ప్రైవేట్ క్రిప్టోకరెన్సీల వల్ల స్థూల ఆర్థిక వ్యవస్థ (మేక్రోఎకానమీ)కు ముప్పు కలుగుతుందని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు. వీటివల్ల దేశ ఆర్థిక సుస్థిరతకు విఘాతం కలుగుతుందని పేర్కొంటూ, రెండిందాల సవాళ్ళను ఎదుర్కొనడంలో ఆర్బీఐ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని తెలిపారు. మూడు రోజుల పాటు సాగిన ఆర్‌బిఐ ద్వై మాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను వివరిస్తూ వీటిలో పెట్టుబడి పెట్టేవారు తమ స్వంత రిస్క్‌తోనే ఆ పని చేస్తున్నట్లు గుర్తుంచుకోవాలని కోరారు. అప్రమత్తంగా ఉండాలని పెట్టుబడిదారులను హెచ్చరించడం తన కర్తవ్యమని తెలిపారు. క్రిప్టోకరెన్సీకి ఎటువంటి ఆధారాలు లేవని పెట్టుబడిదారులు గమనించాలని చెప్పారు. అది కనీసం టులిప్ అయినా కాదని స్పష్టం చేశారు. 17వ శతాబ్దంలో టులిప్ మానియా నడిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఫైనాన్షియల్ బబుల్‌కు ఉదాహరణగా దీనిని చెప్తూ ఉంటారు. వాస్తవ విలువ కారణంగా కాకుండా స్పెక్యులేటర్ల కారణంగా టులిప్ విలువ పెరుతూ ఉండేది. ఆర్బీఐ ద్వైమాసిక…
Author: Editor's Desk, Tattva News
కేంద్ర ప్రభుత్వ పథకం సంసద్ ఆదర్శ్ యోజన కింద ఎంపీలు దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్న గ్రామాలలో దేశం మొత్తం మీద ఉత్తమంగా ఎంపికైన మొదటి 10 గ్రామాలలో మొదటి రెండు స్థానాలలో గ్రామాలతో పాటు 7 గ్రామాలు తెలంగాణవే కావడం విశేషం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గ్రామాలు 4, ఉమ్మడి నిజామాబాద్కు చెందిన 3 గ్రామాలు ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్కు చెందిన సైదాపూర్మండలం వెన్నంపల్లి గ్రామం జాతీయ స్థాయిలో మొదటి స్థానం సాధించగా, బెజ్జంకి మండలం గన్నేరువరం 4, ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపల్లి 6, వీణవంక మండలం రామకృష్ణాపూర్ 9, ఉమ్మడి నిజామాబాద్జిల్లా జుక్కల్ మండలం కౌలాస్ గ్రామం 2, రెంజల్ మండలం కందకుర్తి 5, నిజామాబాద్ మండలం తానాకుర్ద్ గ్రామం 10వ స్థానంలో నిలిచాయి. మొదటి స్థానంలో నిలిచినా వెన్నంపల్లి గ్రామం జనాభా 2,167. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు 2014–-15లో వెన్నంపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. రూ. 1.5 కోట్లు ఎంపీ ఫండ్స్ మంజూరు…
కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమక్రమంగా అదుపులోకి వస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, జనవరి 21 నాటి గరిష్ట స్థితితో పోలిస్తే కేసులు 80 శాతం తగ్గాయని తెలిపింది. ఇక నాలుగు రాష్ట్రాల్లో క్రియాశీల కేసుల సంఖ్య 50వేల పైన ఉందని పేర్కొంది. ఈ ఏడాది జనవరి 24వ తేదీన పాజిటివిటీ రేటు రికార్డు స్థాయిలో 20.75శాతానికి పెరిగింది. అయితే ప్రస్తుతం అది 4.44 శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దీనిబట్టి చూస్తే వైరస్ వ్యాప్తి రేటు క్రమంగా తగ్గుతోందని పేర్కొన్నారు. ఇక జనవరి 21న కొత్త కేసులు ఏకంగా 3.47 లక్షలు దాటాయి. అప్పటితో పోలిస్తే రోజువారీ కేసుల సంఖ్య 80 శాతం తగ్గిందని చెప్పారు. అయితే, కేరళలో కరోనా వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. అక్కడ రోజువారీ పాజిటివిటీ రేటు…
