కళ్యాణి శంకర్, సుప్రసిద్ధ పాత్రికేయురాలు ప్రతి నాయకుడు స్థిరపడేందుకు కీలకమైన క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. ప్రస్తుత యుపి అసెంబ్లీ ఎన్నికలు ప్రియాంక గాంధీ వాద్రా రాజకీయ భవిష్యత్తుకు నిర్ణయాత్మక ఘట్టం. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ట్రంప్ కార్డుగా భావించిన ఆమె ఇప్పుడు ప్రస్తుత ఎన్నికల్లో భారీ సవాలును ఎదుర్కొంటోంది. 1989 నుండి యుపిలో పార్టీ అధికారంలో లేదు. సంస్థ దాదాపు అంతరించిపోయింది. కాబట్టి, 2019 జనవరిలో అధికారికంగా రాజకీయాల్లోకి ప్రవేశించిన 49 ఏళ్ల ప్రియాంక గాంధీకి ఇది ఒక దుర్బలమైన సవాల్. ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ ప్రకటించలేదు. అయితే కాంగ్రెస్ అద్భుతంగా గెలిస్తే ప్రియాంక తప్ప మరెవరు? మరేదైనా ముఖం కనిపించడం లేదా అని ఒక విలేఖరిని అడిగిన ఆమె గత వారం తానే కాంగ్రెస్ ముఖమని అంగీకరించింది. ఆమె ఎంట్రీ గేమ్ ఛేంజర్ అని పార్టీ విశ్వసించింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన ప్రియాంక తాను సిద్ధమైనప్పుడే రాజకీయ ప్రవేశం చేస్తానని…
Author: Editor's Desk, Tattva News
ఉద్యోగులు చేస్తోన్న ఉద్యమానికి జనసేన పార్టీ మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఉద్యోగులను రెచ్చగొట్టేలా ఉంటున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఉద్యోగులపై అనవసర వ్యాఖ్యలు మానుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు. తమ సమస్యల పరిష్కారం కోసమే ఉద్యోగులు పోరాడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు అనేక హామీలిచ్చారని గుర్తు చేశారు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని నమ్మించారని ధ్వజమెత్తారు. జీతాలు పెంచాల్సిన ప్రభుత్వం తగ్గించడమేంటని ఆయన ప్రశ్నించారు. జగన్ చేసిన మోసం వల్లే ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారని ఆయన విమర్శించారు. పోరాటానికి రాజకీయ పార్టీల అవసరం లేదని ఉద్యోగులు ప్రకటించారని గుర్తు చేస్తూ, అందువల్లే తాను ఇంతకాలం వీటిపై మాట్లాడలేదని ఆయన తెలిపారు. ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలపవలసి రావడం పట్ల విచారం వ్యక్తం చేశారు. అనేకమందిని అరెస్టు…
ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ కారుపై గుర్తు తెలియని కొందరు దుండగులు జరిపిన కాల్పులు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఉత్తర ప్రదేశ్ లో కలకలం రేపుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా కిథౌర్‌లో ఈ సంఘటన జరిగింది. దుండగులు మూడు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. 34 తూటాలు కారు కింది భాగంలోకి దూసుకెళ్లాయి. మీరట్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఒవైసి ఢిల్లీ వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. యుపి ఎన్నికలలో ఒవైసి పార్టీ 93 సీట్లలో పోటీ చేస్తుండడంతో ఆయన విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఛజర్సీ టోల్ ప్లాజా సమీపంలో ఆయన వాహనంపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. 34 రౌండ్ల బుల్లెట్స్ దూసుకెళ్లాయి. దాంతో ఆయన వాహణం టైర్లు పంక్చర్ అయ్యాయి. దాడి చేసేందుకు వచ్చిన వారు మొత్తం ముగ్గురు, నలుగులు ఉన్నారని, తాను వేరే వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయానని ఒవైసి చెప్పారు. కాల్పుల తర్వాత తుపాకులు ఘటనాస్థలంలో వదిలి దుండగులు…
