సాయుధ దళాల ప్రత్యేక అధికార చట్టం(అఫ్స్పా) పరిధి నుంచి ఈశాన్య రాష్ట్రాల్లోని 36 జిల్లాలను మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. అస్సాంలో 23, మణిపూర్‌లో 6, నాగాలాండ్‌లో 7 జిల్లాలకు ఈ మినహాయింపు లభించింది. అఫ్స్పా 1958 సెప్టెంబర్ 11 నుంచి అమల్లోకి వచ్చింది. ఘర్షణలు జరిగే ప్రాంతాల్లో శాంతిభద్రతలను కాపాడటం కోసం ఈ చట్టాన్ని తెచ్చారు. ఈ చట్టం ప్రకారం అవసరమనుకుంటే చర్యలను చేపట్టేందుకు సాయుధ దళాలు అమలు చేయడానికి ఈ చట్టం అనుమతి ఇస్తుంది. తీవ్రవాదుల శిక్షణ స్థావరాలను ధ్వంసం చేయడం, వారెంట్ లేకుండా వ్యక్తులను అరెస్టు చేయడం వంటి వాటికి ఇది అవకాశం కల్పిస్తుంది. ఈ చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. గత ఏడాది డిసెంబరు 4న నాగాలాండ్‌లోని మోన్ జిల్లా, ఓటింగ్ గ్రామస్థులను ఉగ్రవాదులుగా భావించి, వారిపై సాయుద దళాలు జరిపిన కాల్పుల్లో ఆరుగురు సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. ఆగ్రహోదగ్రులైన గ్రామస్థులు…
Author: Editor's Desk, Tattva News
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రోత్సాహాన్నిస్తూ శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడలో ఒకొక్కటి 1208 మెగావాట్ల సామర్థ్యంతో ఆరు రియాక్టర్లను ఏర్పాటు చేయడానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు కేంద్రప్రభుత్వం వెల్లడించింది. బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ప్రధానమంత్రి కార్యాలయం సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రాజ్యసభలో గురువారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కొవ్వాడ ప్రాజెక్ట్ ప్రతిపాదనను ప్రభుత్వం ఖరారు చేసిన తర్వాత వాస్తవ పెట్టుబడి వివరాలు వెలువడతాయని మంత్రి చెప్పినప్పటికీ, కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టులో మొత్తం అంచనా పెట్టుబడులు రూ 2 లక్షల కోట్ల వరకు ఉంటాయి. కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు వల్ల 8 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పని ప్రారంభించిన తర్వాత, ప్రతి జంట యూనిట్ స్టేషన్లు దాదాపు 2 వేల మందికి ఉపాధి కల్పిస్తాయి. 6,780 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో దేశంలో 22…
ఎస్టీ రిజర్వేషన్‌లను పెంచడంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హామీనిచ్చారు. రాష్ట్ర శాసనసభలో ఎస్టీ రిజర్వేషన్ పెంపును డిమాండ్ చేస్తూ సభ్యులు ఆందోళన చేయడంతో ముఖ్యమంత్రి స్పందించారు. న్యాయమూర్తుల కమిటీ నివేదిక మరో 8-10 రోజులలో రానుందని తెలిపారు. ఆ తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎస్టీ రిజర్వేషన్ అంశం అత్యంత క్లిష్టమైనదని పేర్కొంటూ ప్రభుత్వం ముందు ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. మాజీ ఉపలోకాయుక్త సుభాష్ అడి నేతృత్వంలో వివిధ సామాజిక వర్గాల రిజర్వేషన్‌తోపాటు ఎస్టీ రిజర్వేషన్‌లకు సంబంధించిన కమిటీ ఏర్పడిందని గుర్తు చేశారు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌కు నివేదిక ఇవ్వాలని సూచించామని తెలిపారు. రెండు వారాలలోగానే నివేదికలు రానున్నాయని చెప్పారు. గతంలో వాల్మీకి సామాజికవర్గీయులను వెనుకబడిన, బుడకట్టు వర్గం కింద 5శాతం రిజర్వేషన్ ఉండేది. ఎస్టీలోకి వాల్మీకులను చేర్చిన తర్వాత 3.5శాతం మాత్రమే రిజర్వేషన్ సాధ్యమవుతోంది.…
