Author: Editor's Desk, Tattva News

రెండుళ్లుగా ప్రపంచాన్ని కకావికలం కావిస్తున్న కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రపంచంలోనే అతి పెద్ద టీకాల కార్యక్రమం భారత్ చేపట్టి నేటితో  ఏడాది పూర్తయింది.  ప్రపంచంలోనే అత్యంత విజయవంతంగా టీకాల కార్యక్రమం చేబడుతున్న ఘనత భారత్ కు దక్కుతుందని ఈ సందర్భంగా  కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌గా దీనిని ఆయన అభివర్ణించారు. ఇందుకోసం కృషి చేసిన హెల్త్ వర్కర్లు, శాస్త్రవేత్తలు, ప్రజలందరికీ ఆయన ఓ ట్వీట్‌లో అభినందనలు తెలిపారు. ”ఈ రోజుతో ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏడాది పూర్తి చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో, ప్రతి ఒక్కరి కృషితో ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన వ్యాక్సినేషన్ డ్రైవ్‌గా ఇది నిలిచింది” అని మంత్రి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.  ఏడాది వ్యవధిలో 156.76 కోట్ల వ్యాక్సినేషన్ కవరేజ్ పూర్తి చేసుకుంది. 2021 జనవరి 16న దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్…

Read More

 * నేడు గుల్జారీలాల్ నందా వర్ధంతి  ఎవరికైనా ఒక పదవి అనుకోకుండా వస్తే ఆ పదవిని ఎలా స్థిరపరచుకోవాలా అని ప్రజాప్రతినిధులు ఆలోచించే కాలంలో, రెండు సార్లు ఆపద్దర్మ ప్రధాన మంత్రిగా వ్యవహరించినా ఆ తర్వాత పార్టీ పెద్దలు ఎవరిని ఆ స్థానంలో కూర్చో పెట్టాలనుకుంటే వారికి బాధ్యతలు అప్పగించి తప్పుకుని తనకు ఇచ్చిన బాధ్యతను చిత్తశుద్ధితో అమలుచేసిన ఏకైక వ్యక్తి గుల్జారీలాల్ నందా. కేంద్ర ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించినా `సొంతం’ అంటూ ఏమీ మిగుల్చుకొని సిసలైన గాంధీయవాది. చైనా దాడి తర్వాత భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆరోగ్యం క్షీణించి నురణించినప్పుడు తాత్కాలిక ప్రధానిగా 14 రోజులు పనిచేశారు నందా. తిరిగి పాకిస్థాన్ తో యుద్ధం ముగిసి, శాంతి ఒప్పందం మీద సంతకం చేసిన మరుసటి రోజే అనూహ్య పరిస్థితిలో లాల్ బహదూర్ శాస్త్రి మరణించినపుడు తిరిగి ఆపద్ధర్మ ప్రధానిగా  మరో 14 రోజుల పాటు పనిచేశారు.  అంతేకాక కేంద్రంలో కీలక శాఖలయిన విదేశాంగ, అంతర్గత…

Read More

ఉత్తర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల పక్రియ ప్రారంభమైన తర్వాత సుమారు 10 మంది నేతలు, ముగ్గురు మంత్రులతో సహా బిజెపికి రాజీనామా చేసి, దాదాపు అందరు ప్రధాన ప్రతిపక్షం సమాజవాద్ పార్టీలో చేరారు. దానితో దాదాపు ప్రతి పోల్ సర్వే తిరిగి బిజెపి అధికారంలో రాబోతున్నట్లు చెబుతుండగా, ఎస్పీలో ఉత్సాహం కనిపిస్తున్నది.  మూడు రోజుల్లోనే ముగ్గురు సీనియర్ మంత్రులు, ఐదుగురు ఎంఎల్‌ఎలు , మరో ఇద్దరు కీలక నేతలు వరుసగా రాజీనామాలు చేయడంతో ఇక బిజెపి పనైపోయిన్నట్లే అంటూ వాఖ్యానాలు వినబడుతున్నాయి.  అయితే బీజేపీలో వారి రాజీనామాలతో ఎటువంటి కలవరం కనిపించడం లేదు.  రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తే కరోనాను ఏమేరకు కట్టడి చేస్తుందో, ఈ రాజీనామాలు సహితం బిజెపికి ఆ మాత్రమే నష్టం కలిగిస్తాయని ఒక బిజెపి నేత చెప్పుకొచ్చారు. ఇప్పుడు బిజెపిని వదిలి వెడుతున్న వారంతా దాదాపుగా 2017 ఎన్నికల ముందు ఆ పార్టీలో చేరిన వారే. గత ఐదేళ్లుగా మంత్రులుగా,ఎమ్యెల్యేలుగా పదవులలో ఉన్నవారే. అప్పుడు బీజేపీలో చేరుతున్నప్పుడు ఎటువంటి కారణాలు చెప్పారో,…

