Author: Editor's Desk, Tattva News

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన నదుల అనుసంధానం కార్యక్రమంలో భాగంగా చేపట్టిన గోదావరి-కావేరీ నదుల అనుసంధానంపై రాష్ట్రాలు మోకాలడ్డుతున్నాయి. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ పలు సందేహాలను వ్యక్తం చేస్తుండగా, తమిళనాడు, పుదుచ్చేరి మాత్రం పూర్తిగా ఆమోదం తెలుపుతున్నాయి. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌ (జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయం)లో గోదావరి-కావేరీ నదుల అనుసంధానంపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, పుదుచ్చేరి రాష్ట్రాల అధికారులతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సమావేశం నిర్వహించింది. దాదాపు గంటన్నర పాటు సమావేశం జరిగింది. నదుల నీటి సమస్యలపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు రాష్ట్రాలు తమ అభ్యంతరాలను వివరించాయి. గోదావరి-కావేరి అనుసంధానంపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) అధికారులు రాష్ట్రాల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టును నిర్మించేందుకు అన్ని భాగస్వామ్య రాష్ట్రాల మద్దతు కోరేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశాన్ని ఏర్పాటుచేసింది. తొలుత రూ.89వేల కోట్లుగా అంచనా వేయగా,…

Read More

ఉగాది నుండి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని పట్టుదలతో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉండడంతో, జిల్లాల విభజనకు సంబంధించిన పక్రియను   రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. విస్తృతంగా సమావేశాలు నిర్వహించడంతో పాటు, ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి అధికారులు క్షేత్రస్థాయికి దిశా నిర్ధేశం చేస్తున్నారు.  దీంతో జిల్లాల్లో కూడా ఈ దిశలో పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాల్లో కలెక్టరేట్ల ఏర్పాటుకు సంబంధించి భవనాల గుర్తింపు ప్రక్రియ జోరుగా సాగుతోంది. అనేకచోట్ల ప్రతిపాదిత జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే రెండు, మూడు భవనాలను గుర్తించి నివేదికలను పంపినట్లు తెలిసింది.  వీటిని పరిశీలించి జిల్లా కలెక్టర్లు నిర్ణయం తీసుకున్న తరువాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిస్తారు. కలెక్లర్ల నివేదికలతో పాటు, ప్రత్యామ్నాయ నివేదికలను కూడా ప్రభుత్వం తెప్పించుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటుపై వచ్చే అభ్యంతరాలను, సలహాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర కేంద్రానికి చేర్చాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. …

Read More

అహ్మదాబాద్‌ నగరాన్ని అతలాకుతలం చేసిన వరుస బాంబు పేలుళ్ళ కేసులో 38 మందికి మరణ శిక్ష విధిస్తూ  14 ఏళ్ళ తర్వాత శుక్రవారం ప్రత్యేక కోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పేలుళ్ళ కేసులో దోషులుగా తేలిన  మరో 11 మందికి యావజ్జీవ శిక్ష విధించింది.  ఒకేసారి 38 మందికి ఉరి శిక్ష విధిస్తూ ట్రయల్‌ కోర్టు తీర్పు ఇవ్వడం దేశంలో ఇదే తొలిసారి. గతంలో ఒక కేసులో ఒకేసారి 26 మందికి మరణశిక్ష విధించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో 2008 జులై 26న కేవలం 70 నిముషాల వ్యవధిలో వరుసగా 22 బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. 56 మంది మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు.  ఈ పేలుళ్ళలో మరణించిన వారి పిల్లలకు లక్ష రూపాయిలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 వేలు ఇవ్వాలని ప్రత్యేక…

Read More

కర్ణాటకలో కొన్ని కళాశాలలో ప్రారంభమైన హిజాబ్  వివాదం జాతీయ స్థాయికి చేరుకోవడంతో తొలుత హిందూ – ముస్లిం విభజనకు దారితీసి, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో, ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లో రాజకీయంగా లబ్ధిపొందవచ్చని కొందరు బిజెపి నాయకులు భావించారు. సోషల్ మీడియాలో, ఇతరత్రా హిజాబ్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.  అయితే బిజెపి ముస్లిం మహిళలకు వ్యతిరేకం అనే సంకేతం ఈ వివాదం ఇచ్చే ప్రమాదం ఉన్నట్లు ఆలస్యంగా గ్రహించినట్లు కనిపిస్తున్నది.  పైగా,ట్రిపుల్ తలాక్ ను రద్దు చేయడం ద్వారా ముస్లిం మహిళలో పొందిన సానుభూతిని దూరం చేసుకొనే ప్రమాదం ఉన్నదనే ఆందోళనలో పడినట్లు కనిపిస్తున్నది. అందుకనే ఇప్పుడు దిద్దుబాటు చర్యకు పాల్పడినట్లు తెలుస్తున్నది.  కర్ణాటక విద్యా సంస్థల్లో హిజాబ్ వివాదం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక బీజేపీ నేతలకు ఆ పార్టీ అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. బీజేపీ ముస్లిం మహిళలకు వ్యతిరేకం కాదని సంబంధితులందరికీ స్పష్టంగా…

