Author: Editor's Desk, Tattva News

ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌పై వివాదాస్పద వ్యాఖ‍్యలు చేస్తూ పెట్టిన పోస్టుల వేడి మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. మాజీ ఉపప్రధానిపై పెట్టిన పోస్ట్‌కు మరాఠీ నటి కేతకీ చితాలే (29)ను ఆదివారం థానే పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను కోర్టులో హాజరుపరుచగా.. మే 18వ తేదీ వరకు పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు వెల్లడించింది.  చితాలే తన ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో మరొక వ్యక్తిని ఉద్దేశిస్తూ మరాఠీ కవితను పోస్ట్ చేసింది.  అది ఇంటి పేరు (పవార్) , వయస్సు (80)ను ప్రస్తావించింది. కానీ  81 ఏళ్ల  ఎన్ సిపి  నాయకుడు బాధపడుతున్న శారీరక రుగ్మతలను కూడా సూచిస్తుంది. “నరకం ఎదురు చూస్తున్నది”, “నీవు బ్రాహ్మణులను ద్వేషిస్తావు” వంటి పదాలు అందులో ఉన్నాయి కాగా, ఆమెపై  మరో మూడు కేసులు నమోదయ్యాయి. ముంబైలో రెండు,  అకోలా జిల్లాలో ఒక కేసును  నమోదైనట్లు పోలీసులు తెలిపారు. తాజాగా పూణేలో బీజేపీ మహారాష్ట్ర అధికార ప్రతినిధి వినాయక్‌ అంబేకర్‌పై ఎన్సీపీనేతలు,…

Read More

రెండేళ్లుగా మూడు రాజధానులంటూ రాజధాని నగరంగా అమరావతి అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ, ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా వస్తున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఇరకాట పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తున్నది. మూడు రాజధానుల చట్టం చెల్లదని రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ విషయమై ముందు వెళ్లలేక, వెనుకడుగు వేయలేక సతమతమవుతున్నట్లు స్పష్టం అవుతున్నది.  హైకోర్టు తీర్పుపై వెంటనే రాష్ట్ర శాసనసభను సమావేశ పరచి శాసనవ్యవస్థ పరిధిలో హైకోర్టు జోక్యం ఏమిటని అంటూ ఆగ్రవేశాలు వ్యక్తం చేసినప్పటికీ ఇప్పటి వరకు హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయడం లేదు. హైకోర్టు తీర్పుకు ముందే అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లుల్ని వెనక్కి తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుుడు వాటి స్ధానంలో కొత్త బిల్లు తెచ్చేందుకు కూడా సాహసించడం లేదు. ఆ దిశలో ఎటువంటి కసరత్తు చేయడం లేదు.  కేవలం ఆరు నెలల్లో రాజధానిగా అమరావతి ఏర్పాట్లు పూర్తి కావాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు వెంటనే అమలు జరపడం…

Read More

విశ్రాంత ఐఏఎస్‌ అధికారిణి, బీజేపీ నాయకురాలు రత్నప్రభ ఎస్సీ కాదంటూ వచ్చిన పిటిషన్‌పై దర్యాప్తు జరపాలని నాంపల్లి మూడో మెట్రో పాలిటిన్‌ కోర్టు పోలీసులను ఆదేశించింది.  రత్నప్రభ ఎస్సీ కాదని ఈ వ్యవహారంపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలంటూ ఏవీ రమణ అనే వ్యక్తి నాంపల్లి మూడవ మెట్రోపాలిటన్‌ న్యాయస్థానంలో పిటిషన్‌ను దాఖలు చేశారు. కర్ణాటక ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఆమె గత ఏడాది తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేశారు.  రత్నప్రభ ఫిర్యాదు మేరకు 2012లో రమణపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. దాంతో సీసీఎస్‌ అధికారులు రమణను అరెస్టు చేశారు.   అయితే రత్నప్రభకు షేక్‌పేట మండల అప్పటి తహసీల్దార్‌ చంద్రకళ ఎస్సీ సర్టిఫికెట్‌ ఇచ్చారని, రత్నప్రభ షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ కాదని ఆ సర్టిఫికెట్‌ ఉపయోగించి తనపై అక్రమంగా అట్రాసిటీ కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఆమెకు ఆ…

