Author: Editor's Desk, Tattva News

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర శనివారంకు 10 రోజులు పూర్తయ్యింది. ఈ రోజు ఉదయం కిష్టంపూర్ చౌరస్తాకు రాగానే 100 కి.మీలు పూర్తి చేసుకున్నారు. జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో అలంపూర్ లో ప్రారంభించి జోగులాంబ జిల్లాలోనే బండి సంజయ్ 9 రోజులపాటు ఇదే జిల్లాలో పాదయాత్ర చేశారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా కార్యకర్తల్లో జోష్ నింపుతూ ముందుకు సాగుతున్నారు. ప్రతి రోజు ఉదయం లేచింది మొదలు.. రాత్రి పొద్దుపోయే దాకా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. గతంలో పెద్ద పెద్ద బహిరంగ సభలకు ప్రాధాన్యతనిచ్చిన బీజేపీ ఈసారి మాత్రం ‘ప్రజల గోస – బీజేపీ భరోసా’ పేరిట ప్రతిరోజు సగటున మూడు, నాలుగు గ్రామ సభలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. నడిగడ్డలో పాదయాత్ర చేసినన్ని రోజులు ఎక్కడ చూసినా రైతులు కలిసి నడిగడ్డ దుస్థితిని వివరించారు. ఈ…

Read More

అప్పుల బాధలు తాళలేక కౌలు రైతుల జీవితాలు అర్ధంతరంగా రాలిపోతుంటే.. ఆ కుటుంబాలు పలుకరించే దిక్కులేక, పట్టించుకునే నాథుడు లేక ఇబ్బందులు పడుతున్న వేళ ‘నేనున్నానం’టూ జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ చేసిన కౌలు రైతు భరోసా యాత్ర ధైర్యాన్ని నింపుతూ సాగింది. ఇటీవల అనంతపురం జిల్లాలో 30 మంది కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన పవన్‌.. శనివారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డున పడిన అన్నదాతల కుటుంబాలకు భరోసా కల్పించారు. జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా దెందులూరు, చింతలపూడి నియోజకవర్గాల్లో బలవన్మరణాలకు పాల్పడిన కౌలు రైతుల ఇళ్లకు వెళ్లి ఆ కుటుబాల కష్టాలు ఆలకించారు. కౌలు రైతుల కన్నీరు తుడిచేందుకు జనసేన పార్టీ ఉందన్న ధైర్యాన్ని నింపారు. ఇంటింటికీ వెళ్లి కష్టాల్లో ఉన్న ఆ కుటు-ంబాలను పలకరిస్తూ.. ఆత్మహత్యలకు కారణాలను ఓపికగా ఆలకించారు. కౌలు రైతులను అదుకుంటామంటే ప్రజలు నమ్మి సంపూర్ణ మెజార్టీతో గెలిపిస్తే…

Read More

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీ రామారావు హద్దుమీరి మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ (రాజ్యసభ) జీవీఎల్ నరసింహారావు ధ్వజమెత్తారు. బీజేపీ అంటే భయంతోనే కేటీఆర్ అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ మాట్లాడిన మాటలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే అంశంపై ఓ రెండు పత్రికల్లో (నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే) వక్రీకరించే కథనాలతో ప్రధాని మోదీని నిందిస్తూ విష ప్రచారం సాగించారని జీవీఎల్ ఆరోపించారు. తప్పుడు ప్రచారంపై ఆ పత్రికల వివరణ కోరగా, ఎడిటర్లు ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేవని చెబుతూ అందుకే ఆ రెండు పత్రికలపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని రాజ్యసభ చైర్మన్‌కు నోటీసులు అందజేశామని జీవీఎల్ తెలిపారు. తద్వారా బీజేపీ మీద తప్పుడు ప్రచారం చేస్తే రాజ్యాంగం పరిధిలో చట్టబద్ధంగా చర్యలు తీసుకోడానికి వెనుకాడబోమన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి…

Read More

శనివారం సాయంత్రం నడిచిన హైడ్రామా మధ్య అమరావతి ఎంపి, నటి నవనీత్‌ కౌర్‌ రానా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రానాను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నివాసం మాతోశ్రీ ఎదుట హనుమాన్‌ చాలీసా చదువుతామని వీరిద్దరు సవాలు చేయడంతో సబర్బన్‌ ఖర్‌లోని వారి నివాసం వద్ద ఉద్రికత్త నెలకొంది. శివసేన కార్యకర్తలు వారి ఇంటిని చుట్టుముట్టడంతో వారు తాము సవాలును వెనక్కి తీసుకున్నారు. అనంతరం నవనీత్‌, రవిని పోలీసులు అరెస్టు చేశారు. ఐపిసిలోని 153(ఎ)సెక్షన్‌ కింద వీరిద్దరిపై కేసు నమోదైంది. నవనీత్‌ కౌర్‌ దంపతులను అరెస్ట్ చేసి ఖార్ పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. పోలీసుల చ‌ర్య‌పై న‌వ‌నీత్ కౌర్ దంప‌తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తామేమీ ఉగ్ర‌వాద చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌టం లేద‌ని, సీఎం ఇంటి ముందు హ‌నుమాన్ చాలీసా ప‌ఠిస్తామ‌ని మాత్ర‌మే చెబుతున్నామంటూ వారు పోలీసుల‌తో వాగ్వాదానికి దిగారు. టాలీవుడ్‌తో పాటు పలు సినిమాలలో నటించిన…

