Author: Editor's Desk, Tattva News

ఒక వంక,ఉక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతుండగా, ఆ రెండు దేశాల మధ్య రాజీ కుదర్చడం ద్వారా యుద్దానికి ముగింపు పలకడం కోసం ఇజ్రాయిల్ ప్రయత్నం ప్రారంభించింది.   ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నఫ్తాలీ బెన్నెట్ చొరవ తీసుకొని ఇరు దేశాల అధ్యక్షులతో సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారు.  మొదటగా, శనివారం ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్ ను  కలిసి మూడు గంటల పాటు చర్చించారు. దీనికి ముందు రష్యాతో చర్చించాలని ఇజ్రాయెల్‌ను ఉక్రెయిన్ కోరింది.  అమెరికాకు అత్యంత సన్నిహితంగా మెదిలే దేశమైన ఇజ్రాయెల్  ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండించింది. అయినప్పటికీ పుతిన్‌తో సమావేశం అవ్వడం గమనార్హం.  పైగా ఈ యుద్ధం మొదలైన తర్వాత రష్యా అధినేతతో సమావేశమైన మొదటి దేశాధినేత ఇజ్రాయెల్ ప్రధాని మాత్రమే.  పుతిన్‌తో సమావేశం అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో బెన్నెట్ మాట్లాడినట్లు  ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం రష్యా, ఉక్రేనియన్ నాయకులతో సత్సంబంధాలను కొనసాగించేందుకు ప్రయత్నిస్తామ‌ని తెలిపారు. …

Read More

అమెరికా, ఐరోపా దేశాలను తమ  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి డిస్‌కనెక్ట్‌ అవుతున్నట్లు కనిపిస్తున్న వీడియోలను సోషల్‌ మీడియాలో రష్యా  పోస్ట్‌ చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో అమెరికా, ఐరోపాతో సహా పలు దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. పలు అగ్రదేశాలు రష్యాపై ఆంక్షలను మరింత కఠినతరం చేశాయి. అయితే, రష్యా మాత్రం తన దూకుడును తగ్గించలేదు. అంతటితో ఆగకుండా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వైదొలగింది. తాను అంతరిక్ష కేంద్రం నుంచి వైదొలగితే ఎదురయ్యే పరిణామాల గురించి రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్‌ అమెరికాను ముందుగానే హెచ్చరించింది. ఈ మేరకు రష్యా తాను అంతరిక్ష కేంద్రం నుంచి డిస్‌కనెక్ట్‌ అవుతున్నట్లు కనిపిస్తున్న వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.  అమెరికా ఆంక్షలు విధించిన కొద్ది రోజుల్లోనే ఈ వీడియోను అనూహ్యంగా విడుదల చేసింది. 47 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో రష్యన్‌ వ్యోమగాములు రష్యన్‌…

Read More

ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగా ఉండడంతో పీఆర్సీ సిఫార్సులు అమలు సాధ్యం కాదని వాదిస్తూ వచ్చిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పటి వరకు కనీసం ఆ నివేదికను కూడా బాట పెట్టలేదు. అయితే హైకోర్టు మొట్టికాయలు వేయడంతో చివరకు బైటపెట్టక తప్పలేదు. తీరా చూస్తే ప్రభుత్వ ఉద్యోగులకు అశుతోష్‌ మిశ్ర కమిటీ చేసిన చేసిన సిఫారసులన్నీ యథాతథంగా అమలు చేస్తే ప్రభుత్వంపై ఏడాదికి రూ.3,181 కోట్ల భారమే పడుతుందని స్పష్టమైనది. ఈ విషయాన్ని ఆ కమిటీయే స్పష్టం చేసింది. ఉద్యోగులకు 27% ఫిట్‌మెంట్‌ ఇస్తూ, ఇప్పుడున్న ఇంటి అద్దె భత్యాల్ని తగ్గించకుండా, సీసీఏని కొనసాగిస్తూ, మరిన్ని వెసులుబాట్లు, ప్రయోజనాలు కల్పిస్తూ చేసిన సిఫారసుల్ని పూర్తిగా అమలుచేసినా ప్రభుత్వంపై పడే అదనపు ఆర్థికభారం రూ.3,181 కోట్లేనని కమిటీ పేర్కొంది. ఇప్పటివరకూ ఉన్న ఇంటి అద్దె భత్యాల్ని కొనసాగిస్తూ, 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో పనిచేసేవారికి 22% హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలంటూ కొత్త కేటగిరీని…

