2014లో బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ నుండి గత సంవత్సరం టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ వరకు ఎన్నికల వ్యూహకర్తగా ప్రచారాన్ని పర్యవేక్షిస్తూ విశేషమైన `విజయ రికార్డు’ను కొనసాగించడంలో ప్రశాంత్ కిషోర్ విజయం సాధించారు. 2017లో పంజాబ్‌కు చెందిన కెప్టెన్ అమరీందర్ సింగ్, 2019లో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, 2021లో తమిళనాడుకు చెందిన ఎంకే స్టాలిన్ గెలుపొందడంతో పాటు మరికొందరికి సేవలు అందించడం ద్వారా ‘హై ప్రొఫైల్’ పోల్ వ్యూహకర్తగా తన ఇమేజ్ ను కాపాడుకోగలుగుతూ వస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ సేవలు పొందగలిగితే ఎన్నికల్లో విజయం సాధిస్తుందనే అభిప్రాయాన్ని అనేక రాజకీయ పార్టీలలో సృష్టించ గలిగారు. అయితే. 2017యుపి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సహకారం అందించలేక పోవడం, ఆ తర్వాత బీహార్ ఎన్నికలలో తాను స్వయంగా పోటీచేస్తానని ప్రకటించి, పరిస్థితులు సానుకూలంగా లేకపోవడం వంటి తన వైఫల్యాలను దాచడంలో కూడా విజయం సాధించాడు. గత ఏడాది పశ్చిమ బెంగాల్‌లో…
Author: Editor's Desk, Tattva News
దమ్ము ఉంటే తనను జైల్లో వేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు బిజెపి నాయకులకు సవాల్ విసిరారు. తనను జైల్లో వేస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తరచూ పేర్కొంటుండడం పట్ల తీవ్రంగా స్పందించారు. బండిసంజయ్‌నే జైల్లో వేస్తామని కేసీఆర్ హెచ్చరించారు. జైలు అంటే దొంగలు భయమని, తమకేం భయలేదని స్పష్టం చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై వరుసగా మూడు రోజులుగా అవినీతి ఆరోపణలు చేస్తున్న ముఖ్యమంత్రి మోదీ ప్రభుత్వ హయాంలో 33 మంది బ్యాంక్‌లను మోసం చేసి విదేశాల్లో తలదాచుకుంటున్నారని మండిపడ్డారు. ఇది మోదీ ఆధ్వర్యంలో దేశం సాదించిన ఘనత అని ఎద్దేవా చేశారు. ఇందులో సగం కంటే ఎక్కువ మంది మోదీకి స్నేహితులేనని, గుజరాతిలేనని కేసీఆర్ ఆరోపించారు. “బీజేపీ మాస్ట్ గో ఫ్రమ్ ది కంట్రీ” నినాదం ఇప్పుడు అవసరమని కేసీఆర్ స్పష్టం చేశారు. ‘‘కనీస సంస్కారం లేని పార్టీ బీజేపీ. ప్రధాని మోదీ. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు బీజేపీకి ప్రజల్లో నమ్మకం ఉండేది. కర్ణాటక,…
దైవ దర్శనం అన్ని వర్గాలకు చేరువ కావాలని రామానుజాచార్యులు నమ్మారని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలిపారు. బడుగు వర్గాలకు దైవ దర్శనం ప్రాప్తి కోసం రామానుజాచార్యులు కృషిచేశారని కొనియాడారు. ఈశ్వరాధాన చేయడానికి అన్ని వర్గాలకు హక్కు ఉంటుందని చెప్పారని పేర్కున్నారు. భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా సమతామూర్తి కేంద్రంలో ఏర్పాటు చేసిన 120 కిలోల బంగారు రామానుజాచార్యుల ప్రతిమను లాంఛనంగా ఆయన ఆవిష్కరించారు. వేద పండితులు నిర్ణయించిన మూహుర్తానికి స్వర్ణమూర్తిని రాష్ట్రపతి లోకార్పణం చేశారు. సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ముచ్చింతల్ చేరుకున్నారు. విహంగ వీక్షణంలో సమతామూర్తి కేంద్రాన్ని తిలకించారు. ఈ సందర్భంగా రామానుజుల స్వర్ణమూర్తి నెలకొల్పి చినజీయర్‌స్వామి చరిత్ర లిఖించారని అభినందించారు. రాష్ట్రపతి రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా అందరికీ శుభాభినందనలు తెలిపారు. రామానుజుల స్వర్ణమూర్తి లోకార్పణం చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. ముచ్చింతల్ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు. శ్రీరామనగరం అద్వైత.. సమతా క్షేత్రంగా విరాజిల్లుతుందని తెలిపారు. రామానుజులు…