Read More

ప్రపంచంలోనే అంత్యంత విజయవంతమైన క్రికెట్ కెప్టెన్ లలో ఒకరుగా గుర్తింపు పొందిన విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుండి నిష్క్రమించడంతో భారత్ క్రికెట్ లో నాయకత్వ సమస్య తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టెస్ట్ కెప్టెన్సీకి మరో సమర్ధుడైన సారధిని నియమించడం బీసీసీఐకి పెద్ద సవాలుగా మారనున్నది.  భారత్ క్రికెట్ లో కోహ్లీ అంత విజయవంతమైన కెప్టెన్ మరొకరు లేరన్నది గమనార్హం. అయితే ఆయన వత్తిడుల కారణంగానే నిష్క్రమిస్తున్నట్లు ఆయన లేఖ స్పష్టం చేస్తున్నది. ఈ వత్తిడులు బీసీసీఐ నుంచి, ముఖ్యంగా ముంబై కేంద్రంగా గల ప్రముఖుల నుండే ఎదురు కావడంతో సమర్ధవంతంగా తాను కెప్టెన్ గా కొనసాగలేననే నిర్ణయానికి వచ్చిన్నట్లు కనిపిస్తున్నది.  ముఖ్యంగా హెడ్ కోచ్ గా రవి శాస్త్రిని తప్పించి, రాహుల్ ద్రావిడ్ ను నియమించినప్పటి నుండి  టీం ఇండియాలో పరిస్థితులు ప్రతికూలంగా మారుతూ వస్తున్నాయి. రవి శాస్త్రి, కోహ్లీ ఇద్దరు దూడకుడుగా ఆడేవారు కావడంతో వారి మధ్య పొందిక బాగా కుదిరింది. కానీ…

Read More

బంగ్లా యుద్ధం – 31 భారతదేశం, పాకిస్తాన్‌ల మధ్య పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభమైనప్పుడు, ప్రతిపక్ష పార్టీలు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి అనూహ్యమైన రీతిలో మద్దతుగా నిలిచాయి. యుద్ధంలో పాకిస్థానీ సేనలు  బేషరతుగా లొంగిపోయిన్నట్లు ప్రధాని దిగువసభలో  ప్రకటించిన సందర్భంలో   పార్టీలకు అతీతంగా, సభ్యులంతా నిలబడి, చప్పట్లు కొడుతూ  “జోయ్ బంగ్లా”,  “బంగ్లాదేశ్ లాంగ్ లివ్”, “ఇందిరా గాంధీ లాంగ్ లివ్” అని నినాదాలు చేస్తూ కాగితాలను గాలిలోకి విసురుతూ ప్రశంసలు కురిపించారు. బహుశా 75 ఏళ్ళ భారత పార్లమెంట్ చరిత్రలో అవి చాలా అరుదైన దృశ్యాలు అని చెప్పవచ్చు.  అదే సంవత్సరం మార్చిలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆమె  ఐక్య ప్రతిపక్షాన్ని ఓడించి తిరిగి అధికారంలోకి వచ్చారు. అధికార – ప్రతిపక్షాల మధ్య విధానాల పరంగా తీవ్రమైన రాజకీయ విబేధాలు కొనసాగుతున్న సమయం. ఎన్నికలు జరిగి కేవలం ఎనిమిది నెలలైనా తర్వాత ప్రతిపక్షాలు ఆమెకు ఆ విధంగా బాసటగా నిలబడటం కూడా…

Read More

 గత మంగళవారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన కొద్ది నిమిషాల్లో అమెరికా రక్షణ వ్యవస్థ ఉలిక్కి పడినట్లు తెలుస్తున్నది. దానిని తమ దేశంపైకే ప్రయోగాచారనే భయంతో ఎదుర్కొనే చర్యలకు తలబడ్డారు. వాయుమార్గాన దాని నుండి తమ దేశాన్ని రక్షించుకోవడం కోసం దాని సామర్ధ్యం తెలుసుకోవడంలో మునిగిపోయారు.  ఈ ఉలిక్కిపాటు గురించి చేసుకొని “అసహ్యం” అంటూ ఒక అమెరికా చట్ట సభ్యుడు ఎద్దేవా చేశారు. “ఆ క్షీపని సామర్ధ్యాలను మించిన అవగాహన మన రక్షణ అధికారులకు ఉన్నట్లు లేదు” అంటూ పేర్కొన్నారు. ఆ సమయంలో అమెరికా రక్షణ అధికారులు సేకరించిన డేటా ప్రకారం ఈ క్షిపణి అలస్కా లేదా కాలిఫోర్నియా తీరానికి దూరంగా ఉన్న అలూటియన్ దీవుల వరకు ముప్పును కలిగిస్తుందని ఆందోళన చెందాయి. నిమిషాల వ్యవధిలో,అమెరికానార్తర్న్ కమాండ్,  నార్తర్న్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ ఆ ప్రారంభ రీడింగులను తోసిపుచ్చాయి.  క్షిపణి అమెరికా ప్రధాన భూభాగానికి…

