Author: Editor's Desk, Tattva News

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫిర్యాదుపై పార్లమెంట్ ప్రివిలేజ్‌ కమిటి స్పందించింది.  తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి సోమేశ్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్త తో పాటు పలువురు అధికారులకు లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది.  ఫిబ్రవరి 3న తమ ముందు హాజరు కావాలని ప్రివిలేజ్ కమిటీ నోటీసులు అందించింది. డీజీపీ మహేందర్ రెడ్డి, కరీంనగర్ సీపీ సత్యనారాయణ, ఏసీపీ శ్రీనివాస రావు, జగిత్యాల డీఎస్పీకి ప్రకాష్ తో పాటు కరీంనగర్‌ ఇన్‌స్పెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది.  కాగా, సంజయ్ వాదనలను శుక్రవారం కమిటీ సభ్యులు విన్నారు. ఆయన అందించిన వీడియో క్లిప్ లను, పత్రికల కథనాలను పరిశీలించారు. తనపై దౌర్జన్యంగా వ్యవహరించారని, తనను అక్రమంగా ఆరోపించారని చెబుతూ వారిపై చర్యలు తీసుకోవాలని సంజయ్ కోరారు.  తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవో 317ను సవరించాలంటూ ఈ నెల 2న కరీంనగర్‌లోని తన కార్యాలయంలో దీక్ష చేపట్టానని చెబుతూ…

Read More

వేతన సవరణపై  వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్లిప్త ధోరణి పట్ల ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు వచ్చే ఎలా 7 నుండి నిరవధిక సమ్మెకు సిద్దపడుతున్నారు. రాష్ట్ర చరిత్రలో వేతన సవరణకు ఉద్యోగులు నిరవధిక సమ్మెకు తలపడటం ఇదే ప్రధమం కావడం గమనార్హం.  గత ఎన్నికలలో వైసిపి ప్రభుత్వం ఏర్పాటులో విశేషమైన పాత్ర వహించిన ప్రభుత్వ ఉద్యోగులు తమను ప్రభుత్వం మోసం చేసినది అంటూ ఇప్పుడు వీధులలోకి వస్తున్నారు. ఈ నెల 24న  సమ్మె నోటీసును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇవ్వనున్నారు.  పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయించారు. పీఆర్సీ జీవోలు తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ 24న సీఎస్‌ సమీర్‌ శర్మకు సమ్మె నోటీసు ఇవ్వనున్నట్టు తెలిపారు. వచ్చే నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి (ఫిబ్రవరి-7) సమ్మెలోకి వెళ్లనున్నట్లు…

Read More

బంగ్లా యుద్ధం – 37 1971లో బంగ్లాదేశ్‌ ఒక నూతన దేశంగా ఆవిర్భవించినప్పుడు,  అది విధ్వంసంకు గురైన ప్రాంతం. పాకిస్తాన్ సైనిక దళాలు 30 లక్షల మందికి పైగా ప్రజలను  ఊచకోత కోసింది.  ఐదు లక్షల మందికి పైగా మహిళలపై అత్యాచారం చేసింది. మారణహోమ హింసతో పాటు, మౌలిక సదుపాయాల భారీ విధ్వంసం, ఆహార కొరత,  సామూహిక మాంద్యం వంటి తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నది.  జనవరి 17, 1972న టైమ్ మ్యాగజైన్ కవర్ స్టోరీ “ప్రపంచపు సరికొత్త దేశం – బంగ్లాదేశ్ – రక్తపాత యుద్ధంలో పుట్టింది” అంటూ కథనాన్ని ప్రచురించడం గమనిస్తే ఒక విధంగా ప్రపంచం ఎద్దేవా చేసిన్నట్లు స్పష్టం అవుతుంది.  కొన్నాళ్ల తర్వాత “పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ పోర్ట్ సిటీ ఆఫ్ చిట్టగాంగ్‌లో తన ఖాతాలో సరిగ్గా రూ. 117 (16 అమెరికా డాలర్లు) మాత్రమే మిగిల్చింది” అని మరో కథనం ప్రచురితమైనది. అంటే ఆ దేశం ఆర్ధికంగా దివాళా అంచున…

Read More

పౌరుల కోసం ప్రత్యేక గుర్తింపు రుజువుగా భారత ప్రభుత్వం ఆధార్ కార్డులను అందిస్తున్నది. ప్రస్తుతం బ్యాంకులు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల సేవలను పొందేందుకు ఆధార్ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తప్పనిసరి. అయితే ఐదేళ్ల లోపు బాలల కోసం ప్రభుత్వం ‘బ్లూ బాల్​ ఆధార్ కార్డు’లను తాజాగా ప్రారంభించింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) జారీ చేసిన ఆధార్ ​కార్డుకు 12- అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటుంది. బ్లూ ఆధార్ కార్డులో కూడా 12 అంకెలు ఉంటాయి. అయితే చిన్నారుల వయస్సు 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఇది చెల్లదు. సాధారణంగా అయితే, ఆధార్ కార్డ్‌‌‌‌‌‌‌‌లో కార్డుహోల్డర్​ వేలిముద్రలు, రెటీనా వివరాలు కూడా ఉంటాయి. ఈ కార్డు ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఒక్కరే వాడాలి. అయితే, బ్లూ బాల్ ఆధార్ కార్డ్‌‌‌‌‌‌‌‌లో అలాంటి సమాచారం ఏదీ ఉండదు. ప్రత్యేక సంఖ్య కూడా ఉండదు. పిల్లవాడు పెరిగి 5 ఏళ్లు దాటిన తర్వాత…