ఒక వంక ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో శాంతిభద్రతల రికార్డు చూపి తిరిగి ఎన్నిక కావాలని యోగి ఆదిత్యనాథ్ ప్రయత్నం చేస్తుండగా, ఆయన ప్రభుత్వం వ్యవహారంపై అత్యున్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. ”తానే ఫిర్యాదీగా, తానే తీర్పు చెప్పేదిగా, తానే ఆ తీర్పును అమలు చేసేదిగా యుపి ప్రభుత్వం వ్యవహరించిందని జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సూర్య కాంత్ లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం సిఎఎ కు వ్యతిరేకంగా 2019లో జరిగిన నిరసనల సందర్భంగా ధ్వంసం అయిన ఆస్తులకు నష్ట పరిహారాన్ని నిందితులనుండి రికవరీ చేయడానికి పూనుకున్న కేసుపై విచారణ సందర్భంగా పై విధంగా వ్యాఖ్యానించింది. వెంటనే రికవరీ ఆపకపోతే తామే ప్రభుత్వ చర్యలను చట్టవ్యతిరేకంగా పరిగణిస్తూ తీన్పు చెప్పవలసివస్తుందని తీవ్రంగా హెచ్చరించింది. ఆ ఆందోళనలో ధ్వంసం అయిన ప్రభుత్వ ఆస్తులకు నష్ట పరిహారాన్ని తమ వద్దనుండి వసూలు చేయడాన్ని అభ్యంతరపెడుతూ పర్వేజ్ ఆరిఫ్…
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సోమవారం నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఉదయం 5.59 నిమిషాలకు ప్రయోగించింది. కాగా, ఈ ఏడాది ఇస్రో ప్రయోగించిన తొలి మిషన్ ఇదే. ప్రయోగానికి సంబంధించి 25 గంటల కౌంట్ డౌన్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఈవోఎస్-04, ఐఎన్‌ఎస్-2టీడీ, ఇన్‌స్పైర్ శాట్-1 ఉపగ్రహాలను..రోదసిలోకి పిఎస్‌ఎల్ వి -52 మోసుకెళ్లింది. 1,710 కిలోల ఆర్‌ఐ(ఈవోఎస్-04), 17.50 కిలోల ఐఎన్‌ఎస్-2టీడీ..8.10 కిలోల ఇన్‌స్పైర్ శాట్-1 ఉపగ్రహాలను రోదసిలోకి రాకెట్ తీసుకెళ్తుంది. వీటితో పాటు మరో రెండు చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లింది. ఈవోఎస్-04 అనేది రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం. ఇది వ్యవసాయం, అటవీ, తోటలు, నేత తేమ, హైడ్రాలజీ వంటి యాప్‌లకు నాణ్యమైన చిత్రాలను అందించనుంది. ఇస్రో చైర్మన్ గా సోమనాథ్ బాధ్యతలు తీసుకున్నాక ఇది మొదటి…
దక్షిణాదిన కర్ణాటకలో ఒక వంక ముజీబ్ వివాదమే ముస్లిం బాలికలు ఆందోళన చేస్తుండగా, మరోవంక ఉత్తరాదిన ఉత్తర ప్రదేశ్ లో ఒక ముస్లిం బాలిక లక్నో యూనివర్సిటీలో ఎంఎ సంస్కృతంలో అత్యధిక మార్కులు పొంది, ఏకంగా ఐదు గోల్డ్ మెడల్స్ సాధించుకొని చరిత్ర సృష్టించింది. సంస్కసృతంలో పిహెచ్ డి చేసి, ప్రొఫెసర్ కావాలన్నదే ఒక రోజువారీ కూలి కుమార్తె అయిన బాలిక చెబుతున్నది. నవంబర్‌లో జరిగిన కాన్వొకేషన్ వేడుకలో ఘజాలా ఈ పతకాలను స్వీకరించవలసి ఉన్నప్పటికీ, కరోనా కారణంగా ఆమె వేడుకలో పాల్గొనలేక పోయింది. దానితో గత గురువారం, డీన్ ఆర్ట్స్ ప్రొఫెసర్ శశి శుక్లా గజాలాకు పతకాలను ప్రదానం చేశారు. రోజువారీ కూలీ కుమార్తె, గజాలా ఏకంగా ఐదు భాషలలో ప్రావీణ్యం సంపాదించింది — ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, అరబిక్, సంస్కృతం. ఆమె 10వ తరగతి చదువుతున్నప్పుడే తండ్రి చనిపోయాడు. ఆమె చదువు కొనసాగించడానికి చాలా కష్టపడింది. “ఈ పతకాలు నా వల్ల కాదు, నా సోదరులు — షాదాబ్,…
బజాజ్ ఆటో మాజీ ఛైర్మన్ రాహుల్ బజాజ్, సుదీర్ఘ అనారోగ్యం తర్వాత పూణెలో 83 ఏళ్ల వయసులో శనివారం మరణించారు. బజాజ్ జూన్ 10, 1938న కోల్‌కతాలో కమల్‌నాయన్ బజాజ్, సావిత్రి బజాజ్ అనే మార్వాడీ వ్యాపారవేత్త దంపతులకు జన్మించాడు. గత కొంతకాలంగా ఆయన న్యూమోనియా, హృద్యోగ సమస్యలతో బాధపడుతున్నారు. గత నెలలో ఆయన పూణెలోని రుబీ హాల్ క్లినిక్‌లో చేరినట్టు ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ పర్వేజ్ గ్రాంట్ తెలిపారు.బజాజ్, నెహ్రూ కుటుంబాలకు చెందిన మూడు తరాల వారి మధ్య తరతరాల స్నేహం బంధం ఉంది. రాహుల్ తండ్రి ఇందిరా గాంధీ, కమల్‌నాయన్ ఇద్దరూ ఒకే స్కూల్‌లో చదువుకున్నారు. ఆయన మరణ వార్త తెలియగానే ప్రజలు సోషల్ మీడియాలో ఆయనకు నివాళులర్పించడం ప్రారంభించారు. 