Author: Editor's Desk, Tattva News

ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు మంగళవారం కొరడా ఝుళిపించింది. పదేపదే ఆమోదయోగ్యం కాని ప్రసంగాలు చేస్తున్నప్పటికీ.. ధర్మ సంసద్‌లను నిర్వహించకుండా నిరోధించేందుకు చర్యలు చేపట్టడంలో రాష్ట్రాలు విఫలమవ్వడంపై మండిపడింది.  ధర్మ సంసద్‌లో విద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. ‘అక్కడ స్పీకర్లు (ప్రసంగీకులు) ఏం చెబుతున్నారో మాకు తెలియదు. ఈవెంట్‌ నిర్వహించాలనుకుంటామని అడిగితే అనుమతిని తిరస్కరించలేమ’ని ఉత్తరాఖండ్‌ న్యాయవాది వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది.  ‘ఇటువంటి ఆమోద యోగ్యం కాని ప్రసంగాలను నిరోధించాలి. మాట్లాడేవారు ఒకే విధంగా ఉంటే.. సమస్య ఉంటుందని తెలియదని తెలివిగా వాదన చేసి తప్పించుకోలేర’ని కోర్టు స్పష్టం చేసింది. ఇటువంటి విద్వేషపూరిత ప్రసంగాలు చేయకుండా ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఇరు రాష్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.  ఈ ఈవెంట్ల గురించి ముందే ప్రకటిస్తుండగా.. విద్వేష పూరిత ప్రసంగాలు నిరోధించేలా ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. పిటిషనర్ల తరుపున సీనియర్‌ న్యాయవాది కపిల్‌…

Read More

బిజెపి బలహీన పడితే తానే ప్రధాన మంత్రి అవుతాననే మితిమీరిన విశ్వాసంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రయోగాలు చేస్తూ ఉండడంతో నేడు దేశంలో ఆ పార్టీతో జత కట్టడానికి ఇతరులు వెనుకడుగు వేసే పరిస్థితికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ మధ్య జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ భవిష్యత్తు పట్ల ఆ పార్టీ నేతలలోనే అనుమానాలు బయలుదేరాయి.  అదను కోసం ఎదురు చూస్తున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి వచ్చి ఎన్నికల నిర్వహణ బాధ్యతను తనకు అప్పగిస్తే 2024లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు వస్తానని కాంగ్రెస్ నాయకుల ముందు ఓ రంగుల ప్రపంచం ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం కాంగ్రెస్ లో ఒక విధంగా గతంలో అహ్మద్ పటేల్ నిర్వహించిన పాత్ర తనకు ఇవ్వాలని కోరుతున్నారు.  ఎన్నికల పొత్తు, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం ఎత్తుగడలతో తన నిర్ణయాలే చెల్లుబాటు కావాలని, సోనియా గాంధీ మినహా మరెవ్వరు ప్రశ్నించరాదని…

Read More

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కాబోయే ముఖ్యమంత్రిగా మాజీ ఎంపీ, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు పిఎ  జితేందర్ రెడ్డి ప్రకటించడంపై రాష్ట్ర బీజేపీలో కలకలం రేగుతున్నది. సంజయ్ 12 రోజులుగా జరుగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ సందర్భంగా మక్తల్ లో సోమవారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో  బండి సంజ‌య్ ముఖ్య‌మంత్రి అయితేనే రైతుల క‌ష్టాలు తీరుతాయ‌ని జితేంద‌ర్‌రెడ్డి సంజయ్ సమక్షంలోనే పేర్కొనడం ఆ పార్టీలో రాజకీయ దుమారం రేపుతున్నది. కొంత కాలంగా పార్టీలో సీనియర్లను దూరంగా పెడుతూ, సంజయ్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ పలువురు ఆయనకు వ్యతిరేకంగా కరీంనగర్ జిల్లాలో, హైదరాబాద్ లో కూడా సమావేశాలు జరుపుతున్నారు. వారికి నచ్చచెప్పేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు నల్లు ఇంద్రసేనారెడ్డి నాయకత్వంలో తీవ్ర ఫలితాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నాయకుల పట్ల సంజయ్ కఠినంగా వ్యవహరిస్తూ ఉండడం, తాను చెప్పిన్నట్లు వింటేనే…

