Author: Editor's Desk, Tattva News

ఒక వంక 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రువర్గంలో, ప్రభుత్వ యంత్రాంగంలో, పార్టీ వ్యవస్థలో కీలక మార్పులు చేసి,  `ఇంటింటికి ఎమ్యెల్యేలు’ కార్యక్రమం ద్వారా నేరుగా ప్రజల వద్దకు వెడుతుండగా,  ప్రధాన ప్రతిపక్షం టిడిపి కూడా సమాయత్తం అవుతున్నది.  ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరుపుతూ, పార్టీ యంత్రాంగాన్ని స్థానికంగా క్రియాశీలం చేసే ప్రయత్నం చేస్తున్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఇప్పుడు జిల్లాల పర్యటనలు చేపట్టారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఎక్కువగా హైదరాబాద్, అమరావతిలకు పరిమితమై ఉంటూ, చాలా అరుదుగా రాష్ట్రంలో పర్యటిస్తూ వస్తున్న ఆయన విస్తృతంగా జిల్లాల పర్యటన చేపట్టారు. దీనికి సంబంధించిన టూర్‌ షెడ్యూల్‌ను సోమవారం ఖరారు చేశారు. ఈ నెల 4వ తేదీ నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. ఇప్పటికే పన్నుల భారం, విద్యుత్‌ కోతలు, బస్సు, విద్యుత్‌ ఛార్జీల పెంపుతో పార్టీ ఆధ్వర్యంలో బాదుడే – బాదుడు నిరసన…

Read More

టీఆర్ఎస్, రాష్ట్ర బీజేపీ నేతల మధ్య మరోసారి ట్విట్టర్ వార్ జరుగుతోంది. కేంద్ర,రాష్ట్ర పాలనలపై ఒకరినొకరు ట్విట్టర్లో తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.  ఇటీవల  పక్క రాష్ట్రాలపై, కేంద్రంపై  ట్విట్లు పెట్టి వివాదాలు రేపిన తెలంగాణ మంత్రి కెటి రామారావు మరోసారి కేంద్రంపై విమర్శలు చేశారు.  ఇప్పటికే పలుమార్లు బహిరంగ సభలు, సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర, కేంద్రంలోని బీజేపీ పెద్దలపై విమర్శలు గుప్పించే కేటీఆర్..`మోదీకి విజన్ కొరత’ అంటూ  ఈసారి ఏకంగా ప్రధాని మోదీపైనే విమర్శనాస్త్రాలు సంధించారు. “… ఇలా చెప్పుకుంటూపోతే సీఎం కేసీఆర్ మోసపూరిత హామీలకు కొదవ లేదు” అంటూ కేంద్ర మంత్రి జి  కిషన్ రెడ్డి ఘాటుగానే ట్విట్టర్ ద్వారానే బదులిచ్చారు.  దేశంలో ఏడేళ్ల బీజేపీ పాలనలో బొగ్గు కొరత, కరోనా టైంలో ఆక్సిజన్ కొరత, పరిశ్రమలకు కరెంట్ కొరత,యువతకు ఉద్యోగాల కొరత, గ్రామాల్లో ఉపాధి కొరత, రాష్ట్రాలకిచ్చేనిధుల కొరత వచ్చిందన్నారు. ఇవన్ని సమస్యలకు పీఎం, మోదీకి విజన్ లేకపోవడమే కారణమంటూ ట్వీట్ చేశారు…

Read More

సుస్థిర అభివృద్ధికి సేంద్రియ వ్యవసాయమే ఉత్తమమైన మార్గమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. భూసారాన్ని కాపాడుకోవడం ద్వారానే భవిష్యత్ తరాలకు ఆహార భద్రతను అందించగలమని స్పష్టం చేశారు.  సహజ వనరులైన భూమి, నీరు అపరిమితం అనే ఆలోచన సరికాదని, పరిమితమైన ఈ వనరులను పరిరక్షించుకుంటూ సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.  సోమవారం ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ సమావేశ ప్రాంగణంలో భూసారం ప్రాముఖ్యతను వివరిస్తూ రాసిన ‘భూమి సుపోషణ్’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి, భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భూసారం నానాటికీ తగ్గిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. క్రిమిసంహారకాలు, రసాయనాలను అవసరానికి మించి వినియోగిస్తుండటం వల్ల భూమి తన సారాన్ని కోల్పోతోందని తెలిపారు. ఈ విషయంపై అన్నదాతల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. దీనికితోడు బోరుబావులను పరిమితికి మించి వినియోగించడం వల్ల భూమిలో ఉండాల్సిన తేమ తగ్గిపోతోందని, దీని కారణంగా సారవంతమైన నేలలు ఇసుకమేటలతో మిగిలిపోతున్నాయని…

