దేశంలో మూడో వేవ్ ముప్పు, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు రంగంలోకి దిగిన కేంద్రం ప్రభుత్వం బూస్టర్ (ప్రికాషనరీ) డోసు వ్యాక్సినేషన్ ఇవ్వడం ప్రారంభించింది. ముందుగా ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ సిబ్బంది, 60 ఏండ్లు పైబడి కోమార్బిడ్ కండిషన్లతో బాధపడుతున్న వారికి జవనరి 10 నుంచి మూడో డోసు వ్యాక్సిన్‌ను వేయబోతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ గత నెల చివరి వారంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి ప్రికాషనరీ డోసు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం మొదలైన తొలి రోజే దాదాపు పది లక్షల మందికి బూస్టర్ డోసు వేశారు. దేశవ్యాప్తంగా నిన్న ఒక్క రోజులో 9 లక్షల 84 వేల 676 మందికి ప్రికాషనరీ డోసు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఐదు లక్షల 19 వేల 604 మంది హెల్త్ కేర్ వర్కర్లకు, రెండు లక్షల ఒక వెయ్యి 205 మంది ఫ్రంట్…
Author: Editor's Desk, Tattva News
బంగ్లా యుద్ధం – 26 బంగ్లాదేశ్ ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడంలో నిర్ణయాత్మక పాత్ర వహించింది. అయితే ఆ దేశం ఏర్పడిన తర్వాత భారత్‌లో మనం మరిన్ని సమస్యలను ఎదుర్కొనవలసి వస్తున్నది. భారతదేశంలో పోరాడిన అన్ని ప్రత్యక్ష యుద్ధాలలో ఓటమి చెందిన కోల్పోయిన తరువాత, పాకిస్తాన్ ఇప్పుడు ప్రచ్ఛన్న యుద్ధం చేయడంపై దృఢంగా దృష్టి సారించింది. గత కొన్ని దశాబ్దాలుగా దాని దుష్ప్రభావాలు చూస్తున్నాము. పంజాబ్‌లో ఖలిస్తానీలను ప్రోత్సహించినా, జమ్మూ కాశ్మీర్‌లో జెహాద్‌గా పిలవబడేలా ప్రోత్సహించినా, రెండింటిలోనూ పాకిస్థాన్ హస్తం ఉంది. యాదృచ్ఛికంగా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ లను తమ దేశంలో విలీనం చేసుకోవాలని దేశ విభజన ముందు నుండే పాక్ కోరుకుంటున్నది. వాస్తవ భౌగోళిక, రాజకీయ పరిస్థితులను గ్రహించి, తన ధోరణిని మార్చుకునే ప్రయత్నం చేయడం లేదు. పాకిస్థాన్ దుర్భుద్దికి ప్రధాన కారణం సట్లెజ్, బియాస్, రావి, చీనాబ్, జీలం, సింధులో ప్రవహించే నీరు. ఈ రెండు రాష్ట్రాలు పాకిస్తాన్ కు ఎగువగా…
తాజాగా తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఇటీవల తనను కలసిన వారిని పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికే హైదరాబాద్ లో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సినీ ప్రముఖులు మహేష్ బాబు, మంచు లక్ష్మి, థమన్, బండ్ల గణేష్ ప్రభూతులు కరోనాకు గురయ్యారు. రాష్ట్రంలో కూడా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. సోమవారం ఒక్కరోజే 1,825 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో దాదాపు 15 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఒకరు మృతి చెందారు. ఇక వైరస్ బారి నుంచి 350 మంది కోలుకున్నారు. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో కరోనా కలకలం రేపింది. తాజాగా 15 మంది మెడికల్ స్టూడెంట్స్ కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. దీంతో కాలేజీలో కోవిడ్ సోకిన విద్యార్థుల సంఖ్య 41కు చేరింది. దీంతో వారంతా హోం…
