సేని ప్రజలు తరిమి కొట్టారని గుర్తుచేస్తూ ఏపీ లో కూడా జగన్ కు అలాంటి పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను అడ్డంకులు…
కృష్ణా నదిపై కర్ణాటక నిర్మించతలపెట్టిన అప్పర్ భద్ర, అప్పర్ తుంగ ప్రాజెక్టులపై సుప్రీం కోర్టును ఆశ్రయించే దిశలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. అప్పర్ భద్ర ప్రాజెక్టు ద్వారా 10 టీఎంసీల నీటిని, అప్పర్ తుంగ ప్రాజెక్టు ద్వారా 20 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు కర్ణాటక ఈ రెండు ప్రాజెక్టులను తలపెట్టింది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణకు ఎగువ నుంచి చుక్క నీరు కూడా రాదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ రెండు ప్రాజెక్టులకు బచావత్ ట్రిబ్యునల్ నుంచి ఎటువంటి నీటి కేటాయింపులు లేకున్నా కర్ణాటక ప్రభుత్వం ముందుకు వెళ్లడం దారుణమని తెలంగాణ నీటిపారుదలశాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రిబ్యునళ్లకు, నిబంధనలకు విరుద్దంగా కర్ణాటక రాష్ట్రం వ్యవహరిస్తున్నా కేంద్రం పట్టించుకోక పోవడంతో న్యాయపరమైన మార్గంలో వెళ్లి కర్ణాటకను నిలువరించాలని తెలంగాణ యోచిస్తోంది. ఇందుకు సుప్రీం కోర్టులో కేసు వేయాలని తెలంగాణ సాగునీటి శాఖ భావిస్తోంది. ఇందుకు న్యాయ నిపుణుల అభిప్రాయాలను, సూచనలను సేకరిస్తోంది.…
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడుగా ఉన్న ఏజీ పెరారివాలన్ కు సుప్రీం కోర్ట్ విముక్తి కలిగించింది. అతడిని విడుదల చేయాలంటూ తీర్పు వెలువరించింది. జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, బీఆర్ గవాయి, ఏఎస్ బొప్పన్నలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. దానితో 31 ఏళ్ల తర్వాత పెరారివాలన్ జైలు జీవితం నుండి బయట పడుతున్నారు. రాజీవ్ గాంధీ హత్యకు సూత్రధారి అయిన ఎల్టీటీఈ వ్యక్తి శివరాసన్ కోసం పెరారివాలన్ రెండు 9-వోల్ట్ బ్యాటరీలను కొనుగోలు చేశాడు. రాజీవ్ గాంధీని హత్య చేసేందుకు బాంబులో బ్యాటరీలను ఉపయోగించారు. ఆ సమయంలో పెరారివాలన్ వయసు 19 ఏళ్లు. దీంతో ఈ కేసుకు సంబంధించి 1998లో పేరారివాలన్‌కు టాడా కోర్టు మరణశిక్ష విధించింది. మరుసటి ఏడాది సుప్రీంకోర్టు కూడా ఆ శిక్షతో ఏకీభవించింది. ఈ ఏడాది మార్చిలో ఉన్నత న్యాయస్థానం అతడికి బెయిల్ మంజూరు చేసింది. అయితే విడుదలలో జాప్యం…
ఒక వంక ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ సారి తమిళనాడు నుండి ఎన్నిక కావాలని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి పి చిదంబరం ప్రయత్నిస్తున్న సమయంలో ఆయనతో పాటు, ఆయన తనయుడు, లోక్‌సభ సభ్యుడు కార్తీల చిదంబరంల ఇల్లు, కార్యాలయాలపై మంగళవారం సిబిఐ సోదాలు జరపడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే వీరిపై పలుసార్లు సిబిఐ సోదాలు జరిగాయి. అయినా నిర్దుష్టంగా వారు తమపై ఎటువంటి నేరారోపణ చేయలేక పోయారని వారు చెబుతున్నారు. గత పర్యాయం మహారాష్ట్ర నుండి రాజ్యసభకు ఎన్నికైన చిదంబరం ఈ పర్యాయం రాష్ట్రం నుండి డీఎంకే మద్దతుతో సొంత రాష్ట్రం నుండి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం రాజ్యసభ ఎన్నికలలో పోటీ చేయకుండా చేయడం కోసమే ఈ సోదాలు జరిపారని విమర్శలు చెలరేగుతున్నాయి. చెన్నై, ముంబాయి, ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్ తదితర పదిచోట్ల వారి నివాసా లు, కార్యాలయాలపై ఏక కాలంలో సోదాలు చేపట్టింది. మొత్తం వంద మందికిపైగా…
సీనియర్ ఐపిఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఎపి ప్రభుత్వం ఎట్టకేలకు ఉత్తర్వులు జారీ చేసింది. సర్వీసులోకి తిరిగి తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. 2022 ఫిబ్రవరి 8 నుంచి ఏబీవీ సర్వీసు రీఇన్‌స్టేట్ చేస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఆ రోజు నుంచి ఏబీ వెంకటేశ్వరరావు సర్వీసులో ఉన్నట్లు గుర్తించి ఆయనకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు కల్పించాలని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు జీఏడీకి రిపోర్టు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఏబీవీపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఎపి ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. సర్వీస్ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ఏబీవీని ఏపీ ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 8న వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేసింది. టిడిపి హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న సమయంలో భద్రతా ఉపకరణాలు కొనుగోలులో అక్రమాలు జరిగాయంటూ వెంకటేశ్వరరావును విధులలో నుండి ఎపి ప్రభుత్వం తొలగించింది. ఏబీవీకి గత నెల సుప్రీంకోర్టులో ఊరట దక్కింది.…
గుజరాత్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పాటీదార్ ఉద్యమ నేత, గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్థిక్ పటేల్ పార్టీకి రాజీనామా చేశారు. అత్యవసరమైన పరిస్థితుల్లో పార్టీకి అందుబాటులో ఉండాల్సిన తమ నేత విదేశాలకు వెళుతుంటారని పరోక్షంగా రాహుల్‌గాంధీని ఎద్దేవా చేశారు. ఈ మేరకు పూర్తి వివరణతో రెండు పేజీలతో కూడిన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపారు. అలాగే ట్విటర్‌లోనూ పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, తన పదవికి రాజీనామా చేస్తున్నానని పేర్కొంటూ తన నిర్ణయాన్ని సహచరులు, గుజరాత్ ప్రజలు స్వాగతిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గుజరాత్ రాష్ట్ర భవిష్యత్ కోసమే తాను తీసుకున్న ఈ చర్య ఉపయోగపడుతుందని భావిస్తున్నానని ఆ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఇటీవల రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటనకువచ్చిన సమయంలో హార్థిక్ పటేల్‌తో భేటీ కాలేదు. ఈ అంశంపై స్పందిస్తూ తాను అగ్ర నేతలతో సమావేశమైనపుడు వారు రాష్ట్ర సమస్యలను వినకుండా…