Read More

ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ప్రకటన రాగానే పొలిటికల్ జంపింగ్స్ మొదలయ్యాయి. అటు బీజేపీ నుంచి సమాజ్వాదీ పార్టీలోకి.. ఇటు ఎస్పీ, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలు పెరిగాయి. కమలం పార్టీ నుంచి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ మారితే.. ములాయం చిన్న కోడలు అపర్ణ యాదవ్ బీజేపీలో చేరారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జరుగుతున్న ఈ వలసల వల్ల ఎవరికి లాభం అనే చర్చ ఇప్పుడు సర్వత్రా నడుస్తోంది. ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత 10 మంది నేతలు, ముగ్గురు మంత్రులు బీజేపీకి రాజీనామా చేసి సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ప్రతి పోల్ సర్వే తిరిగి బీజేపీ పవర్లోకి రాబోతున్నదని చెబుతున్న సమయంలో ఈ వలసలు ఎస్పీలో ఉత్సాహం కలిగిస్తున్నాయి. అయితే బీజేపీలో ఈ వలసలపై అంతగా టెన్షన్ కనిపించడం లేదు. పైగా ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ను బీజేపీలో…

Read More

రామ‌నుజ‌చార్యుల 1000వ జ‌యంతి సంద‌ర్భంగా హైదరాబాద్ కు సమీపంలోని ముచ్చింతల్ లో గల చిన్నజియ్యర్ స్వామిజీ ఆశ్రయంలో  216అడుగుల స‌మ‌తామూర్తి విగ్రవిష్కరణకు అన్ని సన్నాహాలు సిద్ధమయ్యాయి.  ఫిబ్ర‌వ‌రి 5వ తేదీని ప్ర‌ధాని న‌రేంద్ర  ఆవిష్కరించగా,  13న  స‌మతా మూర్తి లోప‌ల గ‌ర్భాల‌యాన్ని రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ ఆవిష్క‌రించ‌నున్నారు.  45 ఎకరాల విస్తీర్ణంలో సమతా మూర్తిని ఏర్పాటు చేశారు.  ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం పేరిట ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. శ్రీరామనగరంలో  ప్రధాన మందిరంలో 120 కిలోల బంగారంతో రూపొందించిన 54 అంగుళాల రామానుజ నిత్యపూజా మూర్తిని 13న రాష్ట్రపతి రామ్‌నా«థ్‌ కోవింద్‌ తొలి దర్శనంతో ప్రారంభిస్తారు.   216 అడుగుల ఎత్తైన రామానుజల మహా విగ్రహం చుట్టూ 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకం కొనసాగుతుంది. శ్రీవైష్ణవంలో దివ్యదేశాలుగా భావించే.. శ్రీరంగం, తిరుమల, కంచి, అహోబిలం, భద్రీనాథ్, ముక్తినాథ్, అయోధ్య, బృందావనం, కుంభకోణం.. ఇలా మొత్తం 108 ప్రధాన…

Read More

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో శుక్రవారం కాంగ్రెస్ నేతల  నాటకం రక్తి కట్టించింది.  ఉదయం మాజీ ముఖ్యమంత్రి,  రాజ్యసభ ఎంపీ దిగ్విజయ సింగ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తనను కలవడానికి అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదంటూ  నిరసనగా సిఎం హౌస్ దగ్గర ధర్నా చేపట్టారు.  భోపాల్-విదిషా సరిహద్దులో టెమ్ మరియు రాజ్‌గఢ్ జిల్లాలో వరుసగా సుతాలియా డ్యామ్ ప్రాజెక్టుల వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం విషయంలో చౌహాన్‌ను కలవాలని సింగ్ అనుకున్నాడు. ఈ మూడు జిల్లాలు,  గుణకు చెందిన సుమారు 1,500 కుటుంబాలు ప్రాజెక్టుల వల్ల నష్టపోవలసి ఉంది, నష్టపరిహారం సరిపోదని వారు   నిరసిస్తున్నారు. అయితే, ధర్నా సమయంలోనే, మరో మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కమల్ నాథ్ రాష్ట్ర హ్యాంగర్‌లో చౌహాన్‌ను కలిశారు. ఇద్దరు నాయకులు దాదాపు అరగంట పాటు ఒకరినొకరు చర్చలు జరిపారు. అనంతరం ధర్నాలో పాల్గొన్న కమల్‌నాథ్‌ మాట్లాడుతూ.. ప్రాజెక్టు వల్ల నష్టపోయిన ప్రజలకు కాంగ్రెస్‌ అండగా…