రోజువారీ కరోనా కేసులు ముందు రోజుకన్నా స్వల్పంగా తగ్గినా పలువురు ప్రముఖులు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తున్నది. కేంద్రం మంత్రులు రాజనాథ్ సింగ్, అజయ్ భట్, ముఖ్యమంత్రులు నితీష్ కుమార్, బసవరాజ్ బొమ్మై, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, సిపిఎం అగ్రనేతలు ప్రకాష్ కారత్, బృందా కారత్ లతో పాటు పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. ప్రముఖ నటి, బిజెపి నేత కుష్భు సుందర్ కూడా కరోనాకు గురయ్యారు. వీరంతా హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు. గడిచిన 24 గంటల్లో లక్షా 68 వేల 63 కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం 1,79,723 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో పోలిస్తే ఇవాళ 11,660 కేసులు తగ్గాయి. ముందు రోజుతో పోలిస్తే 6.5 శాతం తక్కువగా కేసులు వచ్చాయని మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే ఒక్క రోజులో 277 మంది మరణించినట్లు వెల్లడించింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 33,470 కొత్త కేసులు నమోదయ్యాయి.…
రెండు తెలుగు రాష్ట్రాలలోని మూడు రియల్ ఎస్టేట్ కంపెనీలపై గత వారం ఆదాయపన్ను శాఖ అధికారులు జరిపిన సోదాలలో రూ 800 కోట్ల మేరకు నల్లధనం కనుగొన్నారు. ఈ సందర్భంగా రూ 1.64 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లలోని పలు ప్రాంతాలలో ఈ గ్రూప్కార్యకలాపాలపై దాడులు జరిపారు. నవ్య డెవలపర్స్, రాగ మయూరి ఇన్ఫ్రా, స్కంధాన్షి ఇన్ఫ్రా కంపెనీలపై గత వారంలో ఐటీ దాడులు జరిపారు. లెక్కల్లో చూపని రూ. 1.64 కోట్ల క్యాష్‌ను దాడులలో స్వాధీనం చేసుకున్నట్లు కూడా ఐటీ అధికారులు ప్రకటించారు. నల్లధనం దొరక్కుండా ఉండడానికి ఈ కంపెనీలు ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఉపయోగించినట్లు ఐటీ డిపార్ట్మెంట్ తెలిపింది. ట్రాన్సాక్షన్లు పూర్తయ్యాక డేటా ఆటోమేటిక్‌గా మాయం కావడానికి ఈ సాఫ్ట్వేర్ వినియోగించినట్లు వివరించింది. రిజిస్ట్రేషన్ వాల్యూకి మించిన మొత్తాన్ని ఈ కంపెనీలు కస్టమర్ల నుంచి క్యాష్ రూపంలో తీసుకుంది. ఇలా వచ్చిన బ్లాక్‌మనీని మళ్లీ…
వైసిపి ఎంపీగా ఉంటూనే ఆ పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా సుమారు రెండేళ్లుగా పోరాటం జరుపుతున్న నరసాపూర్ ఎంపీ కె రఘురామరాజు చివరకు తన పదవికి రాజీనామా చేసి, తాజా ఎన్నికలకు సిద్ధపడుతున్నట్లు తెలిసింది. సంక్రాంతికి తన నియోజకవర్గంకు వెళ్లి, రాజీనామా ప్రకటింపవచ్చని తెలుస్తున్నది. ఆ తర్వాత బిజెపి, జనసేనల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు చెబుతున్నారు. టిడిపి సహితం అభ్యర్థిని పోటీలో దింపకుండా, మద్దతు ఇవ్వడం ద్వారా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ మనుగడకు సవాల్ గా ఈ ఎన్నికలను మలిచేందుకు తెరవెనుక భారీ కృషి జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఈ మధ్యనే రాజీనామా చేస్తానని ప్రకటించిన ఆయన ఈ లోగా చేతనైతే తన లోక్ సభ సభ్యత్వాన్ని అనర్హతో రద్దు చేసే పని చేయమని ఆయన వైసిపి నాయకత్వంకు సవాల్ చేశారు. రెండేళ్లుగా తన నియోజకవర్గానికి, ఆంధ్ర ప్రదేశ్ కు దూరంగా ఉనున్న ఆయన గత తిరుపతిలో జరిగిన అమరావతి రైతుల బహిరంగ సభలో పాల్గొన్నారు.…
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పంజాబ్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ భద్రతా వైఫల్యం గురించి చేసిన ట్వీట్‌కి నటుడు సిద్ధార్థ్ చేసిన రీ ట్వీట్‌పై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నెహ్వాల్‌పై సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదనిఎం వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. ఇటీవల పంజాబ్‌లో ప్రధాని పర్యటన సందర్భంగా ప్రధాని కాన్వాయ్ దాదాపు అరగంట పాటు బటిండాలోని ఫ్లైవోర్‌పై నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై దేశమంతా చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా దీనిపై సైనా నెహ్వాల్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘ప్రధానికే అలాంటి పరిస్థితి ఎదురైతే.. ఏ దేశమైనా సురక్షితంగా ఉందని ఎలా అనుకోగలం? ప్రధానిపై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. నెహ్వాల్ చేసిన ట్వీట్‌కు సిద్ధార్థ్ రీ ట్వీట్ చేస్తూ.. ‘చిన్న కాక్‌తో ఆడే ప్రపంచ ఛాంపియన్.. భగవంతుడి దయవల్ల భారతదేశాన్ని కాపాడేవారు ఉన్నారు’ అని…