దేశంలో పెద్దపులల మరణాలు పెరుగుతున్నాయి. వృద్ధాప్యంతోపాటు వివి ధ కారణాలతో అంతకుముందు 106 పులులు చనిపోతే.. ఒక్క 2021లో 127 టైగర్స్ మృతిచెందినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్యసభలో అనుబంధ ప్రశ్రలకు పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సమాధానాలిచ్చారు. పులి జాతి మరణానికి వృద్ధాప్యం, పులుల మధ్య గొడవలు, విద్యుదాఘాతం, వేట వంటి అనేక కారణాలు ఉన్నాయని ఆయన చెప్పారు. పలు రాష్ట్రాలు నివేదించిన వివరాల ప్రకారం.. 2021లో పులుల మరణాల సంఖ్య 127 గా ఉంది. గత సంవత్సరం మధ్యప్రదేశ్‌లో గరిష్టంగా 42 పులులు చనిపోయాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 27, కర్నాటకలో 15, ఉత్తరప్రదేశ్‌లో 9 పులులు చనిపోయినట్టు రికార్డులున్నాయని వివరించారు. అడవిలో పులుల సగటు ఆయుర్దాయం సాధారణంగా 10-12 సంవత్సరాలు ఉంటుందని, అయితే సహజ పర్యావరణ వ్యవస్థలో వృద్ధాప్యం, వ్యాధులు, అంతర్గత పోరాటాలు, విద్యుదాఘాతం, వలలు, నీళ్లలో మునిగిపోవడం, రోడ్డు, రైలు ప్రమాదాల వంటి కారణాలతో…
దేశంలో ప్రతిపక్షాలు లేని అసెంబ్లీగా నాగాలాండ్ నిలిచింది. నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పిఎఫ్) శాసనసభ్యుడు వైఎం యెల్లో కొన్యాక్ బుధవారం కేబినేట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో అక్కడి ప్రభుత్వం అఖిల పక్ష ప్రభుత్వంగా మారింది. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి నెఫ్యు రియో, ఆయన మంత్రి వర్గం, యునైటెడ్ డెమొక్రటిక్ అలియన్స్ (యుడిఎ) చైర్మన్ టిఆర్ జెలియాంగ్ హాజరయ్యారు. నాగాలాండ్‌లోని అధికార, ప్రతిపక్ష పార్టీలు దేశంలో తొలి అఖిల పక్ష కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించిన ఐదు నెలల తర్వాత ఇప్పుడు కార్యరూపం దాల్చింది. నాగాల రాజకీయ సమస్యను ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం, నాగా సంస్థలు, ఇతర సమూహాలు ఏకమవ్వడంతో ఇది సాధ్యమైంది. ‘ఒకే పరిష్కారం-ఒకే ఒప్పందం’ కింద నాగా రాజకీయ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర అసెంబ్లీలో 25 మంది ఎమ్మెల్యేలతో ప్రధాన ప్రతిపక్షమైన నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పిఎఫ్) త ఏడాది జులైలో రియో నేతృత్వంలోని పీపుల్స్…
శ్రీరామనగరంలోని 216 అడుగుల భగవద్రామానుజుల విగ్రహాన్ని ఆర్ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, ఆర్ఎస్‌ఎస్ పూర్వ సహా కార్యవహ్ భయ్యాజీ జోషి దర్శించుకున్నారు. 108 దివ్యదేశాలను సందర్శించారు. ఆలయాల విశేషాలను వారికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ వివరించారు. అనంతరం సమతామూర్తి ప్రాంగణం ముందు భగద్రామునుజుల జీవిత చరిత్ర త్రీ డీ షోను వారు వీక్షించారు. సాయంత్రం యాగశాలలో శ్రీలక్ష్మీనారాయణ యజ్ఞంలో పాల్గొన్నారు మోహన్ భగవత్, శివరాజ్‌సింగ్ చౌహాన్ దంపతులు పాల్గొన్నారు. ప్రధాన యాగమండపంలో కంకణం ధరించి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ వారిని సత్కరించి, వారికి మంగళాశాసనాలు అందించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. అంతకుముందు ప్రవచన మండపంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ ఆధ్యర్యంలో ధర్మాచార్య సదస్సు జరిగింది. ఈ సదస్సులో దేశంలోని పలుప్రాంతాల నుంచి వచ్చిన 385 మంది సాధుసంతులు, పీఠాధిపతులు, ఆచార్యులు పాల్గొన్నారు. హిందూ పురాణాలు సమానత్వాన్ని నేర్పాయని ఈ సదస్సులో మోహన్ భగవత్ గుర్తు చేశారు.…
తాను నెహ్రు గురించి మాట్లాడితే కాంగ్రెస్ వారికి అంత భయం ఎందుకని ప్రధాని నరేంద్ర మోదీ చురకలు అంటించారు. తాను నెహ్రూను ఎన్నడూ గుర్తు చేసుకోవడం లేదని అంటూ ఉంటారని, గుర్తు చేసుకున్నపుడు వివాదాస్పదం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నెహ్రూ అప్పట్లో చెప్పిన మాటలనే తాను ప్రస్తావించానని, . అప్పటి, ఇప్పటి పరిస్థితులను వివరించేందుకే తాను ఆయనను ప్రస్తావించానని తెలిపారు. ఉత్తర ప్రదేశ్ లో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలలో మొదటి దశ పోలింగ్ జరగడానికి కొన్ని గంటల ముందు ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్లమెంటులో మాజీ ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ గురించి తాను ప్రస్తావించడంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ప్రధాని కొట్టిపారవేసారు. తాను ఫలానా వ్యక్తి తండ్రి లేదా తాత గురించి మాట్లాడలేదని స్పష్టం చేశారు. మాజీ ప్రధాన మంత్రి చెప్పిన మాటలనే తాను ప్రస్తావించానని, ఆ మాటలను తెలుసుకోవడం దేశ ప్రజల హక్కు అని చెప్పారు. తాను నెహ్రూ గురించి మాట్లాడనని ప్రతిపక్షాలు అంటూ ఉంటాయని, తాను మాట్లాడితే మాత్రం…