Read More

ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో మూడవ దశలో ఈ నెల 20న పోలింగ్ జరుగనున్న తదుపరి యుద్ధభూమి తరచుగా ‘యాదవుల కోట’గా ముద్రించబడే ప్రాంతం కీలకం కానున్నది. సమాజ్‌వాదీ పార్టీ నేతృత్వంలోని కూటమి మొదటి రెండు దశలలో సంతృప్తికరంగా ఓట్లు పొందిన్నట్లు భావిస్తున్నది.  అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశలో వెళ్లాలంటే మూడవ దశ ఓటర్లలో కీలకమైన   యాదవ్ ఓటర్లు అఖిలేష్ యాదవ్ నాయకత్వాన్ని అంగీకరిస్తారా? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఫిబ్రవరి 20న 16 జిల్లాల్లోని 59 స్థానాలకు పోలింగ్ జరగనుంది. వీటిలో మెయిన్‌పురి, ఎటా, కాస్‌గంజ్, హత్రాస్, ఫిరోజాబాద్ జిల్లాల్లోని 19 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అలాగే, కాన్పూర్, కాన్పూర్ రూరల్, ఫరూఖాబాద్, ఒరైయా, ఇటావా మరియు కన్నౌజ్‌లోని 27 అసెంబ్లీ నియోజకవర్గాలు, బుదేల్‌ఖండ్ ప్రాంతంలోని 13, అంటే ఝాన్సీ, జలౌన్, హమీర్‌పూర్, లలిత్‌పూర్ మరియు మహోబా జిల్లాల్లో నివసిస్తున్న ఓటర్లు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. కర్హల్ (మెయిన్‌పురి) నుంచి…

Read More

తిరుమలలో రాబోయే రోజుల్లో హోటళ్ళు, ఫాస్టు ఫుడ్‌ సెంటర్లు లేకుండా చేసి అన్ని ముఖ్య కూడళ్ళలో ఉచితంగా అన్నప్రసాదాలు అందించాలని టిటిడి పాలక మండలి నిర్ణయం తీసుకుంది. విఐపిలైనా.. సామాన్య భక్తుడికైనా ఒకే రకమైన ఆహారం అందించాలని తీర్మానం చేశామని టిటిడి చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో టిటిడి పాలకమండలి సమావేశం గురువారం జరిగింది. ఈ ఏడాది 2022 – 23 వార్షిక బడ్జెట్‌ను రూ.3,096.40 కోట్లతో ఆమోదించినట్లు సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలోని అలిపిరి వద్ద సైన్స్‌సిటీ నిర్మాణానికి మంజూరు చేసిన 70 ఎకరాల భూమిలో 50 ఎకరాలు వెనక్కు తీసుకుని ఆధ్యాత్మిక నగరం నిర్మించాలని నిర్ణయించామని చెప్పారు. రూ.230 కోట్లతో శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటి ఆసుపత్రి భవనాల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. హదయాలయం ప్రారంభించి వంద రోజుల్లో వంద ఆపరేషన్లు నిర్వహించారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను ప్రజలకు…

Read More

పంజాబ్లోకి యూపీ, బీహారీలను రానివ్వబోమన్న తన వాఖ్యలపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావడంతో పంజాబ్ ముఖ్యమంత్రి చరణజిత్ సింగ్ చన్నీ తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని అంటూ సంజాయిషీ ఇచ్చారు. పంజాబ్ ప్రతి ఒక్కరిదీ అని పేర్కొంటూ, నిజానికి తాను ఆ వాఖ్యాలను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఉద్దేశించి చేశానని చన్నీ వివరణ ఇచ్చారు. మరోవైపు చన్నీ కామెంట్లపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా స్పందించారు. చన్నీ ఉద్దేశం అది కాదని, ఆయన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమె చెప్పారు. పంజాబ్ను పంజాబీలు మాత్రమే పాలించాలన్నదే చన్నీ ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు. అయితే ఆ మాటల్ని కొందరు ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నారని ఆమె ఆరోపించారు. యూపీ, బీహార్ నుంచే కాదు ఎవరైనా ఎక్కడి నుంచైనా పంజాబ్ కు రావచ్చని ప్రియాంక చెప్పారు. ఇదిలా ఉంటే చన్నీ వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహం…