Read More

తమిళనాడును విభజించే కుట్ర జరుగుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కే.స్టాలిన్ ఆరోపించారు. కులమతాల ప్రాతిపదికన తమిళ ప్రజలను విడగొట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. తద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని హెచ్చరించారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకుని, ఇలాంటి కుట్రలను తిప్పికొట్టాలని ఆయన పిలుపిచ్చారు. రాష్ట్ర ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలని కోరారు. చెన్నైలో ఓ ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కుల, మతాల ప్రాతిపదికన విభజించడం ద్వారా తమిళ జాతికి ముగింపు పలకొచ్చని, మన అభివృద్ధిని అడ్డుకోవచ్చని కొంతమంది అనుకుంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఆ ఉచ్చులో పడకూడదని, అటువంటి ప్రయత్నాల వెనుక దాగి ఉన్న కుట్రలను పసిగట్టాలని స్టాలిన్ స్పష్టం చేశారు. వివాదాస్పద పౌరసత్వ చట్టం సవరణ (సీఏఏ) బిల్లు విషయంలో విపక్ష అన్నాడీఎంకే వ్యవహరించిన తీరు మీద కూడా స్టాలిన్ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మన రాజ్యాంగంలోని లౌకిక విలువలకు సీఏఏ విరుద్ధమన్న ఆయన గతేడాది తమిళనాడు అసెంబ్లీలో తమ పార్టీ…

Read More

ఆరాధనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల అంశంపై చర్చించేందుకు సోమవారం ఏర్పాటు చేసిన మహారాష్ట్ర అఖిలపక్ష సమావేశం తర్వాత,  దేశవ్యాప్తంగా మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగానికి సంబంధించిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం రూపొందించాలని మహారాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ అంశంపై చర్చించేందుకు కేంద్రం ప్రతినిధులను కలవడానికి ప్రతినిధి బృందం వెళ్లనున్నట్లు కూడా తెలిపింది.  సమావేశం అనంతరం మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్, శివసేన నేత ఆదిత్య థాకరేతో కలిసి మీడియాతో మాట్లాడారు. “దేశమంతటా వర్తించే చట్టాన్ని తీసుకురావాలని మేము కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నాము. దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూస్తాం’’ అని వాల్సే పాటిల్ పేర్కొన్నారు. లౌడ్ స్పీకర్ల వినియోగంపై రాష్ట్రానికి చెందిన ప్రతినిధి బృందం కేంద్ర ప్రభుత్వాన్ని కలవాలని, చర్చలు జరపాలని కూడా సమావేశంలో నిర్ణయించామని థాకరే చెప్పారు. ఇదిలావుండగా మతపరమైన ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించలేదని, లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసిన…

Read More

స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ అంతర్జాతీయ సామాజిక మాధ్యమం ‘ట్విటర్‌’ను సొంతం చేసుకున్నారు. 44 బిలియన్‌ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేయడానికి సోమవారం ఒక ఒప్పందం కుదిరినట్లు ది వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. పబ్లిక్‌ సంస్థగా వ్యవహరించిన ట్విటర్‌ ఇకపై మస్క్‌ యాజమాన్యంలో ప్రైవేట్‌ కంపెనీగా మారుతుందని ట్విటర్‌ ఒక ప్రకటనలో తెలిపింది.  ఒక్కో షేరు 54.20 డాలర్లతో కొనుగోలు చేసేందుకు చర్చలు జరిపినట్లు పేర్కొంది. రెండు వారాల క్రితమే ఈ సంస్థలో 9.2% వాటా కొనుగోలు చేసినట్లు ప్రకటించారు. ప్రస్తుతం సంస్థ మొత్తాన్నీ తన అధీనంలోకి తీసుకున్నారు.ఫేస్‌బుక్‌, టిక్‌టాక్‌తో పోలిస్తే తక్కువ మంది యూజర్లున్నప్పటికీ, సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు, జర్నలిస్టల ఖాతాలతో ట్విటర్‌కు ప్రపంచవ్యాప్తంగా అమిత ప్రాచుర్యం లభించింది.  ట్విటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్న మస్క్‌ కూడా ట్విటర్‌ యూజర్లలో ఒకరు. ఈ వేదికలో ఆయనకు 8.1 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. వాక్‌ స్వేచ్ఛకు వేదిక అవుతుందన్న నమ్మకంతోనే…