వారసత్వ రాజకీయాలు మన దేశ ప్రజాస్వామ్యానికి ముప్పు అని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. కొంతమంది సోషలిస్టులమని చెప్పుకునే ఫేక్ సమాజ్ వాదీలు ఉన్నారని, వాస్తవానికి వాళ్లు కుటుంబవాదులని ఆయన విమర్శించారు. గతంలో తనకు ఒక లేఖ వచ్చిందని, అందులో సమాజ్ వాదీ పార్టీలో ఒకే కుటుంబానికి చెందిన 45 మంది వేర్వేరు పదవుల్లో ఉన్నారని వివరించారని అంటూ ములాయం, అఖిలేశ్ యాదవ్ రాజకీయాలపై ధ్వజమెత్తారు. ఏదైనా ఒక పార్టీని కొన్ని తరాల పాటూ ఒకే కుటుంబం నడిపితే అక్కడ దేశం అభివృద్ధి కాకుండా కుటుంబ అభివృద్ధే లక్ష్యంగా మారుతుందని మోదీ స్పష్టం చేశారు. జమ్ము కశ్మీర్ లో రెండు పార్టీలను రెండు కుటుంబాలు మాత్రమే నడుపుతూ వచ్చాయని, ఇదే ట్రెండ్ హర్యానా, జార్ఖండ్, యూపీ, తమిళనాడు వరకూ చాలా రాష్ట్రాల్లో కనిపిస్తోందని ఆయన వివరించారు. వారసత్వ రాజకీయ పార్టీల్లో ఒకే కుటుంబం ఎప్పటికీ సుప్రీం పవర్ గా ఉంటుందని ప్రధాని చెప్పారు. పార్టీ మంచిగా…
కర్నాటకలోని వివిధ ప్రాంతాల్లో హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమై, మంగళవారం కొన్ని చోట్ల హింసాత్మకంగా మారడంతో ఈ వివాదంకు కాంగ్రెస్ ఆజ్యం పోస్తున్నట్లు స్పష్టం అవుతున్నదని కర్నాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర, రెవెన్యూ మంత్రి ఆర్. అశోక ఆరోపించారు. “కాంగ్రెస్ నాయకులు హిజాబ్ సమస్యకు సంబంధించి అగ్నికి ఆజ్యం పోస్తున్నారని వారు మండిపడ్డారు. భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగితే కర్ణాటకలోని ప్రజలు వారిని అరేబియా సముద్రంలో పడవేస్తారని జ్ఞానేంద్ర హెచ్చరించారు. కాంగ్రెస్ కర్ణాటక అధ్యక్షుడు డి.కె. శివకుమార్ శివమొగ్గలో భారత త్రివర్ణ పతాకాన్ని దించారని, దాని స్థానంలో కాషాయ జెండాను పెట్టారని మీడియాకు తప్పుడు సమాచారం అందించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎప్పుడూ బడితే అప్పుడు ఎగరవేయము. శివకుమార్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. సీనియర్ నేత నుంచి ఇలాంటి ప్రకటన రావడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం చేసుకోవచ్చు’’ అని మంత్రి మండిపడ్డారు. తరగతి గదులలో హిజాబ్ ధరింపరాదని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినదని ఆయన చెప్పారు. నిర్దేశిత యూనిఫాం కాకుండా ఇతర వస్త్రాలను…
తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన ఆస్తుల పంపిణీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయంతోనే జరగవలసి ఉన్నట్లు కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. ఈ పంపిణి ఇంకా పూర్తి కాలేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ చెప్పారు. రాజ్యసభలో బిజెపి ఎంపి జివిఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తెలంగాణ, ఎపి మధ్య కొన్ని ఆస్తుల విషయంలో సయోధ్య కుదరలేదని తెలిపారు. ఈ విషయంలో ఇప్పటికే 26 సమావేశాలు నిర్వహించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టం ప్రకారం విభజన చట్టంలోని షెడ్యూల్ 9,10 పరిధిలోని సంస్థల ఆస్తుల పంపకం ఎటూ తేలలేదు. అప్పుడప్పుడూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నా అవి తూతూమంత్రంగా మిగిలిపోతున్నాయి తప్ప ఏ ఒక్క సమస్యకు పరిష్కారం లభించడం లేదు. 2019లో ఇరు రాష్ట్రాల సిఎంలు ఇదే అంశంపై ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు. కానీ ఈ సమస్యలు పరిష్కారం…