Read More

పెద్దలను గౌరవించుకుని కుటుంబ వ్యవస్థను పటిష్టపరచుకోవాలనే సందేశాన్ని సంక్రాంతి అందిస్తోందని, అందుకే సంక్రాంతిని పెద్దల పండుగగా, పెద్ద పండుగగా జరుపుకుంటారని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు.  చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరితో ప్రేమగా మెలగాలనేది భారతీయ పండుగల్లో ఉండే పరమార్థమన్న ఆయన,  ఈతరం యువత పండుగల్లోని అంతరార్ధాన్ని అర్ధం చేసుకుని, పండుగలు పబ్బాలను జరుపుకోవటంతో పాటు… మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం చెన్నై పర్యటనలో ఉన్న గౌరవ ఉపరాష్ట్రపతి, చెన్నై కోట్టూర్ పురంలోని తమ స్వగృహంలో సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా నెల్లూరులోని స్వర్ణభారత్ ట్రస్టు పెద్దల ఆశ్రమంలో ఉన్న పెద్దలతో అంతర్జాల వేదిక ద్వారా సంభాషించారు.  భారతీయ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ప్రతి పండగకు ఓ పరమార్థం ఉంటుందన్న ఉపరాష్ట్రపతి, దాదాపుగా పండగలన్నీ అన్నదాతలు, పాడిపంటల కేంద్రంగానే ఉంటాయన్నారు. అలాగే భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు కూడా కొత్త పంట చేతికొచ్చిన ఆనందంలో…

Read More

కరోనా, ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభణ కొనసాగుతూ ఉండడంతో  కేంద్ర ఎన్నికల సంఘం  ఎన్నికల ర్యాలీలు, రోడ్‌ షో లు, సభలపై జనవరి 22 వరకు నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది.శనివారం ఐదు రాష్ట్రాలలో కరోనా పరిస్థితిని కీలక సమావేశంలో సమీక్షించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.  భౌతిక  ర్యాలీలు, రోడ్‌షోలపై నిషేధం కొనసాగుతుందని తెలిపింది. ఇక 300 మందితో ఇండోర్‌(క్లోజ్డ్‌) సభలకు అనుమతి ఇస్తూ.. హాల్‌ సామర్ధ్యంలో 50శాతం మందితో సభ నిర్వహించుకోవచ్చని పార్టీలకు అనుమతి ఇచ్చింది ఈసీ. రాజకీయ పార్టీలన్నీ కరోనా ప్రోటోకాల్‌, ఎన్నికల కోడ్‌ కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ఎన్నికలు జరగాల్సిన ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, మణిపూర్‌, గోవాలో కరోనా కల్లోలం కలకలం రేపుతోంది. భారీ ఎత్తున నమోదవుతున్న కేసులు ఆయా రాష్ట్రాల్లో. దీంతో ఎన్నికల సంఘం తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించే క్రమంలో ఆయా చోట్ల ఎన్నికల బహిరంగ సభలు, ర్యాలీలపై…

Read More

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో గోరఖ్‌పూర్ (అర్బన్) స్థానం నుంచి పోటీ చేయనున్నారు. యూపీ ఎన్నికలకు సంబంధించి 57 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ శనివారం మధ్యాహ్నం విడుదల చేసింది. ఆ జాబితాలో ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ నుంచి పోటీకి దిగుతారని ప్రకటించింది. అదేవిధంగా యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని సిరతు స్థానం నుంచి పోటీ చేయనున్నారు. గోరఖ్‌పూర్ (అర్బన్) ముఖ్యమంత్రికి కంచుకోటగా ఉంది. యోగి అక్కడినుంచి 2017 వరకు వరుసగా ఐదు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు గోరఖ్‌పూర్ నుంచి పోటీ చేస్తే ఆరవసారి కానుంది. సీఎం యోగి గోరఖ్‌పూర్ నుంచి పోటీ చేయడమనేది చాలా చర్చల తర్వాత పార్టీ అగ్ర నాయకత్వం తీసుకున్న తుది నిర్ణయమని కేంద్ర మంత్రి, రాష్ట్ర ఎన్నికల పార్టీ ఇన్ ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. పార్టీ నిర్ణయం ప్రకారం.. ఏ సీటు నుంచి…

Read More

బంగ్లా యుద్ధం – 30నాటి తూర్పు పాకిస్థాన్ లో పాకిస్తాన్ సేనలు సాగిస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా, ఆవిర్భావంకు అనుకూలంగా ప్రజాభిప్రాయం సమీకరించడంలో, రాజకీయంగా మద్దతు అందించడంలో నాటి ప్రధాని ఇందిరా గాంధీకి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), నాటి ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనసంఘ్ దన్నుగా నిలిచాయి. అవసరమైన మద్దతును అందించాయి.  జూన్ 2015లో అటల్ బిహారీ వాజ్‌పేయికి బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘లిబరేషన్ వార్ ఆనర్’ని ప్రదానం చేసింది. భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, అప్పటికి 90 ఏళ్ల వయసున్న వాజపేయి  ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో, ఆయన తరపున ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.  అందులో వాజ్‌పేయిని “అత్యంత గౌరవనీయమైన రాజకీయ నాయకుడు” అని ఆ ప్రభుత్వం కొనియాడింది.  1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి మద్దతుగా ఆయన వహించిన”క్రియాశీల పాత్ర”ను అందులో గుర్తించారు.  “బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి భారత ప్రభుత్వం త్వరితగతిన మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేయడం కోసం,…

Read More