Read More

ఉక్రెయిన్ విషయంలోఅమెరికా, రష్యాల మధ్య ఉద్రిక్తలు పెరుగుతూ, ఆ ప్రాంతంలో మరో యుద్ధం తప్పదా అనే ఆందోళనలు వ్యక్తం అవుతున్న సమయంలో  రష్యా రూపొందించిన భద్రతా ప్రతిపాదనలను చర్చించేందుకు జెనీవాలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావ్‌రోవ్‌, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌లు సమావేశమయ్యారు.  నాటోతో గల ఉద్రిక్తతలను పరిష్కరించుకునేందుకు ఒప్పందం కుదురుతుందా లేదా నిర్ణయించనున్నారు. ఐరోపా ఖండంలో ఘర్షణల ముప్పును తగ్గించేందుకు అమెరికా, నాటోలను ఉద్దేశించి రష్యా రెండు ముసాయిదా ఒప్పందాలను ప్రతిపాదించించింది. ఆ తర్వాత వరుసగా జరుగుతున్న దౌత్య సమావేశాల్లో ఇది తాజా సమావేశం.  రష్యా సరిహద్దుల దిశగా నాటోను విస్తరించబోమని రాతపూర్వకంగా నాటో హామీ ఇవ్వాలని రష్యా డిమాండ్‌ చేస్తోంది. అలాగే నాటోలో భవిష్యత్తులో కూడా ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వరాదని కోరుతోంది. సోవియట్‌ యూనియన్‌ కుప్పకూలిన తర్వాత, 1997లో తర్వాత చేరిన పూర్వపు వార్సా ఒప్పంద దేశాల భూభాగంపై ఎలాంటి సైనిక  కార్యకలాపాలు చేపట్టకుండా నాటోను నిలువరించాలని రష్యా…

Read More

కరోనాఇన్ఫెక్షన్లు కొనసాగినా మహమ్మారి అంతానికి సమయం ఆసన్నమైందని లాన్సెట్‌ అధ్యయనం వెల్లడించింది. ఒమిక్రాన్‌ వేవ్‌ ముగిసిన తర్వాత కరోనా తిరిగి వచ్చినా మహమ్మారి మాత్రం కనుమరుగవుతుందని పేర్కొంది. ఆరోగ్య వ్యవస్థలు, సమాజాలు ఎదుర్కొనే పునరావృత వ్యాధిగా కరోనా మారుతుందని ..అయితే సార్స్‌-కోవ్‌-2 కట్టడికి ప్రభుత్వం , సమాజం అసాధారణ చర్యలు తీసుకునే దశ ముగుస్తుందని అధ్యయనం స్పష్టం చేసింది.వ్యాక్సినేషన్‌, ఇన్ఫెక్షన్‌ సోకడం ద్వారా వచ్చిన ఇమ్యూనిటీ బలహీనమయ్యే కొద్దీ కరోనా వేరియంట్ల వ్యాప్తి కొనసాగుతుందని, ముఖ్యంగా శీతాకాలంలో వైరస్‌ల వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని తెలిపింది. వైరస్‌ ప్రభావం మున్ముందు తగ్గుముఖం పడుతుందని పేర్కొంది.  రాబోయే రోజుల్లో కరోనా వైరస్‌ల వ్యాప్తి ఆరోగ్యంపై ప్రభావం పరిమితంగా ఉంటుందని అధ్యయనం అంచనా వేసింది.వైరస్‌ను గతంలో ఎదుర్కొన్న అనుభవం, నూతన యాంటీజెన్స్‌, వేరియంట్స్‌కు వ్యాక్సినేషన్‌ చేపట్టడం , యాంటీవైరల్‌ డ్రగ్స్‌ అందుబాటులోకి రావడం, వైరస్‌ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటి చర్యలతో కరోనా తీవ్రత తగ్గుతుందని…

Read More

దేశీయంగా చమురును వెలికితీయడం ద్వారా భారతదేశానికి ఇంధన భద్రతను అందిండచంతోపాటు విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచుకునేందుకు వీలుపడుతుందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. విశాఖపట్టణంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) ప్రథమ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ  దేశీయంగా చమురు ఉత్పత్తిని పెంచేందుకు పెట్రోకెమికల్ రంగంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్&డీ)కి మరింత ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు.  తద్వారా భారతదేశ ఇంధన అభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.  శక్తి ఉత్పాదన రంగంలో ఆత్మనిర్భరత సాధించాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి, దేశీయంగా చమురు ఉత్పత్తిని, పెట్రోకెమికల్స్ ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారించాలని సూచించారు. భారతదేశంలో పునరుత్పాదక విద్యుదుత్పత్తికి విస్తృతమైన అవకాశాలున్నాయన్న ఆయన, ఈ దిశగా వినూత్నమైన, సృజనాత్మకమైన ఆలోచనలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.  ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు వినియోగ దేశంగా ఉన్న భారత్, తన అవసరాలకోసం 80 శాతం విదేశాల నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్నామని ఆయన…

Read More