Read More

రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడం పట్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మండిపడ్డారు. ఆంక్షలు విధించడం అంటే రష్యాపై యుద్ధం ప్రకటించడంగానే భావిస్తామని స్పష్టం చేశారు. పరోక్షంగా వారిపై కూడా తాము యుద్దానికి సిద్దపడవలసి వస్తుందనే హెచ్చరిక చేసారు. అయితే మొదటి రెండు విడతల చర్చలు రెండు దేశాల మధ్య విఫలమైనా, తిరిగి సోమవారం మూడో విడత జరుగనున్నాయి. దానితో యుద్ధ విరమణకు మార్గం ఏర్పడగలదని పలు దేశాలు ఆసింస్తున్నాయి. ఉక్రెయిన్ లో ‘నో ఫ్లై జోన్’ను ప్రకటించే ప్రతిపాదనను ప్రస్తావిస్తూ అదికూడా యుద్ధంలోకి దిగినట్లే కాగలదని హెచ్చరించారు. ఉక్రెయిన్ ను డీమిలిటరైజేషన్, డీనాజిఫికేషన్ చేయడం ద్వారా ఆ దేశాన్ని తటస్థంగా మార్చాలని, తద్వారా ఉక్రెయిన్ లోని రష్యన్ మాట్లాడే ప్రజలకు రక్షణ కల్పించాలన్నదే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మిలటరీ ఆపరేషన్ లో ప్రొఫెషనల్ సోల్జర్లు మాత్రమే పాల్గొంటున్నారని, ఇతర ఎలాంటి గ్రూపులూ పాల్గొనడంలేదని కూడా వెల్లడించారు. అంతా తాము అనుకున్న ప్రకారమే జరుగుతోందని చెబుతూ…

Read More

కొంతకాలంగా, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, రాష్త్ర గవర్నర్ డా . తమిళశై సౌందరరాజన్ లకు మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు భగ్గుమని వీధిన పడింది. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ విరుచుకు పడటం ప్రారంభించినప్పటి నుండి గవర్నర్ సహితం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు లభించిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఎప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తడమే కానీ కేసీఆర్ ప్రభుత్వ కార్యక్రమాలను పట్టించుకోవడం లేదని టి ఆర్ ఎస్ నాయకులు కొంతకాలంగా గవర్నర్ పట్ల తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే జరపబూనడం ద్వారా కేసీఆర్ గవర్నర్ తో ప్రత్యక్ష పోరుకు సిద్దపడిన్నట్లు స్పష్టం అవుతున్నది. గవర్నర్‌ ప్రసంగం లేకుండా బడ్జెట్‌ సమావేశాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తమిళిసై తీవ్రంగా మండిపడ్డారు. సాంకేతిక అంశాలను అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉభయ సభలను ఉద్దేశించి తాను చేయాల్సిన ప్రసంగాన్ని ఎత్తేసిందని ఆమె ఆగ్రహం…

Read More

ఒక వంక, ఉక్రెయిన్ పై 11 రోజులుగా రష్యా సాగిస్తున్న ముప్పేట దాడుల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రపంచ దేశాలు, మరోవంక అణ్వాయుధాలతో రష్యా చెలగాటం ఆడుతున్నదని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మూడో ప్రపంచ యుద్ధం అంటూ వస్తే అణ్వాయుధాలతోనే జరుగుతోందని అంటి రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ ప్రకటించడం బెదిరింపు ధోరణిగానే భావిస్తున్నారు. నాలుగైదు రోజులతో ఉక్రెయిన్ ప్రభుత్వం లొంగి పోతుందని ఆశించిన రష్యాకు, ప్రపంచ దేశాలు ఏవీ జోక్యం చేసుకోవడానికి సుముఖంగా లేకపోయినప్పటికీ, పది రోజులు దాటినా తీవ్ర ప్రతిఘటన ఇస్తుండడం పట్ల కొంతమేరకు అసహనంతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నది. అందుకనే అణ్వస్త్రాల గురించి ప్రస్తావిస్తున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ఐరోపాలోనే అతి పెద్ద అణువిద్యుత్ కేంద్రం జపోరిజియా పై రష్యా సైనికులు బాంబుల వర్షం కురిపించడంతో ప్రపంచమే వణికి పోయింది. ఆ కేంద్రం మంటలు చెలరేగడంతో.. ఆందోళన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉక్రెయిన్ అత్యవసర సేవల విభాగం, అగ్నిమాపక బృందాలు…

