Author: Editor's Desk, Tattva News

రాజకీయ, సామాజిక విశ్లేషకుడు సి.నరసింహారావు కన్నుమూశారు. అనారోగ్యంతో అర్థరాత్రి 1.50కి ఆయన తుదిశ్వాస విడిచారు. సాయంత్రం 4 గంటలకు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వ్యక్తిత్వ వికాసంపై సి.నరసింహారావు అనేక పుస్తకాలు రాశారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సి. నరసింహారావు 1948, డిసెంబర్ 28న జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 73 సంవత్సరాలు. క్రిష్ణా జిల్లా పెద్దపాలపర్రులో ఆయన జన్మించారు. విజయీభవ, విజయపథం, వ్యక్తిత్వ వికాసం, అన్యోన్య దాంపత్యం, పిల్లల్ని ప్రతిభావంతులుగా పెంచడం ఎలా?, బిడియం వద్దు, అద్భుత జ్ఞాపకశక్తి వంటి అనేక పుస్తకాలు రచించారు. తెలుగులో మొట్టమొదటిసారిగా మనో వైజ్ఞానిక మాసపత్రిక “రేపు” ను ప్రారంభించి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత తొలి వ్యక్తిత్వ వికాస గ్రంధం “వ్యక్తిత్వ వికాసం” ప్రచురించి విశేష ప్రజాదరణ పొందారు. పలు సార్లు ముద్రణకు నోచుకోని, లక్షలాది మందికి ఈ గ్రంధం చేరింది. ఆ…

Read More

కర్ణాటక ప్రభుత్వం తుంగ, భద్ర నదులపై అక్రమంగా నిర్మించతలపెట్టిన రెండు భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు క్లియరెన్స్‌లు ఇవ్వవద్దని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి విజ్ఞప్తి చేసింది. కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర ప్రాజెక్టుకు ఎగువన అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టుల నిర్మాణాలను ఎటువంటి నీటి కేటాయింపులు లేకుండానే చేపడుతోందని తెలంగాణ రాష్ట్ర నీటి శాఖ ఈఎన్‌సి మురళీధర్ కేంద్ర జలవనరుల సంఘం పరిధిలోని ప్రా జెక్టు అప్రయిజల్స్ డైరెక్టరేట్‌కు లేఖ రాశారు. అనధికారింగా ప్రాజెక్టులు నిర్మిస్తూ దిగువ రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న కర్ణాటక దూకుడుకు అడ్డుకట్ట వేయా ల ని లేఖలో కోరారు. అప్పర్ తుంగ ప్రాజెక్టు ద్వారా 20 టీఎంసీల నీటిని, అప్పర్ భధ్ర ప్రాజెక్టు ద్వారా 10 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు ప్రాజెక్టులు చేపట్టిందని ఈఎన్సీ డైరెక్టరేట్ దృష్టికి తీసుకువచ్చారు. జస్టిస్ బచావత్ ట్రిబ్యునల్ కృష్ణానదీ జలాల పంపిణీకి సంబంధించి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన…

Read More

రష్యా నుంచి ఐరోపాకు నేచురల్ గ్యాస్ ను సరఫరా చేస్తున్న ఓ పైప్ లైన్​లో సరఫరాను అడ్డుకున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. గ్యాస్ సరఫరాను ఆపేయడం నిజమేనని, దీనివల్ల కొంత ప్రభావం కూడా పడిందని రష్యన్ ప్రభుత్వ కంపెనీ గాజ్ ప్రామ్ తెలిపింది. అంతకుముందు రోజు కంటే ఐరోపాకు గ్యాస్ సప్లై 25 శాతం తగ్గినట్లు పేర్కొంది. మరోవైపు ఈశాన్య ప్రాంతంలోని ఖార్కివ్ సిటీకి సమీపంలో నాలుగు గ్రామాల నుంచి రష్యన్ బలగాలను పారదోలి, తిరిగి స్వాధీనం చేసుకున్నామని ఉక్రెయిన్ వెల్లడించింది. స్టేరీ సాల్టివ్ గ్రామాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ బలగాలు మరో ఆరు మైళ్లు ముందుకు వెళ్లాయని, ప్రస్తుతం సరిహద్దుకు మరో 10 మైళ్ల దూరంలోనే ఉన్నాయని తెలిపింది.  ఉక్రెయిన్ లో రెండో అతిపెద్ద సిటీ అయిన ఖార్కివ్ కు సమీపంలో నాలుగు గ్రామాలను తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు  వొలోదిమిర్ జెలెన్ స్కీ వెల్లడించారు. రష్యన్ సేనలను…