ఈ ఏడాది జనవరిలో రూ.1,213 కోట్ల విలువైన ఎలక్టొరల్ బాండ్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విక్రయించగా, వీటిలో అత్యధిక భాగం (రూ.784.84 కోట్లు) ఎస్‌బిఐ న్యూఢిల్లీ బ్రాంచిలో జాతీయ రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్నాయి.. ఈ ఎలక్టొరల్ బాండ్లలో అధికంగా (రూ.489.6 కోట్లు) ముంబయి ఎస్‌బిఐ బ్రాంచిలో అమ్ముడయ్యాయి. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో ఎస్‌బిఐ ఈ వివరాలు వెల్లడించింది. .గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, యుపి అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న ఈ సమయంలో ఎలక్టొరల్ బాండ్ల విక్రయం జరిగింది. ఆర్‌టిఐ కార్యకర్త కన్నయ్య కుమార్ ఆడిగిన ప్రశ్నకు ఎస్‌బిఐ సమాధానమిస్తూ, ఈ అసెంబ్లీ ఎన్నికల ముందు అమ్ముడైనంత భారీగా ఇంతకుముందు ఏ ఎన్నికల్లోనూ అమ్ముడుపోలేదని తెలిపింది. ఎలక్టొరల్ బాండ్ల పథకం 2018లో ప్రారంభమైన తరువాత పందొమ్మిదో విడతగా గత నెల 1నుండి 10 వరకు బాండ్ల అమ్మకం సాగింది. 2021ఏప్రిల్‌లో…
భారత రాజ్యాంగాన్ని అవమానపరిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా రాజేంద్రనగర్ లో బీజేపి చేపట్టిన భీం దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న విజయశాంతి అంబేద్కర్ రచించిన రాజ్యంగంలోని ఆర్టికల్ 3తోనే రాష్ట్రం ఏర్పడిందన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కేసీఆర్ దళితులను మోసం చేస్తూనే ఉన్నారని చెబుతూ ఇక తన ఆటలు సాగవని ఆమె హెచ్చరించారు. దేశ ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం పెట్టిన భిక్ష వల్లే కేసీఆర్.. సీఎం పదవిని అనుభవిస్తున్నారని ఆమె సోషల్ మీడియా ద్వారా గుర్తు చేశారు. ‘‘పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి మరి మాట్లాడిన భాషను చూసి రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్రు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా…
పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా, అరెస్ట్ లు జరిపినా, ప్రభుత్వం ఎంతగా బెదిరించినా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఖాతరు చేయలేదు. అకస్మాత్తుగా ఉప్పెనవలె, నిముషాలలో వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయములు `చలో విజయవాడ’ కార్యక్రమం ప్రారంభించడం, ఉప్పనివలె విజృభించడంతో పోలీస్ యంత్రంగం నివ్వెరపోయింది. తామిక ఏమీచేయలేమని గ్రహించి చేతులెత్తేసింది. విజయవాడ రహదారులన్నీ ఉద్యోగులతో నిండిపోయాయి. ఎక్కడికక్కడ బారికేడ్లను ఛేదించుకొని ఉద్యోగులు ముందుకు దూసుకెళ్లారు. వందలాది మందిని అరెస్ట్ చేసినా, ఇళ్లకు వెళ్లి బెదిరించినా, బస్సులు, రైళ్లు, కార్లలో తనిఖీలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. “కరోనానే ఖతం చేశాం..మీ నిర్బంధాలు ఒక లెక్కా” అంటూ వేలసంఖ్యలో ఉద్యోగులు యెట్లా చేరుకున్నారని పోలీసులు ఖంగుతిన్నారు. వేలమంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాదయాత్ర జరుపుతూ “మాకు న్యాయం కావాలి” అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అర్ధరాత్రి ఇచ్చిన చీకటి జీవోలు రద్దుచేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ జీవో రద్దు చేయాలని ముద్రించిన మాస్కులను ధరించారు. ఉద్యోగులు లేకుండా ప్రభుత్వం లేదంటూ నినాదాలు చేశారు. తీవ్రవాదుల కంటే దారుణంగా తమ…
చైనా, పాకిస్థాన్‌లను ప్రభుత్వం ఏకతాటిపైకి తీసుకొచ్చి లడఖ్‌లో “భారీ వ్యూహాత్మక తప్పిదం” చేసిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ నేతృత్వంలోని సీనియర్ కేంద్ర మంత్రులు విరుచుకుపడ్డారు. మరోవంక, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సభా హక్కులను ఉల్లంఘించినట్లు బీజేపీ ఎంపీ నిసికాంత్ దుబే ఆరోపిస్తూ ఆయనపై గురువారం సభా హక్కుల ఉల్లంఘన తీర్మానానికి నోటీసు ఇచ్చారు. రాహుల్ గాంధీ ఓ స్క్రిప్ట్ రీడర్ అని, డ్రాయింగ్ రూమ్ పొలిటీషియన్ అని ఆయన ధ్వజమెత్తారు. ఆయన కనీసం రాజ్యాంగ ప్రవేశికను అయినా చదవలేదని మండిపడ్డారు. జైశంకర్ ట్విటర్‌లో, “పాకిస్తాన్, చైనాలను ఒకచోట చేర్చింది ఈ ప్రభుత్వమే అని రాహుల్ గాంధీ లోక్‌సభలో ఆరోపించారు. బహుశా, కొన్ని చరిత్ర పాఠాలు క్రమంలో ఉన్నాయి: 1963లో, పాకిస్తాన్ అక్రమంగా షక్స్‌గామ్ లోయను చైనాకు అప్పగించింది. 1970లలో చైనా పీఓకే గుండా కారకోరం హైవేను నిర్మించింది. 1970ల నుండి, రెండు దేశాలు…
ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక అంశాలు పటిష్టంగా ఉన్నందున యావత్ దేశం సరైన పథంలో ముందుకు సాగుతోందని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వ సమర్ధవంతమైన విధానాల ఫలితంగా ఏడేళ్ల నాడు జిడిపి రూ.1.10 లక్షల కోట్లు నుంచి ఇప్పుడు రూ. 2.30 లక్షల కోట్లకు రెట్టింపుకు పైగా పెరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. బిజేపి నిర్వహించిన “ఆత్మనిర్భర్‌అర్థ వ్యవస్థ” సదస్సులో కేంద్ర బడ్జెట్ లోను ముఖ్యాంశాలను వర్చువల్ విధానంలో ప్రధాని వివరిస్తూ 2013 14 లో ఎగుమతులు రూ.2.50 లక్షల కోట్ల వరకు ఉండగా, ఇప్పుడు రెట్టింపై రూ.4.70 లక్షల కోట్లకు చేరుకుందని వివరించారు. అదే విధంగా విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) 275 బిలియన్ డాలర్ల నుంచి 630 బిలియన్ డాలర్లకు చేరుకుందని చెప్పారు. పేదలు, మధ్యతరగతి, యువకులకు కనీస మౌలిక సదుపాయాలు పెంపొందించడమే తమ ప్రభుత్వ లక్షంగా బడ్జెట్‌పై దృష్టి కేంద్రీకరించినట్టు ప్రధాని తెలిపారు. పేద ప్రజలకు 80 లక్షల ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు బడ్జెట్‌లో రూ.48,000 కోట్లు…
తెలుగు నెలలో శతాబ్దకాలంగా ప్రజలను ఎంతగానో రంజింపచేస్తున్న ప్రసిద్ధి చెందిన చింతామణి సాంఘిక నాటకంను ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అకస్మాత్తుగా, ఏకపక్షంగా, ఎటువంటి సంప్రదిరింపులు – విచారణ లేకుండా నిషేధించడంతో సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నది. ఆ గ్రంధాన్ని ఇప్పటి వరకు నిషేధింపకుండా కేవలం నాటకంను ఏ విధంగా నిషేధిస్తారని అంటూ ఏపీ హైకోర్టు సహితం విస్మయం వ్యక్తం చేసింది. 20వ దశాబ్దంలోని మూడవ దశకంలోని సామాజిక సమస్యల ఆధారంగా అప్పటి కవి కాళ్ళకూరి నారాయణరావు రచించిన చింతామణి నాటకం ఊరూరా నేటికీ ప్రదర్శితమవుతూనే ఉంది. ఇది వేశ్యావృత్తి దురాచారాన్ని ఖండించే నాటకం. ఈ నాటకంను లీలాశుకచరిత్ర ఆధారంగా రచించారు. దేశవ్యాప్తంగా వేలాది ప్రదర్శనలకు నోచుకోనుంది. గత ఏడాది శతజయంతి సంబరాలు జరుపుకొంటున్న సమయంలో, అత్యంత ప్రాచుర్యం పొందిన చింతామణి నాటకం తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని, దీనిపై నిషేధం విధించాలని ఆర్య వైశ్య సంఘం నేతల డిమాండ్ మేరకు స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ నాటక…
ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ప్రస్తుతానికి అమరావతేనని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని కూడా కేంద్రం తేల్చి చెప్పింది. బుధవారం రాజ్యసభలో ఏపికి చెందిన ఎంపిలు రాష్ట్ర విభజన సమస్యలపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఉమ్మడి ఆస్తులపై వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి లేవనెత్తగా, తెలంగాణకు విద్యుత్తు పంపిణీ, శ్రీశైలం డ్యాం నుంచి తెలంగాణ అక్రమంగా నీరు తీసుకోవడం, రాష్ట్ర రాజధాని విషయమై బిజెపి ఎంపిలు టిజి వెంకటేశ్, జివిఎల్ నరసింహారావు, సిఎం రమేష్ ప్రశ్నలు లేవనెత్తారు. వీటికి కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన తరువాత తెలంగాణకు విద్యుత్తు పంపిణీ చేయగా ఆ మొత్తం సొమ్ము ఏపికి తెలంగాణ కట్టకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. వడ్డీతో కలిపి సుమారు రూ.6వేల కోట్లు ఏపికి తెలంగాణ నుంచి రావాల్సి ఉందని, తెలంగాణకు కేటాయింపుల్లో ఆ మేరకు తగ్గించి ఏపికి ఇవ్వాలని టిజి వెంకటేశ్ కేంద్రాన్ని…