Read More

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వద్ద గత కొద్ది కాలంగా పసిడి నిలలు పెరిగాయి. కానీ ఫారెక్స్‌ నిలలు మాత్రం భారీగా తగ్గాయి. గత వారం అమెరికా డాలర్‌ మారకంతో పోలిస్తే.. భారత్‌ కరెన్సీ రూపాయి ఆల్‌ టైమ్‌ కనిష్టానికి పడిపోయింది. డాలర్‌ మార్క్‌తో 77కు బలహీనపడింది.  మున్ముందు డాలర్‌ మారకంతో రూపాయి 80కి పడిపోయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. 2028-29 ఆర్థిక సంవత్సరానికి.. డాలర్‌ మారకంతో రూపాయి వ్యాల్యూ 94కు పడిపోయే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా వేస్తున్నది.  భారత్‌ కరెన్సీ రూపాయి ఈ సంవత్సరం స్థిరంగా క్షీణతను నమోదు చేస్తోంది. 2022 క్యాలెండర్‌ ఏడాది ప్రారంభం నుంచి అమెరికా డాలర్‌ మారకంతో నాలుగు శాతం తగ్గింది. మరోవైపు భారత్‌ ఫారెక్స్‌ నిలలు 600 బిలియన్‌ డాలర్ల దిగువకు పడిపోయాయి. సెప్టెంబర్‌ 3, 2021 నుంచి ఫారెక్స్‌ నిలలు 45 బిలియన్‌ డాలర్ల మేర పడిపోయాయి.…

Read More

గోదావరి జలాలను పొలాలకు తరలించిన `అపర భగీరథుడు’ ,”కాటన్ దొర” అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ జయంతి మే 15 (1803.). పవిత్ర గోదావరి ప్రవహిస్తున్న జీవనదికి ఇరువైపుల ఉన్న ఉభయ గోదావరి జిల్లాలకు 18 వ శతాబ్ది వరకు తాగడానికి నీళ్ళు లేవు. ఒక ఏడు అతివృష్టి, మరొక ఏడు అనావృష్టి. ఏటా గోదావరి వరదలు చేసే బీభత్సం. 1854 వరకూ గోదావరి ప్రజలు పడ్డ ఇక్కట్లు ఇన్నీ అన్నీ కావు.  నేడు ఉభయగోదావరి ప్రజలు పచ్చ పచ్చగా ఉండటానికి, తెల్ల బట్టలు ధరించడానికి, సుష్టుగా భోం చేయడానికి వెనుక పెద్ద గాధ ఉన్నది. ఒక్కమాటలో చెప్పాలంటే గోదావరిని అదుపులో పెట్టి, ప్రజావసరాలు తీర్చే నదిగా మార్చటానికి మూలపురుషుడు సర్ ఆర్ధర్ కాటన్. ఆయన కేవలం గోదావరి ప్రజలకే గాక అన్నదాతగా భారతీయులకు చిరస్మరణీయుడు గోదావరి డెల్టా 1831-32 లో అతివృష్టి, తుఫానులకు లోనయ్యింది. 1833లో అనావృష్టి…

Read More

సోనియా గాంధీ సారథ్యంలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న మూడు రోజుల మేధోమథన సదస్సు ‘నవ సంకల్ప్‌ చింతన్‌ శిబిర్‌ ప్రధానంగా సంస్థాగతంగా పార్టీలో తీసుకు రావలసిన సంస్కరణలపై దృష్టి సారిస్తున్నది. ఈ విషయమై పార్టీ నేతలు చాలాకాలంగా మాట్లాడుతున్నా మొదటిసారి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నది. ముఖ్యంగా పార్టీ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ నేతలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, యువ నాయకత్వాన్ని ముందు పెట్టడం ద్వారా బడుగు వర్గాలను, యువతను ఆకట్టుకునే ప్రయత్నం కనిపిస్తున్నది. సోనియా గాంధీ నియమించిన ‘సామజిక న్యాయం, సాధికారికత కమిటీ’ సిఫారసు మేరకు పార్టీలో అన్ని స్థాయిల్లోని పదవుల్లోనూ సామాజిక న్యాయం పాటించాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ నేత కె. రాజు తెలిపారు. ప్రైవేట్ రంగంలోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు జాతీయ స్థాయిలో ఒక విధానం తీసుకు రావాలని కూడా ప్రతిపాదిస్తున్నారు. రాజ్యసభ సభ్యునిగా ఒక పార్టీ నేతకు రెండుసార్లు మాత్రమే అవకాశం ఇవ్వాలని రాజకీయ నిర్మాణ కమిటీ ప్రతిపాదించింది.…

Read More

పశ్చిమ ఢిల్లీలోని ముండ్కాలోని నాలుగు అంతస్తుల కార్యాలయ సముదాయంలో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారిలో ఎక్కువ మంది యువతులు, ముఖ్యంగా కరోనా మహమ్మారి తరువాత తమ కుటుంబాలను పోషించడానికి ఉద్యోగాలలో చేరినవారు. ఇప్పటివరకు ధృవీకరించిన 27 మరణాలలో 21 మంది మహిళలు. ఇప్పటివరకు ఐదుగురు మహిళలతో సహా ఎనిమిది మంది బాధితులను మాత్రమే గుర్తించగా, పోలీసులు తయారు చేసిన తప్పిపోయిన వ్యక్తుల జాబితాలో 29 మందిలో 24 మంది – చనిపోయిన వారిలో ఉన్నారని భయపడుతున్నారు – మహిళలు. ఈ భవనంలో సిసిటివిలు, వైఫై రూటర్‌లను తయారు చేసి, అసెంబుల్ చేసి విక్రయించే సంస్థ ఉంది. చాలా మంది మహిళలు అసెంబ్లింగ్ యూనిట్‌లో లేదా హెల్పర్‌లుగా పని చేస్తున్నారు, వారి నెలవారీ జీతం రూ. 6,500-7,500 మాత్రమే, కానీ “స్వతంత్రంగా” సంతోషంగా ఉన్నారని వారి కుటుంబాలు తెలిపాయి. మంటలను ఆర్పిన అనంతరం శనివారం ఉదయం భవనంలో మాడిమసైన మృతదేహ భాగాలను ఫోరెన్సిక్‌…

Read More

ఉక్రెయిన్‌లో రష్యా చేస్తున్న యుద్ధం వల్ల అంతర్జాతీయంగా ఆహార, ఇంధన సంక్షోభం పెచ్చరిల్లుతోందని జి 7 దేశాలు హెచ్చరించాయి. పేద దేశాలను ఈ పరిస్థితులు మరింతగా దెబ్బతీస్తాయని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ ఓడరేవుల్లో చిక్కుకుపోయిన ఆహార ధాన్యాల ఎగుమతులు సత్వరమే జరిగేలా చూసేందుకు అత్యవసర చర్యలు అవసరమని స్పష్టం చేశాయి.  జర్మనీలోనిబాల్టిక్‌ సముద్ర తీరంలో మూడు రోజుల పాటు జరిగిన సమావేశానంతరం జి 7 దేశాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. ఉక్రెయిన్‌లో మాస్కో చర్యలను సమర్ధించడం ద్వారా లేదా అంతర్జాతీయ ఆంక్షలను దెబ్బతీయడం ద్వారా రష్యాకు సాయపడవద్దంటూ చైనాను కోరాయి.  ”చరిత్రలోనే అత్యంత తీవ్రమైన ఆహార, ఇంధన సంక్షోభాల్లో ఒకటి, ఇటీవల రష్యా దూకుడు చర్య వల్ల తలెత్తింది. అంతర్జాతీయంగా సునిుతమైన ప్రాంతాలను దెబ్బతీస్తోంది.” అని ఆ ప్రకటన పేర్కొంది. అంతర్జాతీయ ఆహార భద్రతను పరిరక్షించేందుకు, ఇందుకు సంబంధించి అత్యంత తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న వారికి…

Read More

కేసీఆర్ సర్కార్‌‌ను కూకటివేళ్లతో పెకిలించి వేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా శనివారం రాత్రి హైదరాబాద్ శివారులోని తుక్కుగూడ వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ తన జీవితంలో ఇంత పనికిరాని అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదని ధ్వజమెత్తారు. ప్రజా సంగ్రామ యాత్ర ఎవరినో ముఖ్యమంత్రి గద్దె దించడానికో, ఎవరినో గద్దె దించడానికో కాదని, బడుగు, బలహీన వర్గాల సహా అందరి సంక్షేమం కోసం చేపట్టిన యాత్ర అని అమిత్‌ షా స్పష్టం చేశారు. అన్నింటికి మించి రజాకార్ల ప్రతినిధులతో చేసిన వారికి వ్యతిరేకంగానే ఈ యాత్ర, అవినీతి చేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఏకిపారేసేందుకు ఈ యాత్ర అని తెలిపారు. కేసీఆర్‌‌ని ఓడగొట్టడానికి తాను రావాల్సిన అవసరం లేదని బండి సంజయ్ ఒక్కరే చాలని అంటూ కేవలం ఓ పార్టీని దించి మరో…

Read More

తరచూ వివాదాస్పద ప్రకటనలతో పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్న త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్‌ కుమార్‌ దేబ్‌ ని బిజెపి సాగనంపింది. ఆయన స్థానంలో రాజ్యసభ సభ్యుడు డా. మాణిక్ సహా (69)ను ముఖ్యమంత్రిగా పట్టం గట్టింది. మరో ఏడాది కాలంలో  అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సమయంలో ఈ మార్పు చేయడం గమనార్హం.  గవర్నర్‌ సత్యదేవ్‌ నారాయణ్‌ ఆర్యను కలిసి శనివారం రాజీనామా అణ్డంచడం, సాయంత్రం కల్లా కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం చకచకా జరిగిపోయాయి. పలు వివాదాస్పద వ్యాఖ్యలతో అనేకసార్లు వార్తల్లో నిలిచిన బిప్లబ్‌పై కొన్ని రోజులుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  రాష్ట్రంలో శాంతి భధ్రలతలను పర్యవేక్షించడంలో సీఎం విఫలమయ్యారంటూ కాంగ్రెస్‌ ఆరోపించింది. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్లు కూడా చేసింది. మరోవైపు సొంత పార్టీ నుంచి కూడా ఆయనకు అసమ్మతి సెగ తగిలింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో నాయకత్వ మార్పు చేయాలని బిజెపి అధిష్ఠానం భావించినట్లు తెలుస్తున్నది. ఆయన ఇటీవల ఢిల్లీ వెళ్లి…

Read More