వరుస పరాజయాలతో పార్టీ రాజకీయ మనుగడ ప్రశ్నార్ధకరంగా మారుతున్న వేళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ 2024 ఎన్నికలపై దృష్టి సారించినట్లు కనిపిస్తున్నది. ఎన్నికల వ్యూహ రచనకై తన నివాసంలో శనివారం ఆమె పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పాల్గొన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వారికి 2024 ఎన్నికల స్వరూపం గురించి ఒక ప్రజెంటేషన్ సమర్పించినట్లు చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, 2024 లోక్‌సభ ఎన్నికల్లో 370 నుంచి 400 స్థానాలను సాధించాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రశాంత్ కిశోర్ సూచించారు. కాంగ్రెస్ బలహీనంగా ఉన్నచోట్ల వ్యూహాత్మకంగా పొత్తులు కుదుర్చుకోవాలని తెలిపారు. మరోవంక, ఎన్నికల వరకు పార్టీకి పూర్తిస్థాయిలో సేవలు అందించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఆయనను కోరారు. ఈ సమావేశంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు, పార్టీ పునరుద్ధరణకు మార్గాలను రూపొందించేందుకు యోచిస్తున్న మేధోమథన సమావేశం గురించి సమాలోచనలు కూడా జరిపినట్లు తెలుస్తున్నది. మల్లికార్జున్ ఖర్గే,…
Author: Editor's Desk, Tattva News
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్ష నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలంటూ గతేడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం బిల్లును ఆమోదించి గవర్నర్‌కు పంపించింది. అయితే దీనిపై ఎటూ తేల్చకుండా గవర్నర్ తాత్సారం చేశారు. విమర్శలు రావడంతో చివరకు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉన్నదంటూ ఆ బిల్లును అసెంబ్లీ పరిశీలనకు ఈ నెల 3న గవర్నర్ తిరిగి పంపారు. దీంతో ఫిబ్రవరి 8న మరోసారి రెండో బిల్లును అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ ఆమోదానికి పంపారు. అయితే దీనిని కూడా గవర్నర్ రవి పక్కన పెట్టారు. దీంతో విద్యార్థుల ప్రయోజనాలను పట్టించుకోకుండా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది. బిల్లును రెండోసారి కూడా గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆమోదించకపోవడంతో ప్రభుత్వం భగ్గుమన్నది. దీంతో బిల్లును ఆమోదించేవరకు రాజ్‌భవన్‌కు తాము దూరంగా ఉంటామని ప్రకటించింది. ఈ క్రమంలో రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమాన్ని కూడా బహిష్కరించింది. ఈ నేపథ్యంలో శనివారం పార్టీ అధికారిక …
బిజెపి పాలిత రాష్ట్రాల్లో విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని, వీటికి సమానంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా బీజేపీతో పోటీ పడుతున్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. మాట్లాడుతూ నవ్వి పొదురు గాక నాకేమీ సిగ్గు.. అన్నట్లుగా పాదయాత్రలో బిజెపి రాష్ట్ర నాయకులు కనీస సోయి లేకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. వాస్తవాలను తెలుసుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఎద్దేవ చేశారు. బిజెపి, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విద్యుత్ ఛార్జీలు ఎక్కువ ఉండగా, కేవలం 7 గంటల పాటు మాత్రమే విద్యుత్ సరఫరా ఉందని, అదే తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తక్కువ, 24 గంటల పాటు నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా సాగుతోందని వినోద్‌కుమార్ వెల్లడించారు. రైతులకు 24 గంటల ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం కేవలం తెలంగాణ ఒక్కటే అని తెలిపారు. పరిశ్రమలకు సైతం ఇతర…