అయోధ్య శ్రీరామ జన్మ భూమిలోని భవ్య మందిర నిర్మాణపు పనులు 30 శాతం మార్చి 15 నాటికి పూర్తయిన్నట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.2020 ఆగష్టు 5న భూమి పూజ జరుగగా మార్చ్ 10, 2022 నాటికి పునాది నిర్మాణం పూర్తవడంతో మొదటి దశ నిర్మాణం పూర్తయించి. ఈ పనిని పూర్తి చేయడానికి దాదాపు 18 నెలల సమయం పట్టింది. మొదట్లో 6 నెలలపాటు పరస్పర చర్చలు, పరిశోధనలు జరిగాయి. తుది నిర్ణయం తీసుకున్న తర్వాత, పనులు పూర్తి చేయడానికి దాదాపు ఒక సంవత్సరం సమయం పట్టింది. ఈ పనిని నెరవేర్చడానికి, ఐఐటి – ఢిల్లీ మాజీ డైరెక్టర్, ఐఐటి – గౌహతి ప్రస్తుత డైరెక్టర్, నిట్ -సూరత్ ప్రస్తుత డైరెక్టర్, సిబిఆర్ఐ రూర్కీ ప్రస్తుత డైరెక్టర్, వారి బృందాలతో పాటు లార్సన్ టౌబ్రో(ఎల్ అండ్ టి), టాటా ఇంజనీర్స్, ఐఐటి -ఢిల్లీ, ఐఐటి -చెన్నై,…
సమాజంలో మహిళల పురోగతికి ప్రతికూలంగా ఉన్న అన్ని అడ్డంకులను తొలగించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పిలుపిచ్చారు. ఢిల్లీలో జరిగిన ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ – ఎఫ్ఎల్ఓ 38వ వార్షిక సదస్సుకు విశిష్ట అతిథిగా పాల్గొంటూ వివిధ రంగాల్లో లింగ వివక్షత పెను ప్రభావాన్ని చూపిస్తోందని.. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలతోపాటు పౌరసమాజం ప్రత్యేకమైన చొరవ తీసుకుని మహిళా సాధికారతకు బాటలు వేయాలని సూచించారు. పారిశ్రామికవేత్తలుగా మహిళలు రాణిస్తున్న తీరును ప్రత్యేకంగా అభిమానించిన ఉపరాష్ట్రపతి ఈ సంఖ్య మరింతగా పెరగాలని, శాసన వ్యవస్థలోనూ మహిళల భాగస్వామ్యానికి సరైన అవకాశం ఇవ్వాలని వెంకయ్య అభిప్రాయపడ్డారు. మహిళలను విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో మరింతగా ప్రోత్సహించి వారికి సరైన సాధికారత కల్పించేదిశగా మరింత జరగాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. భారతదేశ జనాభాలో 49శాతంగా ఉన్న మహిళలను దేశ పురోగతిలోనూ క్రియాశీలక భాగస్వాములు చేసేందుకు చొరవతీసుకోవాలని కోరారు. లింగక వివక్షతను రూపుమాపడంతోపాటు బాలికల విద్యను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని విస్మరించకూడదని, ఇందుకోసం కేంద్ర,…
అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగడానికి ముందే జాతీయ అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన పదవికి రాజీనామా చేస్తారా? లేదా జాతీయ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెడతారా? అన్నది రాజకీయ వర్గాలలో సంచలనం కలిగిస్తున్నది. అయితే చివరి బంతి వరకు ఆడతానని, మధ్యలో పారిపోయే ప్రసక్తి లేదని సంకేతాలు ఇస్తున్నారు. 75 ఏళ్ల పాక్ రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రధాని కూడా పూర్తి పదవీకాలం (ఐదేళ్లు) పూర్తి చేసుకోలేదు. మిలిటరీ జోక్యంతో దాదాపుగా గద్దె దిగిపోవడం లేదంటే శరణార్థులుగా బయటి దేశాలకు పారిపోవడం జరిగింది. అలాగే ఏ ఒక్కరూ అవిశ్వాసంలో ఓడిపోలేదు కూడా. ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నాడు. ఈ తరుణంలో.. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లాలనే ఆలోచనలోనూ ఇమ్రాన్ ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ నుంచి రాజీనామాను ఆశించని ప్రతిపక్ష కూటమి నేత, పీఎంఎల్-ఎన్ చీఫ్ షహబాజ్ షరీఫ్.. తదుపరి ప్రధాని…
ఒబిసి జనగణన చేపట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని వైసిపి ఎంపిలు కోరారు. బుధవారం పార్లమెంటులో ప్రధాన మంత్రిని ఆయన కార్యాలయంలో వైసిపి ఎంపిలు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఒబిసి జనగణన చేపట్టాలని, చట్ట సభలు, న్యాయ వ్యవస్థలో బిసి రిజర్వేషన్లు అమలు చేయాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎపి భవన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల (ఒబిసి) జనగణన, చట్టసభలు, న్యాయ వ్యవస్థ ఉద్యోగాల్లో బిసి రిజర్వేషన్లు అమలు చేయాలని కోరినట్లు తెలిపారు. ఇలా ఉండగా, దేశవ్యాప్తంగా కులగణనను కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని టిఆర్‌ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఉభయ సభల్లో వాయిదా తీర్మానం ఇచ్చింది. పార్టీ ఎంపిలు ఇచ్చిన ఈ తీర్మానంపై రాజ్యసభతో పాటు లోక్‌సభలోనూ తిరస్కరించారు. టిఆర్‌ఎస్ పార్టీ ఎంపిలు ఉభయ సభల్లోనూ తీవ్ర…