1965లో, రాహుల్ బజాజ్ తన తండ్రి మరణానంతరం బజాజ్ గ్రూప్‌లోకి ప్రవేశించాడు. బజాజ్ ఆటో టర్నోవర్ రూ. 7.2 కోట్ల నుంచి రూ. 12,000 కోట్లకు అతని…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీకి రాజకీయ వారసుడిగా భావిస్తున్న ఆమె మేనల్లుడు, లోక్ సభ సభ్యుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బనెర్జీల మధ్య తలెత్తిన విబేధాలు ఈ మధ్య తారాస్థాయికి చేరుకున్నాయి. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై ఇరువురు భిన్నమైన ధోరణులు ఆవలంభించడమే అందుకు ప్రధాన కారణం. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ప్రచారం, వ్యూహంలలో అభిషేక్ కీలక పాత్ర వహించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సారధ్యంలో పార్టీ ప్రచార వ్యూహాలను నిర్ణయించడంలో ఆయనే కీలక భూమిక వహించారు. అందుకనే ఎన్నికల ముందు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆయన, ఆయన కుటుంభం సభ్యులు లక్ష్యంగా దాడులు జరిపాయి కూడా. ముఖ్యంగా పార్టీలో `ఒక వ్యక్తి కి ఒకే పోస్ట్’ అనే విధానం స్పష్టంగా అమలు జరపాలని అభిషేక్ నాయకత్వంలోని యువ నేతలు తెస్తున్న వత్తిడులే వారిద్దరి మధ్య విబేధాలకు ప్రధానంగా కనిపిస్తున్నది. ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ-పాక్ బృందం సలహాలపైననే అభిషేక్…
సినీ పరిశ్రమకు, ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిల మధ్య అంతరం ఏర్పడి, ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో `మెగాస్టార్’ చిరంజీవి చొరవ తీసుకొని సినీ ప్రముఖులతో కలసి ముఖ్యమంత్రిని కలవడం పట్ల తెలుగు సినీ పరిశ్రమలో హర్షం వ్యక్తం అవుతున్నా ఈ విషయమై చిరంజీవి జగన్ ను `యాచించి’ న్నట్లు వీడియో వెలువడంతో టాలీవుడ్ లో పెద్ద దుమారం చెలరేగుతుంది. చిరంజీవి తన స్థాయిని మరిచి ఏపీ ప్రభుత్వాన్ని యాచించడం నచ్చలేదని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భేటీకి సంబంధించి విడుదలైన వీడియోపై స్పందిస్తూ.. ఏపీ ప్రభుత్వాన్ని చిరంజీవి తన స్థాయిని మరిచి.. అంతగా అభ్యర్థించాల్సిన అవసరం లేదని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. దీనిపై ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. మరోవంక, ప్రముఖ నిర్మాత – దర్శకుడు రాంగోపాల్ సహితం `హీరోలు అంతా వెళ్లి జీరోలు అయ్యారు” అంటూ ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. వీరందరిని రప్పించుకొని…
కీలకమైన ఉత్తర ప్రదేశ్ ఎన్నికలలో ఈ నెల 10న జరిగిన మొదటి దశ పోలింగ్ లో రైతు ఉద్యమం తీవ్ర ప్రభావం చూపే పశ్సీమ ప్రాంతంలోని నగరాలలో తమకు బలంగా ఉన్న నగరాలలో తక్కువగా పోలింగ్ జరగడం బిజెపి వర్గాలలో ఆందోళనకు కారణం అవుతున్నట్లు తెలుస్తున్నది. పలువురు ప్రముఖులు తమ స్థానాలను కోల్పోవడం ఖాయం అని బీజేపీ నేతలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్ కూడా నోయిడా నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో ఓడిపోవచ్చని కొందరు సన్నిహితులు పేర్కొన్నారు. ఆగ్రా, మతురా, అలీగఢ్ ప్రాంతాలతో కూడిన బ్రజ్‌లోని వారి నియోజకవర్గాల్లో పలువురు మంత్రుల అవకాశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉధృతంగా ప్రచారం నిర్వహించే పార్టీ యంత్రాంగం ఈ సారి ఆశించినరీతిలో పనిచేయలేదని వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓటర్లను ఇళ్ల నుంచి బయటకు తీసుకొచ్చి ఓటింగ్ వేసేటట్లు చేయడంలో పన్నా ప్రముఖ్, బూత్ కమిటీ సభ్యులు ఎక్కడున్నారు? అని ప్రశ్నలు పార్టీ వర్గాలలో తలెత్తుతున్నాయి. 11…