Read More

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్రను ఈ నెల 8వ తేదీ నుండి ఉమ్మడి కర్నూల్ జిల్లాలో చేయనున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాల్లో భరోసా నింపేందుకు యాత్ర చేపట్టిన ఆయన ఈ సందర్భంగా ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి, ఒకొక్క కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందజేస్తున్నారు.   ‘రాష్ట్రంలోనే అత్యధికంగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది కర్నూలు జిల్లాలోనే. సుమారు 373 మంది కౌలు రైతులు గత మూడేళ్ల కాలంలో బలవన్మరణాలకు పాల్పడ్డార’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. శిరివెళ్ల మండల కేంద్రంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన  తెలిపారు. తొలి విడతలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 130 మంది కౌలు రైతులకు పవన్‌ కల్యాణ్‌ సాయం అందిస్తారని చెప్పారు. 8వ తేదీ ఉదయం 9.30 గంటలకు పవన్‌ కల్యాణ్‌ ఉమ్మడి కర్నూలు జిల్లా…

Read More

వరుసగా రెండోసారి తెలంగాణకు నేషనల్ లీడ్ స్టేట్ అవార్డ్ రావడం గర్వకారణమని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పంచాయతీ రాజ్ శాఖ ఆడిటింగ్ లో  100 శాతం ఆడిటింగ్ చేసిన రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానాన్ని  కైవసం చేసుకుంది.  ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ  దేశంలో 100 శాతం ఆడిట్ సాధించిన మొదటి రాష్ట్రంగా ఉండటం వెనుక  అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కృషి ఉందని తెలిపారు. అలాగే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతో తనతో పాటు అధికారులు బాగా పనిచేశారని కొనియాడారు.  దేశంలోని ప్రతి రాష్ట్రం తెలంగాణను రోల్‌మోడల్‌గా చేసుకుని పంచాయితీరాజ్ శాఖలో వందశాతం ఆడిటింగ్ వ్యవహరాలు ఆన్‌లైన్ ద్వారా జరపాలని సూచిస్తోంది. 12,769 గ్రామ పంచాయతీలు, 540 మండలాలు, 32 జిల్లా పరిషత్‌లు ఉన్న తెలంగాణ రెండోసారి కూడా నేషనల్ లీడ్…

Read More

దేశంలో మార్చిలో 7.60 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు.. ఏప్రిల్‌లో 7.83 శాతానికి పెరిగింది. ఈ విషయాన్ని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సిఎంఐఇ)  విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఇక పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు మార్చి నెలలో 8.28 శాతం ఉండగా.. ఏప్రిల్‌ పూర్తయ్యే నాటికి 9.22 శాతానికి పెరిగింది.  కాగా, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు కాస్త తగ్గడం గమనార్హం. మార్చిలో గ్రామీణాల్లో నిరుద్యోగిత రేటు 7.29 శాతం ఉండగా.. ఏప్రిల్‌లో 7.18 శాతానికి తగ్గింది. నిరుద్యోగిత రేటు హర్యానాలో 34.5 శాతంతో తొలి స్థానంలో నిలువగా, దాని తర్వాతి స్థానంలో రాజస్తాన్‌ (28.8 శాతం) ఉంది.  దేశీయ డిమాండ్‌ మందగించడం, ధరల పెరుగుదల మధ్య ఆర్థిక రికవరీ నెమ్మదిగా ఉండటం వల్ల ఉద్యోగ అవకాశాలు దెబ్బతిన్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు.  ఇక, రిటైల్‌ ద్రవ్యోల్బణం మార్చిలో 6.95 శాతానికి అంటే 17 నెలల గరిష్టానికి…

Read More

మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో చేరి, కీలకమైన పదవీ బాధ్యతలు చేబట్టపోతున్నారంటూ విశేషంగా హడావుడి చేసిన రాజకీయ ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా తానే ఒక పార్టీని ప్రారంభిస్తున్నల్టు ప్రకటించారు. తన రాజకీయ ప్రయాణం బిహార్ నుంచే ఉంటుందని తెలిపారు.  కాంగ్రెస్ లో చేరుతారని తొలుత భావించినా.. భిన్నాభిప్రాయాలు రావడంతో ఆయన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. చాలా కాలంగా తాను అర్థవంతమైన ప్రజాస్వామ్యంలో భాగస్వామిగా ఉన్నానని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన విధానాల తయారీ కోసం పదేళ్లుగా పనిచేస్తున్నానని చెబుతూ ట్వీట్ చేశారు.  ఇప్పుడు రియల్ మాస్టర్ గా మారే సమయం వచ్చిందని పేర్కొంటూ అంశాలను మరింతగా అర్థం చేసుకునేందుకు జన్ సురాజ్ పేరుతో కొత్త పార్టీతో  వస్తున్నానని వెల్లడించాయిరు. బిహార్ నుంచి తన ప్రయాణం ప్రారంభిస్తున్నానని చెప్పడం ద్వారా ప్రస్తుతంకు తన పార్టీ ఆ రాష్ట్రం వరకు పరిమితం కాగలదనే సంకేతం ఇచ్చారు.  ‘ప్రజాస్వామ్యంలో అర్థవంతమైన భాగస్వామిగా ఉండాలనే తపనతో పదేళ్లుగా ప్రజానుకూల విధానాన్ని రూపొందించడంలో…