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఎదుట బిజెపి కార్యకర్తలు చేపట్టిన నిరసన విధ్వంసంకు దారితీయడంతో ఉద్రిక్తత నెలకొంది. ‘ద కాశ్మీర్ ఫైల్స్’ సినిమానుద్దేశించి ఇటీవల కేజ్రీవాల్ వరుసగా వ్యాఖ్యలు చేయడంతో బిజెపి కార్యకర్తలు ఆయన ఇంటి ఎదుట నిరసన చేపట్టారు. గోడలపై పెయింటింగ్ పూశారు. అడ్డుకున్న పోలీసులతో గొడవకు దిగారు. కాశ్మీర్ హిందువుల మారణహోమాన్ని కేజ్రీవాల్ అపహాస్యం చేస్తున్నారంటూ బిజెపి నేతలు ఆరోపించారు. ఈ నిరసనకు నేతృత్వం వహించిన బిజెపి ఎంపి, యువమోర్చ జాతీయ అధ్యక్షుడు తేజశ్వి సూర్యను పోలీసుుల అదుపులోకి తీసుకున్నారు. తేజస్వి సూర్య ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాకు పన్ను రాయితీని ఇవ్వడానికి నిరాకరించడం మాత్రమే కాకుండా, కశ్మీరులో హిందువుల ఊచకోతను కేజ్రీవాల్ ఎగతాళి చేస్తున్నారని ఆరోపించారు. దీంతో తాను ఎవరివైపు ఉన్నారో ఆయన స్పష్టం చేశారని పేర్కొన్నారు. ఆయన ఉగ్రవాదులవైపు ఉన్నారని ఆరోపించారు. ఈ అమానుష క్రూరత్వానికి ఆయన రాజకీయంగా భారీ మూల్యం చేల్లించుకుంటారని హెచ్చరించారు. కాగా,…
ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో జరిగిన హింసాకాండ కేసుపై దర్యాప్తును పర్యవేక్షిస్తున్న సుప్రీంకోర్టు నియమిత కమిటీ సిఫారసు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాకు శరాఘాతంగా మారింది. ఆయన కుమారుడు, ఈ కేసులో నిందితుడు ఆశిష్ మిశ్రాకు మంజూరైన బెయిలును రద్దు చేయాలని ఈ కమిటీ సిఫారసు చేసినట్లు సుప్రీంకోర్టు బుధవారం ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దుపై స్పందించాలంటూ యుపి ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. లఖింపూర్ ఖేరీ హింసాకాండ కేసులో ప్రధాన నిందితుడు కేంద్ర మంత్రి అజరు మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా బెయిల్ రద్దును కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలంటూ మాజీ జడ్జి రాకేష్ కుమార్ జైన్ నేతృత్వంలోని కమిటీ యుపి ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కొహ్లిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. దీనిపై యుపి…
ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 8 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు పెరగడం, సరఫరా గొలుసుపై ప్రభావం పడటం వంటి అంశాలు ఉన్నాయని వివరించింది. చమురు, ఎడిబుల్ ఆయిల్స్ ధరలు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను తగ్గించినట్టు తెలిపింది. ప్రధానంగా రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం భారత్ జీడీపీపై పడుతుందని హెచ్చరించింది. రానున్న ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.2 శాతానికి పరిమితం అవుతుందని పేర్కొంది. గత అంచనాల నుంచి ఈ రేటులో 0.8 శాతం మేర కోత విధించింది. యుద్ధ ప్రభావంతో కమోడిటీ ధరలు పెరగడం, సరఫరా సమస్యలు తలెత్తడం వంటి అంశాల కారణంగా వృద్ధి అంచనాలను తగ్గిస్తున్నట్టు ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్ అదితి నాయర్ తెలిపారు. వచ్చే ఏప్రిల్ నెల తొలి…