ఐరోపాతో భాగస్వామ్యం భారత్ కు కీలకం అని చెబుతూ తన పర్యటన ద్వారా భారత్‌కు ప్రధానమైన యూరోపియన్ భాగస్వాములతో సహకార స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మూడు రోజుల ఐరోపా పర్యటనకు ఆదివారం రాత్రి బయలుదేరే ముందు విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రస్తుతం ఐరోపా అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని గుర్తు చేశారు. అదే సమయంలో మనం ఎంచుకునేందుకు అనేక అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. ‘‘యూరప్ దేశాలతో సహకార స్ఫూర్తిని బలోపేతం చేయడానికి ఈ పర్యటన తోడ్పడుతుంది.శాంతి, శ్రేయస్సులను కాంక్షించే భారత్ వంటి దేశాలకు ఈయూ దేశాలే భాగస్వామ్య పక్షాలు’’ అని ప్రధాని తెలిపారు. జర్మనీ ఛాన్సరల్ ఓలాఫ్ షుల్జ్‌తో వివరణాత్మక ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు బెర్లిన్ పర్యటన ఒక అవకాశంగా ఉంటుందని తెలిపారు. జర్మన్ ఛాన్సలర్ స్కోల్జ్ ఆహ్వానం మేరకు సోమవారం బెర్లిన్‌ను మోదీ సందర్శించనున్నారు. మంగళ, బుధవారాల్లో డెన్మార్క్‌లో పర్యటించి, అక్కడ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గంటారు.…
Author: Editor's Desk, Tattva News
ఉక్రెయిన్ జరిపిన క్షిపణి దాడుల్లో సరిహద్దులకు ఆనుకుని ఉన్న రష్యా ప్రాంతాల్లోని చమురు డిపోలు ధ్వంసమయినట్లు అసోసియేటెడ్ ప్రెస్ (ఎపి) వార్తా సంస్థ విశ్లేషించిన శాటిలైట్ ఫోటోలను బట్టి తెలుస్తోంది. ఈ ఫోటోల్లో బ్రియాన్స్ ప్రాంతంలోని రెండు చోట్ల చమురు డిపోలకు నష్ట వాటిల్లినట్లు కనిపిస్తోంది. ఈ పేలుళ్లలో ఒకటి కన్నా ఎక్కువ సంఖ్యలో చమురు డిపోలు ధ్వంసం అయినట్లు, ఫలితంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు ఈ ఫోటోల్లో ఉంది. ఈ పేలుళ్లు గత సోమవారం జరిగాయి. ఒక క్షిపణి రష్యా ప్రభుత్వ అధీనంలోని ట్రాన్స్‌నెఫ్ట్ కంపెనీ అనుబంధ సంస్థ అయిన ట్రాన్స్‌నెఫ్ట్ డ్రుజ్‌బాకు చెందిన చమురు డిపోను తాకింది. ఈ సంస్థ ఐరోపాకు ముడి ,మురును తీసుకెళ్లే డ్రుజ్‌బా పైప్‌లైన్‌ను నిర్వహిస్తుంది. దీనికి సమీపంలోనే మరో చమురు డిపోకూడా క్షిపణి దాడిలో దెబ్బతింది. ఉక్రెయిన్ సరిహద్దుకు వంద కిలోమీటర్లు ఉత్తరంగా బ్రియాన్స్ ఉంది. ఇలా ఉండగా, రష్యా…
దేశంలో జీఎస్‌టీ వసూళ్లు గతంలో ఎన్నడూ లేనంతగా మరోసారి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 2022 ఏప్రిల్ నెలలో రూ.1.68 లక్షల కోట్ల వస్తు సేవల పన్ను వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. జీఎస్‌టీ వసూళ్లలో ఇది జీవిత కాల గరిష్టమని కేంద్రం తెలియజేసింది. ఈ ఏడాది మార్చిలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.42 లక్షల కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుత రికార్డు వసూళ్ల తరువాత మార్చి నెల కలెక్షన్లు రెండో అత్యధికంగా ఉన్నాయి. మార్చితో పోలిస్తే.. ఏప్రిల్‌లో రూ.25వేల కోట్లు అధికంగా జీఎస్‌టీ రాబడి వచ్చిందని కేంద్రం వివరించింది. 2021 ఏప్రిల్‌లో వచ్చిన జీఎస్‌టీతో పోలిస్తే.. ఇది 20 శాతం అధికమని స్పష్టం చేసింది. ఏప్రిల్‌లో వసూలైన మొత్తం రూ.1,67,540 కోట్లలో.. సీజీఎస్‌టీ వసూళ్లు రూ.33,159 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ వసూళ్లు రూ.41,793 కోట్లుగా ఉన్నాయి. సమీకృత జీఎస్‌టీ కింద రూ.81,939 కోట్లు ఉండగా ఇందులో వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ.36,705 కోట్లు…