Read More

ఇప్పటికే అవినీతి ఆరోపణలు చేస్తూ బిజెపి కార్యకర్త ఒకరు ఆత్మహత్య చేసుకోవడంతో సీనియర్ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి కె ఎస్ ఈశ్వరప్ప మంత్రిపదవికి రాజీనామా చేయవలసి రావడంతో ఓ పెద్ద కుదుపుకు గురైన కర్ణాటకలోని బిజెపి ప్రభుత్వం తాజాగా ఎస్ఐ పరీక్షల కుంభకోణం వెంటాడుతున్నది.  ఎస్‌ఐ పోస్టుల రాత పరీక్ష కుంభకోణంలో రోజురోజుకూ కొత్త పేర్లు తెరపైకి వస్తుండడంతో హోమ్ మంత్రి ఆరాగా జ్ఞానేంద్ర రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇప్పటికే కీలక నిందితురాలిగా భావిస్తూ బీజేపీ నాయకురాలు దివ్య హాగరగిని అరెస్ట్ చేసి సిఐడీ అధికారులు రెండు రోజులుగా ఆమెను ప్రశ్నిస్తున్నారు.  బెంగళూరులోనూ 7 పరీక్ష కేంద్రాల్లో కొందరు అక్రమాలకు పాల్పడి ఉత్తీర్ణులైనట్లు తెలిసింది. దీనికి సంబంధించి హైగ్రౌండ్‌ పోలీసులు 12 మందిని అరెస్టు చేయగా వారిలో ఒక ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఉన్నట్లు సమాచారం. ఇతడు పది లోపు ర్యాంకులో ఉత్తీర్ణుడు కావడం గమనార్హం. ఓఎంఆర్‌ షీట్, కార్బన్‌ షీటులో వ్యత్యాసం బయటపడింది. మరో…

Read More

తెలంగాణాలో పలు రహదారులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయడానికి వచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన ప్రసంగంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాకరంగా చేబట్టిన కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్ట్ ను ప్రశంసించడం తెలంగాణ బిజెపి నేతలలో కాక పుట్టిస్తున్నది.   నిత్యం రాష్ట్రంలోని బిజెపి నేతలు ఆ ప్రాజెక్ట్ ను కేవలం ముడుపుల కోసం చేబట్టారని దుమ్మెత్తి పోస్తుంటే తానే కేంద్రంలో జలవనరుల మంత్రిగా ఉన్నప్పుడు అనుమతి ఇచ్చానని గడ్కరీ చెప్పడం మింగుడు పడడం లేదు.   పైగా, ప్రస్తుతం ప్రజా సంగ్రామ యాత్రలో ఉన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆ ప్రాజెక్ట్ ద్వారా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేసీఆర్ ఫార్మ్ హౌస్ కు నీళ్లు ఇప్పించుకోవడం మినహా తెలంగాణ ప్రజలకు అదనంగా ఒక ఎకరాకు కూడా సాగు వసతి కల్పించలేదని ధ్వజమెత్తుతున్నారు.   అయితే, తెలంగాణలో కా ళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు కనిపిస్తున్నాయని చెబుతూ ఈ ప్రాజెక్టు నిర్మాణంతో హైదరాబాద్ ప్రజలకు తాగునీటి సమస్య తీరిందని గడ్కరీ చెప్పడం గమనార్హం.  టీఆర్‌ఎస్‌‌ ప్రభుత్వ పాలనపై గడ్కరీ పొగడ్తలతో…

Read More

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రెండు రోజుల పాటు జరుప దలచిన తెలంగాణ పర్యటనలో భాగంగా మే 7న ఉస్మానియా యూనివర్సిటీలో తలపెట్టిన రాహుల్‌గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ సందర్శన వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది.  రాహుల్ సభకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ అనుమతి నిరాకరించడంతో ఒక వంక నిరసనలు, మరోవంక హైకోర్టు కు వివాదం చేరింది.  రాహుల్‌ సభ కోసం విద్యార్థి సంఘాల నుంచి అందిన వినతిపత్రానికి సంబంధించి యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించిన మీదట వీసీ శనివారం అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం ప్రకటించారు.  ఓయూలో సభలు సమావేశాలు, రాజకీయ సమ్మేళనాలకు అనుమతులు ఇవ్వకూడదని గతంలోనే నిర్ణయం తీసుకున్నామని వైస్ ఛాన్సలర్ తెలిపారు. పైగా, ఎటువంటి రాజకీయ సభలకు అనుమతి ఇవ్వడం లేదని కూడా స్పష్టం చేశారు. దానితో  రాహుల్‌ సభకు అనుమతి నిరాకరించడం ఓయూలో ఉద్రిక్తతకు దారితీసింది. వీసీని కలిసిన విద్యార్థి సంఘాల నాయకులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆర్ట్స్‌ కళాశాల ముందు బైఠాయించి…

Read More