మన దేశంలో త్వరలో కృత్రిమ గుండె తయారుకానుంది. కృత్రిమ గుండెను తయారుచేసేందుకు ఐఐటి కాన్పూర్ పూనుకుంది. ఇప్పటికే కృత్రిమ గుండెను తయారు చేయడానికి ఐఐటీకి చెందిన ప్రొఫెసర్లు, అమెరికా నిపుణులు, ఎయిమ్స్, అపోలో, ఫోఇ్టస్, మేదాంత వైద్య సంస్థలకు చెందిన సీనియర్ వైద్యులతో కూడిన బృందం నిమగమైంది. వైద్య రంగంలో ఐఐటీ కాన్పూర్ సాధించిన విజయాల్లోనుంచే.. కృత్రిమ గుండె ఏర్పాటుకు బీజం పడిందని.. ఈ మేరకు లెఫ్ట్ వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైస్ (ఎల్‌వీ ఏడీ) పేరుతో కృత్రిమ గుండెను రూపొందించనున్నామని వైద్య బృందం వెల్లడించింది. ‘కరోనా సమయంలో తక్కువ ధరకే వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఐఐటీ కాన్పూర్ తయారుచేసింది. వైద్య రంగంలో ఎన్నో ఘన విజయాల్ని సాధించిన ఐఐటీ కాన్పూర్ కృత్రిమ గుండెను తయారుచేయలేదని కొందరు అన్నారు. దీన్ని మా విద్యా సంస్థ సవాల్‌గా స్వీకరించి వెంటనే కృత్రిమ గుండె తయారుకు కార్యదళాన్ని ఏర్పాటు చేశాం’ అని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ అమితాబ్…
ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో తలెత్తిన భద్రతా వైఫల్యాలపై రిటైర్డ్ జడ్జితో స్వతంత్ర కమిటీని వేసేందుకు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యాకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం అనుమతిచ్చింది. చండీగఢ్ డీజీపీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఐజీ, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, పంజాబ్ రాష్ట్ర సెక్యూరిటీ విభాగానికి చెందిన ఏడీజీపీలతో కూడిన స్వతంత్ర కమిటీని నియమించింది. రిటైర్డ్ సుప్రీం జడ్జి నేతృత్వంలో ఈ కమిటీ ఎంక్వైరీ చేస్తుందని సుప్రీం ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎంక్వైరీ కమిటీలను పక్కన పెట్టేయాలని ఆదేశించింది. అంతకు ముందు వాదనలు వినిపించిన పంజాబ్ అడ్వకేట్ జనరల్ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కోర్టును కోరారు. అయితే కేంద్రం తరపున వాదనలు వినిపంచిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు నిబంధనలను సంబంధించి బ్లూ…
బంగ్లా యుద్ధం – 25 ఆగష్టు 2, 1972న – 13 రోజుల భారత్-పాకిస్తాన్ యుద్ధం డిసెంబర్ 16, 1971న ముగిసిన ఎనిమిది నెలల తర్వాత రెండు దేశాలు సిమ్లా ఒప్పందంపై సంతకం చేశాయి. దీని ప్రకారం భారతదేశం వద్ద ఉన్న 93,000 మంది పాకిస్తాన్ యుద్ధ ఖైదీలను విడుదల చేయాలి. ఆ విధంగా బేషరతుగా వారిని విడుదల చేయడం ద్వారా పాకిస్థాన్ మెడవంచే ఒక అపూర్వ అవకాశాన్ని భారత్ పోగొట్టుకున్నదని చాలామంది పరిశీలకులు, విమర్శకులు ఇప్పటికి భావిస్తున్నారు. అందుకు ప్రతిగా, పాకిస్థాన్ జైలులో ఉన్న భారత్ యుద్ధ ఖైదీల విడుదల గురించి, పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ భూభాగం గురించి మనం పాకిస్థాన్ పై ఎటువంటి వత్తిడులు తీసుకు రాలేకపోయాము. పైగా, యుద్ధం సమయంలో పశ్చిమ పాకిస్థాన్ లో మన సైన్యం స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని కూడా తిరిగి ఇచ్చేసాము. అయితే బేషరతుగా యుద్ధ ఖైదీలను విడుదల చేయడానికి నాటి ప్రధాని ఇందిరాగాంధీని ప్రేరేపించిన అంశాలను…