రేపల్లె రైల్వే స్టేషన్లో మహిళా వలస కూలీపై చోటు చేసుకున్న సామూహిక అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని, పొట్టకూటి కోసం వలస వచ్చిన కుటుంబానికి ఎదురైన ఈ దిగ్భ్రాంతికర ఘటన రాష్ట్రంలో దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిని తెలియచేస్తోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆందోళన వ్యక్తం చేశారు. గత పది రోజులుగా రాష్ట్రంలో వరుసగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకొంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా బాధిత కుటుంబాలపైనే నిందలు వేసి తప్పించుకోవాలని ప్రభుత్వం చూడటం గర్హనీయమని ధ్వజమెత్తారు. తుమ్మపూడి ఘటనలో పోలీసు అధికారుల తీరు ఇలాగే ఉందని మండిపడ్డారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రకటనలు కూడా ప్రభుత్వ వైఖరిని వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. ‘ఇలాంటి సంఘటనలకు తల్లులే కారణం.. వాళ్ళు సరిగా లేకపోవడమే కారణమ’ని చెప్పడం విచిత్రంగా ఉందని నాదెండ్ల విస్మయం వ్యక్తం చేశారు. రేపల్లె సామూహిక అత్యాచార…
భారత సైన్యం విధి నిర్వహణ, కార్యకలాపాల్లో సమర్ధతను పెంచేందుకు ప్రస్తుత సంస్కరణలు, పునర్నిర్మాణం, పరివర్తనలపై ప్రధానంగా దృష్టి పెడతానని నూతన ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే తెలిపారు. సైన్యానికి దేశ నిర్మాణంలో గొప్ప కీర్తి ప్రతిష్ఠలు ఉన్నాయని, దేశ రక్షణ కోసం కృషిని కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. జనరల్ మనోజ్ ముకుంద్ నరవనే స్థానంలో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా శనివారం బాధ్యతలు స్వీకరించిన ఆయన ఆదివారం సౌత్ బ్లాక్ లాన్స్‌లో సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సమకాలీన, భవిష్యత్తు, భద్రతా సవాళ్లను సమర్ధంగా ఎదుర్కొనేందుకు కార్యాచరణ సంసిద్ధతలో అత్యున్నత స్థాయి ప్రమాణాలను నిర్ధారించడం తన ప్రాధాన్య అంశమని మనోజ్ పాండే ప్రకటించారు. ప్రపంచ, భౌగోళిక , రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయని, ఫలితంగా మన ముందు అనేక సవాళ్లు ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ క్రమంలో వైమానిక, నావికా దళాల సమన్వయం సహకారంతో ఎటువంటి పరిస్థితులనైనా…
మే 1 అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులు కార్మికుల హక్కుల కోసం దినోత్సవంగా ఉద్యమించడంకు ప్రతీకగా నిలుస్తుంది. “మే డే” 1886లో అమెరికాలోని కార్మికులు రోజుకు ఎనిమిది గంటల పని కోసం మద్దతుగా ర్యాలీ చేయడం, అందుకు యజమానులు తిరస్కరించడంతో సామూహిక సమ్మెలను ప్రారంభించడానికి మే 1ని గడువుగా నిర్ణయించారు. 1886 చికాగోలో, పదివేల మంది మే డే ర్యాలీలో చేరారు. వేలాది మంది సమ్మెలో పాల్గొన్నారు. సమ్మె చేస్తున్న కార్మికులపై జరిగిన పోలీసు కాల్పులు బాగా తెలిసిన హేమార్కెట్ విషాదానికి దారితీశాయి. నెలల తరబడి వలస కార్మిక వ్యతిరేక ప్రభుత్వ అణచివేత చర్యలు కొనసాగాయి. యూనియన్ హాల్స్‌పై పోలీసు దాడులు, నిర్వాహకుల అరెస్టులు, బూటకపు విచారణ, ఎనిమిది మంది దోషులని తీర్పులు, నలుగురు ప్రముఖ వలస, శ్రామిక-తరగతి ఉద్యమ నాయకులను బహిరంగంగా ఉరితీయడం జరిగాయి. ఐదవ వ్యక్తి ఉరికి ముందే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ న్యాయ విచారణ, మరణశిక్షల అమలు పక్రియను ఆ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులు…
న్యాయస్థానాల్లో స్థానిక భాషలను ప్రోత్సహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. తద్వారా ప్రజలు న్యాయ ప్రక్రియతో అనుసంధానమైనట్లు భావిస్తారని, వారిలో విశ్వాసం పెరుగుతుందని చెప్పారు. అంతిమంగా న్యాయ ప్రక్రియపై ప్రజల హక్కు బలపడుతుందని తెలిపారు. ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, లెఫ్టినెంట్ గవర్నర్ల 11వ సంయుక్త సదస్సును శనివారం ప్రారంభిస్తూ ఇప్పటికే సాంకేతిక విద్యలో స్థానిక భాషలను ప్రోత్సహిస్తున్నట్లు గుర్తుచేశారు. చట్టాల గురించి సులభమైన భాషలో అర్థమయ్యేలా వివరించాలని కోరారు. అండర్ ట్రయల్ ఖైదీల కేసులకు ప్రాధాన్యం ఇవ్వాలని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు సూచించారు. ‘‘దేశంలో న్యాయవ్యవస్థ రాజ్యాంగ సంరక్షకుడి పాత్ర పోషిస్తోంది. సీఎంలు, సీజేల సంయుక్త సదస్సు రాజ్యాంగ సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనం. నేను చాలాకాలంగా ఈ సదస్సుకు వస్తున్నా. మొదట ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రధానమంత్రిగా సదస్సుకు హాజరవుతున్నా. ఒకరకంగా చెప్పాలంటే ఈ సదస్సు విషయంలో నేను చాలా సీనియర్‌ని” అంటూ పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా మిషన్‌లో భాగంగా న్యాయ వ్యవస్థలో సాంకేతికతకు పెద్దపీట వేయాలని…
