గట్టి ప్రతిపక్షం లేకపోవడంతో తిరిగి సునాయనంగా అధికారంలోకి రాగలవని అంచనాలు వెనుకున్న గోవాలో బిజెపికి సొంతపార్టీకి చెందిన తిరుగుబాట్లే బెదడగా మారాయి. దానితో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీలో నాయకత్వం, అభ్యర్థులపై సర్వత్రా పార్టీ వర్గాలలోని ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధికారిక అభ్యర్థులుగా “ఇతర పార్టీల నుండి దిగుమతి చేసుకున్న నాయకులను” రంగంలోకి దింపడంతో “విశ్వసనీయులు”, “బయటి వ్యక్తుల” పోరుగా మారిపోయింది. రాష్ట్ర ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే మద్దతుదారుల నుండి ఎదురవుతున్న ప్రతిఘటన కారణంగా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తిరిగి ఎన్నిక కావడం కష్టం కావచ్చనే అంచనాలు ఏర్పడుతున్నాయి. అదే విధంగా రాణే సహితం ముఖ్యమంత్రి మద్దతుదారుల నుండే ప్రతిఘటనను ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య వైరం పార్టీపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని బిజెపి మద్దతుదారులు ఆందోళన చెందుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ తన తండ్రి ఆరుసార్లు ప్రాతినిధ్యం వహించిన పనాజీ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ రెబల్‌గా పోటీ…
Author: Editor's Desk, Tattva News
ఒక వంక బిజెపి, కాంగ్రెస్ నేతలు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో తలమునకలై ఉండగా, మరోవంక బిజెపి, కాంగ్రెసేతర పార్టీల ముఖ్యమంత్రులు మాత్రమే ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా సమీకృతం కావడంకై వ్యూహాత్మకంగా సమీకృతం అవుతున్నారు. అయితే నేరుగా కేంద్రంపై దండెత్తకుండా, కేంద్రం నియమించిన గవర్నర్లకు వ్యతిరేకంగా గొంతెత్తడం కోసం సమరానికి సిద్ధమవుతున్నారు. వరుసగా ప్రధాని మోదీపై గళం విప్పుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తో పాటు ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరింప చేసుకొంటున్నాయి. వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కీలకంగా మారింది. గవర్నర్ల రాజ్యాంగ అతిక్రమణ, అధికార దుర్వినియోగంపై చర్చించేందుకు ప్రతిపక్ష రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు త్వరలో ఢిల్లీలో సమావేశం కానున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ట్వీట్ చేశారు. ఈ సమావేశాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచించినట్లు తెలిపారు. ‘బిజెపి యేతర పాలిత…
ప్రత్యేక హౌదా కోసం వైసిపి ఎంపీలు రాజీనామాలు చేస్తామని ఆనాడు చేసిన సవాళ్లు ఏమయ్యాయో ప్రజలకు సమాధానం చెప్పాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. టిడిపి కార్యాలయంలో నిర్వహించిన వ్యూహకమిటీ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై నేతలు చర్చించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. హౌదా సాధనకై యుద్ధం చేయకుండా ఎందుకు వెనుదిరుగుతున్నారని సిఎం జగన్ ని నిలదీశారు. సీఎం జగన్‌రెడ్డి.. హోదాపై మీ యుద్ధం ఎక్కడ? పలాయనవాదమెందుకు? అంటూ ప్రశ్నించారు. ప్రజలు అధికారం ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎన్నికల ముందు పదేపదే చెప్పారని, ఇప్పుడెందుకు పోరాటం చేయలేదని నిలదీశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గర్జించి, ఇప్పుడు కుక్కిన పేనులా ఉండటం దేనికి సంకేతమని మండిపడ్డారు. త్రిసభ్య కమిటీ ఎజెండాలో ప్రత్యేకహౌదా అంశాన్ని చేర్చినప్పుడు అది తమ ఘనతని చెప్పుకున్న వైసిపి నేతలు, తొలగించాక టిడిపిపై బురద జల్లడమేంటని ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయం తగ్గకపోయినా, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను…
దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలుగా భావించి ఐఐటి, ఎన్‌ఐటీ లలో అడ్మిషన్లు పొందడం చాల కష్టం కాగలదు. పోటీ ఎక్కువగా ఉంటుంది. అయితే కొద్దీ సంవత్సరాలుగా దేశంలో ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతూ వస్తుండడంతో ఇటువంటి ఉన్నత విద్యాసంస్థలలో ప్రవేశం కోసం పెద్దగా విద్యార్థులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తున్నది. దానితో భారీ సంఖ్యలో విద్యార్థులు చేరకపోవడంతో సీట్లు మిగిలి పోతున్నాయి. గత రెండేళ్లలో వివిధ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో వివిధ కోర్సుల్లో 10,000 సీట్లు ఖాళీగా ఉన్నాయని, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లో 8,700 సీట్లు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గత వారం రాజ్యసభలో తెలిపారు. డేటా ప్రకారం, 2020-21లోఐఐటిలలో 5,484 సీట్లు భర్తీ కాలేదు. వాటిలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో (బీటెక్) 476 సీట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 3,229 సీట్లు, పీహెచ్‌డీ కోర్సుల్లో 1,779 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 2021-22లో, ఐఐటిలలో ఖాళీగా ఉన్న సీట్ల…
తెలంగాణలో డ్రగ్స్ చాపకింద నీరులా విస్తరిస్తోన్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే 10 సంవత్సరాల్లో ఎంప్లారు మెంట్, మాదక ద్రవ్యాలు ప్రధాన సమస్యలుగా మారబోతున్నాయని హెచ్చరించారు. కరోనా సమయంలో అనేకమంది విద్యార్ధులు గంజాయికి అలవాటు పడ్డారనిఆయన తెలిపారు. వీరిలో కొందరు అమ్మాయిలు కూడా ఉన్నారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా డ్రగ్స్, గంజాయి లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో పిల్లల పట్ల తల్లితండ్రులు జాగ్రత్తలు తీసుకోని అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం అన్ని చర్యలు తీసుకోవాలని సిఎం కెసిఆర్ ఆదేశించినట్లు సిపి తెలిపారు. ఇప్పటికే వెయ్యి మంది పోలీసులతో నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ డ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్వెస్టిగేషన్ వింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, మాదక ద్రవ్యాలు అమ్మిన కొన్న కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇలా ఉండగా, డ్రగ్స్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్లలో 250 మందికిపైగా…
పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ మీద తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖ్యలను కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఖండించారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన పుల్వామా ఉగ్రదాడి జరిగిన వార్షికదినం సందర్భంగా ఒక ముఖ్యమంత్రి ఇలా మాట్లాడ్డం ఆయన బాధ్యతారాహిత్యాన్ని, అజ్ఞానాన్ని తెలియజేస్తోందని ఘాటుగా స్పందించారు. మరోవైపు ప్రధాని నరేంద్రమోడీని లేదా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కేనని, కానీ మన సాయుధ దళాలను అవమానించడం కేవలం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. “అభినందన్ వర్థమాన్ పరాక్రమం చాలదా? బాలాకోట్ ఘటన అనంతరం 6 నెలలకు పైగా తమ సొంత గగనతలంలో ఫ్లై జోన్‌ను నిషేధించిన పాకిస్థాన్ చర్యలు చాలవా? ఇవి సరిపోకపోతే కేసీఆర్ నేరుగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దగ్గరే రుజువు కోరవచ్చు.” అంటూ మరో ట్వీట్ చేశారు. భారత సాయుధ బలగాలు సరిహద్దుల వెంబడి శత్రువులపై ధైర్యంగా…
పుల్వామా ఉగ్రదాడికి సమాధానంగా భారత్ సేనలు జరిపిన లక్షిత దాడుల పట్ల తనకు కూడా అనుమానాలున్నాయని, వీటిపై కేంద్రం వివరణ ఇవ్వాలని అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చేసిన ప్రకటన పట్ల అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ విస్మయం వ్యక్తం చేశారు. కేసీఆర్ వాఖ్యలు అమర సైనికుల త్యాగాలను అవమానించడమేనని ఆయన ధ్వజమెత్తారు. పుల్వామా ఘటన జరిగి మూడేళ్లు పూర్తయిన సమయంలో లక్షిత దాడుల గురించి ప్రశ్నించడం ద్వారా ప్రతిపక్షాలు నాడు అమరులైన సైనికులను అవమానిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గాంధీ కుటుంబానికి తమ విధేయతను చాటుకోవడంలో కాంగ్రెస్ తో సీఎం కేసీఆర్ పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. తాము దేశం పట్ల విధేయతతో ఉంటామని, మన సైనిక బలగాలను ప్రశ్నించే వాళ్లను వదలబోమని స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో భారత సైన్యం జరిపిన లక్షిత దాడులకు సంబంధించిన వీడియోను మీడియా సమావేశంలో విడుదల చేస్తూ ధైర్యసాహసాలుగల మన సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించిన వీడియో గ్రాఫిక్…
యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి తమ ఉనికి ప్రశ్నార్ధకరంగా మారడంతో భయంతోనే ఉగ్రవాదులు పాల్పడ్డారని ఈ దాడి జరిగి మూడేళ్లయిన సందర్భంగా వెల్లడైనది. 2019 పుల్వామా దాడి జరిగినప్పుడు జమ్ము కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో 15 కార్ప్స్‌కు నాయకత్వం వహించిన లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) కేజీఎస్ ధిల్లాన్ ఆ దాడికి సంబంధించిన కీలక అంశాలను వెల్లడించారు. ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతికి దాడికి తెగబడ్డారు. జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కి చెందిన 40 సైనికులు బలయ్యారు. జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిపై అవంతిపురా సమీపంలోని లేథిపురలో ఫిబ్రవరి 14న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. సూసైడ్ బాంబర్ పాకిస్తానీ ఉగ్రవాద గ్రూప్ జైషే మహమూద్ కు చెందన సూసైడ్ బాంబర్ కారులో ఐఈడీతో దూసుకొచ్చి సీఆర్పీఎఫ్ జవాన్లు వెళ్తున్న…
కేంద్ర హోం శాఖ రెండు తెలుగు రాష్ట్రాల సమీక్ష సమావేశపు అజెండా నుండి ముందుగా చేర్చిన ప్రత్యేక హోదా అంశాన్ని తర్వాత తొలగించడంపై ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ కలకలం చోటుచేసుకొంటున్నది. ఈ విషయమై బిజెపిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఒక వంక జరుగుతూ ఉండగా, నోరుమెదపరే అంటూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా ప్రధాన ప్రతిపక్షం టిడిపి విమర్శలు గుప్పిస్తున్నది. మరోవంక ఇదంతా బీజేపీలోని మాజీ టిడిపి నేతల కుట్ర అంటూ కొందరు వైసిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. పొరపాటున ఎజెండాలోకి వచ్చిన అంశాన్ని తీసివేయడంపై ఈ రసభ ఎందుకంటూ బిజెపి నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అజెండా నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని తొలగిస్తే ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదపలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో ప్రశ్నించారు. జగన్ కాళ్ల బేరంతో రాష్ట్రానికి ఎనలేని హాని జరుగుతోందని ధ్వజమెత్తారు. హోదాపై జగన్‌రెడ్డి నటనకు ఆస్కార్ అవార్డు కూడా పనికిరాదని ఎద్దేవా చేశారు.…
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము తిరిగి అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరసృతి చట్టం తీసుకు రాగలమని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రకటించడంతో ఈ విషయమై మరోసారి జాతీయ స్థాయిలో చర్చ ప్రారంభమైనది. ముఖ్యంగా కర్ణాటకలో జిహాబ్ వివాదం చెలరేగడంతో, దానిని ఆసరాగా చేసుకొని మతపరమైన విభజనకు పురికొల్పి, ఉత్తరాది రాష్ట్రాలలో హిందువుల ఓట్లు పొందడం కోసం బిజెపి ఈ రాష్ట్రం ప్రయోగిస్తున్నట్లు భావిస్తున్నారు. పలువురు బిజెపి నేతలు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ప్రకటనను స్వాగతించారు. ఉత్తర ప్రదేశ్ తో పాటు ఇతర బిజెపి పాలిత రాష్ట్రాలలో సహితం అటువంటి డిమాండ్లు తలెత్తుతున్నాయి. అయితే ఈ విషయమై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మౌనం వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా అటువంటి చట్టం వారే తేగలరు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి చట్టం రాగలవా అనే ప్రశ్న ఈ సందర్భంగా తలెత్తుతున్నది. రాష్ట్రాలకు అటువంటి చట్టం చేసే అధికారం రాష్ట్రాలకు ఉందా అనే అంశంపై న్యాయ నిఫుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం…