Author: Editor's Desk, Tattva News

అమెరికాను మంచు తుఫాన్‌ వణికిస్తోంది. హిమపాతం మరింత పెరిగే అవకాశం ఉండటంతో అమెరికా ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలను, విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మంచు తుఫాన్‌ మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.  రోజంతా మంచు కురుస్తుండటంతో పలు ప్రాంతాలలో 30 సెంటీమీటర్లకు పైగా మంచు పేరుకుపోయింది. మాన్‌ హాటన్‌కు సమీపంలోని లాంగ్‌ ఐలాండ్‌లో 25 సెంటీమీటర్ల మేర మంచు పేరుకుపోయినట్లు అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో చాలా రాష్ట్రాలు అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. న్యూయార్క్‌, బోస్టన్‌, ఫిలడెల్ఫియాలో మంచు దట్టంగా గుట్టలుగా పేరుకుపోయింది. ఎటుచూసినా హిమపాతమే కనిపిస్తోంది. రోడ్లన్నిటికీ మంచు కప్పేసింది. మంచు తుఫాన్‌ భారీగా కురుస్తుండటంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. మంచు తుఫాన్‌ కారణంగా… ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. దీంతో ప్రజల సంక్షేమం కోసం అమెరికా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.  ఇదిలా ఉండగా… మంచు తుఫాన్‌ ప్రభావం కారణంగా పలు విమాన సర్వీసులను…

Read More

కెనడా రాజధానిలు నగరం ఆందోళనకర పరిస్థితులు నెలకొనడం, వేలాది మంది నిరసనకారులు పార్లమెంట్ వైపుకు బయలుదేరడంతో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తన కుటుంబంతో కలిసి ఓ రహస్య ప్రాంతానికి వెళ్లారు. కరోనా కట్టడికిగాను ప్రభుత్వం విధించిన ఆంక్షలు, నిబంధనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారే అవకాశముండటంతో ప్రధాని కుటుంబాన్ని రహస్య ప్రాంతానికి తరలించాలని భద్రతా వర్గాలు నిర్ణయించాయి. ట్రూడో నేతత్వంలోని కెనడా ప్రభుత్వం కరోనా కట్టడిలో భాగంగా వ్యాక్సిన్లను తప్పనిసరి చేసింది. మాస్కులను ధరించడం, భౌతికదూరాన్ని పాటించడం సహా ఇతర నిబంధనల్ని కఠినతరం చేసింది. ముఖ్యంగా వ్యాక్సిన్లు తీసుకోని ట్రక్కు డ్రైవర్లను దేశంలోకి అనుమతించేది లేదని ప్రకటించింది. దీంతో ట్రక్కు డ్రైవర్ల నుండి నిరసన వెల్లువెత్తింది. మొదటి నుంచి వ్యాక్సిన్లను వ్యతిరేకిస్తున్న ఓ వర్గం దీనిపై గళమెత్తింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కెనడా వ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు భారీ ర్యాలీగా రాజధాని ఒట్టావాకు బయలుదేరారు. దీంతో రాజధానికి…

Read More

దేశంలో కరోనా మూడో వేవ్ కొనసాగుతోంది. చాలా మంది ప్రముఖ సెలబ్రిటీలు ఇటీవలి కాలంలో కరోనా బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్‌కు కరోనా వైరస్ సోకింది. దీంతో ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్‌ లోకి వెళ్లింది. వైద్యులు సూచన ప్రకారం చికిత్స తీసుకుంటుంది.  ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గత రెండు రోజుల స్వల్ప లక్షణాలతో కరోనా పరీక్షులు చేయించుకోగా.. ఫలితాల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు కాజోల్ తెలిపింది. అందరూ జాగ్రత్తగా ఉండాలని కాజోల్‌ సూచించింది. కాగా, గత రెండు రోజులు పాజిటివ్ కేసులు సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అదే సమయంలో దేశంలో కరోనా మృతుల సంఖ్య భారీగా పెరగడం కలవరానికి గురి చేస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,34,281 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో 893 మంది…

Read More

ఇజ్రాయెల్‌తో ఒప్పందంలో భాగంగా 2017లో భారత ప్రభుత్వం పెగాసస్ స్పై టూల్‌ను కొనుగోలు చేసినట్లు వార్తా కథనాన్ని ప్రచురించిన ది న్యూయార్క్ టైమ్స్ పత్రికను సుపారీ మీడియాగా కేంద్ర మంత్రి జనరల్ వికె సింగ్ అభివర్ణించారు.  2017లో భారత్, ఇజ్రాయెల్ మధ్య అధునాతన ఆయుధాలు, నిఘా వ్యవస్థ కోసం కుదిరిన 2 బిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా పెగాసస్ స్పైవేర్, క్షిపణి వ్యవస్థ భారత్ పొందిన్నట్లు  ది న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ఇటీవల ప్రచురించింది.  ఈ కధనం గురించి భారత ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించక పోయినప్పటికీ,  కేంద్ర రోడ్డు రవాణా, హైవేలు, పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వికె సింగ్ శనివారం ట్విటర్ వేదికగా స్పందిస్తూ `న్యూయార్క్ టైమ్స్‌ను ఎవరైనా విశ్వసిస్తారా.. సుపారీ మీడియాగా అది పేరుపొందింది’ అంటూ ఎద్దేవా చేశారు . గత ఏడాది జూలైలో, కొత్తగా నియమితులైన ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ అటువంటి వార్తా కథనాలను “సంచలనం” అని పిలవడం…

Read More

ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఏర్పడిన సమాజ్‌వాదీ పార్టీ-రాష్ట్రీయ లోక్‌దళ్ కూటమిని ప్రస్తావిస్తూ వారిద్దరూ ఎంతకాలం కలిసి ఉంటారని అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. “సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌జీ నిన్న తాను, ఆర్‌ఎల్‌డి అధ్యక్షుడు జయంత్ చౌదరి ‘సాథ్-సాత్’ అని చెప్పుకున్నారు.(కలిసి), అయితే ఎంతకాలం?” అని ప్రశ్నించారు. యాదవ్, ఆర్‌ఎల్‌డి చీఫ్‌ల కలయికను ఆయన అపహాస్యం చేస్తూ ఈ పార్టీల నాయకులను ఎన్నికలు ముగిసే వరకు మాత్రమే కలిసి చూస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడితే ఆజంఖాన్, అతిక్ అహ్మద్ లాంటి వాళ్లు కేంద్రాన్ని నిలదీస్తారని, చౌదరి ఎక్కడా కనిపించరని స్పష్టం చేశారు. “ప్రభుత్వం ఏర్పడితే, జయంత్ భాయ్ వెళ్లిపోతారు. ఆజం ఖాన్ (అతని స్థానంలో) కూర్చుంటాడు. అతని (అఖిలేష్)తో జయంత్ కనిపించడు. అతిక్ అహ్మద్ కూడా వస్తాడు. ప్రజలను ఎందుకు మోసం చేయాలనుకుంటున్నారు? టిక్కెట్ల పంపిణీ భవిష్యత్తులో ఏం జరగబోతోందో తెలియజేస్తోంది’’ అని కేంద్ర మంత్రి తెలిపారు…

Read More

రాబోయే బడ్జెట్‌లో పొగాకు ఉత్పత్తులపై పన్ను పెంచుతారనే ఊహాగానాల మధ్య స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్‌జేఎం) ఆర్థిక విభాగం ‘బీడీలు’, చిన్న చేతితో చుట్టే సిగరెట్లపై సుంకాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరింది. ‘టెండు’ ఆకులతో చుట్టబడిన పొగాకు, తరచుగా పేదవాడి సిగరెట్‌గా పిలువబడుతుందని గుర్తు చేసింది. ఇప్పటికే బీడీలపై 28 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారని గుర్తు చేస్తూ, ఇంకా పన్ను పెంచితే యువతను నక్సల్స్ వైపు నెట్టివేసిన్నట్లు కాగలదని హెచ్చరించింది.  సిగరెట్,  ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టంకు  ప్రతిపాదించిన సవరణల పరిధి నుండి ‘బీడీలను’ కూడా దూరంగా ఉంచాలని ఎస్‌జేఎం కో-కన్వీనర్ అశ్వనీ మహాజన్ డిమాండ్ చేశారు. ఈ పరిశ్రమలో లక్షలాది మంది కార్మికులు ఉన్నారని చెబుతూ  బీడీలపై పన్ను పెంపుదల వారిని  జీవనోపాధిని కోల్పోయేటట్లు చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దానితో  వారిలో చాలా మందిని నక్సలిజం వైపు నెట్టవచ్చని స్పష్టం చేశారు.  “బీడీ పరిశ్రమ దేశంలో 4-4.5 కోట్ల మందికి ఉపాధి,  జీవనోపాధిని కల్పిస్తున్నది. ఈ కార్మికులలో ఎక్కువ…

