తరగతి గదుల్లో హిజాబ్‌లు ధరించడం నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ కర్నాటక హైకోర్టును ఆశ్రయించిన ఉడిపికి చెందిన బాలికల నివాస చిరునామాలతో సహా వారి వ్యక్తిగత వివరాలను భారతీయ జనతా పార్టీ కర్ణాటక యూనిట్ ట్వీట్ చేసింది.ముస్లిం బాలికల వ్యక్తిగత వివరాలు సోషల్ మీడియాలో పెట్టడంపై విమర్శలు రావడంతో బీజేపీ పార్టీ ఇంగ్లీషు, కన్నడ భాషల్లోనూ చేసిన ట్వీట్లను తొలగించింది.కేసు వేసిన బాలికలు ఐదురుగు మైనర్లని పేర్కొంటూ వారి చిరునామాలు, ఇతర వివరాలు ట్వీట్ లలో ఇస్తూ, కాంగ్రెస్ మైనర్ బాలికలను రాజకీయాలకోసం వాడుకొంటున్నట్లు బిజెపి మండిపడింది . ట్విట్టర్‌లో, బిజెపి రాష్ట్ర విభాగం పిటిషనర్ల వివరాల చిత్రాలను వారి చిరునామాలతో సహా పోస్ట్ చేసింది. “లడ్కీ హూ లడ్ శక్తి హూన్” అంటే ఇదేనా, @ప్రియాంకగాంధీ?” అంటూ ప్రశ్నిస్తూ ట్వీట్ లు ఇచ్చింది. అయితే ఈ ట్వీట్ లపై దుమారం చెలరేగడంతో ,కన్నడ, ఇంగ్లీష్ లలో ఇచ్చిన ట్వీట్ లను ఉపసంహరించుకొంది. “#HijabRowలో పాల్గొన్న విద్యార్థులలో ఐదుగురు…
Author: Editor's Desk, Tattva News
తెలంగాణ రాష్ట్రంలో జరిగే అతిపెద్ద పండుగ మేడారం జాతర నేడే ప్రారంభం అవుతుంది. ప్రతి రెండేళ్లకోసారి ఈ జాతరలో దేశంలో కుంభమేళ తర్వాత అంత పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. పూర్వపు వరంగల్ జిల్లా.. ప్రస్తుతం మలుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో జరిగే ఈ జాతరకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. 16న ప్రారంభమై 19 వరకు నాలుగు రోజుల పాటు జరుగుతాయి. తొలినాళ్లలో ఈ జాతరను ప్రధానంగా గిరిజనులు జరుపుకునేవారు.. రాను రాను అమ్మవార్ల మహిమలు తెలిసి అందరూ కొలిచి, మొక్కుతున్నారు. కొద్దీ కాలం వరకు గ్రామీణులే ఎక్కువగా పాల్గొనే ఈ జాతరను 1998లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించి, అధికారికంగా జరుపుతూ ఉండడంతో రవాణా, ఇతర సదుపాయాలు బాగా పెరిగాయి. దానితో పట్టణ ప్రజలు కూడా భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. 13వ శతాబ్దంలో సమ్మక్క, సారలక్క అనే తల్లీ బిడ్డలు ప్రజల కోసం అప్పటి…
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఆకస్మికంగా ఎందుకు మార్చారో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. విజయవాడలో ప్రభుత్వానికి నిరసనగా ఉద్యోగులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడంతోనే ఆయనను బదిలీ చేశారా? అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా మంగళవారం మధ్యాహ్నం వరకూ విధుల్లో ఉన్నారని, ఆకస్మికంగా ఆ బాధ్యతల నుంచి పక్కకు తప్పించడం తనకు విస్మయం కలిగించిందని పవన్ తెలిపారు. అధికారులను నియమించుకోవడం అనేది ప్రభుత్వానికి ఉన్న పాలనాపరమైన అధికారం కావచ్చు… కానీ వైసీపీ ప్రభుత్వానికి డీజీపీని హఠాత్తుగా మార్చాల్సిన అవసరం ఏమి వచ్చిందో? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఇందుకుగల కారణాలను ప్రజలకు తెలియచెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో – విజయవాడలో పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన ర్యాలీ విజయవంతం అయినందుకే సవాంగ్ పై బదిలీ వేటు వేశారని భావించాల్సి వస్తుందని పవన్ స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల నుంచి చిన్నపాటి…