Read More

వివాదాస్పదమైన సాయుధ బలగాలకు విశేషాధికారాలు కట్టబెట్టే సాయుధ బలగాల ప్రత్యేక హక్కుల చట్టాన్ని (ఆఫ్సా) ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ నుంచి పూర్తిగా తొలగించే ఆలోచనలో ఉన్నట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంకేతం ఇచ్చారు. ఈశాన్యం, జమ్మూ కాశ్మీర్ నుంచి అఫ్సాను పూర్తిగా తొలగించాలని రక్షణ బలగాలు కోరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ వివాదాస్పద చట్టాన్ని ఈశాన్య ప్రాంతాలైన నాగాలాండ్, అసోం, అరుణాచల్ ప్రదేశ్‌లలో ఇటీవల పాక్షికంగా తొలగించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు 1990లో జమ్మూకశ్మీర్‌లో ఆఫ్సా చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. 1958 సాయుధ బలగాల (ప్రత్యేక హక్కుల) చట్టం (అఫ్సా) కింద ఏదైనా ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటిస్తే అక్కడ ఆఫ్సాను అమలు చేస్తారు ఇది రాక్షస చట్టమని, దీనిని పూర్తిగా తొలగించాల్సిందేనని ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికీ నిరసనలు, డిమాండ్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్ తాజా ప్రకటనతో ఈశాన్యం, జమ్మూకశ్మీర్‌లో ‘ఆఫ్సా’ చట్టాన్ని కేంద్రం పూర్తిగా ఎత్తివేసే…

Read More

పాకిస్థాన్ విద్యాసంస్థల్లో ఎవరూ తమ పేర్లను నమోదు చేసుకోవద్దని విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసిటీఇ) ఇక్కడి విద్యార్థులను హెచ్చరించాయి. దీన్ని ఉల్లంఘిస్తే భారత్‌లో పై చదువులకు, ఉద్యోగానికి అర్హత కోల్పోతారని స్పష్టం చేసింది. పై చదువుల నిమిత్తం ఎవరూ పాకిస్థాన్‌కు వెళ్లొద్దని తేల్చి చెప్పింది. పాకిస్థాన్‌లోని డిగ్రీ కాలేజీల్లో ఎన్‌రోల్‌ చేసుకున్నవారు అక్కడ పొందిన డిగ్రీ పట్టా ఆధారంగా భారత్‌లో ఉద్యోగం చేయడానికి, ఉన్నత విద్యనభ్యసించడానికి అర్హులు కారు అని వివరించాయి. భారత విద్యార్థులు విద్యనభ్యసించడానికి పాకిస్థాన్‌కు వెళ్లద్దని కేంద్ర ఉన్నతవిద్యా మండలి సూచించింది. భారత ప్రమాణాలకు అనుగుణంగా లేని డిగ్రీలను పొంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవద్దని ఎఐసిటిఇ చైర్మెన్‌ అనిల్‌ సహస్రబుద్ధే తెలిపారు. భారత్‌ వెలుపల విద్యనభ్యసించాలనుకునే విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే ఈ మార్గదర్శకాలను జారీ చేశామని యూజీసీ చైర్మెన్‌ జగదీశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. భారత పౌరులు, ‘ఓవర్సీన్ సిటిజన్ ఆఫ్ ఇండియా’…

Read More

ప్రైవేట్‌ టీవీ చానెల్స్‌ ధోరణిపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలోని జహంగిర్‌పూర్‌ ప్రాంతంలో హనుమాన్ జయంతి ర్యాలీ సందర్భంగా జరిగిన ఘర్షణలు, ఉక్రెయిన్‌పై రష్యా దాడికి సంబంధించి కొన్ని టీవీ చానెల్స్‌ ప్రసారాలపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా, రెచ్చగొట్టేలా హెడ్‌లైన్లు, వ్యాఖ్యలు చేసిన కొన్ని టీవీ చానెల్స్‌కు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చురకలు వేసింది. నియమ, నిబంధనలను ఉల్లంఘించేలా ఉన్నవి మానుకోవాలని హితవు పలికింది. ‘ఇటీవలి కాలంలో అనేక శాటిలైట్ టీవీ చానెల్స్‌ వార్తా ఘటనలను అశాస్త్రీయంగా, తప్పుదారి పట్టించేవిగా, సంచలనాత్మకంగా కవరేజీని ప్రసారం చేసినట్లుగా గుర్తించాం. సామాజికంగా ఆమోదయోగ్యం కాని భాష, వ్యాఖ్యలను ఉపయోగించడం, ఇతరుల మర్యాదను కించపరచడం, అసభ్యకరంగా, పరువు నష్టం కలిగించేలా, మతపరమైన వ్యక్తీకరణలు వంటివి చూసాం’ అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి కార్యక్రమాలు కోడ్‌తోపాటు ది కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (నియంత్రణ) చట్టం 1995…