Read More

`చేతనైతే నా పై లోక్ సభ నుండి అనర్హత వేటు వేయించండి. లీని పక్షంలో నేనే పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికలకు సిద్ధం. అందుకు ఫిబ్రవరి 11 వరకు గడువు ఇస్తున్నాను’ అంటూ వైసిపి నాయకత్వాన్ని ఎంపీ వైఎస్సార్సీపీ తిరుగుబాటు నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు సవాల్ చేసిన రోజుననే అనర్హత వ్యవహారం లోక్‌సభ ప్రివిలేజి కమిటీ ముందుకు చేరింది. వైఎస్సార్సీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ దాఖలు చేసిన పిటిషన్‌లో రఘురామకృష్ణ రాజుపై లేవనెత్తిన ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని లోక్‌సభ స్పీకర్ ప్రివిలేజ్ కమిటీని ఆదేశించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున రఘురామకృష్ణ రాజుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ మార్గాని భరత్ లోక్‌సభ స్పీకర్ ఎదుట పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌తో పాటు, లోక్ సభ రూల్స్, 1985లోని రూల్ నెంబర్ 6 ప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై వీలైనంత…

Read More

దళితులను సీఎం కేసీఆర్ దగా చేస్తున్నారని బిజెపి నేత, మాజీ ఎంపీ విజయశాంతి ధ్వజమెత్తారు. దళిత, గిరిజన పేదల సంక్షేమాన్ని విస్మరించారని ఆమె విమర్శించారు. స్వరాష్ట్రం ఏర్పడితే దళిత ముఖ్యమంత్రి అని ఉద్యమ సమయంలో ఊదరగొట్టిన కేసీఆర్ తాను ముఖ్యమంత్రి అయ్యి దళితుల్ని దగా చేసిన్రు అంటూ సోషల్ మీడియా ద్వారా ఆమె విమర్శలు కురిపించారు. ఆ తర్వాత దళిత, గిరిజన పేదలకు ఉచితంగా మూడెకరాల భూమి ఇచ్చి, బోరు వేయించి మరీ వ్యవసాయం చేసుకునేందుకు టీఆర్ఎస్ సర్కార్ సహకారం అందిస్తుందని చెప్పి ఆ పథకాన్ని కూడా అటకెక్కించారని ఆమె గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సవ్యంగా అమలు కాగా… కేసిఆర్ ఏలుబడిలో మాత్రం సబ్ ప్లాన్ నిధులు బడ్జెట్ కేటాయింపులు, కాగితాలకు పరిమితమై పక్కదారి పట్టాయని ఆమె దుయ్యబట్టారు. హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో దళిత ఓట్లను రాబట్టుకోవడం కోసం దళిత సాధికారతకు టీఆర్ఎస్…

Read More

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్, పంజాబ్‌ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలపై ఎటువంటి ఎగ్జిట్ పోల్ సర్వేలు చేపట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది.  ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే ఫిబ్రవరి 10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మార్చి 7వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశ్వినీ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఎవ్వరూ ఎగ్జిట్‌ పోల్స్ నిర్వహించకూడదని, ఎగ్జిట్ పోల్ సర్వేలను ప్రసారం గానీ, ప్రచారం గానీ చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. తమ ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండు కలిపి విధించనున్నట్లు శుక్లా తెలిపారు.  ఐదు రాష్ట్రాల్లో ఫిబ్రవరి 10…

Read More

పంజాబ్ లోని 2.12 కోట్ల మంది ఓటర్లలో కనీసం సగం మందిగా ఉన్న మహిళా ఓటర్లను ఆకర్షించడం కోసం ప్రధాన పార్టీలు పోటీ పడి హామీల వర్షం కురిపిస్తున్నాయి. అయితే ఎన్నికలలో తమ అభ్యర్థులుగా మహిళలకు  అవకాశం ఇవ్వడంలో మాత్రం మీనమేషాలు లెక్కబెడుతూన్నాయి.  శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి)-బిఎస్‌పి కూటమికి చెందిన 117 మంది అభ్యర్థుల్లో ఐదుగురు మాత్రమే మహిళలు ఉన్నారు. అంటే మొత్తం అభ్యర్థుల్లో దాదాపు 4 శాతం. ఐదుగురిలో 97 స్థానాల్లో పోటీ చేస్తున్న ఎస్‌ఎడికు  చెందిన నలుగురు, 20 స్థానాల్లో పోటీ చేస్తున్న మాయావతి నేతృత్వంలోని బిఎస్‌పి నుంచి ఒకరు ఉన్నారు.  ఉత్తర ప్రదేశ్ ఎన్నికలలో మహిళలకు 40 శాతం సీట్లు కేటాయిస్తున్నామని ప్రియాంక గాంధీ పెద్ద ఎన్నున్న ప్రచారం చేస్తున్నారు. కానీ పంజాబ్‌లోని 109 స్థానాలకు టిక్కెట్లు ప్రకటించగా, వారిలో  కేవలం 11 (10 శాతం) మాత్రమే మహిళా అభ్యర్థులు ఉన్నారు.  ఇక ఆప్ మొత్తం 117 సీట్లలో టిక్కెట్లను ప్రకటించింది, వాటిలో 12 (10 శాతం)…

Read More