Read More

పార్టీ ఎంపీ రఘురామకృష్ణ రాజు తర్వాత ఇప్పుడు మరో వైసిపి సీనియర్ నేత, మాజీ ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ నాయకత్వంపై బహిరంగ తిరుగుబాటు ప్రకటించారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన జిల్లాల విభజన ప్రతిపాదనలు అశాస్త్రీయంగా ఉన్నాయని మండిపడుతూ, రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాలలో ఏ విధంగా నామరూపాలు లేకుండా పోయింది, ఇప్పుడు జిల్లాల విభజన విషయంలో సహితం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే వైసిపికి కూడా అంతే జరుగుతోందని హెచ్చరించారు.  ప్రస్తుతం వైసిపి ఎమ్యెల్యేగా ఉన్న ఆయన నెల్లూరు జిల్లాలోనే రాపూరు, కలువాయిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో ఉన్న రాపూరు మండలం జిల్లాల పునర్విభజనలో తిరుపతి జిల్లాలోకి చేరింది. దీనిని నిరసిస్తూ గురువారం రాపూరులో ఎంపీపీ చెన్ను బాలకృష్ణారెడ్డి ఆద్వర్యంలో మండల ప్రజాప్రతినిధులు చేపట్టిన ఒక్కరోజు నిరాహారదీక్షలో ఆనం పాల్గొని ప్రసంగించారు. ‘‘అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్‌ పార్టీ నామరూపాలు లేకుండా తీవ్రంగా…

Read More

పన్నులతో పాటు వివిధ అంశాల్లో రాష్ట్రానికి నష్టం చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంను సవరించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విభజన వివాదాల పరిష్కార ఉపసంఘ మెదటి సమావేశం గురువారం జరిగింది.  కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్‌ కుమార్‌ గురువారం ఢిల్లీ నుంచి ఎపి, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విద్యుత్‌ సంస్థల నిధుల వివాదం, ఎపి స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ నిధుల పంపిణీ, పన్నులు, బ్యాంకుడిపాజిట్లు, సివిల్‌ సప్లైస్‌, తదితర అంశాలపై తొలి సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం.  పునర్‌వ్యవస్థీకరణ  చట్టంలో అనేక లోపాలున్నాయని, ఫలితంగా పన్నులతో పాటు అనేక అంశాల్లో రాష్ట్రం నష్టపోతోందని ఏపీ అధికారులు చెప్పారు. దీనిని నివారించేందుకు పునర్‌ వ్యవస్థ్కీరణ చట్టానిు సవరించాలనికోరారు. అయితే, ఈ ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం…

Read More

 బెల్జియంలో వారానికి నాలుగు రోజులు మాత్రమే పని విధానంను అమలులోకి తీసుకు రాబోతున్నారు. ఆ దేశ ప్రధాని అలెగ్జాండర్‌ డి క్రూ ఇటీవల ప్రకటించారు. వర్కింగ్‌ అవర్స్‌ ముగిసిన తర్వాత ఇక ఆఫీస్‌ పని గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని కూడా  వెల్లడించారు.  ఉద్యోగులపై పనిభారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. దీంతో ఉత్పాదకత మరింత మెరగయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ”కరోనా మహమ్మారి దృష్ట్యా  పరిస్థితులకు అనుగుణంగా పని చేయాల్సిన అవసరం ఏర్పడింది. లేబర్‌ మార్కెట్‌ కూడా ఈ విధానాన్ని అలవాటు చేసుకోవాలి” అని మంత్రివర్గంలో చర్చ అనంతరం బెల్జియం ప్రధాని మీడియాతో తెలిపారు.  ప్రజల జీవన నాణ్యతా ప్రమాణాలను మెరుగుపర్చడంతో పాటు ఉత్తమమైన వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌ను అందించేందుకు ఈ చర్యలు దోహదపడతాయని తెలిపారు. నూతన విధానం ప్రకారం.. ఒక ఉద్యోగి వారానికి ఐదు రోజులు కాకుండా, నాలుగు రోజుల్లో 38 గంటల పాటు పనిచేయాల్సి ఉంటుంది. అంటే రోజుకు…

Read More