దేశంలో ఈమధ్యకాలంలో నెలకొన్న వివాదాస్పద సంఘటనలపై, , చోటు చేసుకుంటున్న వరుస ఉదంతాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఉండడంపై విపక్షాలు ప్రశ్నించాయి. ముఖ్యంగా శ్రీరామ నవమి సందర్భంగా చోటుచేసుకున్న మత ఘర్షణలను ప్రస్తావిస్తూ మొత్తం 13 ప్రతిపక్ష పార్టీలు శనివారం రోజున సంతకాల సేకరణ ద్వారా ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. తారతమ్యాలకు, రాగద్వేషాలకు తావులేకుండా దేశం మొత్తం శాంతి నెలకొనాలని ఆకాంక్షించిన ఆ పార్టీలు హింసకు కారణమైనవాళ్లను వదలకూడదని, కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశాయి. ఇదిలా ఉండగా ఈ ఘర్షణలపై ప్రధాని మోదీ మౌనంగా ఉండడంపై ప్రతిపక్షాలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి, జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్, ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్, ఎన్సీపీ అధినేత చీఫ్ ఫరూక్…
వాజపేయి హయాంలో బిజెపికి `స్టార్ క్యాంపైనర్ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పార్టీ పార్టీ ప్రచారంలో పాల్గొనడమే కాకుండా ఆ పార్టీ పార్లమెంట్ సభ్యునిగా, వాజపేయి మంత్రివర్గంలో సభ్యునిగా కీలక భూమిక వహించిన ప్రముఖ్ బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో భారీ విజయంతో లోక్‌సభకు తిరిగి రానున్నారు. సెల్యులాయిడ్‌లో అద్భుతమైన కెరీర్ తర్వాత, 76 ఏళ్ల నాయకుడి రాజకీయ ప్రయాణం పలు మలుపులు తిరిగింది. అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీల ద్వయం 1980లో బీజేపీని ఏర్పాటు చేసి, ఆ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించడానికి కృషి చేస్తున్న సమయంలోనే ఆయన బీజేపీలో చేరారు. రాజకీయాలలోకి వచ్చిన కాంగ్రెస్ టికెట్ పై లోక్ సభకు ఎన్నికైన తొలి బాలీవుడ్ నటుడు రాజేష్ ఖన్నాపై 1992లో బిజెపి అభ్యర్థిగా న్యూఢిల్లీ నుండి పోటీ చేసి, ఓటమి చెండంతో ఎన్నికల రాజకీయాలలో ప్రవేశించారు. తరువాత, ఆయన 1996, 2002లలో రాజ్యసభకు ఎన్నికయ్యారు. అటల్…
తరచూ వివాదాలకు గురయ్యే పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. మద్యం సేవించి ఓ గురుద్వారాలో ప్రవేశించారని ఆయనపై పోలీసులుకు ఫిర్యాదు చేశారు. బీజేపీ నేత తజీందర్ పాల్ సింగ్ బగ్గా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడం పంజాబ్‌లో కలకలం రేపుతోంది. సీఎం భగవంత్ మాన్ ఏప్రిల్ 14వ తేదీన మద్యం సేవించి గురుద్వారాలోకి ప్రవేశించారని తజీందర్ సింగ్ తెలిపారు. దేశవ్యాప్తంగా జరుపుకునే బైసాఖీ సందర్భంగా పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ మద్యం సేవించిన స్థితిలో తఖ్త్ దమ్‌దామా సాహిబ్‌లోకి ప్రవేశించారని శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (ఎస్‌జిపిసి) అంతకుముందు శుక్రవారం ఆరోపించింది. దీంతో తాజాగా బీజేపీ నేత బగ్గీ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోన సీఎం క్షమాపణలు చెప్పాలని కమిటీ డిమాండ్ చేసింది. ఈ సందర్బంగా భగ్గా ట్విట్టర్ వేదికగా తన ఫిర్యాదు మేరకు సీఎంపై చర్యలు తీసుకోవాలని …
నాలుగు రాష్ట్రాల్లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు, ఒక లోక్ సభ స్థానంకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీకి ఎక్కడా విజయం సాధింపలేక పోయింది. అయితే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో మినహా మిగిలిన అన్ని చోట్ల బీజేపీ ద్వితియ స్థానంలో ఉండగలిగింది. గతంలో వాజపేయి మంత్రివర్గంలో పనిచేసి, బిజెపి ఎంపీగా ఉన్న ప్రముఖ బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హా పశ్చిమ బెంగాల్ నుండి టిఎంసి అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికయ్యారు. అదే విధంగా నరేంద్ర మోదీ మంత్రివర్గంలో పనిచేసి, మంత్రి పదవి పోవడంతో ఎంపీ పదవికి, బిజేపికి రాజీనామా చేసిన మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ సింగర్ బాబూల్ సుప్రియో కూడా టిఎంసి అభ్యర్థిగా రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, బిహార్‌లలోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని ఒక అసెంబ్లీ నియోజకవర్గం, ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం విడుదల చేసింది. రెండు అసెంబ్లీ స్థానాలను కాంగ్రస్ కైవసం చేసుకోగా,…