Read More

ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ట్వీట్లు చేశారంటూ అరెస్టు చేసిన గుజరాత్‌ ఎమ్మెల్యే జిగేష్‌ మేవానీకి అలా బెయిల్‌ మంజూరైందో లేదో, మరో కొత్త కేసులో సోమవారం ఆయన్ను తిరిగి అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోదీపై ట్వీట్ల కేసులో బెయిల్‌ పిటిషన్‌పై ఆదివారం విచారణ చేపట్టిన అసోం కోర్టు తీర్పు రిజర్వు చేయగా, సోమవారం బెయిల్‌ను మంజూరు చేసింది.  వెంటనే మరో కొత్త కేసులో మేవానీని అరెస్టు చేశారు. మేవానీని అరెస్టు చేసేందుకు వచ్చిన అసోం బార్‌పేట పోలీసులు, ఏ కేసులో అరెస్టు చేశారనేది ఇంకా వెల్లడించలేదు. మోదీపై చేసిన ట్వీట్స్‌కు సంబంధించి అసోంకు చెందిన బిజెపి నేత ఫిర్యాదుతో గురువారం గుజరాత్‌లోని పాలంపూర్‌ నుండి మేవానీని అరెస్టు చేశారు. అనంతరం అసోంకు తరలించారు.  కాగా, బెయిల్‌పై విడుదలైన మేవానీ మాట్లాడుతూ.. ‘ ఇది బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ల కుట్ర. నా ప్రతిష్టను దిగజార్చేందుకు ఇలా చేస్తున్నారు. ఓ క్రమపద్ధతిలో…

Read More

2019లో జమ్ముకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ను కేంద్రం రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను వేసవి సెలవుల తర్వాత విచారణకు అంగీరిస్తామని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. ఆ ఏడాది ఆగస్టులో జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్‌ను ఏకపక్షంగా రద్దు చేసిన కేంద్రం, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. రాష్ట్రంలో జరుగుతున్న పునర్విభజన కసరత్తు దృష్య్టా ఈ పిటిషన్‌పై తక్షణ విచారణ అవసరమని పిటిషనర్లలో ఒకరి తరుపు సీనియర్‌ న్యాయవాది శేఖర్‌ నఫాడే కోరారు.  ఆయన చేసిన వాదనలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ, జస్టిస్‌ హిమాకోహ్లిలతో కూడిన ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. కాగా, ఇది ఆర్టికల్‌ 370కి సంబంధించిన విషయమని, పునర్విభజన జరుగుతోందని కోర్టు తెలిపింది. వేసవి సెలవుల తర్వాత ఈ పిటిషన్‌పై దృష్టి సారిస్తానని సిజెఐ తెలిపారు.  ఈ విషయంపై ఐదుగురు సభ్యులతో కూడిన అత్యున్నత ధర్మాసనం చూడాల్సి ఉంటుందని,  దీని నిమిత్తం బెంచ్‌ను…

Read More

తెలంగాణలో తొలి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.  కోఠి ఉమెన్స్ కాలేజీని మహిళా  యూనివర్సిటీగా మారుస్తూ జీవో జారీ చేసింది.  తెలంగాణలో అమ్మాయిలకు ఉన్నతవిద్యలో అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది.  సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ మహిళా వర్సిటీ ఏర్పాటుపై ఉన్నత విద్యామండలి అధికారులతో భేటీ అయిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉత్తర్వుల ప్రతిని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ కు అందజేశారు. వర్సిటీ ఏర్పాటుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లు కేటాయించినట్లు ఆమె చెప్పారు.  ఈ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త కోర్సులు ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ఆధ్వర్యంలో విధివిధానాలు రూపొందించాలని మంత్రి సబిత ఆదేశించారు. బోధన సౌకర్యాలు విద్యార్థులకు మౌలిక సదుపాయాలు సమకూర్చాలని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మహిళా యూనివర్సిటీ అందుబాటులోకి వస్తుందని మంత్రి స్పష్టం చేశారు. …

Read More

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఇంటి ముందు స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్, ఎమ్యెల్యే అయిన ఆమె భర్త రవి రానా హనుమాన్ చాలీసా చదువుతామని ప్రకటిస్తే, శివసేన కార్యకర్తలు వారి ఇంటి ముందు నిరసనలు చేపట్టడం, మత వైమాశ్యాలు కలిగిస్తున్నారని అంటి ముంబై పోలీసులు వారిని అరెస్ట్ చేయడంతో రాజకీయ దుమారం చెలరేగింది. ఈ వ్యవహారంలో శివసేన, బిజెపి, ఎన్‌సిపి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)కి చెందిన మహిళా నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్‌సిపికి చెందిన ఫహ్మిదా హసన్ ఖాన్.. తనకు ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ఎదుట (ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని మోడీ అధికారిక నివాసం) హనుమాన్‌ చాలీసా చదివేందుకు అనుమతి ఇవ్వాలని కోరడంతో ప్రధాని ఇంటివద్దకు ఈ వివాదం చేరినట్లయింది. హనుమాన్ చాలీసాతో పాటు నమాజ్‌, దుర్గా చాలీసా, నమోకర్ మంత్రం (జైన్ శ్లోకం), గురు గ్రంథ్ సాహిబ్…

Read More