Read More

ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగర శివారు పట్టణం బుచా తరహాలో దాదాపు పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకున్న మరియుపోల్ నగరంలో కూడా రష్యా సైన్యం దారుణ ఊచకోతకు పాల్పడిన్నట్లు వెల్లడి అవుతుంది. ఈ ఊచకోతలను కప్పిపుచ్చుకోవడానికి అలా చంపేసిన వేలాది మందిని సామూహిక సమాధుల్లో పూడ్చి పెట్టిన్నట్లు మరియుపోల్‌కు సమీపంలోని సామూహిక సమాధుల తాజా ఉపగ్రహ చిత్రాలు ధ్రువీకరిస్తున్నాయి. మరియుపోల్‌ను స్వాధీనం చేసుకునే క్రమంలో రష్యా సైనికులు దాదాపు 9 వేల మంది పౌరులను చంపేశారని, వారినందరినీ సామూహిక సమాధుల్లో పూడ్చి పెట్టారని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. మరియుపోల్ పోరులో విజయం సాధించామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ ఉపగ్రహ చిత్రాలు వెలుగులోకి రావడం గమనార్హం. ఉపగ్రహ ఛాయా చిత్రాలను అందించే మాక్సార్ టెక్నాలజీస్ ఈ ఫొటోలను విడుదల చేసింది. యుద్ధంలో మరణించిన పౌరులను పూడ్చి పెట్టడం కోసం రష్యా సైన్యాలు నగరానికి సమీప పట్టణం మన్‌హుష్‌లో…

Read More

భారత్‌ వృద్ధిబాట పట్టాలంటే ఉపాధి కల్పన, రుణాల మంజూరు, కార్మికశక్తి అత్యంత కీలకమైనవని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) మిషన్‌-ఇండియా చీఫ్‌ నాద చౌరి తెలిపారు. కరోనా సంక్షోభం కారణంగా రెండేండ్ల వృద్ధి కోల్పోయామని, భారత్‌లో వివిధ రంగాలు ఇంకా వృద్ధిబాట పట్టాల్సి వుందని ఆమె చెప్పారు. ఓ జాతీయ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..”రాబోయే ఐదేళ్లలో దక్షిణాసియా దేశాల జిడిపి 7 శాతం ఉంటుందని ఇంతకు ముందు అంచనావేశాం. కానీ అది 6.2 శాతానికి పరిమితమవుతుందని భావిస్తున్నాం. ఆర్థిక రంగంలో సంస్కరణలు తీసుకొస్తే వృద్ధి వేగవంతం అవుతుంది. రుణాల లభ్యత, లేబర్‌ మార్కెట్‌ మెరుగుపడాలి. ఉపాధి కల్పన పెరగాలి. దాంతో కార్మికశక్తిలో ప్రాతినిథ్యం పెరుగుతుంది. ఆర్థిక వృద్ధి గాడిలో పడాలంటే క్యాపిటల్‌, లేబర్‌ రెండూ ముఖ్యమైనవే”అని చెప్పారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 9 శాతం వృద్ధి నమోదుచేస్తుందని ఈ ఏడాది జనవరిలో ఐఎంఎఫ్‌ అంచనావేసింది. ఈ…

Read More

బ్రిటీష్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌పై పార్లమెంటరీ దర్యాప్తు జరిపేందుకు ప్రతినిధుల సభ ఎంపీలు ఆమోద ముద్ర వేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో దేశంలో విధించిన లాక్‌డౌన్‌ ఆంక్షలను ఉల్లంఘించిన విషయంలో ప్రధాని చెబుతున్నది వాస్తవమా కాదా అనే విషయం తేల్చేందుకు పార్లమెంటరీ దర్యాప్తు జరపాలని బ్రిటీష్‌ ఎంపీలు నిర్ణయించారు.  ప్రతినిధుల సభలో లాంఛనంగా జరగాల్సిన ఓటింగ్‌ కూడా లేకుండానే సభ్యులు ఆమోదం తెలిపారు. పార్లమెంట్‌ సభా హక్కుల కమిటీ దీనిపై దర్యాప్తు చేపడుతుందని భావిస్తున్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే బోరిస్‌ జాన్సన్‌ పార్లమెంట్‌ను తప్పుదారి పట్టించారని రుజువైతే వెంటనే తన పదవికి రాజీనామా చేయాల్సి వుంటుంది.  ప్రతిపక్ష లేబర్‌ పార్టీ తొలుత ఈ దర్యాప్తుకు పట్టుబట్టింది. దాన్ని నిరోధించడానికి కన్జర్వేటివ్‌ సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పార్లమెంట్‌లో కన్జర్వేటివ్‌లకు గణనీయంగానే మెజారిటీ వుంది కానీ, ప్రధాని వ్యవహార శైలి పట్ల చాలామంది ఎంపీలు సంతృప్తిగా లేరు.  స్వంత పార్టీ సభ్యులే ఆయన తీరుపై…

Read More