సివిల్ కాంట్రాక్టర్ “అసహజ మరణం”పై నమోదైన కేసులో నిందితుడిగా పేర్కొన్న మూడు రోజుల తరువాత, కర్ణాటక మంత్రి కెఎస్ ఈశ్వరప్ప గత సాయంత్రం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి తన రాజీనామాను సమర్పించారు. కేబినెట్‌లో కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ మంత్రిగా ఉన్న ఈశ్వరప్ప “బిజెపికి ఇబ్బంది కలిగించకుండా ఉండటానికి” తాను రాజీనామా చేస్తున్నానని చెప్పారు.రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర బిజెపిలో శక్తివంతమైన బిసి నాయకుడు అవినీతి, తదుపరి కాంట్రాక్టర్ ఆత్మహత్యల ఆరోపణలపై రాజీనామా చేయవలసి వచ్చింది. గత గురువారం తన రాజీనామాను ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైని కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు.రాజీనామాను ఆమోదిస్తున్నట్లు వెంటనే ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే సంతోష్ పాటిల్ అనే కాంట్రాక్టర్ మృతితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఈశ్వరప్ప స్పష్టం చేశారు. పోలీసుల నుంచి ప్రాథమిక నివేదిక అందిన తర్వాత ఈశ్వరప్ప తన రాజీనామాపై తుది నిర్ణయం తీసుకుంటారని ఈ వారం ప్రారంభంలో…
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్పులు చేసిన మంత్రివర్గంలో నెల్లూరు జిల్లా నుండి కాకాని గోవర్ధనరెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, కీలకమైన వ్యవసాయ శాఖను చేపట్టిన రెండు రోజులకే నెల్లూరులో ఓ కోర్ట్ లో దొంగతనం జరగడం, ఆయనపై నమోదైన ఓ కేసు సంబంధించిన కీలక పత్రాలు అదృశ్యం కావడం దిగ్బ్రాంతి కలిగిస్తున్నది. టిడిపికి చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విదేశాలలో వేల కోట్ల రూపాయల వివిలువైన ఆస్తులు సమకూర్చుకున్నారని అంటూ గోవర్ధన్ రెడ్డి డిసెంబర్, 2017లో చేసిన ఆరోపణలపై ఆయన కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తన ఆరోపణలకు మద్దతుగా గోవర్ధనరెడ్డి సమర్పించిన పత్రాలు నకిలీవని, ఫోర్జరీ చేసినవని సోమిరెడ్డి ఆరోపించారు. ఆయన ఆరోపణలను నిర్ధారిస్తూ పోలీసులు సహితం తమ దర్యాప్తు నివేదికను కోర్టుకు సమర్పించారు. ఛార్జ్ షీట్ ను కూడా దాఖలు చేశారు. ఈ కేసులో సాక్ష్యంగా చూపుతున్న పత్రాలను అపహరించడం కోసమే ఈ దొంగతనం జరిగిందని టిడిపి ఎమ్యెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్…
ఆంధ్ర ప్రదేశ్ లో ఆర్‌టిసి టిక్కెట్ ధరలను గతంలో ఎన్నడూ లేనివిధంగా పెంచడంతో ప్రయాణికులపై పెనుభారం పడింది. ఆర్‌టిసి యాజమాన్యం పెరిగిన ధరల భారం రూ.720 కోట్లు అని చెబుతున్నా.. వాస్తవంగా రూ.1500 కోట్లకు పైబడి ఉందని అధికారులు అనధికారికంగా అంగీకరిస్తున్నారు. గతంలో కిలోమీటరు తరహాలోనే పెంచితే ఇప్పుడు కిలోమీటర్‌పై పెంచుతూనే సెస్‌ల రూపేణా భారీగా పెంచారు. ఇప్పుడు ప్రయాణికుడికి ఇచ్చే టిక్కెట్‌పై కూడా సెస్ పేరుతో భారం వేశారు. కనీస ఛార్జీలు, ప్రయాణం సెస్, భద్రత సెస్, టోల్ ఛార్జీలతోపాటు విద్యార్థులు, ఉద్యోగులకు ఇచ్చే సీజనల్ పాస్‌ల ధరలను భారీగా పెంచారు. డీజిల్ సెస్ పేరుతో పల్లె వెలుగు, ఆర్డినరీ సర్వీసులో టిక్కెట్‌కు రూ.2, ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, సిటి మెట్రోలలో రూ.5, సూపర్ లగ్జరీ, ఎసి బస్సుల్లో రూ.10 చొప్పున పెంచారు. పల్లె వెలుగు బస్సులకు కిలోమీటరుకు 73 పైసలుంటే ఇప్పుడు 83 పైసలకు పెంచారు. అల్ట్రా పల్లె…