Read More

మనిషికి ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలియని పరిస్థితి. అనారోగ్యం పాలైనప్పుడే కాదు.. అత్యవసర పరిస్థితుల్లో రోగి ఆరోగ్య పరిస్థితి తెలియక చికిత్స అందించడంలో ఆలస్యం అవుతుంది. ఇది ఒక్కోసారి మనిషి ప్రాణాల మీదకు తెస్తుంది. ఈ సమస్యని కట్టడి పెట్టేందుకు తెలంగాణ సర్కారు హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు చేపట్టింది. హైల్త్ ప్రొఫైల్లో భాగంగా 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరి సమగ్ర ఆరోగ్య సమాచారాన్ని సేకరించనున్నారు. ఆ వివరాలను ఆన్లైన్లో పొందుపరిచి సదరు వ్యక్తికి ఈ హెల్త్ కార్డు జారీ చేయనున్నారు. హెల్త్ ప్రొఫైల్ రూపకల్పనలో భాగంగా జిల్లా వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వ్యక్తుల ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరును యాప్లో ఎంటర్ చేస్తారు. దీంతో అప్పటికప్పుడు సదరు వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత అందులో సదరు వ్యక్తి ఎత్తు, బరువు నమోదు చేస్తారు. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు, సర్జరీల వివరాలు, బీపీ, షుగర్,…

Read More

తెలంగాణ రాష్ట్రంలో కంటే తమ పార్టీ పాలిత రాష్ట్రాల్లో మంచి పథకాలు ఉంటే రాజీనామా చేస్తానని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీ రామారావు సవాల్ విసిరారు.  వేములవాడ మండలం మర్రిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే రమేశ్ తో కలిసి రైతు వేదిక భవనాన్ని ప్రారంభిస్తూ  రాష్ట్ర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని, అలాంటి పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉంటే చెప్పాలని సవాల్ విసిరారు.  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదని మంత్రి ఆరోపించారు.  కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల కోసం చేసింది ఏమీ లేదని ఆయన స్పష్టం చేసారు.  కాశీ అభివృద్ధికి రూ.1000 కోట్లు ఇచ్చామని చెబుతున్న  ప్రధాని మోదీ తెలంగాణలోని వేములవాడకు ఎందుకివ్వడంలేదని ఆయన ప్రశ్నించారు. కాశీలో ఉన్న దేవుడు వేములవాడలో లేడా అని అడిగారు.  వేములవాడకు ఎన్ని నిధులు తీసుకొచ్చావని ఎంపీ బండి సంజయ్ ను…

Read More

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల తన పాదయాత్రను మళ్లీ ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటడానికి వైఎస్ షర్మిల తీవ్రంగా శ్రమిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులకు మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. రాష్ట్రంలోని 90 నియోజకవర్గాలు 14 పార్లమెంట్ నియెజకవర్గాల్లో 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల పరిధి లక్ష్యంగా గతేడాది అక్టోబర్ 20న ప్రజాప్రస్థానం పాదయాత్ర చేపట్టారు. జిల్లాల్లో పర్యటిస్తూ..ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలు, కరోనా కారణంగా నవంబర్ 9న ఈ పాదయాత్ర వాయిదా పడింది. అయితే ఆ పాదయాత్రను ఈనెల 11 నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇలా ఉండగా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ జార్ఖండ్‌ పర్యటనపై షర్మిల స్పందిస్తూ తెలంగాణాలో అమరులైన వారికి ఎందుకు సాయం చేయలేదని నిలదీస్తూ ట్వీట్…

Read More

ఉత్తర ప్రదేశ్ ఎన్నికల సందర్భంగా జరిగిన ప్రచార సభలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నుండి బిజెపి నేతలందరూ ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ)లో నెలకొన్న కుటుంబపాలన గురించి ఆరోపణలు గుప్పిస్తూ వచ్చారు. ఈ ప్రచారాన్ని ప్రచారం చివరి దశలో ఎస్‌పీ నేతలు తిప్పికొట్టేందుకు బిజెపి ప్రముఖుల కుటుంభ సభ్యుల గురించి ప్రశ్నించడం ప్రారంభించారు. ఎస్‌పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఒక టీవీతో మాట్లాడుతూ.. సొంతపార్టీలో కుటుంబ పక్షపాతాన్ని వదిలేసి, బీజేపీ నేతలు తమను తప్పుబడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘ప్రధాని తర్వాతి స్థానంలో ఉన్న హోం మంత్రి అమిత్‌ షా కొడుకు జయ్ షా అత్యంత శక్తివంతమైన బీసీసీఐ గౌరవ కార్యదర్శి ఎలా అయ్యారు? దగ్గరి బంధువు ఉండటం వల్లనే కదా సీఎం యోగి గతంలో గోరఖ్‌పూర్‌ మఠాధిపతిగా ఎదిగారు?’ అని అఖిలేశ్‌ నిలదీశారు. గతంలోనే జయ్ షాపై ప్రతిపక్షాలు పలు ఆర్ధిక అక్రమాలకు పాల్పడిన్నట్లు ఆరోపణలు చేస్తూ, విచారణకు డిమాండ్ చేశాయి. బీసీసీఐ ఇప్పుడు మొత్తం షా కనుసన్నలలో…

Read More