పశ్చిమ బెంగాల్‌లోని మూడు ప్రధాన ప్రతిపక్షాలలో ఏ ఒక్కటీ కూడా తృణముల్ కాంగ్రెస్‌కు దగ్గరగా రాలేదు. అధికార పార్టీ సోమవారం వెలువడిన మునిసిపల్ ఎన్నికలలో 4-0 క్లీన్ స్వీప్‌ను నమోదు చేసింది. తృణమూల్ విజయం అధికారాన్ని, సంస్థాగత ప్రాబల్యాన్ని ఉపయోగించుకొని సమర్ధవంతంగాఎన్నికల యంత్రాంగానికి పదును పెట్టిన్నట్లు చెబుతున్నా, నేడు బెంగాల్ ప్రజలు అడుగుతున్న ప్రశ్న ప్రతిపక్షం ఎక్కడ ఉంది? సిలిగురి, బిధాన్‌నగర్, చందర్‌నాగోర్, అసన్సోల్ లలో శనివారం ఎన్నికలు జరిగిన నాలుగు మునిసిపల్ కార్పొరేషన్‌ల ఫలితాలపై సమగ్ర అధ్యయనం ప్రకారం ఎన్నికలు జరిగిన 226 వార్డులలో తృణమూల్ 198 గెలుచుకుంది. నాలుగు పురపాలక సంస్థలలో అత్యధికంగా బిజెపికి 12 ఉన్నాయి. వామపక్షాలు ఏడు, కాంగ్రెస్ ఐదు గెలుపొందాయి. మరో నాలుగు వార్డుల్లో స్వతంత్రులు పట్టు సాధించారు. సాంకేతికంగా, వామపక్షాలు బిధాన్‌నగర్ , చందర్‌నాగోర్ మునిసిపల్ కార్పొరేషన్లలో రెండవ స్థానంలో నిలిచాయి. మిగిలిన రెండు _ _ అసన్సోల్ , సిలిగురి_లలో అది బిజెపి రెండో స్థానం పొందింది.…
దళారుల ప్రమేయం లేకుండా, లేకుండా నేరుగా రైతుల ఖాతాలలోకి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం – కిసాన్) నిధులను బదిలీ చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే స్పష్టం చేస్తున్నా డిసెంబర్ 2018లో పథకం ప్రారంభించినప్పటి నుండి రూ 2,589.23 కోట్లను అనర్హులకు బదిలీ చేసినట్లు వెల్లడైంది.ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక సంఖ్యలో అనర్హులు ఉండగా, అస్సాంలో ఈ అర్హులైన రైతుల నుంచి ఇంకా ఎక్కువ మొత్తం రికవరీ కాలేదు. ఫిబ్రవరి 2022 నాటికి, ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 14.9 లక్షల మంది అనర్హులైన రైతులను నమోదు చేసింది. వీరి నుండి రూ. 98 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. దీని తర్వాత, ఆశ్చర్యకరంగా, 13.35 లక్షల మంది అనర్హులైన రైతులను కలిగి ఉన్న అస్సాంలో రూ. 768.3 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. హక్కుల కార్యకర్త అవినందన్ జానా సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. వ్యవసాయ…
ఉక్రెయిన్ పై రష్యా బుధవారం దాడి చేయనున్నట్లు ఒక వంక ఆ దేశ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలన్ స్కీ, మరోవంక అమెరికా ప్రకటనలు చేస్తుండగా, అకస్మాత్తుగా రష్యా ఆ దేశ సరిహద్దుల్లో మోహరించిన తన సేనలు కొన్నింటిని వెనుకకు పిలిపించడం అందరికి విస్మయం కలిగిస్తున్నది. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ అధికారిక ప్రకటన వెలువరించింది. అయితే ఇది వెనక్కి తగ్గే చర్యలో భాగమా? లేదా? అనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు డ్రిల్ పూర్తైందని, బలగాలు కొన్నింటిని వెనక్కి రప్పించామని మాత్రమే రష్యా రక్షణ శాఖ ప్రతినిధి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సరిహద్దు ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ పశ్చిమ భాగంలో లక్షకు పైగా సైన్యంతో మోహరించిన రష్యా.. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం ఉదయం నుంచి చాలావరకు సైన్యాన్ని బేస్కు రప్పించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంత మేర సైన్యాన్ని వెనక్కి రప్పించింది? ఎందుకు రప్పించింది? అనే విషయాలపై స్పష్టత లేదు. ఇదిలా…
సినీరంగంలో మరో తార నేలరాలింది. సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహిరి (69) మృతి. ముంబైలోని క్రిటికేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. లహిరి నెల రోజుల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి ఈ మధ్యే డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆయన ఆరోగ్యం మంగళవారం ఒక్కసారిగా విషమించడంతో కుటుంబసభ్యులు డాక్టర్ ను ఇంటికి పిలిపించారు. డాక్టర్ సూచన మేరకు లహిరిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. పరిస్థితి విషమించడంతో అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాతో చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. బప్పి లహిరి గత ఏడాది ఏప్రిల్ లో కరోనా బారినపడ్డారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. బాలీవుడ్ సహా టాలీవుడ్ సినిమాలకు కూడా ఆయన సంగీతమందించారు. 1970 –80 లల్లో బప్పీ లహరి పాడిన, కంపోజ్ చేసిన ఎన్నో పాపులర్ సాంగ్స్ విడుదలయ్యాయి. సింహాసనం, సామ్రాట్, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్ స్పెక్టర్స వంటి తెలుగు చిత్రాలకు…