Read More

ఆధునిక భారత్లో అత్యంత ప్రజాధారణ పొందిన నాయకుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఒకరని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. ‘మోదీ@20 డ్రీమ్స్ మీట్ డెలివరీ’ పుస్తకాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ సమక్షంలో విడుదల చేశారు. ఒక దిగ్గజ నాయకుడి 20 సంవత్సరాల ప్రయాణాన్ని రచయిత అద్భుతంగా ఆవిష్కరించారని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. కలలను సాకారం చేయొచ్చని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప నాయకుడని ఆయన కొనియాడారు. మోదీ దేశ ప్రజల కోసం ఎలా పెద్ద కలలు కంటున్నారు.. కోట్లాది మందిని ప్రభావితం చేసే ఆ కలలను ఏ విధంగా ఆచరణలో పెట్టగలుగుతున్నారనే విషయాలను ఈ పుస్తకంలో చక్కగా వివరించారని వెంకయ్య నాయుడు అభినందించారు. మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకు వెళుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఈ పుస్తకంలో మోదీ చిన్న కార్యకర్త నుంచి అత్యంత ఆదరణ పొందిన నేతగా ఎలా ఎదిగారనే విషయాన్ని తెలియజేస్తుందని…

Read More

విదేశీ విరాళాలు (రెగ్యులేషన్) చట్టాన్ని ఉల్లంఘించి విదేశీ విరాళాలను సులభతరం చేస్తున్నారనే ఆరోపణలపై ఎన్జీవోలు, మధ్యవర్తులు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులపై సీబీఐ 40 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా 14 మందిని అరెస్టు చేసి, రూ.3.21 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఎఫ్‌సిఆర్‌ఎ విభాగానికి చెందిన ఏడుగురు అధికారులు, ఎన్‌ఐసి, మధ్యవర్తులు, ఎన్‌జిఓ ప్రతినిధులతో సహా 36 మందిపై ఏజెన్సీ మే 10న కేసు నమోదు చేసింది. దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో సీబీఐ మంగళవారం సోదాలు నిర్వహించింది. ప్రభుత్వ అధికారులతో సన్నిహితంగా పని చేస్తున్న కనీసం మూడు నెట్‌వర్క్‌లు ఎన్‌జిఓలకు ఎఫ్‌సిఆర్‌ఎ క్లియరెన్స్‌ను వేగవంతం చేయడానికి “స్పీడ్ మనీ”, “సమస్యల పరిష్కార రుసుము” వసూలు చేస్తున్నాయని మంత్రిత్వ శాఖ కనుగొంది, తద్వారా వారు విదేశీ విరాళాలు పొందవచ్చు, అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై మంత్రిత్వ శాఖ సీబీఐ విచారణకు ఆదేశించింది. మార్చి…

Read More

వైవాహిక అత్యాచారం (మారిటల్‌ రేప్‌) నేరపూరితమా, కాదా అనే అంశంపై ఢిల్లీ హైకోర్టు బుధవారం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ తీర్పు ఇచ్చింది. మారిటల్‌ రేప్‌ నేరం కాదని పేర్కొంటున్న ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపిసి)లోని 375వ సెక్షన్‌లోని రెండో మినహాయింపును కొట్టివేస్తూ జస్టిస్‌ రాజీవ్‌ షక్దర్‌ తీర్పు ఇవ్వగా, అదే ధర్మాసనంలోని జస్టిస్‌ హరిశంకర్‌ ఆ నిబంధన చెల్లుబాటును సమర్ధించారు.  ”అర్థం చేసుకోదగిన తేడా” ప్రాతిపదికనే ఇది వుందని వ్యాఖ్యానించారు. ఇరువురు న్యాయమూర్తులు ఇలా భిన్నమైన తీర్పులు ఇవ్వడంతో ఈ కేసులోని పక్షాలను సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు హైకోర్టు అనుమతించింది. భారతదేశంలో, మారిటల్‌ రేప్‌ను ఏ చట్టం లేదా నిబంధన నిర్వచించలేదు.  పిటిషనర్లు అయిన ఎన్‌జిఓ రిట్‌ ఫౌండేషన్‌, ఐద్వా, మారిటల్‌ రేప్‌ బాధితురాలు, ఐపిసి సెక్షన్‌ 375లోని మినహాయింపును రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సవాలు చేశారు. ఈ మినహాయింపు అత్యాచారాన్ని నిర్వచిస్తుంది. 15 సంవత్సరాలు, ఆ పై వయసు గల భార్యతో…