వైసిపి గ్రామాధ్యక్షుడు దారుణ హత్యకు గురయ్యాడు. అదే పార్టీకి చెందిన వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మృతదేహాన్ని సందర్శించడానికి వచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యే మూడు గంటలపాటు ఆ గ్రామంలో బిక్కుబిక్కుమంటూ గడపాల్సి రావడం తీవ్ర కలకలం సృష్టించింది. ఆ పార్టీలోని గ్రూపు రాజకీయాలను బహిర్గతం చేసింది. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. స్థానికుల కథనం ప్రకారం… జి.కొత్తపల్లి గ్రామంలో రోడ్డుపై నడిచి వెళ్తున్న వైసిపి గ్రామాధ్యక్షుడు గంజి ప్రసాద్ (58)పై గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. మెడపై, చేతులపై, పొట్ట భాగంలో విచక్షణారహితంగా నరకడంతో ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికంగా వ్యవసాయం చేస్తూ కోళ్ల ఫారాలు నిర్వహిస్తున్న ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గతంలో టిడిపిలో ప్రసాద్ ఉండేవాడు. ప్రస్తుత హోం శాఖ మంత్రి…
”కోర్టు తీర్పులను తరచూ ప్రభుత్వాలు ఏళ్ల తరబడి అమలు చేయడం లేదు. ఇది కోర్టు ధిక్కారణ పిటిషన్‌కు దారి తీస్తుంది. ఇది ప్రభుత్వ ధిక్కారానికి ప్రత్యక్ష ఫలితం. ఇది ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరం కాదు” అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, లెఫ్టినెంట్ గవర్నర్ల 11వ సంయుక్త సదస్సులో శనివారం మాట్లాడుతూ విధి నిర్వహణలో న్యాయమూర్తులు తమ పరిమితులను గుర్తుంచుకోవాలని, లక్ష్మణ రేఖను దాటద్దని సూచించారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ శాఖలకు రాజ్యాంగం వేర్వేరు అధికారాలను కల్పించిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య బలోపేతానికి, సామరస్యంగా కార్యకలాపాలు సాగేందుకు ఇది దోహదం చేస్తుందని తెలిపారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దుర్వినియోగం అవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. కొందరు వీటిని ‘పర్సనల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్’గా మార్చుతూ.. వ్యక్తిగత వివాదాల పరిష్కారానికి ఉపయోగించుకోవడం బాధాకరమని చెప్పారు. కోర్టుల్లో 56 శాతం కేసులు నమోదవుతున్న ప్రభుత్వమే అతిపెద్ద వ్యాజ్యమని గుర్తు చేశారు.…
కొద్ది రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ భేటీ జరగనున్న నేపథ్యంలో తెలంగాణ నీటిపారుదల శాఖ అప్రమత్తమైంది. సమర్ధమైన వాదనలు వినిపించాలని, ప్రత్యేకంగా కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటాను పెంచుకోవడమే లక్ష్యంగా వ్యవహరించాలని భావిస్తోంది. అంతకు ముందే పెండింగ్ తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు సాధించుకోవడం, కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్ర వాటాను ఇప్పుడున్న 299 టీఎంసీల నుంచి 575 టీఎంసీలకు పెంచుకోవడం, నిబంధనలకు విరుద్ధంగా ఏపీ చేస్తున జల చౌర్యం తదితర అంశాలను ఢిల్లిలోని జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించుకునేలా ప్రత్యేక కన్సల్టెంట్ అధికారిని నియమిం చాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. సాగునీటి పారుదల శాఖలోని అనుభవుజ్ఞుడైన రిటైర్డ్ జల నిపుణులను కన్సల్టెంట్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పొరుగున ఉన్న ఏపీ ప్రభుత్వం ఢిల్లిలో సాగునీటిపారుదల నిపుణుడు, రిటైర్డ్ సీనియర్ ఇరిగేషన్ అధికారిని ప్రత్యేకంగా నియమించింది. ఆ…