ఆర్‌జెడి అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రపాద్ దాణా కుంభకోణంలోని ఐదో కేసులో కూడా సిబిఐ కోర్టు దోషిగా ప్రకటించింది. 1990, 1995 మధ్యకాలంలో డోరాండా ట్రెజరీ నుండి రూ.139.35 కోట్లు అక్రమంగా విత్‌డ్రా చేశారంటూ లాలూపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. దాణా కుంభకోణంలో ఇది ఐదవ కేసు, అతిపెద్ద కేసు. తాజా తీర్పుతో పశుదాణా కుంభకోణానికి చెందిన మొత్తం ఐదు కేసుల్లోనూ లాలూ దోషిగా నిలిచారు. న్యాయమూర్తి సికె. శశి తీర్పును వెలువరించే సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీ కోర్టులోనే ఉన్నారు. ఈ కేసులో 98 మంది ఇతర నిందితులు కూడా కోర్టుకి హాజరయ్యారు. వీరిలో 24 మందిని నిర్దోషులుగా కోర్టు విడుదల చేసింది. మాజీ ఎంపి జగదీష్ శర్మ, అప్పటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి) చైర్మన్ ధ్రువ్ భగత్‌లతో పాటు 35 మందికి మూడేళ్ల జైలుశిక్ష విధించింది. బెయిల్‌కి వారికి అర్హత లభించింది. …
అట్టహాసంగా జరిగిన శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు త్రిదండి చినజీయర్ స్వామి, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుల మధ్య `కోల్డ్ వార్’కు దారితీసిన్నట్లు తెలుస్తున్నది. అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనధికారికంగా `ఆస్థాన గురువు’ స్థాయిలో స్వామిని గౌరవిస్తూ, ఆధ్యాత్మిక అంశాలు అన్నిటిలో ఆయన మాటలను అనుసరిస్తూ వస్తున్న కేసీఆర్ ఈ ఉత్సవాలలో పాల్గొనకపోవడం అందరికి విస్మయం కలిగిస్తున్నది. కనీసం వేడుకల ముగింపు కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హరాజయ్యేవిధంగా చేయడం కోసం చినజీయర్ స్వామితోపాటు మైహోం సంస్థల అధినేత రామేశ్వరరావు చేసిన ప్రయత్నాలన్నీ ఫలించలేదు. మొదటి నుండి అక్కడ సమతా మూర్తి రామానుజాచార్య విగ్రహం ఏర్పాటుకు కేసీఆర్ ప్రభుత్వం పక్షాన అన్నిరకాల సహకారం అందిస్తూ వచ్చారు. చివరకు వేడుకల ఏర్పాట్లను సహితం మంత్రులు, ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షించారు. యాదాద్రి ఆలయ పునరుద్ధరణ దగ్గర నుండి భద్రాచలం ఆలయం కార్యక్రమాల వరకు అన్నింటా స్వామిజీ చెప్పిన్నట్లే చేస్తూ కేసీఆర్ పలు వర్గాల నుండి విమర్శలకు సహితం గురయ్యారు. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి వంటి జాతీయ నేతలు వస్తున్న కార్యక్రమంలో ఎటువంటి లోటుపాట్లు ఉండరాదని కేసీఆర్ స్వయంగా ముందురోజు…
మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి వెలుగులోకి సిబిఐ ఛార్జిషీట్ వైసిపి వర్గాలలో కలకలం రేపుతున్నది. ఒక పధకం ప్రకారం, రూ 40 కోట్ల సుపారీ ఇచ్చి, `రాజకీయంగా అడ్డు తొలగించుకోవడం’ కోసమే హత్య చేయించారని స్పష్టం చేస్తున్నది. ఇందులో ముఖ్యమంత్రికి సన్నిహితుడు, మరో బాబాయ్ కుమారుడు, కడప ఎంపీ వై ఎస్ అవినాష్ రెడ్డి కూడా నిడుతుండే అని సిబిఐ స్పష్టం చేసింది. ఆ వైషయమై ఇంకా దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపింది. అందుకనే `కీలక సూత్రదారులు’ను కాపాడటం కోసం ముఖ్యమంత్రి సిబిఐ దర్యాప్తును ప్రతిఘటించే ప్రయత్నం చేస్తున్నారా? అని అనుమానాలకు ఈ చార్జిషీట్ దారితీస్తుంది. గత ఏడాది అక్టోబర్ 26న వేసిన ఛార్జిషీట్‌తో పాటు ఐదవ నిందితునిగా దేవిరెడ్డి శంకర్‌రెడ్డికి సంబంధించిన వివరాలను పొందు పరుస్తూ 2022 జనవరి 31నపులివెందుల కోర్టులో సిబిఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. శంకర్ రెడ్డి వైసిపి రాష్ట్ర…