Read More

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తీవ్రమైన మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సెరిబ్రల్ అన్యురిజం అనే వ్యాధితో ఆయన గత ఏడాది ఆసుపత్రిలో చేరవలసి వచ్చిందని, చైనా సంప్రదాయ వైద్య విధానంలోనే  చికిత్స చేయించుకున్నారని చెబుతున్నారు.  జాతీయ మీడియా కథనాలనుబట్టి  జీ జిన్‌పింగ్  సెరిబ్రల్ అన్యురిజం వ్యాధికి చైనీస్ సంప్రదాయ చికిత్స పొందారు.  శస్త్ర చికిత్స చేయించుకోవడానికి ఇష్టపడలేదు. జిన్‌పింగ్ ఆరోగ్య పరిస్థితులపై చాలా కాలం నుంచి ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ వరకు విదేశీ నేతలతో జరిగే సమావేశాల్లో ఆయన పాల్గొనలేదు.  2019 మార్చిలో ఇటలీలో పర్యటించినప్పుడు ఆయన నడక తీరు అసాధారణంగా కనిపించింది. కాళ్ళు బరువెక్కడం వంటి వాటి వల్ల కలిగే బాధతో ఆయన నడుస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. అదే సమయంలో ఫ్రాన్స్‌ పర్యటనలో కూడా ఆయన కూర్చొనడానికి ఇతరుల సహకారం తీసుకున్నారు.  2020 అక్టోబరులో షెంజెన్‌లో ఆయన ఓ సభకు…

Read More

ప్ర‌కృతి అందాల‌కి నెల‌వుగా నెల‌కొన్న రుషికొండ‌  వ‌ద్ద పర్యాటక ప్రాజెక్టుల పేరిట భారీ ఎత్తున తవ్వకాలకు తెర తీశారు. అయితే ఆ తవ్వకాలకు సడెన్ గా బ్రేక్ పడిపోయింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఈ తవ్వకాల మీద స్టే విధించింది. దాంతో ఒక విధంగా ఇది అధికార పార్టీ ప్రయత్నాలకు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.  ఎంపి రఘురామ పిటిషన్‌పై ఈనెల 6న ఎన్జీటీ బెంచ్‌ విచారణ చేపట్టింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తవ్వకాలు జరపకూడదని ఎన్జీటీ ఆదేశించింది. ఇప్పటివరకు తవ్వకాలపై అధ్యయనానికి సంయుక్త కమిటీని ఎన్జీటీ నియమించింది.  ఎపి కోస్టల్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ నోడల్‌ ఏజెన్సీగా ఎన్జీటీ వ్యవహరిస్తుంది. నెల రోజుల్లో కమిటీ నివేదికను అందించాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తవ్వకాలు జరపకూడదని ఎన్జీటీ ఆదేశించింది. నిజానికి రుషికొండ వద్ద తవ్వకాలు అన్నీ పర్యావరణ నిబంధనలకు విరుద్ధమని టీడీపీ, జనసేన రెండూ కూడా ఇప్పటికే అన్ని రకాలుగా…

Read More

బీజేపీ ముఖ్యమంత్రి హిమంత శర్మ అనుకోకుండా నోరు జారి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను `ప్రధాన మంత్రి’ అని సంబోధించడంతో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు. దీంతో కాంగ్రెస్‌ నేతలు సీఎంను లక్ష్యంగా చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం హిమంత శర్మ అసోంలో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ అదే వేదికపై ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాను భారత ప్రధానిగా సంబోధిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీని హోం మంత్రిగా పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు విన్న సభలోని బీజేపీ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అయితే, సీఎం అనుకోకుండా నోరుజారారని, ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని బీజేపీకి చెందిన ఓ సీనియర్ నేత సమర్ధించే ప్రయత్నం చేశారు. కానీ, కాంగ్రెస్ మాత్రం ఈ వీడియోలను ట్రోల్ చేస్తూ అధికార బీజేపీ తదుపరి ప్రధాని అభ్యర్థిగా అమిత్ షానే ఎంచుకుందని, ఆయన ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ట్విట్టర్‌లో కామెంట్స్‌ చేసింది.…

Read More

రాజద్రోహ చట్టాన్ని సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంతో, సమీక్ష పూర్తయ్యే వరకు కొత్త కేసులు పెట్టకుండా రాష్ట్రాలకు మార్గదర్శక సూత్రాలు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటివరకూ ఉన్న రాజద్రోహం కేసులపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది. రాజద్రోహం కేసులన్నీ ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు బుధవారం నాటి తీర్పులో ప్రకటిస్తూ, ఈ క్రమంలోనే రాజద్రోహం చట్టం కింద అరెస్టయిన వాళ్లంతా సంబంధిత కోర్టులలో బెయిల్‌ పిటిషన్‌ పెట్టుకోవచ్చని తెలిపింది. రాజద్రోహం కేసుకు సంబంధించిన చట్టాలను పునః పరిశీలించాలని పేర్కొన్న సుప్రీం.. సెక్షన్‌ 124A కింద నమోదైన కేసులన్నింటినీ పునః పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది. రాజద్రోహం చట్టాన్ని పునః పరిశీలిస్తామని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ చట్టాన్ని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు సుప్రీం నేటి తీర్పులో ప్రకటించింది. ఇప్పటికే ఈ చట్టం కింద నమోదైన కేసుల గురించి ఎలాంటి వైఖరి అనుసరించబోతుందో స్పష్టం చేయాలని కోర్టు సోమవారం కేంద్రాన్ని ఆదేశించింది. సుప్రీం ప్రస్తావించిన అంశాలపై కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్…

Read More